వెన్నెల వైపుగా

538962_3585990181529_504711534_n

వెర్రిగా ఊగిపోతూ

ఒళ్ళంతా గుచ్చుతూ

అడుగడుగునా

చీకటి ఊడలు

గుర్తుచేస్తాయి

ఒంటరి ప్రయాణాన్ని

దిక్కుతోచక దడదడలాడుతుంది

గుబులెక్కి గుండె

ఇక కరిగిపోదామనే అనుకుంటుంది

గుప్పున పొంగుతున్న పొగల్లో

విశ్వాంతరాలనుంచి రాలిపడిన

ఒకే ఒక్క తెల్లని బిందువు

నన్ను అందుకుంటుందప్పుడే చల్లగా

నేనిక నీడల పల్లకిలో సాగిపోతాను

వెన్నెల వైపు

-మమత. కె.

Mamata K.

మీ మాటలు

  1. balasudhakarmouli says:

    అంతరంగపు కదలికను యిలా కవిత్వరూపంలో చదవడం నాకొక మంచి అనుభూతినిచ్చింది.

  2. bhasker koorapati says:

    గుప్పెడు అక్షరాల్ని సంధిస్తూ వెన్నెల వైపు అడుగిడుతున్న మమత ను అభినందిచకుండా ఉండలేం..!
    తన ఆశావహ దృక్పధం బావుంది. మరిన్ని కవితల్ని తన కలం నుండి ఆశిస్తూ..!
    There is always a silver lining to every sable cloud..! అని కదా..!
    అదిగో సరిగ్గా అట్లాగే మమత “అగాధమౌ జలనిదిలోనే ఆనిముత్యమున్నట్లే..” ని సాధించి , శోధించాలని ఆశిస్తూ..
    –భాస్కర్ కూరపాటి.

మీ మాటలు

*