
Art: Mandira Bhaduri
ఇన్నాళ్లూ ఏమైపోయావ్
ఒకరి స్వేదాన్ని
ఒకరు చిందిస్తున్నవేళ అడుగుతుందామె
చేపలా మెలికలు తిరుగుతాడతను
నాకు పెద్ద చేపలంటే ఇష్టం, కానీ ఆర్నెళ్లే
తర్వాత రుచి ఉండవు అంటుందామె
ఎందుకలా
పాత్రలతో అనవసరమైన చప్పుళ్లు అంటాడతను
కాపీకప్పులో అలసటను ఊదేస్తూ
ఇది
నాజీవితానికి సింబాలిజం అంటుందామె
ఫోన్ పక్కనపడేస్తూ
గాంధీని చదవాలోయ్ …
అబద్ధమెంత రుచికరమో తెలుస్తుంది-
లౌక్యంగా నవ్వేస్తుందామె.
తాజా కామెంట్లు