ఈ పుడమిపై
తల్లి స్పర్శ లేని జీవి
ఐడియల్ అనుకుంటున్నావా...?
మౌంట్ అథోస్ శిఖరాగ్రాన
మిహెయిల్ ఓ టొలొటొస్
జీవితం ఎరిగిన వాడికి తెలుస్తుంది
రియలిస్టిక్ అని.
విడిపోయే ముందు
మాగ్ పై పక్షుల
నడుమ జంటలను
విడిచిపెట్టాలి.
డైవోర్స్ అనే పదం
ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయేది.
బ్రిటీష్ గెడ్డ పై
గొర్రె- లాన్స్ కార్పోరల్
పిల్లి-చీఫ్ మౌసర్
టూ ది కేబినెట్ ఆఫీస్
మరి మనిషో..?
జాతి ;వివక్ష--- ఉండనే ఉంది కదా!
మనిషి ఎంత తెలివైన వాడో
తెలుసా!
అరవై రెండులో క్యూబన్ ట్రేడ్ ఎమ్బార్గో
గంటల ముందు
జె.ఎఫ్.కె కొన్న 1200 క్యూబన్ సిగార్స్
అంత.
భూమికి ఆరు అడుగుల క్రింద పడుకుంటే
రోధిస్తావు.
పుడమికి 220 అడుగుల క్రింద
గ్రాండ్ కేనియన్ గుహలలో నిదురిస్తే
స్టేటస్ సింబల్!
కుతూహలం కొద్దీ ఇందులోని రెఫరెన్సులు వెతికి తెలుసుకున్నాను. “మాగ్ పై పక్షులు” మాత్రం దొరకలేదు.అదేమిటో చెప్పరా?
కవితలో పాద విభజన కొంచెం తికమక పెట్టింది.
https://en.m.wikipedia.org/wiki/Magpie