ఈ రాత్రి వొడవదు ఎన్నో రాత్రి ఇది చెంప మీద ఎన్నో కన్నీటి చుక్క జారి ఆరిపోతున్నది తెల్లని మంటయ్ కురుస్తున్న మంచు కిటికీ అద్దం మీద వీధి లాంతరు విసుగు ఒక్క వెచ్చని వూహ లేదని ఫిర్యాదు దృశ్యం మారితే బాగుండు, మార్చేది ఎవరు నేనెప్పుడూ చీకట్లో ఆడుకుంటున్న ఆడపిల్లనే నా చుట్టూరా నల్లని కందకం, ప్రతిబింబం లేని అద్దం వృత్తాకార కందకంలో నాచు పట్టిన కత్తులు కందక ఖడ్గానికి పొదిగిన పచ్చల వలె చుక్కలు నల్లని అద్దాన్ని దాటే … [ఇంకా చదవండి ...]
నువ్వంతే ఎప్పుడూ నిత్య వికసిత కుసుమానివై పరిమళం వెదజల్లుతుండు నిను కాంచే చూపుల పై... దేహాలపై... ~ నీ నవ్వుకు వేలాడుతుంది ఓ ముక్క ఆకాశం కాంతి సముద్రాన్నెత్తుకొని నీ నడుమ్మోసే చంటిపాపలా ఓ మాయని మాయలా ముడతలు కొన్ని నీ ముఖంమ్మీద అందం చెక్కిన ఆనందాలౌతుంటాయి అసలే నలుపు ఆపై చెవికి చెవులై వేలాడే లోలాకులు నక్షత్రమంత కాకపోయినా అలాంటిదే ఓ ముక్కు పుడక నీ ముక్కు అందం జుర్రేసుకుంటూ అంత వరకూ చూడని రంగురంగుల సీతాకోకచిలుక దేహపుహోళిలా నిను చుట్టేసిన బట్టల అద్దాల్లోంచి తొంగి … [ఇంకా చదవండి ...]
నా లోపలి సతత హరితారణ్యానికి ఎవడో చిచ్చు పెట్టాడు మట్టిదిబ్బలూ ముళ్లపొదలూ తప్ప తుమ్మముళ్లూ బ్రహ్మజెముళ్లూ తప్ప పూల పలకరింపుల్ని ఆఘ్రాణించలేని పక్షుల రెక్కల ఆకాశాల్ని అందుకోలేని సెలయేళ్ల లేళ్లను తనలోకి మళ్లించుకోలేని జంతుజాతుల జన్మరహస్యాల్ని పసిగట్టలేని మనిషిరూపు మానవుడొకడు ఒళ్లంతా అగ్గి రాజేసుకుని అంటించేశాడు వాడు విధ్వంసపు మత్తులో తూలుతూ మంటల ముందు వెర్రిగా తాండవమాడుతూ ++++++ కాలమాపకయంత్రం మలాము పూసింది కాలిన గాయాలు కనుమరుగవుతున్నాయి పచ్చదనం మళ్లీ … [ఇంకా చదవండి ...]
Copyright © 2024 Saaranga Publishers
మనస్పర్షి నివాళి
యూఫేమిసం గురించిన పూర్తి అవగాహన తెచ్చుకునే ప్రయత్నమేదీ చెయ్యలేదు. కానీ మీఈ కవిత చదివాక మనసుని మెలిపెట్టే ఎంతటి విషయాన్నైనా ఇంత సున్నితంగా చెప్పొచ్చా అన్న ఆశ్చర్యంలోంచి ఇంకా తేరుకోలేకపోతున్నా. వెరీ క్యూట్. కొన్ని మరణాలు ఇలా చరిత్రలో నిల్చిపోతాయేమో కదా. కొంతమందికి వారి అదృష్టం వారు ఉన్నప్పుటికంటే పోయాకనే తెలిసేది. ఐతే అదితెల్సుకోడానికి వారు లేకపోవటమే ట్రాజెడి. వెరీ వెల్ రిటెన్.
చాలా బాగా రాసారు
‘మొట్ట మొదటి సారి ఉట్టి లేఖ పేరుతో చివరి మరణ మహావచనం ఒకటి నీ హృదయం నుంచి కత్తిరించి ఎన్నో హృదయాల అంచున పర్మినెంట్గా పేస్ట్ చేశాని తెలుసు.
మనసున్న వాడే విరిగిపోతాడు. జీవితం మీద అనురక్తితోనే విరక్తీ కలుగుతుంది. నీ పోరాటంలో విరక్తి. నీ విరక్తిలో, శూన్యంలో అనురాగం ఉందనీ తెలుసు.’
Touching!
బాగుంది మీ చివరి ఉత్తరం.
విలువలతో కూడిన జీవితం ఎప్పటికి ఒంటరిదే . అంతా ఋజుమా ర్గంలో , సరళంగా నిజాయితీగా జరుగుతున్నట్లనిపిస్తూనే హటాతుగా ఒంటరిని చేసేస్తుంది . ఎంతటి వారికైనా నమ్మకద్రోహం, ఒంటరితనం భరింప శక్యం కానివే . . మనసున్న మనిషి నిష్క్రమణం ఎంతో బాధాకరం . కంటిలో నలుసులా బాధిస్తూనే ఉంటుంది. మరింత శక్తి పుంజుకుని ఎగసి పడే ఝున్ఝామరుతంలా మరలా రాకూడదు , అవకాశవాదుల సింహాస్వప్నమై….
“నీ అభిమాన రచయిత కార్ల్ సాగన్ చెప్పినట్లు.Absence of evidence is not absence of evidence. ఉత్తరంలో శూన్యం మాత్రమే ఎందుకు చెప్పావో తెలియదు. నువ్వు
రాయకపోయినా కానీ మనసున్న వాడే విరిగిపోతాడని జీవితం మీద అనురక్తితోనే విరక్తీ కలుగుతుందని, నీ పోరాటంలో విరక్తి . నీ విరక్తిలో శూన్యంలో అనురాగం ఉందనీ తెలుసు.”
లాలస వాక్యాలు మనసుని నిజంగా కత్తిరించి అవసరమైన చోట, పేస్ట్ చేస్తాయి..!
రోహిత్ మరణం ఎంత బాధాకరం.. వొక యువకుడి మరణం.. నడిరాత్రి ముగించని ఉత్తరం ..సగం మరణం.. అంతా శూన్యం..
ఖాళీ తనం … మనిషిగా బ్రతుకుతున్నామని నమ్మించుకోడానికి కూడా భయపడేతనం..!!
ఖాళీగా ఉంది లాలసా.. స్నేహితులూ, మిత్రులూ, బంధువులూ, హితులూ, సన్నిహితులూ.. చెరో కొమ్మలు పట్టుకొని రాబందుల్లా వేల్లాడుతుంటే.. ఖాళీ మైదాన స్మశానంలో శాశ్వత నిద్రకి ఉపక్రమిస్తున్నట్లు ఉంది..
మంచి రైటప్ ..
–సాయి పద్మ
“Absence of evidence is not absence of evidence.”
It might be an irrelevant interjection but I would like to mention that this quotation is incorrect. Carl Sagan said, “Absence of evidence is not evidence of absence”.
Perhaps, that was what you meant to say. That you are not yet convinced that Rohith is no more…