
Painting: Rafi Haque
పెట్టె
నా బరువును దించుకుంటూ గతవారపు మేఘవిస్ఫోటనాన్నీ, ఒక ప్లాస్టిక్ మేకనూ, హై స్కూల్లో అనుభవించిన ఐదు సంవత్సరాల నరకాన్నీ, తత్తరపాటు నిండి వికృతమైన నా మొదటి ముద్దునూ, నేనెప్పుడూ కలవని నా అమ్మమ్మనూ తాతయ్యనూ, చాపమీద వొలికిన వొంటినూనె పరిమళాన్నీ, మొన్నమొన్ననే పుట్టిన పిల్లిపిల్లనూ, మొక్కజొన్న నూకతో చేసిన ఉప్మానూ పెట్టెలో సర్దేస్తాను. వృద్ధాప్యంలో వుంటాను కనుక నన్నూ అందులో పడేసుకుంటాను. ఎన్నైనా పట్టేలా ఆ పెట్టె వ్యాకోచం చెందుతుంది మరి! ఆఖరుకు దానికి ఏ లేబులూ తగిలించక రైలుస్టేషను ప్లాట్ఫామ్మీద వదిలేస్తాను. అలా అది తన గమ్యాన్ని చేరుకుని వుంటుందక్కడ, ఎవరో అపరిచితుడు తనను తీసుకుని నిధిలాగా దాచుకుని తనతో కలిసి బతుకుతాడని ఎదురు చూస్తూ.
ఆంగ్లం: గెయిల్ డెండీ
తెలుగు: ఎలనాగ
స్వర్గం అండ్ సన్స్ Co.
తిరుగు లేని నిర్ణయాధికార పరిధిననుసరించి మోక్షగాముల సంఖ్యను తగ్గించాలని నిశ్చయింపబడిందని తెలుపడానికి చింతిస్తున్నాను. ముక్తిని పొందవలసిన ఒక మహా మానవాళిని ఈ విధంగా తొలగించాల్సి రావటం మీకు చిత్రంగా తోచవచ్చు. కాని పెద్దసారు గారు అందరికీ శాశ్వత స్థాయిని వాగ్దానం చేయలేరనీ, కటాక్షవీక్షణాల రూపంలో వేతనం పొందుతున్నవారిని సైతం తొలగించకుండా వుండలేరనీ దయ చేసి గమనించాలి మీరు. ఈ సూత్రం పట్ల అవగాహన లేకపోవటం పెద్దసారు గారి దివ్యత్వాన్ని ఎంతగానో తగ్గిస్తుందనేది, నిజమైన వినయాన్ని క్షీణింపజేస్తుందనేది స్పష్టం. మిమ్మల్ని అంతిమంగా తొలగించే ముందు ఒక సమావేశాన్ని ఏర్పరచి పునర్ముక్తి కోసం మీరు ఏ ప్రత్యామ్నాయాలను కోరుకుంటారో అడుగుతాం. మీరు బాధితులుగా కాని, వేడుకునేవాళ్లుగా కాని రావచ్చు. ఇక వెంటనే మీ కాగితాలను వదిలి వెళ్లండి. చిన్నచిన్న గీతలూ పిచ్చిగీతలూ ఉన్న కాయితాల్ని కూడా వదిలి వెళ్లాలి. ఈ కార్యాలయం నుండి బయటికి పోయేటప్పుడు మీ వెంట ఒక సెక్యూరిటీ గార్డు వస్తాడు. మిమ్మల్ని తీసేయడం పెద్దసారు గారి అనుగ్రహపు అస్పష్టతను ఎలా తెలియజేస్తుంది అనే ప్రశ్న మీలో తలెత్తితే నన్ను సంప్రదించడానికి సందేహించకండి. మీ సేవలకు కృతజ్ఞుణ్ని. పునర్జన్మలో మీకు సంపూర్ణ విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.
ఆంగ్లం: ఫిలిప్ ప్రైడ్
***




వందన టేటే రాంచి, ఝార్ఖండ్లో నివసిస్తున్న ఆదివాసీ కవయిత్రి. రాజస్థాన్ విద్యాపీఠ్ లో తన విద్యను పూర్తిచేసి యే.కే.పంకజ్ ను వివాహమాడి ఆధార్ ఆల్టర్నేటివ్ మీడియాను స్థాపించి ఆదివాసీ హక్కుల కోసం నిత్యం పనిచేస్తున్నారు. ఝార్ఖండ్ ఆదివాసీల భాష,సాహిత్యం,సంస్కృతులను ప్రతిబింబించే ‘అఖాడా’ అనే పత్రికకు సంపాదకురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
హేమంత్ కుక్రేతి హిందీ ఆచార్యులుగా పనిచేస్తూనే తన కవితా సేద్యంలో ఐదు కవితా సంపుటాలు పండించారు. కవిత విమర్శ పై నాలుగు పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. హిందీ సాహిత్య వాస్తవ చరిత్ర అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని రచించారు. వీరి కవితలు భారతీయ భాషలతోపాటు విదేశీ భాషల్లోనూ అనువదింపబడ్డాయి.ఆకాశవాణి,దూ
కృష్ణ మోహన్ ఝా మధేపురా బీహార్ లో జన్మించారు. తన వున్నత విద్యను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసి అస్సాం విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. సమయ్ కో చీర్కర్ అనే కవిత సంపుటిని హిందీలోనూ,యెక్టా హెరాయల్ దునియా అనే సంపుటిని మైథిలిలోను ప్రచురించారు. యితని కవితలు మరాఠి,మైథిలి,నేపాలి,ఆంగ్ల భాషల్లో అనువదింపబడ్డాయి.











ప్రౌఢవయస్సులో జీవితం ఆనందోల్లాసాలతో హాయిగా గడిచిపోతున్న రోజులలో ఛు యువాన్ పధ్నాలుగు కవితలను రచించాడు. గ్రీష్మవేళాదక్షిణానిలవీచికలు నిదాఘతాపతప్తమైన తనువును తాకి తాదాత్మ్యాన్ని కలిగించినట్లు యుగయుగాంతరానుగతకర్కశసమస్యలతో సంతప్తమై సమ్యక్పరిష్కారంకోసం విలవిలలాడుతున్న మనస్సును మెత్తగా స్పృశించి, మైమరపింపజేసే ఒక చల్లదనం ఈ కవితలలో నిండి ఉంటుంది. ఒక సహజత్వం, ఒక సరళత్వం, ఒక సౌగంధ్యం, ఒక మాధుర్యం, ఒక గంభీరిమ, ఒక ఉద్వేజనం, ఒక సంగీతభంగి, ఒక సమతా గుణం, ఒక మాటలకందని వింత అందం మిరుమిట్లు గొలుపుతుంటాయి. తక్కిన కవితలన్నీ ఆయన కలలు కల్లలైన నైరాశ్యపు రోజులలో కూర్చినవి. పెనుతుఫాను వీచేముందు కమ్ముకొన్న కారుచీకటి లాగానో, కారుచీకటి కమ్ముకొన్న తర్వాత వచ్చిన పెనుతుఫాను లాగానో ఉక్కిరిబిక్కిరిచేస్తాయి. తీవ్రమైన ఆగ్రహావేశం, మనసు లోతులను తాకే భావతీవ్రత, శోకవ్యాకులత, చింతావిలీనత, దుఃఖనిర్భరత నిండి ఉంటాయి. సమానహృదయంతో భావన చేయగల సహృదయులకు ఆ మహాప్రభావం నుంచి తప్పించుకోవటం సులభసాధ్యం కాదు. ఆ కవితలలో తొమ్మిది స్మృతిగీతాలు. వాటిలో ‘నారింజకు నివాళి’ అన్నది కూడా ఓడ్ ఛందస్సులోనే ఉన్నది. ఇవి ఏకకాలంలో కూర్పబడిన కృతులు కావని, హాన్ రాజవంశీయుల కాలంలో విద్వాంసులు ఈ కవితలను వేర్వేరు ఆకరాల నుంచి సంపాదించి ఛు యువాన్ రచనలుగా నామకరణం చేశారని – స్యూంగ్ రాజవంశపు ఐతిహాసికుడైన ఛు హ్సీ పండితుడు అభిప్రాయపడ్డాడు. బర్టన్ వాట్సన్, జేమ్స్ లెగ్గీ వంటి సుప్రసిద్ధ చరిత్రకారులు ఈ వాదాన్ని అంగీకరింపలేదు. ప్రామాణిక సంకలనాలన్నిటిలో ఇవి ఛు యువాన్ రచనలుగానే ప్రచురింపబడుతున్నాయి. వాక్యబంధాన్ని అనుసరించి చూస్తే ‘నారింజకు నివాళి’ని ఆయన కవిత్వాభ్యాసం మొదలుపెట్టిన తొలిరోజులలో వ్రాసి ఉండవచ్చునని ఊహించటానికి వీలున్నది. ఇందులోని ప్రథమార్ధం నారింజ గుణోత్కర్షను ప్రశంసిస్తుండగా ద్వితీయార్ధంలో ఎవరో ఒక అజ్ఞాతవ్యక్తి మెచ్చుకోలున్నది. ఆ వ్యక్తి నవయౌవనుడని తెలుస్తూనే ఉన్నప్పటికీ – అది ఛు యువాన్ కావచ్చుననీ, కాకపోవచ్చుననీ నిర్ణయించేందుకు వీలులేకుండా ఉన్నది.
ఒట్టాప్ళాక్కన్ నీలకండన్ వేలు కురుప్ గా జన్మించి (27.05.1931 – 13.02.2016) ఎనభై నాలుగేళ్ల ఒ.ఎన్.వి.కురుప్ శనివారం 13.02.2016న మరణిస్తే, కేరళ శాసన సభ ఆయన పట్ల గౌరవ సూచకంగా, ఈ ఒక్క విషయాన్నే ప్రస్తావించి, మరుసటి పనిదినానికి వాయిదా పడ్డది. ఒక్క శాసన సభ్యులకే దక్కే ఈ గౌరవాన్ని, కేరళ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు తొలిసారిగా ఒక మహాకవికి ప్రకటించింది. 2011-12 సంవత్సరపు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు, కేరళ ఆర్థిక శాఖ మంత్రి “దినాంతం” అన్న కురుప్ దీర్ఘ కవిత నుంచి ప్రారంభ చరణాలు చదివి తన బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టారు.








తాజా కామెంట్లు