సినిమా మొదలయ్యింది….
తెరమీద ఒక కొత్త హీరో “బర్నింగ్ స్టార్” అంటూ ప్రత్యక్షమయ్యాడు. ప్రేక్షకుల్లో కోలాహల. ఒక్కసారిగా “జై సంపూ…జైజై సంపూ” అనే నినాదాలు. మల్టిప్లెక్స్ థియేటర్ మాస్ థియేటర్ అయ్యింది. పంచ్ పంచ్ కీ ఈలలు. ఫీట్ ఫీట్ కీ గోలలు. డైలాగ్ కి కౌంటర్ డైలాగులు. యాక్షన్ కి విపరీతమైన రియాక్షన్లు.
నేను థియేటర్లో వెనక నిల్చున్నాను. నేను వింటున్నది, చూస్తున్నది నిజమోకాదో అనే ఒక సందేహం. నవ్వాలో ఆనందించాలో ఇం
అంతే…..
అదే టైంలో ఎవరో ట్విట్టర్లో సంపూని “నీ మొహం చూసుకో…నువ్వు హీరోవా?” అంటే, “దేవుడిచ్చిన రూపాన్ని నేను మార్చుకోలేను, నాలో చెడుగుణం ఏదైనా ఉంటే చెప్పండి మార్చుకుంటాను” అని సమాధానం చెప్పాడు. అవహేళన చేసిన వ్యక్తి సిగ్గుపడ్డాడ్డు. క్షమాపణలు అడిగాడు. దీనితో సోషియల్ నెట్వర్క్ లో సంపూకు గౌరవం పెరిగింది.
రెగ్యులర్ తెలుగు సినిమా లెక్కలతో, హీరోల ట్యాంట్రమ్స్ తో పడేకన్నా, ఒక ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని నిర్ణయించుకున్నాడు. ‘మీరు చెప్పింది చేస్తాను’ అనే ఒక డెడికేటేడ్ నటుడు దొరికాడు. అతనిప్పుడు స్టార్ అయ్యాడు. సంపూర్ణేష్ బాబు అయ్యాడు. బర్నింగ్ స్టార్ అయ్యాడు. ఈ మధ్యకాలంలో అత్యంత క్రేజ్ సంపాదించిన హిట్ చిత్రానికి చిరుమానా అయ్యాడు.
– కత్తి మహేష్










తాజా కామెంట్లు