1
తలుపు తట్టి ఇగో నేనొచ్చేశాన్లే మళ్ళీ
అని గదిలోపల నవ్వుతూ కూర్చుంటుంది మరణం
ఈ పూటకి చావు వాసన లేకుండా దాటేద్దామని అనుకున్నప్పుడు –
2
ముసుగు తన్ని దుప్పటి పై మీదికి కప్పేసి
వొక ప్రశాంతతని కూడా వొంటి మీదికి లాక్కుని
నిద్రలోపలి గుహలోకి పారిపోతూ వుంటాను
చాల్చాల్లే అని విదిలించుకుని కసురుకొని నన్ను నేను,
లేదులేదులేదు
రానే రావద్దే నువ్వు నా లోపలికి అనుకుంటూ పైకే అంటూ
3
రాత్రి బరువు ఎంతో నీకు తెలుసా?
మరీ దాన్ని రెప్పల మీద మోస్తున్నప్పుడు!
4
పగలగొట్టేయ్యాలన్నంత
కోపమొచ్చేసే గడియారపు బుడి బుడి నడక
వొంటి మీద మెత్తగా గీసుకుపోయే కత్తి
5
రాని నిద్దురని దుప్పటిలా
విసుగ్గా అవతలకి విసిరేసి
పుస్తకంలోకో సినిమాలోకో
అనిద్రని ఖననం చెయ్యాలని కూర్చున్నాను.
ఊహూ,
ఆ అన్నీ లోకాలూ నన్ను విఫలం చేశాయి.
6
కాళ్ళ కింద నేల జారుతున్న అసహనంతో
గది నిండా తిరుగుతున్నప్పుడు
దూరం నించి మిత్రుడి మరణ వార్త.
7
ఆ తరవాత నేనూ చీకటీ
చీకటీ నేనూ వొకరి ముఖంలోకి
ఇంకొకరు చూస్తూ…
*
మీ స్మృతిలో మో …

(ఇంకో మో అంటూ వుండరు..ఇంకో ‘బతికిన క్షణ”మూ వుండదు. ఇంకో “చితి-చింత” కూడా వుండదు. అసలు వొక మనిషి ఎప్పుడూ ఇంకో మనిషిని replace గానీ, displace గానీ చేయడం అంటూ వుండదు. అందుకే, వొక మనిషి- అందునా ఆ మనిషి తనదైన వాక్యాల అడుగుల్ని వెతుక్కున్న మనిషి వెళ్ళిపోయినప్పుడు భరించలేని నిశ్శబ్దం వెంట పడ్తుంది మనల్ని! మో- ఈ జనవరి అయిదున పుట్టారన్నదే నాకు గుర్తుంది. ఆయన వెళ్ళిపోయిన రోజు ఇంకా నా మనసులో సరిగా రిజిస్టర్ కావడం లేదు. మీలో చాలా మందికి అంతే అయి వుండాలి. మీలో చాలా మందికి మో తెలుసు, కవితంలోనూ, వ్యక్తిగతంగానూ, ఉత్తరాల్లోనూ..అలాంటివి మాకు రాయండి. వొక అరుదైన అద్భుతమైన కవిని తలచుకుందాం..)




[వ్యాసానికి చిన్న పరిచయం:
డారియో ఫో 1926లో ఇటలీ దేశపు లంబార్డీ ప్రాంతంలో సాన్‌జియానో అన్న చోట పుట్టాడు. వాళ్ళ నాన్న రైల్వేలో స్టేషన్ మాస్టారు; తన తీరిక సమయాల్లో సరదాగా స్థానిక నాటకల్లో పాత్రలు పోషించేవాడు. బాగా చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్నని నాటకాల్లో వేషాలు వేయడం గమనించిన డారియో ఫోకు సహజంగానే నాటకరంగమంటే ఆసక్తీ, గాఢ అనురక్తీ కలిగాయి. 1950లో – తన ఇరవై నాలుగో ఏట – ఫో మిలన్ నగరం వచ్చి అక్కడే ఓ నాటక సమాజంలో చేరాడు. ఆ సమాజం వాళ్ళు తమ సంగీత రూపకాలకు వ్యంగ్య వ్యాఖ్యానాలు రాసే పని అతనికి అప్పజెప్పారు. వాటి ఉద్దేశమల్లా ప్రేక్షకులను రంజింపజెయ్యడమే. అక్కడ పని చేస్తున్నప్పుడు అతనికి ఫ్రాంకా రమే అన్న సమమనస్కురాలితో పరిచయం అయింది. అది 1953లో పరిణయానికి దారితీసింది. ఫ్రాంకా రమే ఇటలీ దేశపు ‘గిల్లారీ’ అన్న సంచార నాటక ప్రదర్శకుల కుటుంబాలకు చెందిన వ్యక్తి. జానపద నాటక కళారీతుల బాగా తెలిసిన కుటుంబాలవి. అప్పటికప్పుడు ఆశువుగా నాటకాలు రూపొందించి ప్రదర్శించడంలో నిష్ణాతులు ఆ కుటుంబాల వాళ్ళు. వాళ్ళలో ఎక్కువగా చదువు ఉండకపోవడంతో వాళ్ళు తమ నాటకాలను రాత ప్రతుల మీద కన్నా తమ తమ (ఆశు) సృజనాత్మక శక్తి మీదే ఎక్కువగా ఆధారపడుతూ ఉండేవారు. నటులంతా తమ తమ శక్తియుక్తులన్నీ నటనా ప్రావీణ్యాన్నీ జోడించి రంగస్థలం మీదనే అప్పటికప్పుడు ఓ నాటకాన్ని రూపొందించేవారు.
తమ నువో సినా సమాజాన్ని స్థాపించిన కొద్ది సంవత్సరాలకే ఫో, ఫ్రాంకా రమేలు ఆ నాటక సమాజ స్థాపనా ప్రయోగం విఫలమయిందన్న సంగతి గ్రహించారు. ఆ సమాజంలో ఉన్నది తమ తోటి కమ్యూనిస్టులే అయినా వాళ్ళు అధికారగణంతో కుమ్ముక్కై నువో సినా ధ్యేయాలనూ, లక్ష్యాలనూ దెబ్బతీస్తున్నారని ఆ దంపతులు గ్రహించారు. నువో సినా నిర్వహణలో కమ్యూనిస్టు పార్టీ అధినేతల నిరంతర జోక్యం కూడా వీళ్ళకి దుస్సహమయింది. అలా విడివడి మరో నలుగురు అతి సన్నిహితులతో కలసి ‘ల కమ్యూన్’ (LA COMMUNE) అన్న మరో చిన్న సమాజాన్ని స్థాపించారు వారు. ఆ విడివడటం పుణ్యమా అని అన్నేళ్ళుగా శ్రమపడి సంపాదించిన సంపత్తిని – లారీ, వ్యాన్లూ, ఎలక్ట్రికల్ పరికరాలు – ఫో వదులుకోవలసి వచ్చింది.






అచ్చమైన తెలంగాణ కవి
అరుణ్ సాగర్ తెలుగు బుద్దిజీవుల్లో ఒక మర్యాదగల పాత్రికేయుడు. చూడడానికి అత్యాదునికునిగా కనిపించే అతను ఆరణాల అచ్చం ఆదివాసీ. అకస్మాత్ గా అయన గుండె పనిచేయడం ఆగింది. అరుణ్ తండ్రి టి.వి.ఆర్ చంద్రం అంటే గోదావరీ నదీలోయ పరీవాహక ప్రాంతం లో, పోడుకోసం గూడుకోసం, తునికాకు రేటుకోసం జీవితం త్యాగం చేసిన ఒక నికార్సయిన, నిబద్దత కలిగిన సాధారణ కార్యకర్త . ఉమ్మడి కమ్యునిస్ట్ పార్టీ నుండి మార్క్సిస్ట్ పార్టీ దాకా బద్రాచలం ప్రాంత పార్టీ నిర్మాతల్లో ఒకడుగా ఆయన తాను నడిచిన నేలంతా పోరాటాల విత్తనాలు చల్లి ప్రజల జ్ఞాపకాల్లో మిగిలే ఉన్నాడు.
చిన్న అద్దంలో కొండని చూపించడం లాంటిదే కౌముది గారిని చిరు వ్యాసంలో పరిచయం చేయడం! ఆయన కవి, కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు,అభ్యుదయ రచయితల సంఘానికి క్రియాశీల కార్యవర్గ సభ్యుడు. ఖమ్మం జిల్లాలో అరసం వ్యవస్థాపకుడు. కమ్యూనిస్టు పార్టీ యువజన పత్రిక “యువజన” కి సంపాదకుడు. “విశాలాంధ్ర” ఉద్యోగిగా జీవితం ప్రారంభించి, అధ్యాపకత్వంలో స్థిరపడ్డారు. అక్షరోద్యమ నేత గా మారుమూల ప్రాంతాల్లో రాత్రనకా పగలనకా పర్యటించి, అక్షర సేవలో కన్ను మూసిన ఉద్యమ శీలి. ప్రజానాట్య మండలిలో కొన్ని వందల స్టేజీ నాటకాలపై నటించిన ప్రజా నటుడు, గాయకుడు. ఇవన్నీ కాక, రచయితగా అనేక కథలూ, అనువాద రచనలూ అందించిన సృజన శీలి.
“శయనిస్తున్న అతనెలా ఉన్నాడు? యోధునిలాగా లేక కవిలాగ? హ్మ్…… కవిత్వ యోధునిలా” — జె.డి. రోబ్




































తాజా కామెంట్లు