కొత్త మనిషి

 

ఇదే సమాధిని
ఇంకెంతకాలం త్రవ్వుతావు

వాడు
నోరున్నా మాట్లాడలేడు
చెవులున్నా వినలేడు

***

ఆ ప్రేతవస్త్రాలను
ముద్దాడే పెదాలూ శవాలే

ఈ కుళ్ళిన దేహంపై జళ్లి
పువ్వులను అపవిత్రం చేయకు

చీకటిని శాశ్వతంగా
ఆరిపోయే దీపాలు వెలిగించలేవు

***

ఆది నుండీ నువ్వు ఆమె
ప్రేమంటకుండా అలానే ఉన్నారు

ఇలాగు వ్రాయబడివుంది
ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గానీ
చీకటి దానిని గ్రహింపకుండెను..

 చాంద్

chand

సరళమైన వాడు

 chand
వాడు వెలివేయబడ్డాడు
హృదయాలను మార్చుకుంటూ ప్రవహించలేక
వాళ్ళ పాదాల మద్య స్తంభించి పోయాడు
పల్చని తెర లాంటి  హృదయాన్ని
ఆకాశంలా పరుచుకున్నాడు
***
వాడు శూన్యం
కన్నీళ్ళు, గాయాలు
నువ్వు, నేను, ప్రపంచం ఏమీ లేవు
ప్రేమించడానికి ముందు
హృదయాన్ని బోర్లించాలంటాడు
***
దేహం లేనివాడు
చచ్చిన మనసులను చూసి నవ్వుతుంటాడు
నవ్వుతున్న దేహాలపై జాలి పడతాడు
రెప్పలు నుండి కురిసే వానకే నిండిపోతాడు
***
వెన్నెలై కురిసే హృదయం తప్ప
వాడి దగ్గర ఇంక ఏ అక్షరాలు లేనోడు
కాగితంపై రక్తం వొంపుకుంటూ
ఇదే కవిత్వమంటాడు
***
నువ్వెవరు అని అడిగిన ప్రతీ సారీ
తెలుసుకోవడానికే బ్రతికున్నానంటాడు
-చాంద్