చిత్ర పటాలు

 

కాళ్ళకి
వేళ్ళకి
ఎండకి
గాలికి
అడ్డం పడుతూ
గది నిండా
ఈ పటాలు
చలి చీకట్లకు
చుట్టాలు.

చాలా పాతవి
కొత్తవి
రోజూ వచ్చి
చేరుతున్నవి
దుమ్ముని
తుమ్ములని
పట్టుకొచ్చినవి.

పడెయ్యబోతే
కదల్లేదు
వదిలించుకోబోతే
వదల్లేదు
నిప్పెడితే
కాలేయి
రోజుల తరబడి.

ఇప్పుడైతే
అంతా
నిండు ఖాళీ
హాయి
ఎండ
తరగలెత్తే  గాలి.

తలుపు మీద చెక్కాను
ఇచట పటాలకి చోటు లేదు.