కొన్ని క్షణాల్లో నువ్వు

kurma

గాలికి ఊగిన పువ్వు

ఏదో ఊహను కదిలిస్తుంది

గడిచిన ఊసులిక ముసురుకుంటాయి

 

నిశ్చల తటాకంలో

మెరిసే చేపొకటి ఎగురుతుంది

అలజడైన నీటిలో

మేఘాలు చిత్రంగా ఊగుతుంటాయి

 

రోడ్డుమీద ఎవరో

గట్టిగా నవ్వుతారు

ఏళ్లనాటి పలకరింపొకటి

తలపుకొచ్చి సొంపకుండా చేస్తుంది

 

ఎప్పటిదో పాటలోని వయొలిన్ రాగం

నీ గుండెని తాకుతుంది

పురా గాయాలు కొన్ని రేగి

నిన్ను నిలువునా చీరేస్తాయి

 

చిట్టి తల్లి ఒకటి నిన్ను

వెన్నెల కళ్ళతో స్పృశిస్తుంది

నిన్నో ఆటలో ముంచేస్తుంది

అప్పుడిక, బతుకు

గొప్ప వెలుగుతో మెరిసిపోతుంది.

మీ మాటలు

 1. చాలా బాగుందండి.

 2. ఎప్పటిదో పాటలోని వయొలిన్ రాగం

  నీ గుండెని తాకుతుంది

  పురా గాయాలు కొన్ని రేగి

  నిన్ను నిలువునా చీరేస్తాయి……. ఇప్పుడిక వెలుగునిండిన చోటును చూస్తూ వుండటమే!

 3. perugu.ramakrishna says:

  చాలా బాగుంది కవిత

 4. Wanderer says:

  “అప్పుడిక, బతుకు
  గొప్ప వెలుగుతో మెరిసిపోతుంది.”

  ఎంత బాగా వ్రాసారు!

 5. Satyabhama says:

  “అప్పుడిక, బతుకు
  గొప్ప వెలుగుతో మెరిసిపోతుంది.”

  అందమైన కవిత!

 6. Ch V Narasimham says:

  డియర్ కూర్మనాథ్,
  నేను నీ పాత స్నేహితుడిని .నా పేరు చందు.చోడవరం గుర్తుకొచ్చానా? నీ కవిత చాలా బాగుంది !
  నీ ప్రస్తుత చిరునామా ఏమిటి ? ఎక్కడ ఉన్నావు ? దయచేసి నా ” మెయిల్ ఐ డి ” కి పంపు . నా మెయిల్ ఐ డి
  chandu.chelluri@gmail.com

మీ మాటలు

*