ఈ రాత్రి వొడవదు ఎన్నో రాత్రి ఇది చెంప మీద ఎన్నో కన్నీటి చుక్క జారి ఆరిపోతున్నది తెల్లని మంటయ్ కురుస్తున్న మంచు కిటికీ అద్దం మీద వీధి లాంతరు విసుగు ఒక్క వెచ్చని వూహ లేదని ఫిర్యాదు దృశ్యం మారితే బాగుండు, మార్చేది ఎవరు నేనెప్పుడూ చీకట్లో ఆడుకుంటున్న ఆడపిల్లనే నా చుట్టూరా నల్లని కందకం, ప్రతిబింబం లేని అద్దం వృత్తాకార కందకంలో నాచు పట్టిన కత్తులు కందక ఖడ్గానికి పొదిగిన పచ్చల వలె చుక్కలు నల్లని అద్దాన్ని దాటే … [ఇంకా చదవండి ...]
నువ్వంతే ఎప్పుడూ నిత్య వికసిత కుసుమానివై పరిమళం వెదజల్లుతుండు నిను కాంచే చూపుల పై... దేహాలపై... ~ నీ నవ్వుకు వేలాడుతుంది ఓ ముక్క ఆకాశం కాంతి సముద్రాన్నెత్తుకొని నీ నడుమ్మోసే చంటిపాపలా ఓ మాయని మాయలా ముడతలు కొన్ని నీ ముఖంమ్మీద అందం చెక్కిన ఆనందాలౌతుంటాయి అసలే నలుపు ఆపై చెవికి చెవులై వేలాడే లోలాకులు నక్షత్రమంత కాకపోయినా అలాంటిదే ఓ ముక్కు పుడక నీ ముక్కు అందం జుర్రేసుకుంటూ అంత వరకూ చూడని రంగురంగుల సీతాకోకచిలుక దేహపుహోళిలా నిను చుట్టేసిన బట్టల అద్దాల్లోంచి తొంగి … [ఇంకా చదవండి ...]
నా లోపలి సతత హరితారణ్యానికి ఎవడో చిచ్చు పెట్టాడు మట్టిదిబ్బలూ ముళ్లపొదలూ తప్ప తుమ్మముళ్లూ బ్రహ్మజెముళ్లూ తప్ప పూల పలకరింపుల్ని ఆఘ్రాణించలేని పక్షుల రెక్కల ఆకాశాల్ని అందుకోలేని సెలయేళ్ల లేళ్లను తనలోకి మళ్లించుకోలేని జంతుజాతుల జన్మరహస్యాల్ని పసిగట్టలేని మనిషిరూపు మానవుడొకడు ఒళ్లంతా అగ్గి రాజేసుకుని అంటించేశాడు వాడు విధ్వంసపు మత్తులో తూలుతూ మంటల ముందు వెర్రిగా తాండవమాడుతూ ++++++ కాలమాపకయంత్రం మలాము పూసింది కాలిన గాయాలు కనుమరుగవుతున్నాయి పచ్చదనం మళ్లీ … [ఇంకా చదవండి ...]
Copyright © 2024 Saaranga Publishers
రివ్యు బాగుంది.
కదిలే బొమ్మల్ని దృశ్యకావ్యంగా మలచడం…అందమెక్కడున్నా ప్రేమగా ఆరాధనగా చూడటం… ఆద్యంతం గొప్ప పరిశీలనా శక్తితో మెలగడం…అపురూప దృశ్యానికి వుప్పొంగిపోవడం…ఒకింత భావుకతతో పులకించిపోవడం…ఆస్వాదిస్తున్న వెన్నెల్ని సైతం తడిసేలా విప్పారడం…వంశీకి తెలిసిన విద్య…అరుణసాగర్ గారూ కొన్ని జ్ఞాపకాల్ని కదిలించినందుకు అభినందనలు
అందానికి మరింత అందంగా తానూ పరవశించడమే కాదు, నలుగురికీ పంచడం వంశీ కి తెలిసినట్టుగా మరెవరికీ తెలీదేమో!
సినిమా తీసినా, చిన్న కథ రాసినా వెన్నెలజలతారు తీగలే!
ఆర్టికల్ చాలా బాగుంది. వంశీ గారి సినిమాలను, అందులోని తెలుగుదనాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చారు. గోదావరి అందాలు, నుడికారం, విప్పారిన విశాలమైన కళ్ళు, మన పక్కనే వుండే మనుషుల తాలూకు పాత్రలు, ఇళయరాజా సంగీత ఝురి… ఇలా చెప్పుకుంటూ పోతే మదినిండా ఎన్నో వూసులు. నవయవ్వనపు అనుభూతుల కాసులు….. ధన్యవాదాలు అరుణ్ సాగర్ గారూ.
అట్లా తెలంగాణా జీవితాన్ని తెరకెక్కించాలని అనిపిస్తది . అదే విషయం వో సందర్బం ల కలుసుకున్నపుడు వంశీ’ తో అనుంటి..నవ్విండు . తెలంగాణా జీవితం తీస్తే బాగుండు మీరు అన్న.తెలియంది చేయలేను గదండి అన్నడు.
నచ్చాల లేకుంటే మనిషిని అసలు గుర్తించని బాపతు.మోకమాటం లేదు .ఇష్టపడితే బారా ఖూన్ మాఫ్ .
సెటిల్ ఆడుడు యిష్ట మనుకుంట..పాత్రలతోటి అట్లనే ఆడిపిస్తడు తెరను.
గోరేటి ఎంకన్నోలె జీవితాన్ని పట్టిండు.ఆయిన పాట.యీనెది ఆట .
వర్దిల్లాలే కవి కల .మనిషన్నంక తనకో ప్రత్యక మైన కల( అల ) అబ్బాలే .లేక పోతే ఎంజేస్కోను జీవితం.
సాగరన్న…అదో వల . సాగరం ల పడి తన్లాడే మనిషిని వొడిసి పట్టి వోడ్డుకేసే కల (అల) దాని సొంతం. పాటల ఎగిరే గోరేటి మనిషి వంశీ తెర మీంచి మనోని కలం ల నించి జాలు వారాల్సిందే . పాత్రలే కావు శ్రుష్టి కర్తలు కూడా మనుసులే కదా ..ఆల్లను మని (అణ) దీపాలు జేసి మంచు పల్లకి ల మోద్దాం..
అరునన్న మంచిగ జెప్పినవే
— హజారి
soooooooooooooper
వంశీ గారు మానవ సంబంధాల్నీ, అనుభూతుల్నీ, అనుభవాల్నీ దృశ్యీకరిస్తే , మీరు ఆయన దృశ్య కావ్యాల్ని అక్షరాలుగా చిత్రీకరించారు . చాలా బాగుంది .
అమ్మాయి అందం చూపడం అంటే మెడ దిగువ భాగంలో కెమెరా ఫోకస్ చేయాలి అనుకొనే ఇండస్ట్రీ లో స్త్రీత్వం అంటే కళ్ళు , పాదాలు చూపి మోహపరిచిన మాంత్రికుడే వంశీ . మంచి ఆర్టికల్ , బోలెడు మెమోరీస్ అలా కళ్ళ గిర్రున తిరిగాయి
వంశి గారన్న , ఆయన సినిమాలు అన్న చాల ఇష్టం …..అరుణ్ అన్న ఆర్టికల్ చాల బాగా రాసావు….థాంక్స్….
వంశీ గారి గురించి మీరు చెప్పిన విషయాలు బావున్నాయి. ‘ఆల్లను మని (అణ) దీపాలు జేసి మంచు పల్లకి ల మోద్దాం..’ అన్న హజారి గారి మాటలు మరింత బావున్నాయి.
ఆయ్ బాబోయ్ వంశీ గారు ఇంత మాట్లాడారా …?? ఫోన్ లో ..!!
వంశీ ఒక కల్చరల్ సైంటిస్ట్. ఎన్ ఆంత్రోపాలజిస్ట్.
ఎస్… తెలుగు వెండితెర పై సామాన్యుడిని మహారాజు చేసి అన్ని భావ ప్రవాహాల్లో ఇప్పటికీ కొట్టుమిట్టాడేలా చేసిన మాంత్రికుడు.
లవ్ ఆల్మోస్ట్ అల్ హిస్ ఫిల్మ్స్
చాలా చక్కగా రాసారు అరుణ్ సాగర్ గారు.
వంశీ గారి సినిమాలలో సంగీతం చాయాగ్రహణం అందంగా కలిసి పోతాయి. ఆయనకున్న ఏస్తేటిక్ సెన్స్ తెలుగు సినిమా దర్శకులలో చాలా తక్కువగా కనపడుతుంది.
ఆయన మహర్షి సినిమా చాలా రోజులు వెంటాడింది.
ఔను నిజం ఔను నిజం
నీవన్నది నీవన్నది నీవన్నది నిజం నిజం
గొప్ప నిజం
చాలా బాగా రాశారండి. తెలుగులో అద్భుతమైన సినిమాలు తీశారు వంశీగారు. సాహిత్యం…. సంగీతం…. దృశ్యం…. అన్నీ జీవితానుభవాలే.
’’మన మనసులతో కలిసి టపటపలాడే కళ్లు. భానుప్రియ, శోభన, అర్చన, మాధురి. కళ్లుండీ చూడలేకపోయిన కళ్లని పరిచయం చేసిన కళ్లు వంశీవి. లేడీకి కళ్లుంటే చాలు. లేడి కళ్లుంటే చాలు. ఫిదా.‘‘ యుఆర్ కరెక్ట్ అండీ…
వంశీ గారి సినిమా లాంటి అందమైన వ్యాసం .. ధన్యవాదాలు అరుణ్ సాగర్ garoo