ఫిడెల్ కో గీతం

Art: Nivas

Art: Nivas

 • చేగువేరా

~

నీవు సూర్యుడుదయిస్తాడని చెప్పావు.

వెళ్దాం పద

ఆ గీయని దారుల వెంట

నీవు ప్రేమించే ఆ ఆకుపచ్చని మొసలిని విడిపించేందుకు.

 

పద వెళ్దాం,అవమానాల్ని

చీకటి విప్లవ తారల నుదురులతో ధ్వంసం చేస్తూ.

విజయాన్నే పొందేద్దాం లేదా మృత్యువునే దాటేద్దాం.

 

మొదటి దెబ్బకే అడవంతా

క్రొత్త ఆశ్చర్యంతో మేల్కొంటే

అప్పటికపుడే ప్రశాంత సమూహమై

మేమంతా నీ పక్కన నిలిచేస్తాం.

 

ఎప్పుడు నీ గొంతుక

భూమి, న్యాయం, తిండి, స్వేచ్ఛ ల

నాలుగు గాలులనూ చుడుతుందో

అపుడే నీ సరి మాటలతో

నీ పక్కన నిలిచేస్తాం.

 

ఎప్పుడు సాయంత్రానికి

నియంత పై పని ముగుస్తుందో

అప్పటికపుడే కడపటి కదనానికి

మేమూ నీ పక్కన నిలిచేస్తాం.

 

 

ఎప్పుడు క్యూబా బాణపు దెబ్బను

క్రూర మృగం చవిచూస్తుందో

అపుడే పొంగే గర్వపు గుండెలతో

నీ పక్కన నిలిచేస్తాం.

 

ఆ ఎగురుతూ బహుమతులతో ఆకర్షించే

అందమైన గోమారులు మా ఐక్యతను ధ్వంసం చేస్తాయనుకోకు.

మాకు వారి తుపాకులు కావాలి, వారి తూటాల రాయి కావాలి

యింకేమీ వద్దు.

 

అమెరికా చరిత్ర కు పయనించేప్పుడు

మా దారిన అడ్డంగా ఆ ఇనుమే నిలుచుంటే

మా గెరిల్లా ఎముకలు కప్పుకునేందుకు

క్యూబా కన్నీటి తెరలనడుగుతాం

ఇంకేమీ అడగం.

(అనువాదం : విజయ్ కోగంటి )

మీ మాటలు

 1. చిట్ట చివరి యోధుడి గురించి చదువుతున్న ప్రతిసారీ మొదటి ఆవేదనే..

  • విజయ్ కోగంటి says:

   అవును తులసిగారూ. అది ఎపుడూ గుండెను పిండేదే!

 2. ఎక్స్ల్లెంట్. కవిత.అనువాదంభాగుంది..

 3. syed sabir hussain says:

  క్యాస్ట్రోని ఈ ప్రపంచం మరిచిపోగలదా….?

 4. VVLNS Prasad says:

  నిరంతర వైతాళికుణ్ణి మరవటం సాధ్యమా? ఒక వేళ ఎవరైనా మరచే పరిస్థితి వస్తే, నీవు ఉన్నావుగా, తమ్ముడూ!
  వాళ్ళని జాగృత పరిచేందుకు ! హై హై సోదరా-

మీ మాటలు

*