ఆ జోలెలో మిగిలింది రక్తమేనా?!

 

– నిశీధి

~

నీ వారని పరాయని లేకుండా అందరి మాట  మన్నించే దేవ దేవా

ఇదుగో ఈ క్షణం గుమ్మంలో జోలె పట్టుకు నిలబడ్డాను

నీ వాకిలి ముందు నిలబడ్డ ప్రపంచానికి ఏమేమి దొరకలేదని ,

ఇహనిప్పుడు దురదృశ్టాలని అదృష్టంగా మార్చే వరకు

ఖాళీ చేతులతో వెనక్కి మరిలే పరిస్థితే లేదు , నా జోలె నింపి పంపు ప్రభూ

 

ప్రతి కవ్వాలిలో బహుశ  అమ్జాద్ ఫరీద్ సబ్రీ మనస్పూర్తిగా తలవంచి తను నమ్ముకున్న చిష్తి సూఫిజాన్ని గుండెలు  నింపుకొని  ఇదేగా పాడింది!! ఈతి బాధల నుండి రక్షించే మరణమే అల్టిమేట్ డెస్టినీ కాబట్టి సబ్రీ జోలె తాను కోరుకున్న కోరికలతో నిండిందని ఈ రోజు మనం అంతా  సంతోషించాలా  లేక తనకి అడ్డొచ్చే  ప్రతిప్రాణిని , తనని కాదన్న  ప్రతి ఆత్మని మూలంతో సహా నలిపేస్తూ రక్తాన్వేషిలా   ముందుకు వెళుతున్న మతమారణహోమాలని చూసి వణికిపోవాలా ?

జీవుల్లో అతి తెలివయిన జంతువుగా  మనిషి మారిపోయాక,  ఆ తెలివయిన  జంతువుకి ఒక  సంఘ జీవనం,  ఆ సంఘానికి ఒక కట్టుబాటు ఏర్పరచడానికి , ఒక ఆరోగ్యకరమయిన క్రమశిక్షణ అందించే క్రమంలో  మతం ఒక పదునయిన  ఆయుధంగా వాడబడటం , భూమి మీద హ్యూమన్  ఎవల్యూషన్ మొదలయిన ప్రతి చోట దాదాపు అలాంటివే ఒకేరకమయిన బీజాక్షరాలు,  మతం ఏదయినా  అయి ఉండొచ్చు  కాని అది మానవ మనుగడకి సపోర్టింగ్  సిస్టంగానే మొదలయింది అన్న  విషయాన్ని ఎవరం మర్చిపోలేం.  అలాగే ఎవల్యూషన్లో భాగంగా ఎదిగిపోయిన మనిషి మెదడులో మతాలూ సంఘాలు లాంటి ఎలాంటి నియంత్రణకి లోబడని క్రియేటివ్ ఆర్టిస్టిక్ భాగమూ అతి ముఖ్యమైనదేనని  బేసిక్ సైన్స్  చదువుకున్న అందరికి  తెలుసు. అయితే ఇపుడు ఇక్కడ సమస్య ఏమిటంటే కాలంతో పాటు ప్రాపంచిక విషయాలన్నింటినీ తనదిగా చేసుకుంటూ ఏక ఆధిపత్య ధృవంగా మారిపోతున్న మతం,  మతం తాలూకు  భయం , నెమ్మదిగా క్రియేటివిటీని కూడా మింగేస్తూ , తనని హైలైట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడే ఒక పక్క వాద్యంగా కళలనన్నింటిని వాడుకోవడమే  కాకుండా తనకి సపోర్ట్గా రాని ప్రతి కళని కళాకారులని మింగేస్తూ పోతుంటే చివరికి మిగిలే మరుభూమిలో సంఘాలు రాజ్యాలుగా , రాజ్యాలు  అధికారికంగానో అనధికారికంగానో మత రాజ్యాలుగా రూపాంతరీకరణ చెందుతున్న కాలంలో జనప్రియత కోరుకొనే కళ ఎక్కడ నిలబడాలి ? అటు కళ ఇటు మతం  రెండు మనసుని హాయిపరిచేందుకో లేక కొంత ఓదార్పుకోసమే అయితే రెండిటి అంతిమ లక్ష్యం  ఒకటే అయినపుడు ఒక వ్యవస్థ పూర్తిగా  ఇంకో వ్యవస్థని  తినేయడం  వలన జరిగే నష్టం నుండి మానవుడు   తేరుకోగలడా? లేదా ఇప్పటికే  తన నడవడి తో పాటు తన ఆలోచనలని నియంత్రిస్తున్న మతం  గుప్పిట్లో మరింతగా ఇరుక్కుపోయి ఇంకొంత  కుదించుకుపోతాడా ? కుదించుకుపోవడం అంటే తానూ మాత్రమే లేదు తానూ నమ్ముకున్న తనని కమ్ముకున్న మతం మాత్రమే  మిగలడం అంటే ఇహ సంఘ జీవనం కి , సహజీవనంకి అర్ధం ఏముంది ?

 

చరిత్ర సాక్ష్యం , పదకొండో  శతాబ్దం  అంతంలో బాగ్దాద్  మీద మంగోలియన్ దాడి జరిగినప్పుడు ముందు టైగ్రీస్ నది అక్కడి మనుష్యుల రక్తంతో ఎర్రబారింది ఆ తరువాత విలువైన అక్షరాల సిరానలుపు తో నల్లబడింది అని . మనుష్యులని మాత్రమే కాదు  సమూలంగా ఆ జాతి తెలివితేటలని  , భవిష్యత్తుని కూడా నాశనం  చేయడం మధ్య యుగంలో  యుద్ధాలకే కాదు ప్రస్తుతం సాగుతున్న  మత యుద్ధాలు , మతం పేరుతో మానవాళి పై ఏక జాతి చేయాలనుకొనే దాష్టికాలు ఇంకా  నడుస్తూనే  ఉన్నాయి అనిపిస్తుంది . ఒక జాతి లేదా  ఒక మత యుద్ధం మొదలయింది  అంటే ముందు స్త్రీలు పిల్లలు తరవాత ఆ జాతి రత్నాలయిన  కళాకారులు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బ్రతకాల్సిన  పరిస్థితులు రాతి యుగం నుండి ఈ కాలం వరకు సాగడం అసహ్యకరమయిన  తప్పని పరిస్తితిలా మారిపోయింది .

 

రాజ్యానికి మతానికి  అతీతంగా కళని ఆస్వాదించలేని  కుత్సితంలోకి  మనిషి , మనిషి పెంచుకున్న  వ్యవస్థలు లోబడిపోతున్నప్పుడు  సౌదీ  మరణ శిక్ష నుండి ఆఖరి నిముషంలో ప్రాణం నిలుపుకున్న  ఆశ్రాఫ్ ఫాయద్ లు , తమ నేలని  వదిలిపెట్టి పరాయి దేశాల్లో బ్రతకాల్సి వచ్చే తస్లీమా లు , సల్మాన్  రష్దీలు , MF హుస్సేన్లు ఒక పక్క ఆత్మని  అమ్ముకోకుండా  రాజ్యానికి మతానికి ఎదురునిలబడే క్రమంలో తమని తాముకోల్పోవడం చూస్తూ  ఉండగానే మరో పక్క  ఒక చార్లీ హెబ్డో , ఒక కల్బుర్గి , ఒక సబ్రీ , ఒక వాంగో ( 2004లో కాల్చి చంపబడిన  హలాండ్ ఫిలిం మేకర్ ),  ఒక Pippa Bacca ( 2008 లో చంపబడిన ఇటాలియన్  పర్ఫార్మెన్స్  ఆర్టిస్ట్ ) దాదాపు ప్రతి నేల మీద మత వ్యతిరేఖ ప్రతీకార చావులలో అస్థిత్వాన్నే  కోల్పోవడం సామాన్యంగా  మారిపోయింది  .

End of the day art is the only noblest form of human evolution అని నిజంగానే  మనం అందరం నమ్మినట్లయితే  ,ప్రపంచవ్యాప్తంగా సో కాల్డ్ ఒక మతపు జీహాదీలు , పేరు లేకుండా చాప కింద నీరులా కళలని కళాకారులని మట్టి చేస్తున్న ఇతరమతాల మూర్ఖత్వాలకి  వ్యతిరేఖంగా విశ్వవ్యాప్తంగా అందరు ఆర్టిస్ట్లు  ఆ కళలని  అభిమానిస్తున్న సామాన్య జనం మతరహిత మానవీయ దిశలో కళలనే కాదు  కళాకారులని  కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ప్రస్తుతం   కనిపిస్తుంది .

 

ముఖ్యంగా  చరిత్ర  మొదటి నుండి   ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు  ఎన్నిసార్లు రెక్కలు  తెంచినా   తిరిగిలేచే ఫీనిక్స్ పక్షిలా  కొత్త ఊపిర్లు పోసుకుంటున్న మితవాద సూఫీఇజం ఇప్పటికయిన కనిపించని దేవుడి ముందు జోలెలు పట్టుకు తిరిగే ఆశల్ని పక్కనపెట్టి కనిపిస్తున్న ఇస్లామిక్ టెర్రరిజపు మత మూర్ఖత్వాన్ని  ఇస్లాం నుండి పూర్తిగా  బహిష్కరించి ఒంటరిని చేసే దారులు ఆవిష్కరించడం తక్షణ కర్తవ్యం  . పై వాక్యం అన్ని మతాలకి ముఖ్యంగా  హైందవం భారత సంస్కృతని ఒకప్పుడు వైష్ణ శైవుల మధ్య పరస్పర హత్యలు . తరువాత కాలంలో చదువుకున్న , క్రియేటివిటీ  ఉన్నప్రతి దళితుడ్ని  ఎదో విధంగా అడ్డుకొని  ఇపుడు మళ్ళీ  మనదేశంలో    కొత్తగా  పేట్రేగుతున్న మతోద్దారుకులని వెనకేసుకొచ్చే  ఉదారవాద మత విశ్వాసులు కూడా అర్ధం చేసుకోవడం  ముందు ముందు  రాబోయే నష్టాన్ని అంచనా వేసుకొని గంజాయి మొక్కలు ఎదగక ముందే జాగ్రత్త పడటం చాలా అవసరం. లేదంటే  తొందరలో మనం కూడా మన తోటి దేశపు  మత విద్వేషపు విషాలలో మనదయిన హవిస్సులు నమామి  అనిపించడం  ఖాయం .

  • భర్ దో జోలీ యా  మొహమ్మద్ అంటూ సూఫీఇజపు తాత్విక పరిమళాలకి తనదయిన గంభీరత వదిలివెళ్ళిన అంజాద్ సబ్రీ పాటల  జ్ఞాపకంలో .

 

 

.

 

మీ మాటలు

  1. కె.కె. రామయ్య says:

    ‘భర్ దో జోలీ యా మొహమ్మద్’ అంటూ సూఫీఇజపు మార్మిక కవితాగానంలో తనకు తానే సాటి అనిపించుకున్న ప్రముఖ పాకిస్థానీ ఖవ్వాలీ గాయకుడు అంజాద్‌ సబ్రీని మతోన్మాద తాలిబాన్ దుండగులు కరాచీలో దారుణంగా కాల్చి చంపిన సందర్భంలో నిశీధి గారు రాసిన వ్యాసం …. మత మూర్ఖత్వపు, మత విద్వేషపు గంజాయి మొక్కలు ఎదగక ముందే జాగ్రత్త పడటం చాలా అవసరం అన్న హెచ్చరిక వాక్యాలు …. ఆలోచింపజేసేదిగా ఉంది.
    _______________________________________________________

    ముస్లిం మత విశ్వాసానికి మరొక పేరే సూఫీ మతం. ( Sufism or Tasawwuf is defined as the inner mystical ascetic aspect of Islam ). క్రీ.శ. 10వ శతాబ్దం కంటే పూర్వం సూఫీ మతం అరేబియా, పర్షియా ప్రజల సాంఘిక మత జీవనాన్ని ప్రభావితం చేసింది. అరేబియాలో సూఫీ మతం ప్రారంభమై తరువాత భారత దేశానికి వ్యాప్తి చెందింది.

    ‘సుఫా’ అంటే మహ్మద్ మసీదు వెలుపల ఆయన శిష్యులు మత సమావేశాలను జరిపే అరుగు అని అర్ధం. ‘సుఫా’ అనే పదం నుండి సూఫీ ఆవిర్భవించిందని కొందరి అభిప్రాయం. (the lexical root of the word is traced to ṣafā which in Arabic means purity ). భగవంతుడిని ప్రేమించడమే అతన్ని చేరే ప్రధాన మార్గమని సూఫీ బోధకుల దృఢ నమ్మకం. ఎక్కువమంది సూఫీ బోధకులు సమాజానికి దూరంగా ఏకాంతంగా గడిపి మోక్ష సాధనకై ప్రయత్నించారు. ఉలేమాల ఆధిపత్యాన్ని వారి ఖురాన్ వర్గీకరణను సూఫీ బోధకులు వ్యతిరేకించారు. ఉలేమాలు ఖురాన్ వాస్తవ స్పూర్తి అయిన ప్రజాస్వామ్య సమానత్వ భావాలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు. సూఫీ బోధకులు హిందూ, జైన, బౌద్ద, క్రైస్తవ, జొరాస్ట్రియన్ మతాల వల్ల ప్రభావితులయ్యారు.

    హిజ్రా యుగానికి చెందిన మొదటి రెండు శతాబ్దాలలో సూఫీ బోధకులు పశ్చాతాప్తము, దేవుడిపై విశ్వాసము వంటి ప్రాధమిక సూత్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారు కఠిన నియమాలను పాటించారు. మంచి ప్రవర్తన, స్వయం కృషి సమానత్వాన్ని బోధించారు. వారు గురువులను ‘పీర్’ గా గౌరవంగా పిలిచేవారు. వారు బహుమతులను స్వీకరించక దయ, నిరాడంబరత, సహనం, దైవంపై అపార విశ్వాసం, మోక్షాలను విశ్వసించారు

    https://books.google.co.in/books?id=js7YBQAAQBAJ&pg=PA45&lpg=PA45&dq=%E0%B0%B8%E0%B1%82%E0%B0%AB%E0%B1%80%E0%B0%87%E0%B0%9C%E0%B0%82&source=bl&ots=B1JMMGd9Da&sig=b8lovqP8esKkmmNP2hbixmMNGek&hl=en&sa=X&ved=0ahUKEwi-05SN98jNAhXGnJQKHTVED48Q6AEIHDAA#v=onepage&q=%E0%B0%B8%E0%B1%82%E0%B0%AB%E0%B1%80%E0%B0%87%E0%B0%9C%E0%B0%82&f=ఫాల్స్

    అజ్మీర్ దర్గా, ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టి (1141-1236) మొఘల్ చక్రవర్తులు అనుసరించిన సూఫీ బోధకులు.

  2. నిత్యా వి says:

    Bhardiyaa aap phirse hamaare man ki jolee…after a v long time with a wonderful write up…v interesting n informative.

  3. satyanarayana says:

    “అటు కళ ఇటు మతం రెండు మనసుని హాయిపరిచేందుకో, లేక కొంత ఓదార్పుకోసమే అయితే రెండిటి అంతిమ లక్ష్యం ఒకటే అయినపుడు ఒక వ్యవస్థ పూర్తిగా ఇంకో వ్యవస్థని తినేయడం వలన జరిగే నష్టం నుండి మానవుడు తేరుకోగలడా? లేదా ఇప్పటికే తన నడవడి తో పాటు తన ఆలోచనలని నియంత్రిస్తున్న మతం గుప్పిట్లో మరింతగా ఇరుక్కుపోయి ఇంకొంత కుదించుకుపోతాడా ?”

    ఇలాటి అమాయకపు ప్రశ్నలు ,సందేహాలు ఎన్నో వ్యక్త పరిచారు ,ఒక సూఫీ కళాకారుని హత్య సందర్భం లో .
    ఇక్కడ ,Christopher Hitchens చెప్పిన విషయాలు చాలా చక్కగా సరిపోతాయి .
    చదివి , వాటి అర్ధం ,తెలుసుకుని, పాటించి , మన జీవితాలని రక్షించుకోవచ్చు
    Religion comes from the period of human prehistory where nobody—not even the mighty Democritus who concluded that all matter was made from atoms—had the smallest idea what was going on. It comes from the bawling and fearful infancy of our species, and is a babyish attempt to meet our inescapable demand for knowledge (as well as for comfort, reassurance, and other infantile needs). Today the least educated of my children knows much more about the natural order than any of the founders of religion.

    Religion looks forward to the destruction of the world…. Perhaps half aware that its unsupported arguments are not entirely persuasive, and perhaps uneasy about its own greedy accumulation of temporal power and wealth, religion has never ceased to proclaim the Apocalypse and the day of judgement.

    Religion has run out of justifications. Thanks to the telescope and the microscope, it no longer offers an explanation of anything important. Where once it used to be able, by its total command of a worldview, to prevent the emergence of rivals, it can now only impede and retard—or try to turn back—the measurable advances that we have made.
    Sometimes, true, it will artfully concede them. But this is to offer itself the choice between irrelevance and obstruction, impotence or outright reaction, and, given this choice, it is programmed to select the worse of the two.
    Meanwhile, confronted with undreamed-of vistas inside our own evolving cortex, in the farthest reaches of the known universe, and in proteins and acids which constitute our nature, religion offers either annihilation in the name of god, or else the false promise that if we take a knife to our foreskins, or pray in the right direction, or ingest pieces of wafer, we shall be “saved.”

    ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు ,

    If religious instruction were not allowed until the child had attained the age of reason, we would be living in a quite different world.
    అంటే ప్రజలు ,కనీసం మతాన్ని ,చిన్నప్పటి నుంచే బోధించటం, అయినా మాన మని ….మానితే ప్రపంచం మరొక రకంగా ఉంటుందని …
    ఎన్నో డిగ్రీ లు సంపాయించిన జ్ఞానులలో కూడా ఎంతమంది ఒప్పుకుంటారు ?
    ఏదో ,ఒక ఆశ ,కనీసం కొద్దిమంది అయినా ఆలోచిస్తారని …
    థాంక్స్ ఫర్ the post .

  4. Shrutha keerthi says:

    Need of the hour write up and thought provoking one. happy to readu u againNishi ji..

  5. SRINIVAS SATHIRAJU says:

    ఉన్మాదం తలకెత్తినప్పుడు మనిషిలో ఆలోచన నశిస్తుంది. ఆ వక్క నిముషమూ ఆలోచనతో స్పందనను వాయిదా వేసుకుంటే, ఉన్మాదం తలకెత్తకుండా చూసుకునే మర్గాలు కావాలి. ఉన్న పళంగా మతాలు ఎక్కడికీ పోవు పొలేవు. అస్తిత్వం వ్యక్తీకరించే ఆకంక్షాలు మానవత్వం వైపు మరలే మార్గాలు వెతికినప్పుడు మంచి రచనలు రావడం అలవోకగా జరిగే పరిణామమే. అందుకు ముందు అడుగు వెసుకుని తనని తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనిషి మనుగడ సంఘ జీవనానికి ఆమోదయోగ్యంగా మారుతుంది. ఆ దిశలో నడుస్తారు అనే ఆశిస్తున్నాను. అన్నీ మనకే తెలుసున్నట్టుగా కాకుండా కొంత తెలియనిది ఉంది అనే దృక్కోణం వినయం విధెయత కూడా చూపిస్తే రచనల్లో ఎదుటి వారికి ఆలోచించడానికో లేదా ప్రశ్నించడానికో ఆస్కారం దోరుకుతుంది గుడ్డి విమర్శలు లేదా పిచ్హి పొగ్డ్తల స్థానంలో ఒక విధమైన కొత్త బంగారు లోకాలు వస్తాయి.

మీ మాటలు

*