“గడిచిపోయిన నా జీవితాన్ని వెనక్కి పిలువరా..!”

శరత్ కుమార్

శరత్ కుమార్

 

ఒక దశాబ్దం క్రితం వచ్చిన “యాదే”(హిందీ) సినిమాలో ఒక పాట ఉంటుంది. “నగ్మే హై, షిక్వే హై, కిస్సే హై, బాతే భూల్ జాతే హై, యాదే యాద్ ఆతే హై” అని. అలా కలకాలం గుర్తుండిపోయే యాదే, సామల సదాశివగారి “యాది”.

సామల గారి రచనా శైలి విలక్షణం, తనదైన ప్రత్యేక శైలిలో,పాఠకుడిని మంత్ర ముగ్దుడిని చేస్తారు. వారి శైలి విశిష్టత ఏంటంటే మన పక్కనే కూర్చుండి, మనతో మాట్లాడుతూ ఆ జ్ఞాపకాల్నితను నెమరు వేసుకుంటుంటే మనం విన్నట్టుగా ఉంటుంది. “రచయిత-పాఠకుడు ” అన్న గీతని చేరిపివేస్తారు. అప్పటి పరిస్థితుల్లోకి మనల్ని తీసుకెళ్ళి మనల్ని తన జీవితపు మధుర జ్ఞాపకాల్లో విహరింపజేస్తారు.

నీ యాదిలోని ముచ్చట్లు చెప్పు తాతా….! అని తన మనవడు అడిగిన విషయాన్ని గుర్తుచేస్తూ, తనకోసం ఈ ముచ్చట్లు గుర్తు చేసుకుంటున్నట్లుగా- మనవడా ఇదిగో విను..అంటూ తన జ్ఞాపకాల దొంతరలోంచి ఒక్కొక్కటిగా విడమరచి చెబుతుంటారు.

“గడిచిపోయిన నా జీవితాన్ని వెనక్కి పిలువరా..!” అని వేడుకుంటున్నాడు ఉర్దూ కవి “సఫీ లఖ్నవీ”. పిలిస్తే మాత్రం గడిచిపోయిన జీవితం తిరిగి వస్తుందా? రాదు. ఆ సంగతి కవికి తెలుసు- మనకి తెలుసు. కాబట్టి మనమే గతం లోకి వెళ్లి, కొన్ని తీయని జ్ఞాపకాలు పట్టి తెచ్చి,పాఠకుల ముందు పరిస్తే మంచిది-అంటారు సదాశివ. ఈ “యాది” మొత్తం ఆ ప్రయత్నమే. “జో సునా ఉస్కా భళా- జోనసునా ఉస్కా భళా”..ఎవరు విన్నారో వాళ్లకు మేలగుగాక-ఎవరు వినలేదో వాళ్ళకూ మేలగుగాక.

సదాశివ గారు రుబాయిల గురించి, సూఫీ కవుల వేదాంతం గురించీ చెబుతారు. సూఫీ వేదాంతపు లోతులను అర్థం చేసుకుని, దాన్ని భారతీయ వేదాంతం తో అన్వయించుతూ తను ఎలా ఆ సూఫీ కవుల రచనల్ని (కవితల్ని) అనువదించారో చెబుతారు. ఇందులో మొదటగా చెప్పుకోవలసింది “అమ్జద్” గారి గురించీ.ఆయన్ని “హజ్రత్ అమ్జద్ హైదరాబాది” అంటారు. అతనొక సూఫీ కవి. అతని రుబాయీలు ప్రశస్తమైనవి.

“రామ్ కా జిక్ర్ హర్ నామ్ మే హై
రామ్ సబ్ మే హై సబ్ రామ్ మే హై”
“అన్ని పేర్లలో రాముని ప్రసక్తి ఉన్నది. అన్నింటిలో రాముడున్నాడు. రామునిలో అన్నీ ఉన్నాయి”. అంటారు అమ్జద్.

సూఫీలలో  చిస్తియా సంప్రదాయానికి చెందిన మరొక సూఫీ “యాషిన్ షా” గురించీ చెబుతూ, ఈ మౌల్వీ సాహెబ్ గొప్పదనానికి ఒక విషయం చెబుతారు. “మౌలానా అబుల్ కలాం ఆజాద్” ఖురాన్ షరీఫ్ కి భాష్యం రాసేటప్పుడు సందేహాలు వస్తే, ఈ మౌల్వీ సాహెబ్ కి ఉత్తరాలు రాసి ప్రత్యుత్తరాల ద్వారా తన సందేహాలు తీర్చుకునేవారట.

కాళోజీ రామేశ్వర రావు గారు అసలు ‘కవిత’ కి ఇచ్చిన నిర్వచన అద్భుతంగా అనిపిస్తుంది.
“జరాసా జోష్ థోడా దర్ద్ థోడా ఖులూసే దిల్
మిలాకర్ డబ్సే దిల్ కి బాత్ కహ్ దో షాయిరీ హోగీ”
“కొంచం ఆవేశం, కొంచం ఆవేదన, కొంచం సహృదయత ఇవన్నీ కలిపి ఒక పద్ధతిలో మనసులోని మాటను చెప్పండి. అది కవిత్వమవుతుంది” అని అర్థం. పద్ధతి అంటే “శైలి”, “రీతి”. భావం మనసులోనిది ఉండాలి. కవిత్వానికి ఇంతమంచి నిర్వచనం చదవలేదనిపిస్తుంది.

సదాశివ

సదాశివ

కాళోజీ నారాయణ రావు గారు మిర్జా గాలిబ్ కవితనొకటి చెప్తారు.

“ఖైదే యయాత్ బందే గమ్ అస్లమే దోనో ఏక్ హై
మోత్ సే పహారే ఆద్మీ గమ్ సే సజాత్ పాయే క్యోం”

తాత్పర్యం ఏంటంటే “జీవిత బంధంలో ఉన్నంత కాలం బాధలు ఉండేవే. మృత్యువు కంటే ముందు మనిషి బాధల నుండి ఎలా తప్పించుకుంటాడు?” అని. ఈ సమయం లో నాకు జగ్జిత్ సింగ్ ఘజల్ ఒకటి గుర్తొస్తుంది. “వొహ్ కౌన్ హై దునియా మే జిసే గమ్ నహీ హోతా..కిస్ ఘర్ మే ఖుషీ హోతీ హై మాతం నహి హోతా?”

అర్థం ఏంటంటే “ప్రపంచం లో బాధలు /దుఖం లేని మనిషి ఎవరు ? సంతోషం తప్ప మృత్యువు ఉండని ఇల్లు ఉంటుందా?”  అని.
ఈ రెండూ ఒకే సత్యాన్ని తెలియజేస్తున్నాయన్న భావనతో ఈ ఘజల్ ని ప్రస్తావించటం జరిగింది.

మీర్జా గాలిబ్ కి కఠినం గా ఉండే కవిత చెప్పటం ఇష్టమట. అతని సమకాలీనులు “అయ్యా..! ,ఈ కవిత మీకే అర్థం కావలె లేదా పైవానికి అర్థం కావలె. మా లాంటి వాళ్లకు అర్థం అయ్యేది కాదు” అని పరిహసించేవాళ్ళట.

“జిస్ ఖదర్ లోగోంకో నా తిఖ్..! యాద్ హై
హై వహీ దీవనె-మత్బూ -ఆ మేరా ”

    అంటే ‘ఎంతవరకు నా కవిత లోకుల నాలుకల మీద నిలచివున్నదో అదే ముద్రితమైన నా దివాన్ అని అంటారు “నాతిఖ్ లఖ్నవీ” అనే కవి. (దివాన్ అంటే కవితా సంకలనం)సామల గారి రచనలు కూడా అంతే. లోకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని కూర్చుంటాయి. మధురానుభూతులుగా పదే పదే నెమరువేసుకునేలా చేస్తాయి. పాఠకులకి ఎన్నో యాదిలు (జ్ఞాపకాలు) మిగిల్చే పుస్తకం యాది. “అయ్యో ఉర్దూ రాదే, నేర్చుకుంటే ఇంకా బాగా ఈ కవితా మాధుర్యాల్ని ఆస్వాదించవచ్చు” అనిపిస్తుంది.అమరగాయకుడు కె. ఎల్. సైగల్ ఎవరి దగ్గరా నేర్చుకోకున్నా దైవదత్తమైన అద్భుత కంఠంతో ఎన్నటికీ మర్చిపోలేని పాటలు పాడారు. అతని పాటలకు పరవశించని వారెవరు? అని అడుగుతారు సదాశివ.అవును.!ఆ గాన మాధుర్యానికి పరవశించని వారేవరుంటారు? ప్రస్తుత కాలంలో కేవలం రనగొనధ్వనుల సంగీతం తో ఐపాడ్ లో పాటలు వింటూ తామూ  సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాము, అనుకునే నేటి తరానికి సైగల్ పాటలు రుచించవేమో కాని, సంగీతం, గానం లోని రసాస్వాదానికి అలవాటున్న వారికి ఇప్పటికీ ,ఎప్పటికీ సైగల్ పాటలు మరచిపోలేని “గాంధర్వ గాన మాధుర్యాలే”.తన నవలల్ని సినిమాలుగా తీస్తూ కె. ఎల్. సైగల్ కు హీరో పాత్ర అప్పగించి ఉచ్చారణ అంత సరిగాలేని బెంగాలి పాటలు అతని నోటివెంట పాడిస్తూ విని శరత్ బాబు అంతటివాడు పరవశించినాదట. శరత్ బాబు సుప్రసిద్ధ నవలా రచయితే కాక చిత్ర లేఖనం, శాస్త్రీయ సంగీతం లో ప్రవేశమున్నవాడు.సినిమా రంగంలో సైగల్ పాటలకు లభించిన కీర్తికి అసూయ పడే వాళ్ళు కొందరు అతన్ని “బేపీర్” అని ” బే ఉస్తాదియా” అని పరిహసించేవాళ్ళట. అంటే ఏ గురువు దగ్గరా సంగీతం నేర్చుకొని వాడని.

ఆగ్రా ఘరానా ను రంగీలా ఘరానా అని అంటారు. ఆ ఘరానా లో నాయకమణి వంటివాడు ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్”.

ఒకసారి ఎక్కడో ఒక చోట ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ కాళ్ళు జాపి పడుకుని శిష్యులతో మాట్లడుతున్నాడట. కె. ఎల్. సైగల్ అతని కాళ్ళు అదుముతూ కూర్చున్నాడట. అది గమనించిన ఉస్తాద్ లేచి కూర్చుండి “ఇదేమిటి కుందన్ లాల్?” నువ్వు ఇప్పటికే గొప్ప గాయకునివి మేమంతా నీ పాటలకు ముగ్దులము అవుతున్నాము. ఈ సేవ ఎందుకు?” అని ప్రశ్నించాడట.

“ఉస్తాద్ నన్నంతా బే పీర్ అని బనాయిస్తున్నారు.మీ వంటి ఉస్తాద్ శిష్యుణ్ణి అనిపించుకోవటం నాకు గర్వ కారణం. మిమ్మల్ని ఇలాగే సేవించుకుంటాను. ఏదైనా అనుగ్రహించండి” అని వేడుకున్నాడట కె. ఎల్. సైగల్. ఉస్తాద్ అతన్ని శిష్యునిగా స్వీకరించి కొన్ని రాగాలు శ్రద్ధగా నేర్పినారట. అందులో ముఖ్యమైన రాగం భైరవి.
గురుశిష్యుల అనుభంధం అలా ఉండేది ఆ రోజుల్లో. సైగల్ అంతటి స్థాయిలో ఉండి కూడా గురు శుశ్రూషకి అంతటి విలువనిచ్చాడు.

– శరత్ కుమార్ గడ్డమీది

మీ మాటలు

 1. “అయ్యో ఉర్దూ రాదే, నేర్చుకుంటే ఇంకా బాగా ఈ కవితా మాధుర్యాల్ని ఆస్వాదించవచ్చు” అనిపిస్తుంది…

  అన్నమాట అక్షర సత్యం. కనీసం నా అనుభూతిలో.

  సామల సదాశివగారి “యాది”, తిరుమల రామచంద్ర గారి “హంపీ నుండి హరప్పా దాకా” వాటికి అవేసాటి. శరత్ కుమార్ గారూ, మీరన్నట్టు అవి “రచయిత – పాఠకుడు ” అన్న గీత కనిపించదు. ఎన్నిసార్లు చదివినా కొన్ని జ్ఞాపకాలు కళ్ళంబడ నీళ్ళు అసంకల్పితంగా వచ్చేస్తూ ఉంటాయి. అయన నాలాంటి వారికి Teacher in absence. అయన యాదికి నా నివాళి .
  చక్కని వ్యాసాన్ని అందించినందుకు మీకు కృతజ్ఞతలు .

  • Murthy gaaru.. After a long time mallee mee comments chusaa.. Meerannadi aksharaalaa satyam…samala sadashiva gaari pusthakaalu osari chadivelaa undavu.. Mallee mallee “paarayanam” chesthunte kottha kottha vishayaalu inkaa lothugaa aavishkarinchabhadataayi…Thank u sir..!!

 2. Sharath Tigulla says:

  శరత్ గారు మీరు రాసిన ఈ కథనం నాకు చాల నచ్చింది. మీరు ఇలాంటి కథనాలు ఇంకా ఎన్నో రాసి శ్రోతల్ని అలరిస్తారని ఆశిస్తూ.

  మీ శ్రేయోభిలాషి,
  శరత్ కుమార్ తిగుల్ల

 3. Shararth kumar Gaddameedi says:

  ns మూర్తి గారికి మరియు శరత్ తిగుల్ల గారికి లేట్ గా స్పందిస్తున్నందుకు క్షమించగలరు. మీ అభిమానానికి ధన్యవాదాలు.

  త్వరలో మరిన్ని వ్యాసాలతో మీ అభిమానాన్ని చూరగొంటానని ఆశిస్తూ..!

  మీ శరత్ కుమార్ గడ్డమీది

 4. srinath says:

  sharrath garu i was read u r article. you have well explained very detailed about author and his writing style. coming to yadi you have en lighted the poet views. in my view your review is preface of the book. this information is very use full to new reader.through this he can understand the writer. i am finding you have skill of book reviewer. kindy share any thing related to literature.

 5. Sharath I really appreciate your thoughts and congratulate you . Keep going and Good Luck

 6. Srinivas Vuruputuri says:

  Almost a year ago, I did an intro for this book in pustakam.net: http://pustakam.net/?p=15812

  Thanks for your detailed review, Sharat gaaru. It was so good reading through the quotations you selected for this article.

  • Thank u Srinivas garu. I will check the link u have shared… Mee review thappakundaa chaduvuthaa… Samala sada shiva gaari rachanaa Shaili adhbutam.. Hindusthani gharanas gurinchi detailed gaa aayana rachanalu chadivaake telusukunnaa…

మీ మాటలు

*