పసునూరి రవీందర్‌ కి యువ సాహిత్య అకాడెమీ అవార్డ్

Pasunoori Ravinder 1

 

సాహిత్య అకాడ‌మి 23భారతీయ భాషల యువపురస్కారం-2015 విజేతల్ని ప్రకటించింది. తెలుగు నుండి ప్రముఖ యువకవి, రచయిత డాక్టర్‌ పసునూరి రవీందర్‌ను ఎంపిక చేసింది. రవీందర్‌ రాసిన అవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియా పుస్తకానికి ఈ గౌరవం దక్కింది. కవిగా, రచయితగా, జర్నలిస్టుగా, పరిశోధకునిగా బహుముఖీన కృషి చేస్తున్న పసునూరి రవీందర్‌ సాహిత్యలోకానికి సుపరిచితుడు. వరంగల్‌ నగరంలోని శివనగర్‌ ప్రాంతానికి చెందిన రవీందర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో రీసెర్చ్‌ ఫెలోగా పనిచేస్తున్నారు.

లడాయి దీర్ఘకవిత, మాదిగపొద్దు కవితా సంకలనంతో పాటు అవుటాఫ్‌ కవరేజ్‌ఏరియా, జాగో జ‌గావో, దిమ్మిస‌ పుస్తకాలను వెలువరించారు. తెలంగాణ ఉద్యమంలో బహుజన వాయిస్‌ను బలంగా వినిపించిన పదునైన గొంతుక రవీందర్‌. ఇటీవలే రవీందర్‌ కృషికి తెలంగాణ ఎన్నారై అవార్డుతో పాటు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ ఉత్తమ జర్నలిస్టు అవార్డును కూడా సీఎం కేసియార్‌ చేతుల మీదుగా అందుకున్నారు. ఇక సాహిత్య అకాడమి ఎంపిక చేసిన యువపురస్కారం ఈ యేడాది రవీందర్‌ను వరించింది.

 

సురవరం ప్రతాప రెడ్డి రచనలపై సభ

suravaram

మీ మాటలు

  1. chandhu-thulasi says:

    కంగ్రాట్స్ రవీందర్ గారు…..మమీరు భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలి…

  2. buchi reddy gangula says:

    కంగ్రాట్స్ –మా జిల్లా రచయితకు
    ————————————————
    బుచ్చి రెడ్డి గంగుల

  3. Dr.Vijaya Babu Koganti says:

    రవీందర్ గారికి హృదయ పూర్వక అభినందనలు.

మీ మాటలు

*