టియర్స్ గ్యాస్

 

మోహన్ రుషి

 

Mohan Rushi

 

 

 

 

 

అతడు ఆమెకు చాలా దూరంలో నుంచి దగ్గరగా

వున్నాడు. లేదా అతను మాత్రమే అలా అనుకోవడం

లోని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. సంతోషం సగమే

బలం. దుఖ్ఖం శాశ్వత  భారం. ఒక ఖాళీ తాకడానికి

ఎంత సమయం కావాలి? ఇక దిగులు మేఘం ఆవరించి

కళ్ళు దుఖ్ఖాశ్రువులతో చిప్పిల్లడానికి ఏ మరో కారణం

కావాలి?!

 

ఆమె అతడికి చాలా దగ్గర్లో నుంచి దూరంగా వుంది. లేదా

ఆమె మాత్రమే తనకు తాను ఒక ప్రశ్న అవ్వడంలోని

సందిగ్ధ సందర్భాన్ని తీవ్రంగా ఎదుర్కొంటోంది. లోలకాన్ని

నిశ్చలం చెయ్యడానికి ఎంతమాత్రం నిబ్బరం అవసరం? ఒక

స్థిరమైన నిశ్చయంతో హృదయాన్ని గడ్డకట్టించుకుని

వెనక్కి చూడకుండా వెళ్ళిపోవడానికి ఇంకే కొత్త వేదన

కారణం కావాలి?!

*

మీ మాటలు

  1. paresh n doshi says:

    స్తభించిన గాలి, వూపిరాడనితనము, ఘనీభవించిన అశృవు, యివన్నీ మెదులుతున్నాయి. వొక నీటిచుక్క నేల మీద సాధ్యమైనంత తక్కువ చొటును ఆక్రమించుకుంటుందిట. kudos to the brevity and beauty. Thoroughly enjoyed.

  2. నిశీధి says:

    సెకండ్ స్టాంజా కంటే మొదటిది చాలా పవర్ఫుల్ గా ఉంది , ఈ వాక్యం ” ఒక ఖాళీ తాకడానికి

    ఎంత సమయం కావాలి? ” రాయడానికి ఒక జీవితానుభవం ఉండాలి .

మీ మాటలు

*