జయశ్రీ నాయుడు
ఒక కవిత రూపు దిద్దుకునే క్షణాలు బహు చిత్రమైనవి. ఒక ఘటన లేదా అనుభూతి, ఒక ఆలోచన — అతి సూక్ష్మ తరంగం గా మనసులో స్థిరపడి, మర్రి విత్తు మహా వృక్షమైనట్టు బాహ్యాంతరంగాలను ఆక్రమిస్తుంది.దాని పరిధిని అధిగమించలేని నిస్సహాయత కొంత, అందులోని ఆనందమో, అవేదనో, ఆత్మార్పణో, భావ పరమావధిని తెలుసుకొమ్మన్న అంతర్గత వేధింపో, ఇక తెల్ల కాగితమ్మీద అక్షరాలుగా అనువదించుకోవలసిందే. కోడూరి విజయ కుమార్ గారి ఒక రాత్రి మరొక రాత్రి కవితా సంపుటం లోని ** తిరిగి జన్మిస్తావు** కవితని ఆయన సిగ్నేచర్ కవితగా తీసుకోవచ్చు.


‘నీలాంటి ఒకడు
నీ పద్యాన్ని ప్రేమతో హత్తుకున్నపుడు
నీవు తిరిగి జన్మిస్తావు’
నిజంగా చాలా బావున్నాయి ఈ వాక్యాలు. ఏ కవికైనా ఇది అనుభవైద్యకమే కాదు? కవి కి అభినందనలు.
కవితా పరిచయం, విశ్లేషణ చాలా బావుంది జై. మళ్లీ మళ్లీ చదవేంత అందంగా వుంది.
నీకూ శుభాభినందనలు.
ఇలానే తరచూ రాయకూడదూ సమీక్షలని?
:-)
అల్ ద బెస్ట్.
చాలా చాలా అందమైన విశ్లేషణ జయశ్రీ గారూ…
అబిన౦దనలు… కవి గొప్పతన౦ సహజ౦. అయితే, ఆ కవి రాసిన కవిత లోకి ప్రవేశి౦చి…. కవి జారవిడిచిన అనుభూతులు… కన్నీల్ళు.. కష్టాలు.. అనుభవాలు.. స్ప౦దనలు వెతికి వెతికి .. వాటికి అక్షరాలను కుట్టి.. కవి మనసు దొర్లిన ప్రతి చీకటిలో..ప్రతి వెలుగులో విశ్లేషకులుగా విహరి౦చి విశ్లేషి౦చి రాయడ౦ .. తో.. ఆ కవి గొప్పతన౦.. ఆ కవిత లోని ఆ౦తర్య౦ మరి౦త అద్భుత౦గా బయటపడుతు౦ది. కవి నిజ౦గా స౦తోషి౦చే రోజు.. చాలా బాగా రాశారు.. ! ఒక కవిగా కోడూరు విజయ కుమార్ గారి మనసు నిజ౦ చెప్పాల౦టే తుళ్ళి పడే రోజు..! క౦గ్రాట్స్.. Jayashree Naidu గారు…!
కవిత ఎంత బావుంది .. మనసుకి చాల దగ్గరగా అనిపించింది ముఖ్యం గా ఆ చివరి వాక్యం ..నీలాంటి ఒకడు
నీ పద్యాన్ని ప్రేమతో హత్తుకున్నపుడు నీవు తిరిగి జన్మిస్తావు.. ఎంత బావుందో తెలుసా .. అలసిపోయి పరిగేడుతున్నప్పుడు… నిన్ను అదాటున హత్తుక్కున్నట్టు . ఏమి కావాలి ఇంతకన్నా , రోజు కో కవిత దాన్ని పంచుకునే మనుషులు తప్ప .కవి అంతరంగం లోకి పరకాయ ప్రవేశం చేసి .. ఆ అనుభవాన్ని విశ్లేషించి , నలుగురుకి ఆ రుచి ని చూపిస్తున్న మీ’ అద్దం లో నెలవంక ‘ ప్రతి వారం ఒకో నేలవంకని ముచ్చటగా చూపిస్తుంది అచ్చగా మాకు నచ్చిన విధం లో కాకుండా దగ్గరవుండి మీ మాటల అద్దం లో నించి చూపించడం మరింత ఆహ్లాదం గ ఉంది .
కోడూరి అన్తర్ముఖీన ,సత్యశోదిత కవి. నిక్కచ్చి కవితావేశపరుడు. సరిగ్గా చెప్పారు , జయశ్రీ గారు … ఇద్దరికీ అభినందనలు..
జయశ్రీ గారు …
బాధని కవిత్వం చేయడం సంగతేమో గానీ
ఒక్కోసారి పట్టరాని సంతోషాన్ని ఒకట్రెండు వచన వాక్యాలలోకి అనువదించడం కూడా కష్టమే !
నా మరొక కవిత పైన మీరు రాసిన ఈ వ్యాసం చదివేక నా మనః స్థితి ఇది !
ముఖ్యంగా, ఈ కవితని నా సిగ్నేచర్ కవిత అనడం నాకు మరింత ముచ్చటగా వుంది –
మంచి సాహిత్య అభిరుచి వున్న మీ లాంటి వారు ఇట్లా నా కవిత్వం గురుంచి రాయడం నా అదృష్టం ….
మరొక మారు మీకు నా కృతజ్ఞతలు !!
నీలాంటి ఒకడు
నీ పద్యాన్ని ప్రేమతో హత్తుకున్నపుడు
నీవు తిరిగి జన్మిస్తావు.
ఈ వాక్యం చాలుకదా కవికి . మీ విశ్లేషణ ఆత్మీయంగా హత్తుకుంది మాడం. ఇరువురికి అభినందనలు.
గట్టు పై నుంచి ఎంత లొపలకి తొంగి చూసినా భావి లోతు తెలియదు . మునగాలి . ఊపిరి ఆడనంతగా అందులో
గిలగిల కొట్టుకోవాలి గట్టు పైకి వచ్చి లోకాన్ని తేరిపార చూసినప్పుడు .ఒక భయం కలగాలి .ఒక దైర్యం పుట్టాలి . ఒక వెలుగు కనిపించాలి అలాంటి వెలుగు మీ కవితలో పురుడు పోసుకుంది .అగ్ని కణం వికసించాలంటే అంత యాతన పడాలి మరి . ఖండనలోనే విముక్తి .అభినందనలు
అద్భుతమైన కవిత, మీ విశ్లేషణలో మరింత అద్భుతంగా ఆవిష్కరించారు జయశ్రీ నాయుడు గారు