1.
నది మారలేదు
నది పాటా మారలేదు
అర్ధరాత్రి నిశ్శబ్దంలో
నది ఒడ్డున కూచుంటే
ఆ పాట నీకు స్పష్టంగా..
చీకట్లు చిక్కబడితేనే
కొన్ని కనిపిస్తాయి
కొన్ని వినిపిస్తాయి
మరికొన్ని వికసిస్తాయి!
2.
నదిలోంచి
దోసిలితో నీళ్ళు తీసుకుని
తిరిగి నదికే అర్పిస్తూ
చేతులు జోడిస్తాను
–మూలా సుబ్రహ్మణ్యం
nadidi alala sangeetham. meerannattu nadi maaradu. nadula roopam maarinattu maname chestunnaamu…… nadi amalinamynadi……
నదిలోంచి
దోసిలితో నీళ్ళు తీసుకుని
తిరిగి నదికే అర్పిస్తూ
చేతులు జోడిస్తాను…………………..W A H !!! సునిశితమైన పరిశీలన! లోతైన కవిత!
హాయైన కవిత. చక్కగా, చిన్నగా సూటిగా–అలరించింది..
నదిలా హాయిగా ఉంది కవిత.
బాగుంది,..
నది అంత స్వచ్చంగా ఉంది మీ కవిత