
Art: Satya Srinivas
*
పగిలిన పలుచని పాదాలతో
గంభీరమైన సముద్రం వద్దకు
ఆ ముసలమ్మలు వస్తుంటారు
నిశ్శబ్ధం మేఘాలను మార్చకుండా
సముద్రపు ఒడ్డున
వారు ఒంటరిగా కూర్చుంటారు
తలను విసురుతూ
నేలను దువ్వుతూ ఘీంకరిస్తూ
ఒడ్డుపైకి విరుచుకు పడుతుంది
పారదర్శకమైన పడవలో వున్నట్టు
సహనశీలురైన
ఆ ముసలమ్మలు కూర్చుంటారు
వారెక్కడనుండి వస్తారు
వారు ప్రతి మూల నుండి వస్తారు
మన జీవితాల నుండి వస్తారు
ఏకాంతపు మంటలతో
వాళ్ళే సముద్రంలాగున్నారు
వాసనలేస్తున్న ఇళ్ళ నుండి
గడిచిన కాలాల నుండి వాళ్ళొస్తారు
వారు చేతికర్రతో ఇసుకపై
కొన్ని గుర్తులను గీస్తారు
ముసలమ్మలు లేచి వెళ్ళిపోతుంటే
అలల ప్రవాహం నగ్నంగా
గాలిలో ముందుకు కదులుతుంది
* * *
మూలం: పాబ్లో నెరుడా
తాజా కామెంట్లు