కనీస అవసరాలన్నీ అలవోకగా తీరిపోతుంటే అప్పుడు మనిషికి కలిగే తరవాతి ఆశ ఏమిటి? ఆరోగ్యంగా ఎక్కువకాలం, కుదిరితే కలకాలం జీవించి ఉండాలనేగా. ఈ ఆశని తీర్చగల అతి సులువైన ఊహల్లో కాలంలోకి ప్రయాణించడం కూడా ఒకటి. అంతేకాక కాలంలో ప్రయాణించగలిగితే పొందగల మిగతా లాభాలు అంకెలతో లెక్కించలేనన్ని. అటువంటప్పుడు అలా కాలం గుండా మనల్ని విహరింపచేయగల యంత్రమేదైనా మనకే, మనకి మాత్రమే దొరికితే ఎంత బాగుంటుందో కదా. ఎన్ని అద్భుతాలు చెయ్యచ్చు! ఎంత గొప్పవాళ్ళం అయిపోవచ్చు! ఒక వేళ అదే యంత్రం ఒక దురాశాపరుడి లేదా దుర్మార్గుడి చేతిలో పడినట్లయితే జరిగే అనర్థాల్ని కూడా మనం సులభంగానే ఊహించగలం. ఇటువంటి ఆలోచనకే దృశ్యరూపం “24” చలన చిత్రం.
ఆసక్తి కరంగా, చాలా చక్కగా వుందమ్మా మీ రివ్యూ… ధన్యవాదాలు…
సుపర్ణ మహీ , ధన్యవాదాలు
పాలల్లో నీళ్ళు. కలిపినట్లు —సినిమా రివ్యూ లు సారంగ లో—??
==============================================
Buchi రెడ్డి గంగుల
ప్రయోగాత్మకమైన సినిమా గురించి ఉపయోగకరమైన సమీక్ష. సినిమాని ఒక సాంస్కృతిక అంశంగా భావించి, ఈ సమీక్షని ప్రచురించడం సందర్భోచితంగా వుంది.
మీ స్పందనకి సంతోషంగా అనిపించింది . ధన్యవాదాలు శ్యాం గారు
చాలా మంచి సినిమాను అంతకంటే గొప్పగా విశ్లేషణ చేసారు భవాని ఫణి గారు.మీరు రాసే ఆర్టికల్స్ చాలా బాగుంటాయి.రెగ్యులర్గా చదువుతుంటాను.యింకా ఇలాంటివి రావాలి.
తిలక్ బొమ్మరాజు గారు , నిజానికి బాగా నచ్చితే గానీ నేను సినిమా గురించి రాయను . ఒక మంచి ప్రయోగం అనిపించి ఈ రివ్యూ రాసాను . ప్రచురించిన సారంగకి ధన్యవాదాలు . మీ స్పందనకు ఆనందం కలిగింది . thank You