‘ఫాదర్స్’ డే ఫన్ విత్ దినేశన్!

సుధా శ్రీనాథ్ 

 

sudhaఆ రోజు ఫాదర్స్’ డే. స్నేహితులందరూ పిల్లలతో మా ఇంట్లో సమావేశమయ్యారు. ఆ రోజు పిల్లలు తమ అమ్మ సహాయంతో తమ నాన్నకిష్టమైన వంటకాలను చేసి తీసుకొచ్చారు. ప్రతి ఇంటి నుంచివాళ్ళ నాన్న ఫేవరేట్స్ మా డైనింగ్ హాల్ చేరాయి. నేనైతే పిల్లలతో pronunciation కబుర్లకని కూడా ఎదురు చూస్తున్నాను.

అందరం మదర్స్ డే సర్ప్రైజ్‌ని గుర్తుచేసుకొన్నాం. తెలుగులో నాన్నని ‘అప్ప’, ‘అబ్బ’, ‘అయ్య’ అని కూడా అంటాం. కొరియన్స్ కూడా నాన్నని ‘అప్పా’ అని పిలుస్తారట. మొత్తానికి ఈ సారి మదర్స్డే, ఫాదర్స్ డే రెండ్రోజులూ కొరియన్స్‌ని గుర్తు చేసుకొన్నామని అందరికీ నవ్వొచ్చింది. అయితే అమ్మ, అప్ప అనే రెండు తెలుగు పదాలు అదే అర్థంతో వాడే ఇంకో దేశముందనేది అందరికీఅత్యాశ్చర్యాన్నిచ్చిన మాట అక్షరాలా నిజం.

పిల్లల్ని ఆత్మీయంగా సంబోధించడానికి ‘చిట్టి తండ్రీ, చిన్ని నాన్నా’ అంటారని, అమ్మ తనని చాలా సార్లు ముద్దుగా అలా పిలుస్తుందని చెప్పిన ఓ చిన్నారి మాటకు నాన్నల నుంచి ఒకటే చప్పట్లు.ఇంకా బాగుందనేందుకు కొన్ని సందర్భాల్లో ‘దాని అప్ప(అబ్బ)లాగుంది’ అనే వాడుక ఉందనే మాటకి నాన్నల మొహాలు నవ్వులతో నిజంగా వెలిగిపోయాయి. ‘అప్ప’ అనే పదాన్ని పెద్దలకుగౌరవసూచకంగా కూడా వాడుతాం. శ్రీ కృష్ణదేవరాయలు తన ఆస్థానంలో మహామంత్రియైన తిమ్మరసుని తండ్రిలా గౌరవించి ‘అప్పాజి’ అని అత్మీయంగా సంబోధించేవారట. అవునవును, కొన్నిసముదాయాల్లో నాన్నని ‘అప్పాజి’ అనే పిలుస్తారన్నారు బెంగళూరినుంచి వచ్చిన వారొకరు.

ఆ రోజు పగ్గాలు పూర్తిగా పిల్లల చేతుల్లోనే. పిల్లలు తమకు నాన్నే ఫస్ట్ హీరోనని మళ్ళీ మళ్ళీ చెబుతూ నాన్నకు కృతజ్ఞతలు చెప్పుకొన్నారు. అమ్మలు, నాన్నలు కూడా తమ నాన్నను తల్చుకొనిగౌరవాభిమానలందించేలా చేశారు. ఎండెక్కువగా ఉన్నందున ఔట్ డోర్ గేమ్స్ బదులు ఇంట్లోనే నాన్నలకని చిన్ని చిన్ని ఆటలు, బహుమానాలు కూడా ఏర్పాటు చేశారు. “The pioneers in any field are called Fathers in that field. For example: many of you know about Darwin and Mendel. Charles Darwin is known as the father of Evolution theory and Gregore Mendel is for genetics.  Madison is called the father of American constitution. In India, Ambedkar is the father of Indian constitution. Mahatma Gandhi is called the father of the nation.” చిన్నారి మాటలు వింటున్నట్టే ఫాదర్ ఆఫ్ దినేశన్ అంటూ ఒక జోక్ గుర్తుచేశారొకరు.

దినేశన్, గణేశన్ అని అన్నదమ్ములుండేవారు. దినేశన్‌కు తమ్ముడు గణేశన్ అంటే భలే ఇష్టం. ఒక రోజు స్కూల్‍నుంచి వచ్చిన దినేశన్ చాలా డల్‌గా ఉన్నాడు. ఎందుకని వాళ్ళ నాన్న అడిగితే“నాన్నా, నేను నీ కొడుకు కాదా? గణేశన్ నా తమ్ముడు కాదా?” అనడుగుతూ ఏడ్చాడు. ఉన్నట్టుండి నీకీ అనుమానమెందుకన్న నాన్న ప్రశ్నకు అసలు విషయం బయట పడింది. గాంధీజి ఈస్ దిఫాదర్ ఆఫ్ ది నేశన్ అని స్కూల్లో చెప్పారట! జోక్ విన్న నాన్నలకే కాదు, అమ్మలకూ, పిల్లలకూ అందరికీ ఒకటే నవ్వులు. నవ్వులతో, ఆనందంతో నాన్నలందరికీ విందు వడ్డనలతో భోజనాలుమొదలయ్యాయి. వారికి నచ్చిన వంటకాలు నాన్నల విందుకు ఘన స్వాగతం పలికాయి.

భోంచేస్తూ అముదగారు చెప్పిన వాళ్ళ నాన్నగారి విషయం అందర్నీ భావుకుల్ని చేసింది. వాళ్ళ నాన్నగారు రిటైర్ అయిననాడే వాళ్ళమ్మకు వంటింటినుంచి విడుదల అన్నారట. దాన్ని అక్షరాలాపాటిస్తున్నారట. ప్రతి రోజూ ప్రతి వంటకం తామే చేస్తూ వాళ్ళమ్మకిష్టమైన హాబీస్ కొనసాగించేందుకు పూర్తిగా సహకారమిస్తున్నారట. “మా ఆయన కూడా నాకన్ని విధాలా సహకరిస్తూ మా నాన్ననిగుర్తుతెస్తారు” భర్త పట్ల తమ అభిమానం వెల్లడించారు అముదగారు.

అక్కడున్న ప్రతి నాన్న కూడా అమ్మకు ప్రతి రోజూ ఇంటి పనుల్లో సహాయం, సహకారమిస్తున్నవారేనని పిల్లలందరూనాన్నలను అభినందించారు. అమ్మ ఇంట్లో లేనప్పుడు తను అమ్మా! అని పిలిస్తే నాన్న పలుకుతారని, తనకి అమ్మానాన్నలు రెండు కళ్ళలాగని పలికిందో పాపడు. అవును కదా, రెండు కళ్ళలోఏదీ ఎక్కువ కాదు, ఏదీ తక్కువ కాదు; కాకూడదు కూడా. మొత్తానికా రోజు నాన్నలను అభినందనలతో ముంచెత్తారు పిల్లలు. కుటుంబ వ్యవస్థకు అమ్మ నాన్నలిద్దరూ ఆధార స్థంబాలు. బాధ్యతలుతెల్సిన అమ్మా నాన్నలున్న కుటుంబాలే స్వస్థ సమాజాన్ని కట్టగలవు.

bapu

అందరివీ భోజనాలయ్యాయి. వెనకటి వారం సగానికి వదిలేసిన మా pronunciation కబుర్లను కొన సాగించే సమయమది. అంతకు మునుపే నేను మేం మాట్లాడే ఇంగ్లిష్ గురించి పిల్లలతోచర్చించిన విషయం కొందరికి తెల్సి, మన తప్పుల గురించి పిల్లల్ని అడగడం నా తెలివితక్కువ పని అన్నారు.  పిల్లలికపైన మనల్ని ఆడిపోసుకొంటారని బెంగ పడ్డారు. ఇలాంటి ప్రయత్నాలుమానేయమని కొందరు నాకు ఫోన్ చేసి చెప్పారు కూడా. అలాంటి బెంగ అక్కర్లేదని, మనం వట్టినే ఏవేవో ఊహించుకొని దిగులు పడకూడదనే నా అభిప్రాయానికి కొద్దిగా సహకారం దొరికింది. ఈనేపథ్యంలో నేనెదురు చూస్తున్న కబుర్ల సమయం వచ్చేసింది.

అందరం ఒకే చోట కూర్చొన్నాం కబుర్లకని. అచ్చులు, హల్లుల తప్పులతో మొదలెట్టారు పిల్లలు. ‘ఎల్లో’ అనేందుకు ‘యెల్లో’ అంటారన్నారు కొందరు. ‘వోట్’ అనేందుకు ‘ఓట్’ అనడం ‘యెస్’అనేందుకు ‘ఎస్’, ‘ఎండ్’ అనేందుకు ‘యెండ్’ అనడం ఎక్కువగా గమనించిన తప్పులన్నారు ఇంకొందరు. మిగతా పిల్లలు వీరితో సమ్మతిస్తూ తలూపడం కనబడింది.

ఎక్కడైతే z అక్షరం ఉంటుందో అక్కడ j వేసి ఆ పదాలను ఎక్కువగా తప్పు పలుకుతారని, జీరొ, జూ అనే తప్పుల్ని ఉదహరించారు. ఆ ధ్వని తెలుగులో లేనందువల్ల దాన్ని రాసి దిద్దేందుకు వీలుకాదని పిల్లలే తెలిపినప్పుడు విచిత్రమనిపించింది కొందరికి. అదే రీతి x ఉన్న పదాల్లో కూడా అవుతుందని తెలిసింది. ఈ కబుర్లు వద్దని వారించినవారు కూడా పొందికగా ఒదిగిపోయి అభినందించడంవల్ల పిల్లల మాటలు ఊపందుకొన్నాయి. నేను పిల్లలు చెప్పిన ప్రతిదాన్నీ రాసుకోవడం మొదలు పెట్టాను. ఎందుకంటే మన తప్పులు మనక్కనపడవు కదూ.

“అండర్‌స్టాండింగ్ అనేందుకు అండ్రస్టాండింగ్ అని, మాడర్న్ అనేందుకు మాడ్రన్ అని అంటారు. కంసిడరేషన్ అనేందుకు కంసిడ్రేషన్ అంటారు. డి మరియు ఆర్ మధ్యలోని అక్షరంమాయమైపోతుంది, ఎందుకో” అంటూ రాగం తీశాడు బాలుడొకడు. Similarly, the vowel between `t’ and ‘r’ disappears  అంటూ ప్యాట్రన్, మ్యాట్రు అన్నాడింకో చిన్నారి.  Also, the vowel between `t’ and ‘l’ disappears  ఇంట్లిజెంటు, మెంట్లు అంటారని బుంగ మూతి పెట్టిందో చిన్నారి.  కారణమేం చెప్పాలో తోచక నవ్వేసి, వాటిని కూడా రాసుకొన్నాను ఆ తప్పులు నామాటల్లో లేకపోయినా కూడా. ఎగైన్‌స్ట్ అనేందుకు మాలో చాలా మంది ఎగెనెస్ట్ అంటామని ఒకావిడ చెబితే విని పిల్లలు చిరునవ్వులు చిందించారు.

“కొందరు what, where, why తప్పుగా pronounce చేస్తారు. వాటినెలా కరెక్ట్ చేయాలో తెలీదు.” చిన్నారియొక్కతె చెప్పవచ్చో, చెప్పకూడదో అనే భావంతో చెప్పింది. ఇండియన్స్ చాలా మందిwicket బదులు vicket అంటారని గుర్తుచేశాడింకో అబ్బాయి. నాకు పాప చెప్పిన v మరియు w ల వల్ల నేను చేసేటటువంటి మిస్టేక్స్ గుర్తొచ్చి పాప వైపు చూశాను. అది కూడా భారతీయ భాషల్లోరాయడం కష్టం. అందుకే wicket కాస్త vicket అని భారతీకరించారని పాపే కారణమిచ్చింది. ఓహో! నేనా తీరున ఆలోచించి ఉండలేదు. సమస్యకు మూల కారణమేమని కూడా పిల్లలేఆలోచిస్తున్నారని గర్వమనిపించింది.

budugu

కొందరు భారతీయులు చాలా వేగంగా మాట్లాడుతారు; దాని వల్ల అక్కడక్కడ అక్షరాలను మింగేస్తారని ఒకరు, కొన్ని చోట్ల లేని ‘అ’కారాన్ని చేర్చి పలుకుతారని ఇంకొకరి ఫిర్యాదు. ఫిల్మ్, ఫార్మ్అనాల్సినప్పుడు ఫిలమ్, ఫారమ్ అంటారనేది వారి వాదం. మనలో చాలా మంది eyes మరియు ice రెంటినీ ఒకే విధంగా ఐస్ అంటారని మరొకరి ఆక్షేపణ. అంత వరకూ మౌనంగావినిపించుకొంటున్న గౌరవ్ మాట్లాడ్డానికని చేయెత్తాడు. గౌరవ్ పుట్టింది, పెరిగింది అమేరికాలోనే. గౌరవ్ తల్లిదండ్రులు తమ పెళ్ళికి మునుపే అమేరికాలో సెటిలై ఉన్న వారట.

“I don’t care much about how foreigners pronounce English. We can always understand it from the context. As a native speaker I feel that English is a crazy language as far as the pronunciation goes. For example, if ‘s’ comes between two vowels then it has a ‘z’ sound. There are too many such rules and too many exceptions which complicate the learning. I love Indian languages because they are phonetic. I love Telugu. Take any letter in Telugu. There is only one way to pronounce it no matter where it comes.” అప్పుడే హైస్కూల్ ముగించి కాలేజికెళ్ళెబోతున్న గౌరవ్ మాటలు, చెప్పిన తీరూ అందరి మొహాలపై సకారణ మందహాసాన్ని తెచ్చాయి.తాము తెలుగువంటి సుసంబద్ధ, తార్కిక భాషికులమనే గర్వం పిల్లల కళ్ళలో తొంగి చూసింది.

ఆ రోజు తల్లిదండ్రులు శ్రోతృలై పిల్లలే ఎక్కువగా మాట్లాడారు. పిల్లలకు తెలియని తెలుగు గురించి మేం చెప్పేలాగా పిల్లలు తాము గమనించిన, తమకు తెలిసిన విషయాలను మాతో పంచుకోవడానికి ఉత్సుకులై కనపడ్డారు. ఇన్ని రోజులు మనస్సులో ఉంచుకొన్న భావాలను బయటికి చెప్పుకొనేందుకు పిల్లలకు ఆరోజొక మంచి అవకాశాన్నిచ్చింది. పిల్లల్లో ఇంత సూక్ష్మంగా గమనించగలిగేసామర్థ్యముంటుందా అని అమ్మానాన్నలు ఆశ్చర్యపడేలా చేసిందా రోజు. ఎవరూ ఏదీ రాసుకొని తీసుకు రాలేదు. ఏది జ్ఞాపకమొస్తే దాన్ని, ఒక్కొక్కరూ తాము విన్న తప్పు ఉచ్ఛారణలనుతెల్పుతూ తమ భావనలను వెలిబుచ్చేందుకొక వేదికయ్యిందా రోజు.

కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా అర్థం చేసుకోరు. వాళ్ళ సలహాలు, సూచనలకు ప్రాధాన్యతనివ్వకుండా వాళ్ళకి తాము నచ్చమనే అపోహలో ఉంటారు. మీరు మీ చిన్నప్పుడు తెలుగు నేర్చినరీతి వేరు; పిల్లలిక్కడ నేర్చిన రీతి వేరు. మీరు ఫోనెటిక్స్ రూల్స్ ఫాలో చేయరన్న మాత్రానికి పిల్లలకు మీరిష్టం లేదని కాదు. మాట కన్నా మనస్సు ముఖ్యం. మనస్సులోని భావనలు ముఖ్యం.మనకు సాధ్యమయినంత ఉచ్ఛారణలను మార్చుకొనేందుకు ప్రయత్నించవచ్చని నేనన్నాను. పిల్లలందరూ నాతో ఏకీభవించారు. మేం తెలుగు తప్పుగా మాట్లాడితే మీకు మా పైన ప్రేమ ఎలా తగ్గదోఅలాగే ఇది కూడా అన్న ఒక చిన్నారి సమన్వయత అందరికీ ఆనందాన్నిచ్చింది.

ఈ చర్చ వల్ల నాతో పాటు అక్కడున్న అందరికీ సహాయమయ్యింది. అంతే కాదు అమేరికాంధ్ర పిల్లలకు అమ్మభాషపై అవగాహన, మమకారం రెండూ పెరిగాయి. ఉచ్ఛారణల్లో సందిగ్ధమయమైన,ధ్వన్యాత్మకం కానటువంటి ఇంగ్లిష్ నేర్చుకొన్న ఆ పిల్లలకు ధ్వన్యాత్మకమైన తెలుగు భాష సుసంపన్నమనిపించింది. భలే సంతోషమయ్యింది. It was, indeed, a win-win discussion.థ్యాంక్యూ వెరి మచ్ చిట్టి తండ్రులూ, చిన్ని నాన్నలూ!

*

మీ మాటలు

 1. Bharadwaj Godavarthi says:

  సుధా శ్రీధర్ గారు చాల అధ్బుతంగా రాసారు,

  మా నాన్న గురించి నా అనుభవాలు కూడా పంచుకోవాలనిపించింది

  25 ఏళ్ళ క్రితం నేనో వ్యక్తి గురించి విన్నాను ,
  అతని పేరు బాధ్యత,
  సరే కలిసాను, కలిసాక అయిన మాటలోని నిస్వర్ధాని చూసాను,
  నచ్చింది, ప్రయణం చేయడం మొదలుపెట్టాను, త్యాగం అర్ధం తెలుసుకున్నాను,
  ఒకటో తారీకు సంతోషాన్ని నాకు ఇచ్చి , నెలాకరున నా ఆకలి బాధను అయిన మోసేవారు,
  నా అడుగులు గమ్యం సరిగ్గా సాగడానికి చేసిన ప్రయత్నంలో అలిసిన ఆయిన పాదాలను మర్చిపోయారు,
  నా దృష్టిలో ఆస్తి అంటే నాది అనే బరోసా, ఆయినకు మాత్రం ఆస్తి అంటే నేనే అంట,

  ఇలా ఆలోచిస్తున్న నాకు ఒకటి అర్ధం అయింది, ప్రతి తండ్రి జీవితంలో పిల్లలు ఎప్పుడు భావోద్వేగం అవుతారు ఎందుకు అంటే
  ప్రతి తండ్రి జీవితంలో తమకి ఎదురు అయ్యే భాద్యత, సంతోషం, దుఖం, గర్వం పిల్లలే కాబట్టి

  • “ప్రతి తండ్రి జీవితంలో తమకి ఎదురు అయ్యే భాద్యత, సంతోషం, దుఖం, గర్వం పిల్లలే కాబట్టి.” —- చాలా బాగా చెప్పారు.

  • Sudha Srinath says:

   ‘తండ్రికి మరో పేరు బాధ్యత.’
   మీ స్పందనకు చాలా థ్యాంక్సండి భరద్వజ్ గారూ!

 2. N.RAJANI says:

  సుధా గారు మీరు పిల్లలతో చేసిన చర్చ బాగుంది. అమెరికాలోనే కాదు ఇక్కడ కచీతంగా చేయవలసిన చర్చ.ఒక తెలుగు
  అనే కాదు భాష,భావం రెండింటి మద్య ఉన్న తేడాలను మాట్లాడే మనిషి నేపధ్యాన్ని కూడా గమనించవలసిన అవసరాన్ని తెలపడం ముక్యం. బాగుందండీ సుధా గారు

 3. పిన్నమనేని మృత్యుంజయరావు says:

  సుధా శ్రీనాథ్ గారూ!
  మరొక మంచి వ్యాసం అందించినందుకు కృతజ్ఞతలు. కొన్ని విషయాలు నేను చదివినవి. ‘కొత్త భాషలలోని ధ్వనులన్నీ మనం పలికేవీ కావు, పలక గలిగేవీ కావు. అలాంటి సందర్భాల్లో మనకు చిన్నప్పటి నుంచీ అలవాటయిన ధ్వనుల్లోకి కొత్త ధ్వనులను మార్చి వేస్తాం. దరఖాస్తు, బ్యాంకు, ఫ్యాషన్ మొదలైన పదాలను మూలభాషల్లో ఉచ్చరించే పద్దతికీ మనం పలికే తీరుకూ భేదం ఉంటుంది. కొన్ని సమయాల్లో ధ్వనుల్లో ఉండే దగ్గరి పోలికలనూ, అర్ధాల్లో ఉండే సామీప్యాన్నీ ఆధారం చేసుకొని కొత్త పదబంధాలను కూడా సృష్టించుకుంటాం. హిందీ లోని నమక్ హరామ్ ను తెలుగులో నమ్మకహరాం అనీ, ఆంగ్లం లోని విషస్ సర్కిల్ ను విషవలయమనీ అనువదించాం కదా! అలాగే అన్ని భాషల్లోనూ’ అంటారు బూదరాజు రాధాకృష్ణ తన తెలుగు సంగతులు అనే పుస్తకంలో!
  ఉచ్చరణ విషయానికొస్తే తెలుగులో కూడా అన్ని పదాలనూ రాసినట్లే పలకం. ఉదాహరణకు తాటాకు అనే మాట తీసుకోండి. ఈ పదంలో టా కి ఉచ్చారణలో ఉన్న ధ్వని వేరు, లిపిని యధాగా పలికితే వచ్చే ధ్వని వేరు. ae ధ్వనికి మనకు లిపి సంకేతం లేదు. అలాగే చెప్పాడు అన్న మాట లోని ప్పా ధ్వని కూడా! దాన్నిప్పుడు టివి కామెంటేటర్లు ఉప్పాడ లాగా ధ్వనిస్తున్నారు.
  ఏమైనా, పిల్లల్లో భాష పట్ల అంతటి అవగాహనను కలిగిస్తున్న అమేరికా లోని విద్యాలయాలకూ, పిల్లలలోని గ్రహణ శక్తినీ విశ్లేషణా శక్తినీ ప్రోత్సహిస్తున్న మీకూ, ఒక సమావేశాన్ని వైజ్ఞానికంగా మార్చగలిగిన అక్కడి మనుష్యుల సంస్కారానికీ నమస్కరిస్తున్నాను.

 4. Sudha Srinath says:

  ప్రతి భాషకూ తనదే అయిన ప్రత్యేక ధ్వనిరూపం ఉంటుంది. ధ్వనులు, అనువాదాలు గురించి మీ స్పందనకు చాలా థ్యాంక్సండి మృత్యుంజయ రావు గారూ! రాధాక్రిష్ణ గారిది సంశోధనాత్మక రచన అనిపిస్తుంది. ఈ కథనం నా అనుభవాల అభివ్యక్తి అంతే.

మీ మాటలు

*