బానిసకొక బానిసకొక బానిస!

drushya drushyam-9 photoఒకరిని చిత్రించడం ఒకటి.
-అది మనిషిదైతే అతడి అంతర్ముఖం కనిపిస్తుంది.ఇద్దరిని చిత్రించడం మరొకటి.
-అది ఆలుమొగలదైతే వాళ్లిద్దరి అనుబంధం కనిపిస్తుంది. స్నేహితులదైతే అనురాగం వ్యక్తమవుతుంది.ముగ్గురిని చిత్రించడం మాత్రం పూర్తిగా భిన్నం.
ఎందుకో అది సమాజాలనూ, ప్రపంచాలనూ చూపినా చూపుతుంది!

+++

అవును. ఒక చిత్రంలో గనుక ముగ్గురు ఉన్నారూ అంటే ఆ చిత్రం వ్యక్తులను దాటుతుంది. సామూహికతను మెలమెల్లగా చెప్పడానికి ఆ ఛాయాచిత్రం విశ్వ ప్రయత్నం చేస్తుంది. ముగ్గురు లేదా నలుగురు ఉన్నారూ అంటే అది సంఘమే అవుతుంది. మనిషి హఠాత్తుగా ఒక సంఘటనలో భాగంగా లేదా ఒక సన్నివేశంలోని పాత్రలుగా వ్యక్తమవుతారు. ఒక ప్రవహిస్తున్న ధారకు సంబంధించిన వాహికగా మారి మనల్ని ఆశ్చర్యపరుస్తారు. కలవర పరుస్తారు. లేదా ఆనందపారవశ్యానికి గురిచేస్తారు. ఈ చిత్రం అటువంటిదే. కాకపోతే ఇది మనల్ని మనకు పట్టి చూపే కాలమ్, అనుకుంటాను!

+++

ఒకానొక రోజు దీన్ని మన దేశ రాజధానిలో చిత్రించాను.

ముగ్గురూ ముగ్గురే.
ఒక బస్టాఫ్ వద్ద కూచున్న ఒక దినసరి కూలి, నిలబడ్డ ఒక సాఫ్టు వేరు ఉద్యోగి. ఒక చిరు కంపెనీలో పనిచేసే మరొకతను…ముగ్గురూ ఉన్నారు. అందరూ ఎదురు చూస్తున్నది బస్సుకోసమే.

నిజానికి వేచిచూపు.
ఆ వేచిచూపు అందరిదీ.
కానీ, వ్యక్తులు మాత్రం ఎవరికి వారు.

ఒక్కొక్కరు ఒక్కో రకం. ఒక్కొక్కరిదీ ఒక స్థితి.
చిత్రం చూస్తుంటే ఎవరి వయసేమిటో తెలుస్తున్నది. ఎవరి ఆర్థిక స్థోమత ఏమిటో కూడా అగుపిస్తూ ఉన్నది.
మనం ప్రభుత్వం నుంచి మనం ఏదేనీ ధృవీకరణ పత్రం తీసుకోవాలంటే, నింప వలసినవి ఉంటాయి గదా!
అవన్నీ ఈ చిత్రంలోనూ దాదాపుగా నిండి ఉండనే ఉన్నాయి.

అంతా ఒకే చిత్రము.
కులమూ మతమూ జాతీయతా నివాస స్థలమూ ఆర్థిక స్థోమతా అన్నీ ఏదో విధంగా తెలుపుతున్న చిత్రము.
అన్నిటికన్నా చిత్రం ఏమిటంటే, ఇది మూడో ప్రపంచ చిత్రం.

వేర్వేరు స్థాయి భేదాలతో…ధనికా పేదా మధ్యతరగతిగా కానవస్తున్న ఆ చిత్రం  అచ్చమైన మన దేశీయ చిత్రమే.
– The third world.

+++

ముగ్గురున్నారని కాదు.
బానిసకొక బానిసకొక బానిస గనుక!

విడగొట్టబడి…
అందరూ చౌరస్తాలో అపరిచితులై ఎదురుచూస్తూ ఉన్నారు గనుక!

~కందుకూరి రమేష్ బాబు

మీ మాటలు

  1. DrPBDVPrasad says:

    రమేషన్నా కాప్షన్ నప్పలా దృశ్యమైతే మా మస్తుగుంది
    అదిగొ కూకున్నాడె ఆయన బానిసేంటి?శ్రమజీవి
    కూకున్నా ఎదురు సూస్తున్న పక్కనేబెట్టుకున్న గడ్డపారంత ధీమాగా ఉన్నాడు
    షూసు బాబు దేశంకోసమేనన్నంత దర్పంగా ఉన్నాడు
    ఎనకాటి పెద్దమడిసి కూడ దైన్యంగా మాత్రం లేడన్నా
    ఇంత మంచి బొమ్మకొట్టి ఆ పేరెట్టావేంటన్నా?
    ఆత్మవిశ్వాసంతో కళకళ లాడేవాళ్ళు ఆళ్ళు బానిసలేంటి?
    దేశారాజధానిలో అయితే ఆళ్ళుందేది(బానిసలు డబ్బుకి,పదవికి)పార్లమెంతౌసులో కదా?

    • మీరు అన్నది కూడా కరెక్ట్ లగే ఉన్నది. మీ పద్ధతిలో చూస్తే….
      కాని నీను ఆ ఫోటో ను అలా చదువుకున్నాను.

      రచన కు దృష్టి ముక్క్యం. దృశ్యం మాత్రం చాల మాట్లడుతది.

      ఎంజాయ్ ది ఫొటోగ్రాఫ్. థాంక్ యు వేరి మచ్.

మీ మాటలు

*