గీతాంజలి

Kadha-Saranga-2-300x268
రమ్యా, రమ్యా” అని ఎవరో గెట్టి గెట్టిగా లోయలోనుండీ అరుస్తున్నారు.
 ఆ సమయంలో ఓ పర్వత శిఖరపు అంచులో ఉన్నాను నేను. ఎవరబ్బా నా పేరు పిలుస్తున్నారు అని లోయలోకి తొంగి చూస్తే  అక్కడ మా నానమ్మ ఉంది. అరుపులు గెట్టి గెట్టి గా వినిపిస్తున్నాయ్…వులిక్కిపడి కళ్ళు తెరిచాను, ఎదురుగా నన్ను నిద్రలేపుతూ మా నానమ్మ.  “ఎంత సేపమ్మా పడుకునేది, సమయం 12 కావొస్తోంది. ఆదివారం కాబట్టి సరిపోయింది…కాలేజి ఉన్నప్పుడు కుడా ఇంతే నా నువ్వు” అని అడిగింది.
నేను విసుక్కుంటూ  “నీకు తెలీయదు లే నానమ్మా, కాలేజి ఉన్నప్పుడు అయితే క్లాస్ లు ఉంటాయ్ అని ఎప్పుడో లేచేసే దాన్ని. హాలిడేస్ కద అని ఇలా ఉన్నాలే” అన్నాను.  హాలిడేస్ కి మదనపల్లి లో ని మా నానమ్మా వాల్ల ఇంటికి వొచ్చాను.  ఇప్పటికే ఇక్కడికి వొచ్చి ఒక వారం అవుతోంది. ఇన్ని రోజుల్లో ఒక్క సారి కుడా వూరిలోకి పోలేదు. కాని రోజు సాయంత్రం మాత్రం సైకిల్ తొక్కుతూ అలా రోడ్డు మీద  కొండలవైపు వెల్లటం నాకు అలవాటు. కాని ఇంకొక రెండు రోజుల్లో తిరిగి నెల్లూర్ వెల్లిపోవాలి, కాలెజ్ కి, అదే కొంచం బాధ. సగం నిద్ర ని మోసుకుంటూ కష్టపడి రూం బయటకి వొచ్చాను.  లేచిలేవ గానే టివీ చూద్దాం అని కూర్చుంటే డిష్ రావట్లేదు. “నానమ్మా, టివి రావట్లేదూ?” అని అడిగాను. “డిష్ వైర్ కి ఏదో అయ్యిందట రాత్రి వర్షం వల్ల, ఈ రోజంతా టివీ రాదు” అనింది. ఏం చేయాలో అర్థం కాలేదు ఆరోజంతా నాకు.
 ఇల్లంతా సద్దుతూ, ఏదో తెలియని దానికోసం వెతుకుతూ, సైకిల్ తొక్కటానికి సాయంత్రం కోసం ఎదురు చూస్తూ, గడిపాను.  అలా సద్దుతూ ఉన్నప్పుడు నాకు మా తాతయ్యవి పాత పుస్తకాలు కనిపించాయి. ఆ పుస్తకాలన్ని ఒకొక్కటిగా తీస్తూ ఉంటే మధ్యలో టాగూర్ “గీతాంజలి” కనిపించింది.  గీతాంజలి గురించి తెక్స్ట్ బుక్కులలో చదవటమే కాని నేను ముందెప్పుడూ చదవలేదు. ఎలాగో ఖాలీగా ఉన్నాను కద, ఇది అయినా చదువుదాం అని చదవటం మొదలు పెట్టాను. అంతకు ముందెప్పుడూ కవిత్వం చదవలేదు నేను.దాన్ని చదువుతుంటే మాత్రం చదువుతూ అలాగే ఉండిపోయాను. సమయం గురించి ఆలోచించలేదు. మన అందరికీ అంతుచిక్కనిదేదో ఉంది ఆ కవిత్వంలో. ఏదో మాంత్రికత ఉంది. సంగీతం వింటున్నప్పుడు మనసు ఎలా తేలికవుతుందో అలా అయిపోయింది.  సమయపు ప్రవాహంలో జీవితం గడ్డ కట్టినట్టు అనిపించింది. కొద్ది సేపు  ఆ కవిత్వపు గాలులలో నేనొక ఈక నయిపోయానా అనిపించింది.  చుట్టూ చూసాను – ప్రపంచాన్ని  కొత్తగా స్పర్షిస్తున్న అనుభూతి కలుగుతోంది.  నా లోపలి ఒకొక్క పొరని పక్కకు తీసుకుంటూ నా అంతర్లోకాల కీకారణ్యంలోకి ప్రయాణిస్తున్నట్టు అనిపించింది.  కొంచం సాహసం గా, కొంచం మాయ గా, మధురం గా ఉంది ఆ మొత్తం అనుభవం.
అప్పటినుండి నా చుట్టూ ఉన్న ప్రపంచానికి ఏదో అయ్యింది. ప్రపంచం తనలో ఒక రహస్యాన్ని మోస్తూ నాకు చూపించకుండా దాపెడ్తోందేమో అనిపిస్తోంది.  నా మనసు కుదురుగా లేదు. ఇప్పటివరకు ఎప్పుడూ టెక్స్టు బుక్కులు చదవటమే  కాని కవిత్వం చదవని నాకు ఇదేదో వింతగా ఉంది.  ఏమయింది? ఏంటి ఇది? ఎవరు చదివినా ఇలానే ఉంటుందా? ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలలో తడిచిపోయాను.
సాయంత్రం 5 కాగానే   నాపాత సైకిల్ వేస్కొని అలా ఆలోచనల రోడ్డు మీదకు వొచ్చాను. రోడ్డు తిన్నగా ఆకాశానికి దారితీస్తోంది. రాత్రి పడిన వర్షం వల్ల ఇంకా నేల తడిగానే ఉంది. అక్కడక్కడ పిల్లకాలువలు ప్రవహిస్తున్నాయి. దూరంగా కొండలు టోపి పెట్టుకున్నట్టు మేఘాలు కమ్ముకున్నాయి. నేన్ సైకిల్ తొక్కుతుంటే,సైకిల్ చక్రాల చెప్పుడు, చుట్టూ ఆవరించిన నిషబ్ధం లోకి ఇంకిపోతోంది.  ఇక్కడి నిషబ్ధం బలె వింతది. సముద్రంలా అలలు అలలుగా తాకుతుంది.  హట్చు కుక్కపిల్లలా ఎక్కడికిపోయినా వెంటనే వొస్తుంది. ఈ నిషబ్ధం నిరంతరం విచ్చుకునే ప్రక్రియలో నిమఘ్నమయి ఉంటుంది. అయినా నేన్ ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను, క్రితం ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలు నాకు రాలేదే, ఏమయ్యింది నాకు అనిపించింది.
నాకు చాల దాహం అనిపించింది. లక్కీ గా ఆ పరిసరాల్లోనే ఒక చిన్న అంగడి కనిపించింది. సరే అని నా సైకిల్ నిపక్కకు పెట్టి, ఆ అంగడి దెగ్గర ఒక నీల్ల పేకెట్ కొన్నాను.   ఒక అల్లరి గాలి  అక్కడ తగిలించి ఉన్న వార్తా పత్రికలను తాకి , చుట్టూ ఉన్న నిషబ్ధంలో అలజడి కలిగించింది. ఆ కాగితాలన్ని రెక్కల్లా రెపరెపా  కొట్టుకున్నాయి.  ఆ సమయంలో ఒక పత్రిక లో నుంచి టాగోర్ ఫోటో తొంగిచూసింది .  అప్పుడే  గీతాంజలి చదివి ఒక మధురమైన అనుభూతిని పొందిన నేను ఆ ఫోటొ కనిపించిన వెంటనే ఆ పేపర్ తీసుకొని చూసాను.  ఆగస్ట్ 7త్ న, అంటే ఈ రోజు, 1941 లో టాగోర్ చనిపోయాడట. ఆయన స్మారకార్థం అన్నీ బెసంట్ కళాశాలలో ని కాంఫరెన్స్ హాల్ లో ఒక చిన్న కార్యక్రమం సాయంత్రం ఏడు కి జరగబోతోంది అని ఉంది.  అది చదివిన వెంటనే అనుకున్నాను, ఎలాగైనా ఆ కార్యక్రమానికి వెల్లాలి అని.
ఇంటికి తిరిగి వెల్లిపోయి  చెక చెక రడీ అయ్యాను. నానమ్మా ఒక పక్క అరుస్తూనే ఉంది “ఏంటే ఆ తొందర?” “ఎక్కడికి వూరేగుతున్నావ్?” అని. “నేను వూరిలోపలికి వెల్లాలి, నాకు పని ఉంది” అని చెప్పాను.  “నీకు ఈ వూరిలో ఏం పని ఉంది?” అని అడిగింది నానమ్మ. ఎందుకో నిజం చెప్పాలి అనిపించలేదు. “ఫ్రెండ్ ని కలవాలి” అని చెప్పాను. “ఈ వురిలోకుడా నీకు ఫ్రెండ్స్ ఉన్నారా?” అని అడిగింది నానమ్మ, అనుమానాస్పదంగా. “ఏం ఉండకుడదా?” అని విసుక్కుంటూ ఇంటి బయటకు వొచ్చేసాను.   అన్నీ బెసంట్ కాలేజ్ మా ఇంటి నుండి ఒక మైలు దూరం వుంటుంది. సమయం ఇంకా 6:15. ఆ ప్రోగ్రాం ఏడు కి కద, అంత త్వరగా వెల్లి నేన్ ఏం చేస్తాను అనుకుని, నడుచుకుంటూ వెల్లాలి అనుకున్నాను.  చిన్న చిన్న చినుకులు పడ్తున్నాయి. ఇంకా వూరు తడిగానే ఉంది. సాయంత్రం పానిపూరి/ చాట్ బండులను జనాలు చుట్టుముట్టారు .  వుద్యోగస్తులు, పిల్లలూ ఇంటికి వెల్లే సమయం అది…రోడ్డు అంతా గందరగోలంగా ఉంది. ఎన్నో శబ్ధాల మధ్య నా మౌనం తప్పిపోయింది. ఏన్నో ఆకారాల మధ్య నా శరీరం అంతరిక్షంలో ఒంటరి నక్షత్ర శకలంలా అనిపించింది.  ఎందుకో గీతాంజలి చదవకపొయ్యుంటే బాగుండేది అనిపించింది…ఈ యాంత్రిక ప్రపంచంలో నేను ఒక యంత్రంగానే ఉంతే బాగుంటుంది. గీతాంజలి నాకు ఎందుకో నాలోని ఒంటరితనాన్ని గుర్
తుచేసింది.
అంతమంది జనాలలో, అన్ని శబ్ధాలలో అకస్మికంగా ఒకతను కనిపించాడు.  యవ్వనపు అందంతో వెలిగిపోతున్నాడు.  ముడతలు పడిన కుడ్తా, జీన్స్ పాంటు  వేస్కొని, ఒక సంచిని భుజానికి తగిలించుకొని రోడ్డు పై నడుచుకుంటూ వెల్తున్నాడు.  ఎందుకో చూసిన వెంటనే చాల ఆసక్తికరంగా అనిపించాడు ఆయన. తనంతకు తాను, తనకు మాత్రమే ప్రత్యేకమైన లోకం లోకి వెల్తున్నట్టు నడుస్తున్నాడు. నాట్యురల్ గా గాలికి చెదిరిపోయిన జుట్టూ,  ఎటువైపో చూస్తున్న చిన్న చిన్న నిశ్చలమైన, ప్రకాశవంతమైన కళ్ళు,  పెదవుల దెగ్గర దాగిపోయిన విరిసీ విరయని నవ్వూ, ఆగిపోయిన పాట, బయటపడ్డ రహస్యం అన్నీ కనిపించాయి ఆయను చూస్తుంటే. కొంచం సేపు అలానే ఆయన్ను చూస్తూ ఉండిపోయాను.  ఎందుకో ఆ సందర్భంలో నా పరిస్థితి గురించి ఆయన ఇట్టే అర్థంచేస్కోగలడు అనిపించింది. ఊరుకాని ఊరు, ఆయన ఎవరో అనామకుడు-  మనకెందుకులే ఈయన విషయాలు అనిపించికొంచం తొందరగా నడిచి ఆతన్ని దాటుకున్నాను. అలా నడుస్తూ నడుస్తూ సగం దూరం వొచ్చాక కుడా నా మనసు ఆయన్ను చూసిన తరునంలోనే ఆగిపోయింది . ఎవరతను? చుట్టూ ప్రపంచం పట్టనట్టుగా అలా వెల్లిపోతున్నాడేంటి? అని అలోచిస్తూ అలోచిస్తూ ఉంటే మధ్యలో ఒక ప్రశ్న వొచ్చింది.  నేన్ ఎందుకు ఆయన గురించి ఇంత ఆలోచిస్తున్నాను? ఎవరి గురించి అయినా ఇలా నే ఆలోచిస్తానా లేక ఆయన ఒక్కడి గురించేనా? అని. ఆ ప్రశ్నకు సమాధానం వెతకటం కంటే ఏం ఆలోచించకుండా ఉండటమే నయం అనుకుని నా ఆలోచనలను అదుపు చేసుకున్నాను.
కొంచం దూరం వొచ్చాక ఎందుకో అనుమానంవొచ్చి ఒక సారి వెనక్కి తిరిగి చూసాను. ఆయన నా వెనకాలే ఇంకా ఉన్నాడు. కాని అంతే అయోమయంగా, ప్రపంచం పట్టనట్టు నడుస్తున్నాడు. నాకు ఒక కొంచం సేపు చచ్చేంత భయం వేసింది. ఎవరు ఈయన? నన్ను ఏమైనా ఫాలో చేస్తున్నాడా అని.  వెన్నులో వొణుకు పుట్టింది. ఎందుకొచ్చిందిలే అని ఒక ఆటో మాట్లాడుకున్నాను అనీ బెసంట్ కాలేజ్ వరకు.
ఆటో లో వెల్తున్నప్పుడు ఆకాశంలో వురుములు మెరుపులు వింపించాయి. వర్షం పెద్దది అయ్యే లా ఉంది. ఆటో తీస్కొని మంచిపని చేసాను లే అనుకున్నాను.   కాలేజ్ చేరే సమయానికి 6:45 కావొస్తోంది.  కాలేజీ వాట్చ్-మేన్ ని కాంఫరెన్స్ హాల్ ఎక్కడ అని అడిగి, తిన్నగా కాంఫరెన్స్ హాల్ లో కి వెల్లి కూర్చున్నాను. లోపల ఒక యాభై మంది కూర్చోవటానికి అనుకూలంగా ఉంది. అప్పటికి ఇంకా కూర్చీలను సద్దుతున్నారు. అందరికంటే మొదట వొచ్చింది నేనే.  బయట వర్షం పెద్దది అవుతున్న శబ్ధం వినిపిస్తోంది. నిర్వాహకులు కొంచం కంగారు పడుతున్నారు. నెన్ వొచ్చిన ఒక 5 నిమిషాలకి ఇంకొక ముస్సలి ఆయన వొచ్చాడు.  అలా ఒకొక్కరుగా వస్తూ ఒక ఇరవై నిమిషాలలో మొత్తం హాల్ నిండిపోయింది.  చివర్లో వొచ్చిన వాల్లు అందరూ వర్షానికి బాగా తడిచి పోయి ముద్ద అయ్యారు. ఒక సారి అందరినీ గమనించాను.
అక్కడ ఉన్నవాల్లు అందరు వయసులో నాకంటే చాల పెద్ద వాల్లు.  ముడతలు పడిన మొహాలు, తెల్ల జుట్టూ, కంటెద్దాలు ఇవన్నీ అక్కడ వొచ్చిన వారి కనీస క్వాలిఫికషన్స్.  ఇంతలో ఒక పెద్దాయన మైక్ లో టాగోర్ ని పరిచయం చేసి ఒకొక్క వుపన్యాసకుడినీవేదిక  పైకి పిలవటం మొదలుపెత్తాడు.  వేదిక  పైన ఉన్న వాళ్ళు కింద కూర్చున్న వాళ్ళకంటే ముసలి గా ఉన్నారు. చివర్లో ఆ రోజుటి ముఖ్య అతిథి ని పిలుస్తూ ఆయన గురించి కొంచం పరిచయం చేసాడు వుపన్యాసకుడు. పేరు తపస్ బంధోపాధ్యాయ. ఆయన శాంతినికేతన్లోని విశ్వ భారతిలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా  పని చేస్తున్నాడట.  టాగోర్ యాత్రా రచనల పైన రీసర్చ్ చేసాడట. రవీంద్రుని సంగీతం గురించి మాట్లాడటానికి ప్రపంచంలో చాలా ప్రదేశాలకు వెల్లాడట.  ఈయన పరిచయం బట్టి కచ్చితంగా ఈయనకు వాకింగ్ స్టిక్ ఉంటుంది అనుకున్నా…చూస్తే రోడ్డు మీద  నన్ను వెంబడించిన ఆ యువకుడే ఈ వ్యక్తి.
untitled

painting: Tagore

అప్పటినుండి నేను మాత్రం నా ఇంద్రియాలను ఆయనకు అతికించేసాను.  ఆయన్నే తదేకంగా గమనిస్తూ ఉండిపోయాను. వేదిక మీదున్న పెద్దమనుషులు ఏదేదో చెప్తున్నారు, నేను వాళ్ళ మాటలను కొంచం కుడా పట్టించుకోలేదు. తపస్ బంధోపాధ్యాయ, టిపికల్  బెంగాలి పేరు. అసలు ఈయనకు వయసు ఎంత ఉంటుంది.  పెళ్ళి అయ్యుంటుందా? అది ఏమో గాని చూడ్డానికి చాలా బాగున్నాడు. చాలా సింపుల్ గా ఉన్నాడు. జుట్టు ని దువ్వుకోలేదు,..సముద్రంలా, అలలు అలలు గా ఉంది ఆయన జుట్టు.  ఆయన రెండు కల్లు, రెండు ఆకాశాలేమో. నిర్మలంగా, కదలకుండా ప్రషాంతంగా ఉన్నాయి. అయినా ,నేన్ ఏంటి ఇలా ఆలోచిస్తున్నా? ఏంటో ఇదంతా అని అనుకుంటూ ఉన్న సమయంలో…అయన తల ఎత్తి వేదిక  పైన నుండి అంత మంది ఆడియన్స్ మధ్యలో ఉన్న నన్ను చూసాడు. వెంటనే నా చూపులను కిందకి దించేసాను. భయం తో లోపల ఒక మంచుగడ్డ కరిగింది. చా! దొరికిపొయ్యానే అని అనిపించింది. ఇంక తల ఎత్తటానికి ధైర్యం సరిపోలేదు. లోపలి ప్రసంగాల కంటే బయటి వర్షమే ఎక్కువగా వినిపిస్తోంది.  ఆయన మాట్లాడ్తున్నప్పుడు మాత్రం ఒకటి రెండు సార్లు తల ఎత్తాను. రవీంద్రుడు రాసిన హైకూ ల గురించి, చైనా ప్రయాణం గురించీ,  రవీంద్రుని కవిత్వంలోని విష్వమానవ అన్వేషణ గురించి ఆయన ఏదేదో మాట్లాడాడు. సగానికి సగం నాకు అర్థం కాలేదనే చెప్పాలి. కాని ఆయన వుపన్యాసం అయిపోయాక హాల్ లో ఉన్న పెద్ద మనుషులందరూ లేచి నిలబడి మరీ చెప్పట్లు కొట్టారు.  నేను అందరితో పాటు లేచి చెప్పట్లు కొట్టాను.  ఆయనతో మాట్లాడాలి అని చాలా కోరిక కలిగింది.  చివర్లో మాట్లాడదాంలే అనుకున్నాను.
మొత్తం కార్యక్రమం అయిపోయే సమయానికి 9 కావొస్తోంది. వర్షం కొంచం తగ్గింది. ఇంటికి వెల్లాలి. కాని తపస్ ను వొదిలి ఎలా వెల్లటం?  ఇంకెప్పుడూ కనిపించడేమో.  ఆయన ఊరికి వెల్లిపోతాడేమో , అని ఏదో దిగులు ఆవరించింది.  సరే అని ధైర్యం చేసి ఒక సారి మాట్లాడాలి అనుకున్నాను.  ఆయనని అప్పటికే అందరూ చుట్టుముట్టారు.  వాల్లలో కొంత మంది విలేఖరులు కుడా ఉన్నారు. ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు. అందరూ వెల్లిపోయాక మాట్లాడొచ్చు లే అనుకొని ఒక పక్కన నిలబడి వెయ్ట్ చేస్తూ ఉండిపోయాను. ఒకరు పోతే ఇంకొకరు వచ్చేస్తున్నారు తప్ప ఆయన మాత్రం అసలు ఖాలిగానే లేడు. మధ్యలో రెండు మూడు సార్లు ఆయన కోసం వేచిచూస్తున్న నన్ను గమనించాడు. కాని ఆయన మొహంలో నిస్సహాయత కనిపించింది.
నా ఫోన్ మోగింది. ఇంటినుండి. నానమ్మ, అటువైపు నుండి ఒకటే అరుపు ‘ఏమైపోయావ్? ఎక్కడికెల్లిపోయావ్? చెప్పకుండా అలా వెల్లిపోతే ఎల? లేట్ అయిపోయింది, వర్షం పడ్తోంది…తొందర్గా తిరిగి వొచ్చెయ్.”
“వొచ్చేస్తున్నాను” అని చెప్పి కాల్ కట్ చేసాను.
ఇలా అయితే కుదరదూ అని నేనే ధైర్యం చేసి ఆయన చుట్టు ఉన్న ముసలి గుంపు లోకి దూసుకుపోయాను.  ఆ గందరగోలం మధ్యలో ఆయనను పిల్చాను- “తపస్ తపస్” అని. ఆయన నా వైపు తిరిగి చూసాడు, చుట్టూ అందరూ మాట్లాడటం ఆపేసారు.  సడన్ గా ఏం మాట్లాడాలో గుర్తుకురాలేదు. ఏదో ఒకటి అడిగేద్దాం లే అని  “గీతాంజలి లో మీకు నచ్చిన పద్యం ఒకటి చెప్పరా”  అని అడిగాను. ఆయన నవ్వి,  బెంగాలి లో రవీంద్రుని కవిత ఒకటి చెప్పాడు~
“నువ్వు నాకు దెగ్గరిగా వస్తున్నావో నాకు తెలీదు.
రవి, తారలైనా నిన్ను నా నించి
ఎప్పటికీ దాచి ఉంచలేవు.
అనేక ఉదయ సాయంకాలాలు
నీ పాదధ్వనులు వినవొచ్చాయి.
నీ దూత నా హృదయంలోకి వొచ్చి
నన్ను రహస్యంగా పిలిచి వెళ్ళాడు.
ఇవాళ నా జీవితం ఎందుకు ఇట్లా కంపిస్తోంది
ఎందుకు నా హృదయంలో ఆనందం స్పందిస్తోంది తెలీదు.
నా పనులు కట్టిపెట్టవలసిన సమయం ఆసన్నమైనట్టుంది.
నీ మధుర సమక్షావ్యక్త పరిమళం గాలిలో వూగుతోంది.”
బెంగాలి లో ఆయన చెప్పినది అర్థం కాకపోయినా, ఆయన ఆ కవిత చెప్తున్నంత సేపూ నాకు లూఇస్ ఆరంస్ట్రాంగ్ పాట “లె వి ఎన్ రోసె” లో రెండు లిరిక్స్ పదే పదే గుర్తొచ్చాయి.
“and when you sing angels sing from above
everyday words seem to turn into love songs”
ఆ గుంపు నుండి బయటకు పడి, ఆయన్ను చివరి సారి చూసాను. ఆయన నన్ను నవ్వుతూ ఇంకా చూస్తున్నాడు.   అక్కడి నుండి ఇంటికి వొచ్చేసాను.  “లె విఎ ఎన్ రోసె” పదే పదే గుర్థొస్తోంది.  నానమ్మతో బాగ తిట్లు తిని, ఏదో తినేసి నిద్రపోయాను. కలలో అంతా ఆ కవిత్వమూ, ఆయన నవ్వూ, ఆ పాటే – పదే పదే గుర్తొచ్చాయి.
 -సిరా
 

మీ మాటలు

  1. తిలక్ బొమ్మరాజు says:

    గీతాంజలి గొప్ప కావ్యమని ,అనుభూతుల మేళవిమ్పని తెలుసు,రవీంద్రుడి చేతుల నుండి జాలువారిన ఓ మంచు పుష్పం.ఇలా నన్నాకర్షించింది సిరా రాసిన ఈ కథ కూడా,చాలా నచ్చింది సిరా గారు.అభిననదనలు.

  2. చాల బాగుంది సిరా గారు …………..అలా చదువుతూ ఉండిపోయ నేను ……..నన్ను రమ్య ల ఉహించుకున్న చదువు తున్నపుడు :)

  3. prasad bhuvanagiri says:

    అనుభూతి కి అక్షర రూపం

మీ మాటలు

*