కోలాహలం

10325745_574651602650328_7994500965816693952_n 

ప్రయాణమిది

మనసు ప్రాణాయామమిది

యోగత్వమా…

ప్రాణాలను ప్రేమతో సంగమించే

వేదనా యమున సమ్మోహమా…

ఒప్పుకోలేని విన్నపాలు కళ్ళబడలేని కలలు

అర్థమయ్యే పదాలు ఆశల సవ్వడులు

ఇన్నిటినీ ఇన్నాళ్ళూ మోసుకొచ్చిందీ కాలం

కొన్ని దూరాలు సృష్టిస్తూ అలుస్తాను

కొన్ని గుండెచప్పుళ్ళు వింటూ కలుస్తాను

ప్రశ్నలు సంధించే పొరపాట్లు

మనసు భూకంపాల నడుమ

కొత్త ఆలోచనల శిఖరాగ్రాలు మొలుస్తాయి

ఒక్కో చినుకు కూర్చుకుని

గుండె చప్పుడులో

ఆశల అరణ్యాలు పరుస్తాయి

నాలో నువ్వూ

భౄమధ్యం లో ఉత్తర దక్షిణం

కలల కాన్వాసులో పెనవేతల భూమధ్యరేఖలు

అంతమూ లేదు ఇది ఆదీ కాదూ

మనసు సత్యం

మోహ కోలాహలం

-జయశ్రీనాయుడు

jaya

(painting: Anupam Pal)

మీ మాటలు

  1. ఆర్.దమయంతి says:

    కొన్ని దూరాలు సృష్టిస్తూ అలుస్తాను

    కొన్ని గుండెచప్పుళ్ళు వింటూ కలుస్తాను..
    – చాలా బాగున్నాయి ఈ లైన్స్ ..

    అవును జై,
    వేదనా యమున సమ్మోహమా…అన్నారు కదా, ఎలా తెలిసుకున్నట్టు ఆ రహస్యాన్ని మీరు?

    ఒక్కో చినుకు కూర్చుకుని

    గుండె చప్పుడులో

    ఆశల అరణ్యాలు పరుస్తాయి

    చాలా బావుంది. ఇది ఏమో ఏమో కానీ, మోహమైన కవిత్వం,,కోలాహలమే.
    జై! మీకు అభిననన్దనలు.
    :-)

మీ మాటలు

*