మనసులో వాన

 

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

అరుణ గోగులమండ
~
చూరును వీడి జారబోయే చినుకు క్షణకాలపు ఊగిసలాటలో
నూనెరంగుల చిత్రపు వెలిసిపోయిన వెర్షన్లా..
నువు ఓగుబులు తెరై కదలాడతావు.
గది గోడకున్న నిలువుటద్దంపై ఉషోదయపు ఏటవాలు కిరణంలో
తెలిమంచు వేళ్ళతో లిపికందని ఊసుల్ని రాసి మాయమౌతావు
“యువర్ థాట్స్ సర్ఫేస్ సో ఆఫెన్ డియర్ నోబడీ”.
ఉన్నదేదో ఇదిమిద్దంగా తెలియని గమ్మత్తైన స్థితి.
లేనిదెపుడూ.. నిజంగా లేనిదెపుడు?
తలపుల గోతాముపరుగులో ఆ నాలుగుగదులెంత అలిసాయో తెలిసేదెవరికి?
రమ్మనీ అనకుండా వద్దనీ చెప్పకుండా
వాటంత అవే పాదాలను చుట్టుకున్న పాశపు పోగులు
కొన్ని ముడులలో చిక్కుబడి, పీఠముళ్ళై బంధించబడి
బంధాలుగా కట్టబడి
వలయాలు వలయాలుగా బ్రతుకంతా ఆక్రమిస్తూ.
ఏం చెప్పమంటావోయ్.. కలలలో నిరంతరం నాతో నడిచే చెలికాడా..!
మర్రి చెట్టు ఊడల్లా దిగబడి మనసులోతుల దాగున్న చిత్రం నీవు.
నిద్దురలో నడిచే ప్రాణమున్న మతిలేని జీవి నేను.
బాధ్యత మరవను.
కాలాన్ని వెనుదిప్పనూలేను.
చిటికెలేసి నీ ఉనికి చాటుతూ నాకోసం వెతికిన రోజుల దిగులుమేఘం ..
నడిరేయంతా మాగన్ను నిదురల కళ్ళలో కదులుతూ.
చిమ్మ చీకటిలో వరస గదులకావల పిట్టగోడపై నీ ఒంటరి మనసు
వేళ్ళాడిన మౌనసందేశపు గేయాల సుడులు తలపై రివు రివ్వున తిరుగుతూ.
వేర్ ఆర్ యు మై బోయ్? మస్ట్ బీ సంబడీ ఎల్సెస్ మేన్ నౌ..!
ఆనాడు వికసించిన వాత్సల్యం శిలాజమై మిగిలినా సౌరభం మదిని వీడదు.
ఏ లోకాల సరిహద్దుల నీ అడుగులు సాగుతూపోయినా
ఈ అంచుల ఒంటరై నిలుచున్ననా దేహాన్ని పొగమంచులా తాకకమానవు.
లైఫ్ స్టిల్ రిమైన్స్ మై డార్లింగ్..
థో,నథింగ్ లాస్ట్స్ ఫరెవర్..
మెమరీస్ లాస్ట్.
టిల్…లాస్ట్.
*

మీ మాటలు

 1. D Subrahmanyam says:

  మంచి కవిత అరుణా అభినందనలు

 2. Adi Andhra Thippeswamy says:

  Congrats Madam

 3. Kiranmai says:

  Adhbhutam Aruna
  Enta bagundo
  Cheppalenu

 4. Aruna.Gogulamandaa says:

  తాంక్యూ దేవరకొండ గారూ,తిప్పేస్వామిగారూ, అండ్ డార్లింగ్ కిరణ్మయి..యు మేడ్ మై డే దిస్ మోనింగ్..థాంక్యూ డియర్ పబ్లిషర్స్ ఫర్ గివింగ్ మీ మోర్ రీసన్స్ టు స్మైల్ టుడే..

 5. Mallikharjuna Rao Neathala says:

  Very good poem , Marvles and etxtract feelings from Hearts of Huemen….
  Thank you Thank you very much Aruna garu

  • Aruna.Gogulamandaa says:

   తాంక్యూ సో వెరీమచ్ మల్లిఖార్జున రావు గారూ…మీ అప్రీషియేషన్ మేక్స్ మీ రైట్ బెటర్..

 6. ashokavari says:

  బాగుంందంండీ మేడమ్ ..!

 7. మంచి కవిత

 8. Aruna.Gogulamandaa says:

  థాంక్యూ వెంకట్ గారూ..

 9. Naveenkumar says:

  గుడ్ వన్ అరుణ గారు.. లవ్డ్ ఇట్ ..

  • Aruna.Gogulamandaa says:

   నవీన్ గారూ.మీ కామెంట్ ఆలస్యంగా చూసాను..తాంక్యూ సో వెరీ మచ్..

 10. dasaraju ramarao says:

  సైలెంట్ లవ్.expressed గుడ్

  • Aruna.Gogulamandaa says:

   తాంక్యూ రామారావు గారూ..ఆల్ ఆఫ్ యు మేడ్ మై డే ఏ స్పెషల్ వన్ విద్ యువర్ అప్రీషియేషన్..

 11. గంగాధర్ వీర్ల says:

  అర్థవంతం.. అనుభవైక భావన కలిగించారు.
  మీ కవితకు జేజేలు

  • Aruna.Gogulamandaa says:

   థాంక్ యూ గంగాధర్ వీర్లగారూ..మీ వ్యాఖ్య సంతోషం కలిగించింది..

 12. K.WILSON RAO says:

  ఉషోదయపు ఏటవాలు కిరణంలో తెలిమంచు వేళ్ళతో లిపికందని ఊసుల్ని రాసి మాయమౌతావు…… ఒక అద్భుతమైన వ్యక్తీకరణ .. బాగుంది అరుణ గారు

 13. Aruna.Gogulamandaa says:

  తాంక్యూ వెరీ మచ్ విల్సన్ గారూ ..సా యువర్ కామెంట్ వీరీ లెట్..బట్ ఫెల్ట్ టూ గుడ్ టు రీడ్ ఇట్..తాంక్ యూ..

మీ మాటలు

*