From the Editor

ఇక సెలవ్!

Update (January 22, 2017): ఈ సారంగ సాహిత్య పత్రిక సైట్ ను కనీసం ఒక సంవత్సరం వరకు, అంటే 2018 మార్చి వరకు, ఇలాగే ఉంచుతాం. ఆ తరువాత సంగతి ఏమిటీ అన్నది ఇంకా ఆలోచించి అనౌన్స్ చేస్తాం. థాంక్స్!  “సారంగ” ఈ నాలుగేళ్లలో వేసిన అడుగులూ తప్పటడుగులూ/ సాధించిన విజయాలూ/ సంపాదించుకున్న అనుభవాలేమిటో  ఇప్పుడు ఈ వీడ్కోలు సమయంలో ఏకరువు పెట్టుకోదల్చుకోలేదు. ఇవన్నీ  ఇక్కడ రాసిన/ ఇక్కడ చర్చల్లో పాల్గొన్న ప్రతి వొక్కరివీ కాబట్టి! ఇవన్నీ ప్రతివారం అక్షరసాక్ష్యాలుగా మీ ముందు నిలబడ్డవే కాబట్టి! వెబ్ పత్రికా రంగం లో “ సారంగ” దీపస్తంభం! అయినా, చివరి మాటగా ఒక సారి తలచుకోవడం బాగుంటుందని అనుకుంటున్నాం.  వెబ్ పత్రికా రంగంలో “సారంగ” ఒక ప్రయోగం. మొదట వారం వారం తీసుకురావడమే విశేషం, ఆ విధంగా మిగిలిన వెబ్ పత్రికలకు అది … [ఇంకా చదవండి ...]

పెద్ద కథ / సుధాకర్ ఉణుదుర్తి

తూరుపు గాలులు -చివరి భాగం

3 దీపాంకరుడు ఉత్తారారామానికివచ్చి రెండేళ్ళుదాటింది. కొత్త పరిసరాలు, కొత్త మనుషులు, కొత్త విషయాలు; నేర్చుకోవడానికి అంతులేని అవకాశాలు. వీటిమధ్య రోజులు ఇట్టే గడిచిపోయాయి. సింహళభాష బాగాపట్టుబడింది. శిష్యుల సహకారంతో ఉచ్ఛారణ లోపాలు కూడా సరిదిద్దుకున్నాడు. తనకు సాయంగా నియమించబడిన శిష్యుడు ధర్మపాలుడితో అతనికి బాగా సఖ్యత కుదిరింది. ఉత్తరారామంలో దీపాంకరుడికి అన్నిటికన్నా ఆనందం కలిగించినదేమంటే దంతమందిరానికి సంవత్సరంపొడుగునా వచ్చేభక్తుల సందడి, అక్కడ ఉత్సాహపూరితంగాజరిగే పండగలు, పూజలు, దైనందిన కార్యక్రమాలు. నాలందాలోకూడా అతడటువంటి బౌద్ధ జనసందోహాన్ని చూడలేదు. వరసగా రెండేళ్లపాటు అన్ని పూజలనూ, పండగలనూ దగ్గరగా పరిశీలించినమీదట  అతనికి తోచిన విషయాలను వైశాఖ పూర్ణిమనాడు ఈవిధంగా తన జ్ఞాపకసంపుటిలో వ్రాసుకున్నాడు: మరో బుద్ధజయంతి పండగ వచ్చి వెళ్ళిపోయింది. మొత్తానికి ఈ రెండేళ్లలో చాలా సంగతులే తెలియవచ్చాయి. ఉదాహరణకి సింహళదేశం కూడా బ్రాహ్మణపౌరోహిత కులం, రాజ, వైశ్య కులాలు, భూమిమీద, వ్యవసాయంమీద ఆధిపత్యం కలిగిన గోవి కులం, వృత్తుల ఆధారంగా ఏర్పడ్డ అనేక కులాలు, ఛండాల కులం - ఇలా చాలా కులాలున్నాయని తెలుసుకున్నప్పుడు … [ఇంకా చదవండి ...]

పగిడీల పడవ

ఏ నిమిషానికి…

  భూపతిరాజు త్రిలోచనరాజుగారి ఇంటి దగ్గర ఆగిన వేగిరాజోరి మట్ట,  ప్రహారీ ముందు కాస్సేపు అలాగే  నిలబడి, అయోమయంగా తల గోక్కున్నారు. ' తూర్పా, పడమటా? పడమటా, తూర్పా?  ఉత్తరవా, దచ్చిణవా? దచ్చిణవా, ఉత్తరవా? ' ఈరోజు త్రిలోచనరాజుగారు ప్రహారీకి ఏ దిక్కునున్న తలుపు  తీయించి ఉంటారు? అనే అనుమానంతో మట్ట చేతులు అలా అసంకల్పిత ప్రతీకార చర్యలా  తలలోకి పోయి గోకడం మొదలెట్టాయి. ' కాళ్ళుపీకేలా ఇక్కడెందుకు నిలబడ్డం?  ఇంటి చుట్టూ ఓ ప్రదక్షిణ చేసి వచ్చేస్తే, అదే తెలిసిపోతుంది కదా?' అనుకొని  ఆ పనిలో పడ్డారు మట్ట. నెమ్మదిగా నడచి వెళ్తున్న మట్ట మొహాన్ని, తెరలు తెరలుగా వచ్చిన గాలి అలలు అలలుగా మారి చాచిపెట్టి కొట్టింది. ' ఇదేంటిది? ఇదేం గాలిది? ' అనుకున్న ఆయన, నడవడం ఆపి అటు ఇటూ పైకీ కిందకీ ఓసారి చూసారు. చుట్టూ చాలా చెట్లున్నా... ఎక్కడా ఏ చెట్టుకున్న ఆకూ అల్లల్లాడ్డంలేదు. 'మరి ఈ మాయముండా గాలి … [ఇంకా చదవండి...]

ఇతర/ అఫ్సర్

చాయ్ కప్పులో గోదారి!

(త్వరలో ప్రచురణ కానున్న భాస్కరభట్ల కవిత్వ సంపుటికి రాసిన ముందు మాట) గోదావరి నాలో మొదటి సారి ఎప్పుడు గలగల్లాడిందో చెప్పాలి ఇప్పుడు భాస్కరభట్ల గురించి రాయాలంటే! నదితో కాపురమున్నవాడి గురించి రాయాలంటే నది నించే మొదలెట్టాలి, ఎందుకంటే అతని మూలం నదిలో వుంటుంది కాబట్టి! ఈ “పాదముద్రలు” భాస్కరభట్ల దాచుకున్న పదముద్రలు, నెమలీకలు.  తనే అన్నట్టు: ఇప్పుడంటే రెండేగానీ... చిన్నప్పుడు నాకు మూడు కళ్లు! పుస్తకంలో దాచుకున్న నెమలికన్నుతో కలిపి!!! కవిత్వంతో మొదలైన జీవితం చివరికి  పాటతో ముడిపడడం గోదావరి జీవులకి కొత్త కాదు. అది దేవులపల్లి కావచ్చు, నండూరి సుబ్బారావు కావచ్చు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కావచ్చు, సిరివెన్నెల కావచ్చు, భాస్కరభట్ల కావచ్చు. వాళ్ళు కవిత్వం రాసినా అందులో గోదావరి గలగలే  పల్లవి అందుకుంటాయి.  నేను ఎంతో ఇష్టపడే ఇస్మాయిల్ గారి తొలినాళ్ళ కవిత్వంలో కూడా ఆ పాట వినిపిస్తుంది,  “తొలి సంజ నారింజ ఎవరు వలిచేరూ?” అంటూ. అయితే, ఇస్మాయిల్ లాంటి కవులు పాటలాంటి గోదావరి ప్రవాహంలోంచి కవిత్వ సెలయేటిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతే, భాస్కరభట్ల అటు ఆ ప్రవాహంలోనూ ఇటు ఈ సెలయేటిలోనూ రెండీట్లోకి హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే, ఇప్పటికీ అతన్ని నడిపించే దారి  గోదారే అని నా నమ్మకం. భాస్కరభట్ల ఆ గోదారి మీంచి హైదరాబాద్ దాకా జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చిన 1998 నాటి రోజులు నాకు మంచి జ్ఞాపకాలు. అప్పుడు నేను ఆంధ్రభూమి దినపత్రికలో ఫీచర్స్ ఎడిటర్ గా వుండే వాణ్ని. తెలుగు జర్నలిజంలోనే మొట్ట … ఇంకా చదవండి...]

ప్రకటన

శ్రీమతి గన్నవరపు సరోజినీ, సత్యనారాయణ మూర్తి స్మారక కథల పోటీ ఫలితాలు

సారంగ పత్రిక తో కలిసి నిర్వహించిన శ్రీమతి గన్నవరపు సరోజినీ, సత్యనారాయణ మూర్తి స్మారక కథల పోటీలను ఆదరించి కథలు పంపించిన రచయితలందరికీ ధన్యవాదాలు. దాదాపు నలభై కథల నుంచి రెండు కథలను బహుమతి కి ఎంపిక చేయటం కొంచెం కష్టమే అయినప్పటికీ న్యాయ నిర్ణేతలు మొత్తం పోటీకి వచ్చిన కథల నుంచి రెండు కథలను ప్రథమ, ద్వితీయ బహుమతులకు ఎంపిక చేసారు. మొదటి బహుమతి గా మూడు వేల రూపాయలు గెల్చుకున్న కథ “ మీ అమ్మ మారిపోయిందమ్మా !” ( రచన :  జి.ఎస్. లక్ష్మి) రెండవ బహుమతి గా రెండు వేల రూపాయలు గెల్చుకున్న కథ “ భగవంతుని భాష “ ( రచన : పి.వి. శేషారత్నం)             సాధారణ ప్రచురణ కు ఎంపికైన కథలు అనుబంధానికి నిర్వచనం : సుజలా గంటి తాంబూల సందేశం : డా. దేవులపల్లి సుజాత … [ఇంకా చదవండి ..]

కథానిక / జి.ఎస్. లక్ష్మి/పి .వి. శేషారత్నం /సుజలా గంటి

మీ అమ్మ మారిపోయిందమ్మా!

(శ్రీమతి గన్నవరపు సరోజినీ సత్యనారాయణమూర్తిగారి స్మారక కథలపోటీలో మొదటి బహుమతి గెల్చుకున్న కథ ) “మీ అమ్మ మారిపోయిందమ్మా..”అన్న నాన్నగారి మాటే నా చెవుల్లో గింగుర్లెత్తుతోంది. ఈ మాట ఆయన నాలుగునెలలక్రితం ఫోన్ లో అన్నారు. “అమ్మ మారడమేంటి నాన్నా!” అనడిగితే “ఏమోనమ్మా! నాకలా అనిపిస్తోంది..” అని అక్కడితో ఆపేసారు. మళ్ళీ నెల్లాళ్ళ తర్వాత అదే మాట. “ఏం జరిగింది నాన్నా!” అంటే “ఇదివరకులా లేదమ్మా.. ఇదివరకు అస్సలు యిల్లు కదిలేది కాదా! ఇప్పుడు అస్తమానం ఎక్కడికో అక్కడకి వెడుతోంది.” అన్న నాన్నగారి మాటలకి హోస్.. అంతేనా అనిపించింది. “పోనీ, వెళ్ళనీ నాన్నా.. ఇప్పటికి కదా అమ్మకి కాస్త వెసులుబాటయిందీ..ఇన్నాళ్ళూ … [ఇంకా చదవండి ...]

భగవంతుని భాష

(శ్రీమతి గన్నవరపు సరోజినీ సత్యనారాయణమూర్తిగారి స్మారక కథలపోటీలో రెండో బహుమతి గెల్చుకున్న కథ ) తనది పేరుకి చిన్న కాకా హోటల్లాంటిదే అయినా ఇక్కడ టిఫిన్లు బావుంటాయని  వండుకోవడానికి సమయం, ఓపిక చాలని సాఫ్ట్ వేర్  యువత వస్తుంటారని టేబుళ్లన్నీ అద్దంలా తుడిపిస్తూ ఎంతో నీట్‌గా ఉంచుతాడు  ఆ హోటల్‌  ఓనరు బలరాం. ఆర్డరిచ్చిన పావుగంటలోకల్లా పొగలు  కక్కుతూ టిఫిన్‌ టేబుల్‌మీదకి రావడమూ అక్కడ ప్రత్యేకతే. నోట్లో పెట్టుకోకుండానే అల్లం  చెట్నీతో పెసరట్టు రోస్టు కరకరలాడున్నట్టు ఊరించేస్తూ దానిమీద వేసిన బటర్‌ నెమ్మదిగా కరిగిపోతోంటే టిఫిన్‌ ప్లేటు దగ్గరకు జరుపుకుంటున్న జీవన్‌కు భార్య మందార గుర్తుకొచ్చి … [ఇంకా చదవండి ...]

అనుబంధానికి నిర్వచనం

(శ్రీమతి గన్నవరపు సరోజినీ, సత్యనారాయణ మూర్తి స్మారక కథల పోటీలలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ ) అపర్ణ కు చాలా బాధగా,అసహన౦గా,కోప౦గా ఉ౦ది. ఇప్పటిదాకా ఆమె జీవిత౦లో ఇలా౦టి అవమానాన్ని ఎదుర్కోలేదు. జీవిత౦ లో అన్నీ అనుకున్నవి సాధి౦చి౦ది. దానికి ఎవరడ్డు వచ్చినా క్షమి౦చేది కాదు.లెక్కచేసేది కాదు. అలా౦టిది ఇన్నాళ్ళకు తన మాట కాదనగల ఒక మనిషి వస్తు౦దని కానీ ఆమెను ఎదుర్కోవాల్సి వస్తు౦దని కానీ  కలలో కూడా ఊహి౦చ లేదు.    సువర్ణ ఇన్ని మాటల౦టు౦దని ఊహి౦చ లేదు. తన గదిలోకి వచ్చాక టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వేజ్ ను నేలకేసి కొట్టి౦ది.ఏదో తెలియని కసి.అప్పటి ఆమె మనోభావన ఊహకు కూడా అ౦దన౦త చిత్ర౦గా ఉ౦ది.ఇప్పుడే౦ … [ఇంకా చదవండి ...]

అనునాదం/ ఎలనాగ

తనతో కలిసి …

                              పెట్టె నా బరువును దించుకుంటూ గతవారపు మేఘవిస్ఫోటనాన్నీ, ఒక ప్లాస్టిక్ మేకనూ, హై స్కూల్లో అనుభవించిన ఐదు సంవత్సరాల నరకాన్నీ, తత్తరపాటు నిండి వికృతమైన నా మొదటి ముద్దునూ, నేనెప్పుడూ కలవని నా అమ్మమ్మనూ తాతయ్యనూ, చాపమీద వొలికిన వొంటినూనె పరిమళాన్నీ, మొన్నమొన్ననే పుట్టిన పిల్లిపిల్లనూ, మొక్కజొన్న నూకతో చేసిన ఉప్మానూ పెట్టెలో సర్దేస్తాను. వృద్ధాప్యంలో వుంటాను కనుక నన్నూ అందులో పడేసుకుంటాను. ఎన్నైనా పట్టేలా ఆ పెట్టె వ్యాకోచం చెందుతుంది మరి! ఆఖరుకు దానికి ఏ లేబులూ తగిలించక రైలుస్టేషను ప్లాట్ఫామ్మీద వదిలేస్తాను. అలా అది తన గమ్యాన్ని చేరుకుని వుంటుందక్కడ, ఎవరో అపరిచితుడు తనను తీసుకుని నిధిలాగా దాచుకుని తనతో కలిసి బతుకుతాడని ఎదురు … [ఇంకా చదవండి ...]

నేనూ సినిమా/ భవాని ఫణి

అలుపెరుగని పోరాటం – దంగల్ 

మనం వినని కథలూ కావు. మనం చూడని సినిమాలూ కావు. సక్సెస్ స్టోరీలెప్పుడూ చాలా ఉత్తేజాన్ని కలుగజేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. 'చాలానే చూసాం కదా, అటువంటి మరో కథేలే' అని ట్రైలర్ చూసినప్పుడు అనిపించకపోలేదు కానీ ఈ సినిమా చూసినప్పుడు మాత్రం, 'ఒక శిల్పకారుడు అతి నేర్పుగా చెక్కిన శిల్పంలా ఉంది సుమా' అనే ఆలోచన మాత్రం రాక మానలేదు. సినిమా ఒక కథ, సినిమా ఒక కవిత, సినిమా ఒక క్షణికానందం, సినిమా ఒక జీవితకాల సత్యం, సినిమా ఒక వినోదం, సినిమా ఒక దుఃఖం, సినిమా ఒక వెతుకులాట నిజానికి సినిమా ఒక ఆట కూడా. పట్టూ విడుపూ తెలిసి ఉండటం, దాడి చేయడమెప్పుడో దెబ్బకు కాచుకోవడమెప్పుడో అర్థం చేసుకునే తెలివితో మెలగడం, ప్రత్యర్థి ఏమాత్రం ఊహించలేని ఎత్తులను సమయానుకూలంగా వేయగల నేర్పరితనాన్ని కలిగి ఉండటం వంటి లక్షణాలు ఒక ఆటకు ఎంతో … [ఇంకా చదవండి ...]

‘పురా’ గమనం/ కల్లూరి భాస్కరం

‘పడగ’ల స్తబ్ధతా, ‘విండ్’ చలనమూ !

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-11  వేయిపడగలలో ధర్మారావు ముఖంగా అతిమానుష, మానుష ప్రపంచాల మధ్య తారతమ్య వివేచన నవల పొడవునా జరుగుతూనే ఉండడం గురించి చెప్పుకున్నాం. అరుంధతినీ, కిరీటి భార్య శశిరేఖనూ కూడా అబ్బురపరచిన అతిమానుషజగత్తు అది. దేవదాసిని చూసినప్పుడు, “తానొక కల్పితజగత్తున, అమానుషప్రపంచమున  తిరుగాడుచున్నట్లు”; “ఈ సంవిధానమే చిత్రముగా నున్నట్టు” శశిరేఖకు అనిపిస్తుంది. అలాగే, కావ్యజగత్తే యథార్థమైన జగత్తు అనీ, అపరిపక్వమైన మనస్సులు, కృత్రిమ ప్రకృతులు, అసహజమైన మనోభావాలు కలిగిన మనమే కల్పిత జగత్తు అనీ ధర్మారావు అనుకోవడం గురించీ, దివ్యజగత్తు నుంచి భౌమజగత్తులోకి రావడంలో అతను ఎదుర్కొనే క్లేశం గురించి కూడా చెప్పుకున్నాం. ఈ అతిమానుష, మానుష జగత్తులను; అవాస్తవిక, వాస్తవికజగత్తులుగా అనువదించుకుంటే ధర్మారావు పొందే క్లేశం వాస్తవికతను ఎదుర్కోవడంలోనే. శిల్పంలోనూ, కవిత్వంలోనూ కూడా వస్తుస్వరూపాన్ని “యథాప్రాప్తం”గా చిత్రించ కూడదని అతను అనుకుంటాడు. అతని ఆలోచనలు ఇంకా ఇలా ఉంటాయి: లోకమునందలి వస్తువు … [ఇంకా చదవండి ...]

రాగం-తానం-పల్లవి/ ఫణీంద్ర

రెహ్మానుకి వేటూరి అందం!

ఈ జనవరి 6 న యాభై ఏళ్ళు పూర్తిచేసుకున్న ఏ. ఆర్. రెహ్మాన్ ఎందరో సంగీతాభిమానుల గుండెల్లో స్థిరనివాసం ఏర్పరుచుకుని తనదైన చరిత్ర సృష్టించుకున్నారు. తెలుగు పాటని పునర్నిర్వచించిన పాటల రచయితగా తెలుగుని ప్రేమించే వారి గుండెల్లో శాశ్వత స్థానాన్ని పొందిన వేటూరి జయంతి కూడా జనవరిలోనే (జనవరి 29).  ఈ సందర్భంగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కొన్ని చక్కని పాటలని గుర్తుచేసుకుందాం. వేటూరికి సంగీత దర్శకుడు రెహ్మాన్ తో సన్నిహితమైన అనుబంధం ఉందని చాలా మందికి తెలియదు. రెహ్మాన్ దిలీప్‌గా రాజ్-కోటి వంటి సంగీతదర్శకుల వద్ద సహాయకుడిగా ఉన్న రోజులనుంచే వారి పరిచయం మొదలైంది. ఒకసారి వేటూరి రెహ్మాన్‌కి ఎవరి గురించో … [ఇంకా చదవండి ..]

అక్షరాల వెనుక/ నున్నా నరేష్

బీటలు వారిన ‘గాలి అద్దం’

' ఏరుకున్న దుఃఖంలో' అంటూ నాయుడి మీద 22 ఏళ్ల క్రితం నేను రాసుకున్న కవిత ఇది: వెన్నెల రెక్క తెగిన అమావాస్య ఏడుపురా నువ్వు   శ్వాసలూ భాషల్లోనే మూల్గాయని ఆత్మహత్యాత్మకంగా నొక్కి   తలవాకిట పడిగాపుల్లో చీత్కార ప్రణయాన్ని ఖాండ్రించి నవ్వి   నువ్ తీస్తున్న దౌడు పాదాల పియానో చప్పుడు-   మహానగర కూడలి చాపిన తారునాల్కకి వెగటు రుచివి మొండి గోడల్ని బీటలు చీల్చిన గడ్డిపూ పజ్యానివి కొడిగట్టిన దూదొత్తి రెపరెప కాల్చిన ఒంటరి అరిచెయ్యివేరా ఏంతకీ నువ్వు-   పెకలించినా మట్టంటని మొక్కలు మరెప్పుడూ నేల చేరని వాన చినుకులు అరచేతి … [ఇంకా చదవండి ...]

అద్దంలో నెలవంక/ నిశీధి

లోలోపలే మరణిస్తున్న ఎందరో….

నాలుగు వందల సంవత్సరాల వివక్షా పూరిత గాలులలో ఇప్పటికీ విషం చెరిగే అసత్యపు సాంస్కృతిక మూస ధోరణులు, జాతి మరీచికల నడుమ మనిషికి మనిషికి మధ్య ముఖ్యంగా నల్లజాతి మనిషికి తెల్లజాతి మనిషికి మధ్య  ముడి నగ్న సత్యాల మార్పిడి అత్యవసరం అంటారు  మనందరం చదివి ఔపోసన పట్టిన “రూట్స్” రచయిత అలెక్స్ హేలీ . మరి వేల ఏళ్లకి పైగా రంగు తేడాలు లేకుండానే వివక్షలననుభవిస్తున్న16.6 శాతం షెడ్యుల్ క్యాస్ట్స్ ఇంకో 8.6 శాతం షెడ్యుల్ ట్రైబ్స్ గొంతెత్తి చెప్తున్న నగ్న నిజాలని హత్తుకొనే ధైర్యం లేకపోయినా కనీసం రెండు చెవుల మధ్య మెదడు తెరచి పెట్టుకొని వినే క్షమత అయినా మిగిలిన వాళ్లందరికీ ఇప్పుడు ఉందా అన్నదే ప్రశ్న . రెండున్నరేళ్ళ క్రితం ఎంపికైన బ్యాలెట్ల రక్తం నిరంతర బలవంతపు సామాజిక సంఘీభావాలు  , నియంతృత జాతీయవాదాలుగా మారిపోయి నిరపరాధులను అమాయకులను హతమార్చడం ,ఇన్నోసెంట్ పీడిత మేధావుల అణచివేతకు కేరాఫ్ అడ్రెస్గా ప్రభలుతూ, గాంధీ … [ఇంకా చదవండి ..]

‘తెర’చాప/ సారధి మోటమర్రి

నాకు నచ్చిన చిత్రం: జయభేరి

‘సంగీతమపి సాహిత్యం సరస్వత్యా కుచద్వయం; ఏక మాపాత మధురం అన్యదాలోచనామృతం.’ సంగీతం చెవిన పడినంతనే మధురం. సాహిత్యం అలా కాదు. ఆలోచిస్తే అమృతం. ఆలోచింపచేసే దే సాహిత్యం.” అని అంటారు దాశరధి రంగాచార్యులు గారు తమ ఋగ్వేద పరిచయ పుస్తకంలో. సినిమా అనేది- ఒక కళ. నటన, నాట్యము,  సంగీతము, సాహిత్యము మరియు దృశ్యము- సమపాళ్ళలో మేళవించి చెక్కిన శిల్పమే, ఈ దృశ్య కావ్యము. తెలుగు చలనచిత్ర స్వర్ణ యుగములో అజరామరమైన చిత్రాలు అందించినవారిలో శ్రీ పి. పుల్లయ్య ఒకరు. వందల చిత్రాలకు కధా, మాటలు, పాటలు సమకూర్చి, తన పదునైన సంభాషణలతో, ప్రేక్షకుల గుండె లోతులను తట్టినవాడు ఆచార్య ఆత్రేయ. ఒక రచయితగా, సినీ కవిగా, మాననీయ వ్యక్తిగా, … ఇంకా చదవండి