ప్రియమైన సారంగ వార పత్రిక పాఠకులకు,
నమస్తే!
‘కథ కానిది…’ – అనే శీర్షిక కింద వరసగా కథలు రాయాలనే ప్రయత్నాన్ని తలపెట్టాను.
కథలంటే ఊహా జనితాలు కాదు. పోని, ఉత్త నిజాలూ కాదు.
ఈ రోజుల్లో వార్త కూడా కథ లా వుంటే నే చదవడానికి బావుంటోంది. కాదా చెప్పండి?
అందుకే, కొన్ని నిజాల్ని మూలాధారం గా చేసుకుని, కథలు రాయాలని నిర్ణయించుకున్నాను.
ఈ విశాల జగతిలో మనిషి నడిచే ప్రతి అడుగులోనూ కథ వుంది. విని స్పందించే హృదయముంటే!
జీవితానికి మించిన సస్పెన్స్, థ్రిల్లింగ్, హారర్, ఇంట్రెస్టింగ్ స్టోరీ అంటూ వేరే ఏదీ వుండదని గాఢం గా నమ్మే వారిలో నేనూ ఒకర్ని.
నే – కనీ, వినీ, ఎరిగిన, జరిగిన విషయాలనే కథ గా రాస్తానని, అదే ఈ శీర్షిక ప్రధానోద్దేశమని సవినయం గా తెలియచేసుకుంటున్నాను.
రచన చదివి, ఎప్పటిలా మీ ప్రోత్సాహాన్ని నాకందచేస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ..
ఈ అవకాశాన్ని కలగ చేసిన పత్రికా సంపాదకులు అఫ్సర్, కల్పన గారికి నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ,
నమస్సులతో..
-ఆర్.దమయంతి.
తప్పకుండా స్వాగతిస్తామండీ,
కనీ, వినీ, ఎరిగిన, జరిగిన విషయాల మీద మీ స్పందనలు .
ధన్యవాదాలు సత్యనారాయణ గారు.
:-)