కొండల నడుమ
మబ్బుల పందిరి కింద
అందే ఆకాశపు అందాల దారిలో
నా ఇల్లు
*
దండమూడి సీతారాం చూసిన ఈ దృశ్యాన్ని మీ అక్షరాల్లోంచి చూసి ఇక్కడ మీ మాటల్లో చెప్పండి.
కొండల నడుమ
మబ్బుల పందిరి కింద
అందే ఆకాశపు అందాల దారిలో
నా ఇల్లు
*
దండమూడి సీతారాం చూసిన ఈ దృశ్యాన్ని మీ అక్షరాల్లోంచి చూసి ఇక్కడ మీ మాటల్లో చెప్పండి.
వో ప్రవాహం
కాస్త నిశ్శబ్దంగా
యింకాస్త తేలికగా
అలలు పడవ
అడుగున
తాకినట్టు
గాలి కోసిన
చప్పుడు
చెవుల తల్లి
సంగీతం సముద్రపు
హోరు
నీరు పేరుకున్న
జ్ఞాపకం
మంచు ఆకులు
రాయని డైరీ
పచ్చి గాయపు మొక్క
పసరు వాసన
వసంతం
తెస్తూ.
అది హిమాలయాల్లో మనాలి లే!
ఆకాశం అలా నీలంగా కనిపించినంత మేరా ఈ లోకం భలే అందంగా వుంటుంది! ఇక దరిదాపుల్లో కొండలు కూడా ఆ ఆకాశాన్ని ముద్దాడబోతుంటే హద్దులు చెరిగిపోయే అందమే అది! అదిగో అప్పుడే వచ్చేస్తాడు దండమూడి సీతారాం కెమెరా నేత్ర ధనుస్సుతో-
ఈ దృశ్యం మీకెలా అనిపిస్తుందో మాటల్లో చెప్పండి. మీ మాటగా రాయండి ఇక్కడ!
మనం రోజూ చూసే దృశ్యమే దండమూడి సీతారాం కూడా చూస్తాడు. ఆ దృశ్యంలోకి సీతారాం చూస్తున్నప్పుడు మాత్రం అదొక కథగా, కలగా మారిపోతుంది!
ఇక్కడ ఈ దృశ్యంలో ఎన్ని కథలు కూడా కలిపాడో చూడండి.
మీ ఊహకి రెక్కలిచ్చి, కవిత్వంలోకో, అందమైన మ్యూజింగ్స్ లోకో ఎగిరిపొండి.
కొన్ని వాక్యాలుగా మారిపోండి.
రాయండి! ఏం అనిపిస్తే అదే రాయండి!
ప్రకృతిని మించిన కృతి లేదు! కెమెరా లెన్స్ ఒకసారి ప్రకృతితో ప్రేమలో పడ్డాక ఎన్ని వర్ణాలో ఆ ప్రేమకి! ఆ వర్ణాలన్నీ తెలిసినవాడు దండమూడి సీతారాం!
ఈ దృశ్యాన్ని మీ అక్షరాల్లో బంధించండి.
కవితగానో, చిన్ని మనోభావంగానో ఆ దృశ్యానువాదం చేయండి.
దృశ్యాన్ని బంధించడం అంటే ఒక ఊహని బంధించడమే!
ఆ ఊహ కొన్ని సార్లు నైరూప్యంగా కూడా ఉండచ్చు, దాని రూపం యేమిటో అంతుపట్టకపోవచ్చు!
జీవితం ఎంత అందమైందో దృశ్యం అంత అందమైంది. కనిపించే ప్రతి రూపంలోనూ ఒక అందమేదో గూడు కట్టుకొని వుంటుంది.
అలాంటి అందాన్ని ఇక్కడ కెమెరా కవి దండమూడి సీతారాం పట్టుకున్నాడు.
మరి..
అదే అందాన్ని మీరు అక్షరాల్లో పట్టుకోగలరా?!
ప్రయత్నించండి!
ఈ దృశ్యం మీకెలా అనిపిస్తోందో ఆ అనుభూతిని కవితగానో, ఇంకో భావనారూపంగానో తర్జుమా చేసి, ఇక్కడ రాయండి!
*
ఇది ప్రముఖ చాయాచిత్రకారుడు దండమూడి సీతారాం తీసిన ఫోటో! కొన్ని ఫోటోలు గొప్ప దృశ్యాన్ని పొదివి పట్టుకున్న చిత్ర కవితలు. ఇదీ అలాంటిదే!
ఈ దృశ్యం మీ అక్షరాల్లో ఎట్లా తర్జుమా చేయగలరో ప్రయత్నించండి. మీకు నచ్చిన పద్ధతిలో- కవిత కావచ్చు, చిన్ని కథ కావచ్చు, చిన్ని ఆలోచన కావచ్చు, చిన్ని అనుభవమూ కావచ్చు- ఇక్కడ కామెంట్ గా రాయండి.
ఈ రాత్రి వొడవదు ఎన్నో రాత్రి ఇది చెంప మీద ఎన్నో కన్నీటి చుక్క జారి ఆరిపోతున్నది తెల్లని మంటయ్ కురుస్తున్న మంచు కిటికీ అద్దం మీద వీధి లాంతరు విసుగు ఒక్క వెచ్చని వూహ లేదని ఫిర్యాదు దృశ్యం మారితే బాగుండు, మార్చేది ఎవరు నేనెప్పుడూ చీకట్లో ఆడుకుంటున్న ఆడపిల్లనే నా చుట్టూరా నల్లని కందకం, ప్రతిబింబం లేని అద్దం వృత్తాకార కందకంలో నాచు పట్టిన కత్తులు కందక ఖడ్గానికి పొదిగిన పచ్చల వలె చుక్కలు నల్లని అద్దాన్ని దాటే … [ఇంకా చదవండి ...]
నువ్వంతే ఎప్పుడూ నిత్య వికసిత కుసుమానివై పరిమళం వెదజల్లుతుండు నిను కాంచే చూపుల పై... దేహాలపై... ~ నీ నవ్వుకు వేలాడుతుంది ఓ ముక్క ఆకాశం కాంతి సముద్రాన్నెత్తుకొని నీ నడుమ్మోసే చంటిపాపలా ఓ మాయని మాయలా ముడతలు కొన్ని నీ ముఖంమ్మీద అందం చెక్కిన ఆనందాలౌతుంటాయి అసలే నలుపు ఆపై చెవికి చెవులై వేలాడే లోలాకులు నక్షత్రమంత కాకపోయినా అలాంటిదే ఓ ముక్కు పుడక నీ ముక్కు అందం జుర్రేసుకుంటూ అంత వరకూ చూడని రంగురంగుల సీతాకోకచిలుక దేహపుహోళిలా నిను చుట్టేసిన బట్టల అద్దాల్లోంచి తొంగి … [ఇంకా చదవండి ...]
నా లోపలి సతత హరితారణ్యానికి ఎవడో చిచ్చు పెట్టాడు మట్టిదిబ్బలూ ముళ్లపొదలూ తప్ప తుమ్మముళ్లూ బ్రహ్మజెముళ్లూ తప్ప పూల పలకరింపుల్ని ఆఘ్రాణించలేని పక్షుల రెక్కల ఆకాశాల్ని అందుకోలేని సెలయేళ్ల లేళ్లను తనలోకి మళ్లించుకోలేని జంతుజాతుల జన్మరహస్యాల్ని పసిగట్టలేని మనిషిరూపు మానవుడొకడు ఒళ్లంతా అగ్గి రాజేసుకుని అంటించేశాడు వాడు విధ్వంసపు మత్తులో తూలుతూ మంటల ముందు వెర్రిగా తాండవమాడుతూ ++++++ కాలమాపకయంత్రం మలాము పూసింది కాలిన గాయాలు కనుమరుగవుతున్నాయి పచ్చదనం మళ్లీ … [ఇంకా చదవండి ...]
Copyright © 2024 Saaranga Publishers
తాజా కామెంట్లు