ఒక నది : రెండు కవితలు

537604_404123966333998_1230470395_n


1.
నది మారలేదు
నది పాటా మారలేదు

అర్ధరాత్రి నిశ్శబ్దంలో
నది ఒడ్డున కూచుంటే
ఆ పాట నీకు స్పష్టంగా..

చీకట్లు చిక్కబడితేనే
కొన్ని కనిపిస్తాయి
కొన్ని వినిపిస్తాయి
మరికొన్ని వికసిస్తాయి!

2.

నదిలోంచి
దోసిలితో నీళ్ళు తీసుకుని
తిరిగి నదికే అర్పిస్తూ
చేతులు జోడిస్తాను

574894_284644554948607_899993610_n

–మూలా సుబ్రహ్మణ్యం

మీ మాటలు

 1. balasudhakarmouli says:

  nadidi alala sangeetham. meerannattu nadi maaradu. nadula roopam maarinattu maname chestunnaamu…… nadi amalinamynadi……

 2. C.V.SURESH says:

  నదిలోంచి

  దోసిలితో నీళ్ళు తీసుకుని

  తిరిగి నదికే అర్పిస్తూ

  చేతులు జోడిస్తాను…………………..W A H !!! సునిశితమైన పరిశీలన! లోతైన కవిత!

 3. హాయైన కవిత. చక్కగా, చిన్నగా సూటిగా–అలరించింది..

 4. నదిలా హాయిగా ఉంది కవిత.

 5. బాగుంది,..

 6. mercy margaret says:

  నది అంత స్వచ్చంగా ఉంది మీ కవిత

మీ మాటలు

*