మమత వేగుంట
సప్తస్వరాల శిఖర బిందువు- నిషాదం!
స్వరం సరిహద్దులకి చివరి పరీక్ష- ని.
నీ వ్యక్తీకరణ పరిధుల తుదీ మొదలూ తేల్చుకునే సమయంలో వినాలి- ని.
తెగని సంఘర్షణ తరవాతే గెలుపు
కాన్వాస్ చీకట్లోంచి మెరుస్తుంది కళాఖండం
ఆ ఉత్సాహపు ఉరకల్లో మేధో విజయంలో వినాలి- ని.
ఏనుగు ఘీంకారంలోంచి కదిలాయి నిషాద స్వరమూలాలు.
ఆ ఘీంకారం నిన్నూ నన్నూ ఆదిమ యుగాల్లోకీ తీసుకెళ్తుంది
ఈ క్షణంలోకీ ఇక్కడికీ మేల్కొల్పుతుంది.
సాధ్యమయ్యే కలలోకి మెలకువ- ని
ఒక అద్భుతంలోకి విజయ సోపానం- ని
సాధ్య స్వప్న కళకి చేరువగా విను- ని!
ని?
మమత గారు.
వాట్ ఏ లవ్లీ వర్క్.
ఉన్నత మైన కళకు బాష అక్కర్లేదు అన్నారు ఒక మిత్రుడు మొన్న.
అలా అన్నట్టే, ఈ సారి మీ సుస్వరం చూస్తే టెక్స్ట్ చదవకుండా ఉన్దిపోవాలనిపించింది.
ఎంత ఎత్తుకు తీసుకెళ్ళారు!
ఆ ఘీంకారం కూడా సుస్వరం అని అర్థమయింది.
థాంక్స్ చెప్పడం వేస్ట్.
ఐనా, ఒక మాట.
అసలు మీరు ఆ మాత్రం కూడా చెప్పడం ఎందుక -ని?
అంత బ్రివిటి ఎలా సాధించారు?
నైస్ వర్క్స్ ప్లీజ్.
సెలవు, మరో ప్రయత్నం వరకు.
రమేష్ గారు, A picture speaks a thousand words అన్నారు కదా, అందుకే బొమ్మ వేసినప్పుడు మాటలు సెలవు తీసుకుంటాయి.. thank you for your response ! మమత
” ఆ ఘీంకారం నిన్నూ నన్నూ ఆదిమ యుగాల్లోకీ తీసుకెళ్తుంది… ఈ క్షణంలోకీ ఇక్కడికీ మేల్కొల్పుతుంది.” అద్భుతం మమత గారూ !
రమేష్ గారు.. A picture is worth a thousand words అన్నారు కదా, బొమ్మ వేసినప్పుడు మాటలు సెలవు తీసుకుంటాయి.. :) thank you for your response..
Thank you, Rekha!