ఇక సెలవ్!

ఫోటో: దండమూడి సీతారాం

గురువారం సారంగవారం!

గత నాలుగేళ్ళుగా ప్రతి గురువారం వినూత్న శీర్షికలతో, వివిధ రచనలతో మీ ముంగిట నిలుస్తూ వచ్చిన “సారంగ” వారపత్రిక ఈ వారంతో సెలవు తీసుకుంటోంది. ఈ వీడ్కోలు మాకూ మీకూ అంత సంతోషం కాదని తెలుసు. ఈ నాలుగేళ్లలో “సారంగ” ప్రతి అడుగులోనూ అక్షరంలోనూ మీరు కొండంత అండ. కేవలం సాహిత్య బంధుత్వం వల్ల మీరు అందిస్తూ వచ్చిన సహకారాన్ని మేం మరచిపోలేం. ఈ ప్రయాణంలో మనమంతా కలిసి నడిచాం. కలిసి ఆలోచించాం. అది అద్భుతమైన అనుభవం.

Update (January 22, 2017): ఈ సారంగ సాహిత్య పత్రిక సైట్ ను కనీసం ఒక సంవత్సరం వరకు, అంటే 2018 మార్చి వరకు, ఇలాగే ఉంచుతాం. ఆ తరువాత సంగతి ఏమిటీ అన్నది ఇంకా ఆలోచించి అనౌన్స్ చేస్తాం. థాంక్స్!

 “సారంగ” ఈ నాలుగేళ్లలో వేసిన అడుగులూ తప్పటడుగులూ/ సాధించిన విజయాలూ/ సంపాదించుకున్న అనుభవాలేమిటో  ఇప్పుడు ఈ వీడ్కోలు సమయంలో ఏకరువు పెట్టుకోదల్చుకోలేదు. ఇవన్నీ  ఇక్కడ రాసిన/ ఇక్కడ చర్చల్లో పాల్గొన్న ప్రతి వొక్కరివీ కాబట్టి! ఇవన్నీ ప్రతివారం అక్షరసాక్ష్యాలుగా మీ ముందు నిలబడ్డవే కాబట్టి!

వెబ్ పత్రికా రంగం లో “ సారంగ” దీపస్తంభం!

అయినా, చివరి మాటగా ఒక సారి తలచుకోవడం బాగుంటుందని అనుకుంటున్నాం.  వెబ్ పత్రికా రంగంలో “సారంగ” ఒక ప్రయోగం. మొదట వారం వారం తీసుకురావడమే విశేషం, ఆ విధంగా మిగిలిన వెబ్ పత్రికలకు అది భిన్నంగా నిలిచింది. తెలుగు సాహిత్య చరిత్రలో అచ్చు రూపంలో వెలువడిన వారపత్రికలు విశేషమైన ముద్ర వేశాయి. వాటితోపాటు ఆదివారం అనుబంధాలు కూడా! వాటి ప్రమాణాలను, విజయాలను ఆదర్శంగా తీసుకుని, “సారంగ” ఇంత కాలమూ మీ అనుదిన జీవితాల్లో విడదీయలేని అక్షర బంధమైంది. “సారంగ” కేవలం ఒకసారి చదివి మరచిపోయే పత్రికలాగా కాకుండా, ఎన్నో అమూల్యమైన ఇంటర్వ్యూలను, సృజనాత్మక, విశ్లేషణలని మీ ముందు ఉంచింది. ముఖ్యమైన పుస్తకాల ప్రచురణల్ని ఒక ఈవెంట్ గా celebrate చేసే పరిచయ వ్యాసాలనూ, ఆ రచయితలూ కవుల ఇంటర్వ్యూలనూ ప్రత్యేకంగా ప్రచురించింది. ప్రధాన స్రవంతి అచ్చు పత్రికలూ, తోటి వెబ్ పత్రికలూ ప్రచురించడానికి సాహసించని విలువైన రచనల్ని ఎలాంటి వొత్తిళ్ళకూ లొంగకుండా మీ ముందుకు తీసుకువచ్చింది. వివిధ తరాల రచయితలకు “సారంగ” ఒక దీపస్తంభమే అయింది. ముఖపుస్తకమే ప్రధాన సాహిత్య వ్యాపకంగా మారిన మహమ్మారి కాలంలో, కేవలం సాహిత్యేతర రాజకీయాలే రచనలకి కృత్రిమ “గౌరవాన్ని” ఆపాదిస్తున్న సందర్భంలో, అసలైన సాహిత్యానికీ, “కృత్రిమ వేషధారణ” లాంటి సాహిత్య వాతావరణానికీ నడుమ నలుగుతూ నిశ్శబ్దంలో కూరుకుపోతున్న  నిక్కమైన రచయితలకు కాసింత ఆశారేఖగా “సారంగ” నిలిచింది.

 ప్రధానంగా వివిధ శీర్షికలలో “సారంగ” కొత్త ప్రయోగాలూ ప్రమాణాలూ మీ అందరి మన్ననలూ అందుకున్నాయి. అసలైన పుస్తకం మీద ప్రేమాభిమానాలు పెంచడంలో “సారంగ” తన పాత్ర తాను హుందాగా పోషించిందని మా నమ్మకం. సాహిత్య సృజన క్రియలో రచయిత పాత్ర ఎంత ముఖ్యమో, చదువరికీ అంతే వాటా దక్కి తీరాలన్న పట్టుదలతో చదువరుల కోసం అనేక శీర్షికలు నిర్వహించాం. రచయితలకు చదువరులతో నేరుగా మాట్లాడుకునే సంభాషణా పూర్వకమైన సాంస్కృతిక వాతావరణాన్ని నిర్మించడంలో “సారంగ” చాలా మటుకు సఫలమైంది. ఆ మాటకొస్తే, మంచి చదువరి అన్న చిన్న భరోసా కలిగితే చాలు, భేషజాలేమీ లేకుండా, “సారంగ” ఎడిటర్లు తమకి తామే ఆ చదువరులకి పరిచయం చేసుకొని, రచనలు పంపించమని అడిగిన సందర్భాలు కోకొల్లలు! ఇక మంచి చదువరులు మంచి రచయితలుగా రూపుదిద్దుకున్న అపురూపమైన సన్నివేశాలు కూడా ఇక్కడ తారసపడ్డాయి. మా మటుకు మేం ఎంత మంది ప్రముఖుల రచనల్ని ప్రచురించామని కాదు, ఎంత మంది కొత్త వాళ్ళని పరిచయం చేశామన్న గీటురాయి మీద ‘సారంగ’ని నిర్వహించాం. రచనకి రచనే అచ్చమైన కొలమానం అన్న మౌలిక నియమం మీద రచనల్ని ప్రచురించాం.

మంచి కథలు, పెద్ద కథలు, నవలలు, అనువాదాలు, లోతైన విమర్శనాత్మక కాలమ్స్

ముఖ్యమైన విషయం: తెలుగు నాట ప్రచురితమవుతున్న వార్షిక కథా సంకలనాల్లో వెబ్ పత్రికల భాగస్వామ్యాన్ని పెంచింది “సారంగ.” గత నాలుగేళ్ళుగా కథా సారంగలో ప్రచురించిన అనేక కథలు వివిధ కథాసంకలనాల్లో చేరాయి. వెబ్ పత్రికల కథకి ఆ విధంగా కొత్త గౌరవాన్ని “సారంగ” సాధించింది. ఈ శీర్షికలో ఎంతో మంది కొత్త కథకుల్ని పరిచయం చేసింది. వాళ్ళ రచనలు కథా వార్షికల్లో కూడా చోటు సంపాదించుకున్నందుకు, ఇతరేతర సందర్భాల్లో వారికి అవార్డులు దక్కినందుకు  సంతోష పడ్డాం.

ముఖ్యంగా, “సారంగ”కి క్రమం తప్పకుండా శీర్షికలు రాస్తూ, మా విమర్శని, ప్రశంసని కూడా ఒకే చిర్నవ్వుతో స్వీకరించారు కాలమిష్టులు. దాదాపు ప్రతి కాలమ్ మాకూ మీకూ విలువైనదే. ఈ కాలమ్స్ రాయడం కోసం ఎంతో శ్రమ, సమయమూ పెట్టారు కాలమిష్టులు. కొత్త అధ్యయనాలు చేశారు. కొత్త సంగతులు వెలికితీశారు. ప్రతి గురువారం సారంగని తీర్చిదిద్దడంలో కాలమిష్టుల తోడ్పాటు మరచిపోలేనిది.

కొత్త రచయితలకు వెన్ను-దన్ను

అతికొద్ది కాలంలోనే సారంగ రచయితలకు అతిచేరువయ్యింది. ఇప్పుడే కలం పట్టిన కొత్త రచయితల నించి ఎప్పటి నించో చేయి తిరిగిన అనుభవజ్ఞులైన రచయితల దాకా ఒక  రచన పూర్తికాగానే “ఇది సారంగకి పంపించాలి, సారంగలో దీన్ని చూసుకోవాలి” అన్న గౌరవాన్ని వెబ్ పత్రికకి తీసుకువచ్చామని నిర్మొహమాటంగా చెప్పుకోగలం. నిజానికి  ఇప్పుడు ఈ చివరి సంచిక మూసివేస్తున్న సమయానికి మా దగ్గిర నాలుగు వారాలకు సరిపడా రచనలు  ఎంపిక అయి, పెండింగ్ లో వున్నాయి.  వాటిని వెనక్కి తిప్పి పంపడం మాకు దిగులుగా వుంది. అయినా తప్పడం లేదు.  పత్రిక తొలివారాల్లో మేం లేఖలు రాసి అడిగి తెప్పించుకున్నప్పటికీ,  కొద్ది కాలంలోనే ప్రతి వారం రెండు మూడు వారాలకు సరిపడా రచనలు రావడం మొదలయింది. కాని, అనువాదాలు కూడా పెద్ద సంఖ్యలో రావడం మాకు గొప్ప సంతోషాన్ని కలిగించింది. ముఖ్యంగా నవలలకు, పెద్ద కథలకు సారంగ మళ్ళీ పీఠం వేసింది.  ఒక దశలో మేం నిజానికి అడిగి రచనలు తెప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది.  అరుదైన సందర్భాల్లో తప్ప ఎవరినీ అడగలేదు. అడిగినప్పుడు కచ్చితంగా సమయ పాలన చేస్తూ, మా విజ్ఞప్తిని మన్నించిన రచయితల సహకారాన్ని ఎప్పటికీ మరచిపోలేం. ముఖ్యంగా కథలూ, వ్యాసాలూ లెక్కలేనన్ని మాకు చేరడం మొదలయింది. ఇక కవిత్వం సంగతి చెప్పక్కర్లేదు. రోజులో చాలా భాగం ఈ రచనలు చదవడం, వాటి మీద వ్యాఖ్యలతో రచయితలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరదపడంలో గడిచేది. ఇది మాకెంతో విలువైన అనుభవం. ఈ క్రమంలో విపరీతమైన రద్దీ వల్ల అనేక రచనలు క్యూలో వుండడం వల్ల చాలా రచనలు ప్రచురణలో ఆలస్యమైనా ఏనాడూ ఏ వొక్కరూ విసుగుపడలేదు, నిరాశ పడలేదు. మనఃస్ఫూర్తిగా అర్థం చేసుకున్నారు.

విసిరిన రాళ్ళే పూలమాలలు!

అలాగే, అనేక వాదాలూ వివాదాలూ వ్యక్తిగత సంవాదాలూ నడుస్తున్న ఈ సంక్షుభితదశలో  రచనల విషయంలో మేం ప్రజాస్వామిక భావనని గౌరవించాం. “సారంగ”కి తనదైన ఒక పాలసీ వున్నప్పటికీ, మేం  చెప్పిందే వేదం అనుకోకుండా, భిన్న స్వరాలకు చోటిచ్చాం.  కొన్ని సమయాల్లో అస్తిత్వ సాహిత్యాల పట్ల ఎక్కువ మొగ్గు చూపించినా, దానికి కొందరు  అసహనం ప్రకటించినా, “సారంగ” దారి ఏమిటో స్పష్టంగా తెలిసిన వాళ్ళు సహనంగానే వున్నారు. అభిప్రాయ స్వేచ్చని నిరభ్యంతరంగా గౌరవించాం.

ఇక ఈ ప్రయాణమంతా సుఖంగానే, సంతోషంగానే జరిగిందని చెబితే అది పచ్చి అబద్ధమే అవుతుంది. ప్రతి పని డబ్బుతో కాదంటే పరపతితో ముడిపడి వున్న ఈ కాలంలో ప్రతి గురువారం సంచిక బయటికి రావడానికి పడ్డ ప్రసవ వేదన తక్కువేమీ కాదు. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఒకటి, రెండు  రోజులు  ఆలస్యం చేశాం. ఇక్కడ కాలాన్నీ ధనాన్నీ మేం లెక్కలోకి తీసుకోలేదు. నిరంతరం మారుతున్న ఉద్యోగాల మధ్యా, వూళ్ళ మధ్యా, పెరుగుతున్న కుటుంబ, వృత్తిపరమైన బాధ్యతల మధ్యా ప్రతి గురువారం పొద్దున్నే ఒక దరహాసంతో “సారంగ” మీ ముందు ప్రత్యక్షరమైందంటే, అది చిన్న విషయం కాదు. ఎలాంటి ప్రతిఫలాపేక్షా లేకుండా ఇంత సమయం ఇందులో పెట్టామంటే అది  కేవలం సాహిత్యం పట్ల మాకున్న ఆసక్తి వల్ల! మా ఆసక్తిని నలుగురితోనూ సహృదయంతో పంచుకోవాలన్న తపన వల్ల!

అయినా సరే,  కొన్ని చేదు అనుభవాలు తప్పలేదు. కొంతమంది రచయితలు అలిగి మొహం తిప్పుకుంటే మరికొంత మంది బెదిరింపులకు కూడా సిద్ధపడ్డారు. అవసరానికి సారంగ పత్రికను వాడుకొని అవకాశం వచ్చినప్పుడు బురద చల్లాలని చూసారు మరి కొందరు. ఇలాంటి కొన్ని చేదు అనుభవాలు ఈ వీడ్కోలు సందర్భంగా అయినా చెప్పకపోతే, ఈ పత్రిక నిర్వహణ వెనక ఎలాంటి శ్రమ వుందో మీకు అర్థం కాదు.

కొత్త ఆలోచనలతో మళ్ళీ ఎప్పుడో !

అటువంటి కొన్ని అపశ్రుతులు తప్ప “సారంగ” గానం అందంగా సాగింది, మంచి అనుభవంగా నిలబడింది. కొత్త వాగ్దానంగా వెలిగింది. ఒక గొప్ప తృప్తితో నిష్క్రమిస్తున్నాం. తెలుగు సాహిత్యంమీద ఒక ఆశావహమైన దృష్టితో ఈ ప్రయాణంలో ఇక్కడితో  ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాం. ఇద తాత్కాలికమే అనుకుంటున్నాం. నిజానికి  వెబ్ పత్రికా రంగంలో, సాహిత్య సందర్భంలో “సారంగ” చేయాలనుకున్నవీ , సాధించాలనుకున్నవీ అనేకం వున్నాయి. వాటిల్లో మేం కొంత మేరకు మాత్రమే ఈ పత్రిక ద్వారా ఈ నాలుగేళ్ల లో చేయగలిగాం. పత్రికని ఇంకా విశేషంగా తీర్చిదిద్దాలన్న కోరిక కూడా బలంగానే వుంది. ఎలా తీర్చిదిద్దాలా అన్న విషయంలో స్పష్టత కూడా వుంది. అన్నిటికీ మించి మీ సహాయ సహకారాలు ఎప్పుడూ వుంటాయన్న గొప్ప నమ్మకం వుంది. సారంగ ను మొదలు పెట్టిన నాటి సాహిత్య వాతావరణం కంటే ప్రస్తుత సాహిత్య సామాజిక వాతావరణం లో అతి ముఖ్యమైన ప్రత్యామ్నాయ తెలుగు సాహిత్య పత్రిక సారంగఅవసరం ఇప్పుడు మరింత ఎక్కువ గా ఉందని మాకు తెలుసు. ఇలాంటి సంక్లిష్ట, సంక్షుభిత పరిస్థితుల్లో నిష్క్రమణ మీకూ, మాకూ ఇద్దరికీ విషాదమే. కానీ తప్పనిసరి అయింది. కొత్త రూపు రేఖలతో, కొత్త ఆలోచనలతో  మళ్ళీ ఎప్పుడో మీ ముందుకు వస్తామన్న నమ్మకం తో  మీ నుంచి సెలవు తీసుకుంటున్నాము!

రచయితలకు సాంకేతిక సూచన:

ఈ గురువారమే సారంగ చివరి సంచిక. మార్చి 30 తరవాత సారంగ వెబ్ సైట్ కూడా పూర్తిగా తొలగిస్తాం. కాబట్టి, మీ రచనలు అన్నీ విడిగా ఈ లోపే డౌన్ లోడ్ చేసుకోండి, ఆ తరవాత అవి కనిపించవు కాబట్టి! ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. అలాగే, మా వద్ద పెండింగ్ లో అనేక రచనలు వున్నాయి. వాటిని రచయితలు వెనక్కు తీసేసుకోవలసిందిగా వ్యక్తిగత విన్నపం. మమ్మల్ని సంప్రదించాల్సి వస్తే editor@saarangabooks.com కి ఈమెయిల్ చేయండి.

అఫ్సర్

కల్పనారెంటాల

రాజ్ కారంచేడు

మీ మాటలు

 1. మనస్సు కి ముసురు పట్టినట్టుగా వుంది.

 2. ప్రసాద్ చరసాల says:

  అయ్యో! ఇదేమిటి, ఉరుముల్లేకుండా పిడుగులు!
  ఎంతో హుందాగా, ఎన్నెన్నో మంచి కథలూ, కాలమ్స్‌తో వెలువడుతున్న సారంగ మరిక రాదంటే నమ్మశక్యం కాకుండా వుంది.

 3. D. Subrahmanyam says:

  అనూహ్యమయిన మీ నిర్ణయం కదిలించి వేసింది. నాలాంటి తెలుగు సాహిత్యం లో ఓనమాలు దిద్దిన వారికీ సారంగా చాలా సహకరించింది. కల్పనా గారిని ఒక సారి సాహిత్య అకాడమీ లో కలిసి ఆప్యాయంగా మాట్లాడిన అనుభూతి. అఫ్సర్ గారిని ఇంచుమించు రోజు FB లో కలవడం వారి స్నేహభావాన్ని చూడడం మంచి అనుభూతి, వారితో స్నేహం ఎప్పటికీ కొనసాగుతుంది. నేను ఏదయినా రాస్తే అఫ్సర్ గారికి పంపి సలహాలు అడుగుతూ ఉంటాను. అలాగే అఫ్సర్ గారి తోనూ మిగిలిన ముస్లిం తెలుగు రచయిత (త్రి) లతో ఢిల్ల్లీ లో ఒక సాహిత్య సభ జరపాలనే నా కోరిక తీర్చమని అఫ్సర్ గారిని కోరుతున్నాను. మీ ముగ్గురికీ ఆత్మీయ నమస్కారంతో .. ఢిల్లీ సుబ్రహ్మణ్యం

 4. సాయి.గోరంట్ల says:

  మాటలు రావడం లేదు 😢😢

 5. మణి వడ్లమాని says:

  అఫ్సర్ గారు ఈ వీడ్కోలు తాత్కాలికమే అని బలంగా నమ్ముతున్నాను. గురువారం వచ్చింది అంటే సారంగ కోసం అనే ఆనందం. ఈ వారం ఎవరెవరు రాసారా అనే ఆత్రుత ఇక ఉండబోదు అంటే చాల బాధ గా ఉంది. . మాటలు పెగలటం లేదు. ఈ విడిపోవడం మళ్ళి కలవడానికే అని నమ్ముతూ విష్ యు అల్ ది బెస్ట్

 6. Narayana sharma says:

  Cala badhaga undi sir….. Malli alocinca kuudada

 7. Dr PERUGU RAMA KRISHNA says:

  ఎందుకని….?

 8. S. Narayanaswamy says:

  Doesn’t make sense to shut the site down. Please reconsider this decision. If it is a matter of server, I am sure some alternative can be found. There is a lot of valuable material here.

 9. indraprasad says:

  very sad

 10. Balasudhakarmouli says:

  సారంగకి విరామం వద్దు.

 11. amarendra dasari says:

  అన్యాయం..పోని పక్ష పత్రికగా మార్చండి

 12. నమ్మశక్యం కాకుండా ఉందండి. ఆకాశమంత ఆహ్లాదంగా అల్లుకున్న వెచ్చదనం మాయమవబోతున్న భావన. త్వరలో మరిన్ని కొత్త హంగులతో మురిపించేందుకు సిద్ధం కావాలని ఆసిస్తూ తప్పనిసరి వీడ్కోలు..:(

 13. చందు తులసి says:

  పత్రికా సంపాదకులుగా… సారంగ గురించి ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం మీదే సర్. కానీ సారంగతో మాకూ విడదీయరాని అనుబంధం వుంది. సూచించే హక్కూ వుందనుకుంటున్నాను.
  ముఖ్యంగా మాలాంటి…. కొత్త తరం వారికి సాహిత్య పాఠశాల సారంగ.
  భారం మీమీద ఎక్కువే వుందని తెలుసు. కానీ అది మాలాంటి వారు కొందరు పంచుకోవడానికి సిద్దంగా ఉన్నాము….
  మరొక్క సారి ఆలోచించండి

 14. నీహారిక says:

  ఈ ఎడబాటు తాత్కాలికం కావాలని కోరుకుంటూ, సరికొత్త ఆలోచనలతో, సరికొత్త పత్రికగా మా ముందుకు రాగలదనే ఆశాభావంతో, తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలందించిన సారంగ కి వీడ్కోలు శుభాభివందనాలు !

 15. THIRUPALU says:

  ఒక స్నేహితుణ్ని కోల్పోయినట్లు ఉంది.

  • kurmanath says:

   you said it

   • Thirupalu says:

    అవును సర్, ఉదయం చూసినప్పటి నుండి బాధ గా ఉంది.
    “పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవి”
    అని నెమరు వేసుకోవసిందే!

 16. Praasadamurty says:

  I am unable to bear this news. Tears are coming out. Plz rethink Afsar bhai. If you need any cooperation, I am ready. Saranga is an irrevocable alternative to the hegemony of print media. It is not only for new comers it provided space for radical and challenging views from seniors also. Plz think again and take suggestions from all Saranga lovers.

 17. కపిల రాంకుమార్ says:

  కారణాలు ఏమైనా…..నిష్క్రమణ ఒకింత విచారం కలిగించినా సాహిత్య సేవ ఒక మైలు ర్యిగా మిగుల్తుంది. ఆల్‌ ది బెస్ట్‌…సంపాదకవర్గాని, తోటి కవి మిత్రులకి

  • కపిల రాంకుమార్ says:

   మైలు ర్యిగా ** మైలు రాయి

 18. DrPBDVPrasad says:

  ఇంతగా పూనుకొని చేస్తున్న ఈ సాహిత్య మిత్రులకు మనంగా చేస్తున్న సాయం ఏఁవుంది? చదవటమే కదా అనుకొని అక్షరం పొల్లు పోకుండా చదివి ఎంత ఆనందం అనుభవించాను. శ్రమ లేకుండా మెయిల్ కు చేరుకునే పీచర్స్ అన్నీ ఏకబిగిన చదివి సారంగ విహారానికి మురిసి పోయాను.
  ఎంత బాధతో మీరీ నిర్ణయం తీసుకున్నారో..
  ఈ నాలుగేళ్ల కాలాన్ని సాహిత్య మయం చేసిన మిత్రులు అఫ్సర్ గారికి కల్పన గారికి రాజుగారికి కృతఙ్ఞతాభివందనాలు.

 19. ‘నిరంతరం మారుతున్న ఉద్యోగాల మధ్యా, వూళ్ళ మధ్యా, పెరుగుతున్న కుటుంబ, వృత్తిపరమైన బాధ్యతల మధ్యా ప్రతి గురువారం పొద్దున్నే ఒక దరహాసంతో “సారంగ” మీ ముందు ప్రత్యక్షరమైందంటే, అది చిన్న విషయం కాదు.’
  అఫ్సర్ కారణం లేకుండా ఏదీ చెయ్యవు నువ్వు. మరో మరింత మంచి మలుపు కోసమే ఈ నిర్ణయం తీసుకుని వుంటావు. ఆ నమ్మకంతో ఫిర్ మిలేంగే, సారంగ!

 20. B.RAM NARAYANA says:

  very sad! any reason? I think readers deserve some plausible explanation.

 21. కంటిచూపు పోయినట్లుంది

 22. మెర్సీ మార్గరెట్ says:

  మా లాంటి కొత్తగా రాసేవాళ్లకి సారంగ ఎప్పుడూ వెన్నుతట్టింది.. కొత్త రూపు రేఖలతో, కొత్త ఆలోచనలతో మళ్ళీ ఎప్పుడో మీరు మా ముందుకు వస్తామన్న నమ్మకం తో ఎదురుచూస్తు..

 23. బమ్మిడి జగదీశ్వరరావు says:

  సారంగా!
  రాస్తున్న పెన్నును లాగేసుకుంటే – చదువుతున్న పుస్తకం లాగేసుకుంటే – పలుకరించి పంచుకొనే మిత్రున్నిలాగేసుకుంటే – నువ్విచ్చినవన్నీ నువ్వే లాగేసుకుంటే – నువ్వే రానంటే..
  భారంగా!
  -బమ్మిడి జగదీశ్వరరావు

 24. కాకుమాని says:

  వసంతం వెళ్లి పోయినా మళ్లీ వస్తుంది!

 25. rambabu thota says:

  “సారంగ” లో పబ్లిష్ అయిందంటే ఖచ్చితంగా చదవాల్సిందే అనుకొనేవాడిని. అటువంటిది సారంగే లేకపోవడం ఏమిటి?

  పిల్లచేష్టలకు బ్రేకిచ్చి, నేనూ ఒక ఆర్టికల్ రాసి సారంగకు పంపుదాం అని మొన్ననే అనుకున్నాను. కష్టనష్టాలన్నీ నేరుగా చూసే మీకు సలహాలివ్వడం తగదు.అందుకే, కుదిరితే మళ్ళీ మొదలు పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను.

 26. పిన్నమనేని మృత్యుంజయరావు says:

  సారంగ చదవడం మొదలెట్టాక సాహిత్యంలో అనేక కొత్త పార్శ్వాలు చూడగలిగాను. మంచి పత్రిక ఆగిపోతున్నందుకు విచారంగా ఉంది. మీలోని ఉత్సాహం మిమ్మల్ని కుదురుగా కూర్చోనివ్వదనీ, త్వరలోనే మళ్ళీ సారంగ వెలుగు చూస్తుందని ఆశిస్తాను. నా రచనలు ప్రచురించి ప్రోత్సహించినందుకు అఫ్సర్ గారికి సారంగ కుటుంబానికి ధన్యవాదాలు.

 27. సారంగ ఈ కాలపు సాహిత్యానికి ముఖ్యమైన వేదికలలో ఒకటిగా నిలబడింది. అఫ్సర్ గొప్పకవి మాత్రమే కాదు, సమర్ధుడైన సంపాదకుడు కూడా అని రుజువు చేసింది. పత్రిక ఆపటానికి కారణాలేమో తెలియదు కాని, మీ నిర్ణయాన్నీ, మీ స్పేస్ నీ గౌరవిస్తూనే, మీకు వెసులుబాటు కలిగేలా మార్పు, చేర్పులు చేసి పత్రిక కొనసాగించగలరేమో, లేదా, పత్రిక తొలగించకుండా ఉంచగలరేమో చూడమని కోరుతున్నాను. సారంగ రూపంలో మీరూ, మీ మిత్రులూ చేసిన సాహిత్యసేవకు ధన్యవాదాలు.

 28. అయ్యో!

 29. kurmanath says:

  అయ్యో .
  ఇది తాత్కాలికం కావాలని కోరుకుంటున్నా. సైట్ మూసెయ్యకండి, దయచేసి.

 30. N Venugopal says:

  అయ్యో, అన్యాయం….

 31. అన్యాయం. త్వరలోనే మళ్ళీ మోదలవ్వాలని ఆశిస్తూ

 32. ఇక సెలవ్.
  సరే. మంచి, చెడూ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారు. ప్రత్యామాయ పద్దతులు చూసుకోవాలిగదా! ఒకటా, రెండా? నాలుగేళ్ల కృషి. వారం వారం, ప్రతివారం వెలువరించారు. నాలుగేళ్ళ సాహిత్యం. విలువైన అక్షరానికి ఇవ్వాల్సిన విలువ ఇది కాదేమో. అచ్చు పుస్తకాలు పత్రికలు కావచ్చు మరోహటి కావచ్చు ఈ రోజున అచ్చైనదాన్ని కానిదాన్ని డిజిటైజ్ చేస్తున్నప్పుడు, వెబ్‌జైన్‌ని ఎవరికి అందకుండా అలా ఆకాశంలోకి ఒంపేస్తాననడం సరి కాదేమో! ఒకళ్ళు కాకపోతే నలుగురూ నాలుగు చేతులేస్తే మరొక సర్వర్ మీదన్నా ఆ సాహిత్యం అందరికి అందుబాటులో ఉంచవచ్చు. అలా కాదు కూడదంటే, నిర్ద్యాక్షిణ్యంగా ఆ నీరోలాగా తగలబెట్టడమే అయితే…చరిత్ర క్షమించదు. I am sorry Afsar, Raj. The reader too has a stake here! You simply cannot ignore her.

 33. విలాసాగరం రవీందర్ says:

  సారంగ పత్రిక ఆగిపోతందంటే బాధగా ఉంది సార్. నెల పత్రిక లా అయినా కొనసాగించండి.

 34. లాస్య ప్రియ says:

  ఊహించలేదు మాష్టారు. ఒక మంచి సాహిత్య పత్రికను ఇలా మధ్యలో ఆపెయ్యటం మీకు సమంజసం కాదు. ఎన్నో సాహితీ ప్రక్రియల్ని పరిచయం చేసి, మమ్మల్ని ఒక రకంగా ఎడిక్ట్ చేసి, ఆకలేస్తున్న పసి హృదయాల్ని అర్థం చేసుకోకుండా అలమటించేలా చేస్తున్నట్లుగా మీకనిపించటం లేదూ … పక్ష పత్రిక గానో, మాస పత్రికగానో మార్చండి మాష్టారు. ప్లీజ్ సారంగను మాకు దూరం చేయవద్దు.

 35. Kunaparaju Kumar says:

  తప్పక తిరిగి Vasthu Dane aasatho

  Kunaparaju Kumar

 36. Mahendra Kumar says:

  ప్రతీ వారం సారంగ చదివితే సమకాలీన ప్రపంచంతో పెనవేసుకున్న అనుభూతి ఉండేది , సెలవుదీస్కోవడానికి కారణాలేవైనా , మళ్ళీ మీ ముందుకు వస్తామన్న నమ్మకంతో సెలవు అన్నారు కాబట్టి ఎదురు చూస్తూ ఉంటాము , నేను నా లాగా ఎందరో…

 37. సారంగ తీసుకున్న ఈ నిర్ణయం బాధాకరంగా ఉంది.

  మీరు రచననీ, రచయితనీ గౌరవించారు. సందర్భానికి తగిన రచనలకు చోటునిచ్చారు. మీకున్న పని ఒత్తిళ్ళ నడుమ ఈ పనులన్నింటినీ సమర్ధంగా చేయగలిగారు. అయితే

  అనీల్ అట్లూరి గారంటున్నట్లుగా కనీసం,ఈ నాలుగేళ్ళ సాహిత్యాన్ని భద్రపరిచే విషయం గురించయినా
  మీరు మరోసారి ఆలోచిస్తే బాగుంటుంది

 38. Venu udugula says:

  ఇక సెలవు అనే మాట వినగానే…. ఎవరో పోయినట్టుగా ఉంది. ఉన్న ఒక్క సారంగ కూడా దూరం ఐతే….

 39. Kcube Varma says:

  ఇది నిజంగా అన్యాయమే. ఈ సంక్షుభిత జంక్షన్లో మీరి నిర్ణయం తీసుకోవడం ఒక్కసారిగా కలచివేసింది. మరల వస్తారన్న హామీ ఇస్తూనే దీనిని మూసివేసే నిర్ణయం కూడా దారుణం. దీనినిలా ఉండనివ్వండి. రచనలను దాచుకునే అవకాశం అందరికీ వుండకపోవచ్చు. అయినా మీరీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారన్న చిగురాశ ఎక్కడో కదులుతూ వుంది. దయతో పునరాలోచిస్తారని..

 40. Madhu Chittarvu says:

  You did great work these last four years.I read some wonderful Telugu literature and fearless discussions and reviews columns.What will happen to all this valuable articles and stories.They will simply disappear into cyberspace.I undersrand you mayhave problems but all this seems unfair.

 41. Krishna Veni says:

  But why? Hope it is only temporary and your weekly is not going to shut down forever. I subscribed for saranga ans so, never missed reading a single issue from the time, I got to know about it’s existence
  My 1st story was accepted by saranga and I will always remember it.
  Thank you very much.
  But, please do reconsider your decision.

 42. dasaraju ramarao says:

  అయ్యో ,నమ్మబుద్ది కావడం లేదు.

 43. kothapalli ravibabu says:

  చాలా బాధగా ఉంది ఇక ముందు saarnga సౌజన్యంతో అని ప్రజాసాహితీలో ప్రచురించ డానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఎవరిబాధ వారిది.
  If Winter comes can be Spring far behind ?

 44. vanivenkat says:

  అయ్యో …చాలా బాధగా వుంది …నేను ఇష్టంగా చదివే మ్యాగ్జైన్ సారంగ ఒక్కటే ..మళ్ళీ రావాలని ఆకాంక్షిస్తున్నాను

  వాణి

 45. Very Sad News

 46. కె.కె. రామయ్య says:

  సారంగ, తెలుగు సాహిత్యానికి సంబందించిన ఒక అంతర్జాల పత్రిక మాత్రమే కాదు. సమకాలీన సమాజంలోని అనేక సమస్యలకు, వాటిపై జరుగుతున్న పోరాటాలకు బాసటగా నిలిచి, ప్రగతిశీల శక్తుల గొంతు వినిపిస్తున్న వేదిక. వటవృక్షంలా ఎదుగుతున్న దీన్ని అర్ధాంతరంగా నిలిపివేసే అధికారం మీకెవరిచ్చారు ? ఏ కుట్రలకు, ఏ వత్తిళ్లకు తలవగ్గుతూ ఈ నిర్ణయం తీసుకొబండిందో వివరణలు, సంజాయిషీలు ఇవ్వవలసినదిగా మేము డిమాండ్ చేస్తున్నాము.

  అమెరికా దేశంలో ఉంటున్న సంపాదక వర్గంలోని వారికి … ఆదేశ న్యాయ సూత్రాల ప్రకారం పత్రికను ఇలా నడపటం పర్మిసిబుల్ కాదంటే, పత్రికను విజయవాడ, ఖమ్మం, హైదరాబాదు లాంటి చోట్లకు ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుండి నడపండి. మరో టీమ్ కు అప్పగించి నడిపించండి.

  సంపాదక వర్గంలోని వారికెవరికైనా పత్రిక కోసం సమయం వెచ్చించే వీలు కుదరకుంటే, వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉంటె సమర్థులైన ఇంకొందరు అనునాయులను టీమ్ లో చేర్చుకోవచ్చుఁగా. ఆర్ధిక పరమైన వనరులు కావాలంటే, సారంగ పాఠకులమందరమూ ఉడతా భక్తిగా మాకు చేతనైన సాయం చేయగలము. వారం వారం పత్రిక తీసుకు రావడం ఏంతో శ్రమతో కూడిన విషయమే. నిజమే. పోనీ పక్షపత్రిక గానో మాసపత్రికగానో అయినా నడవ నియ్యండి.

  అంతే కానీ నమ్ముకున్నోళ్లను నట్టేట్లో వదిలిపెట్టకండి, దయచేసి.

  ( సారంగా! రాస్తున్న పెన్నును లాగేసుకుంటే – చదువుతున్న పుస్తకం లాగేసుకుంటే – పలుకరించి పంచుకొనే మిత్రున్నిలాగేసుకుంటే – నువ్విచ్చినవన్నీ నువ్వే లాగేసుకుంటే – నువ్వే రానంటే.. భారంగా! ~ బమ్మిడి జగదీశ్వరరావు )

 47. ఏమిటీ ఉరుముల్లేని పిడుగు! ఈ వేదిక అవసరమైనది. ఈ కాలానికి మరింత అవసరమైనది.

 48. Venkateshwarlu says:

  నాలుగు సంవత్సరాలపాటు, క్రమం తప్పకుండా నిబద్దతతో , అంకితభావం తో పత్రికను తీసుకురావడం నిజంగా చాలా గొప్ప విషయం. ఈ విషయంలో పత్రికా టీం సభ్యలకు కు వందనాలు. భవిష్యత్ లో మీరు ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. మీరు అకస్మాత్తుగా ఆపారని, నేను మిమ్ముల్ని అనడం అంత బాగుండదేమో? ఎందుకంటే, పత్రిక ను నాలుగు సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా మీరు తీసుకరావడానికి ఎంతకష్టపడ్డారో అర్థం చేసుకోవాలి. ఈ ప్రయత్నం చిన్న విషయం కాదు. సులభమైన విషయం అసలే కాదు. మోసే వారికి దాని బరువు తెలుస్తోంది. బయటి నుండి అనడం చాలా సులభం. ఆచరించడం అతి కష్టమైన విషయం. మీ నుండి నేర్చుకోవాలసింది ఎంతో ఉంది అని అనుకుంటున్నాను. మీ ప్రయత్నం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.

 49. K SANTHAIAH says:

  దగ్గరి మిత్రుణ్ణి కోల్పోయినట్టుంది

 50. అయ్యొయ్యో . అబ్బా. చాలా బాధగా వుంది. మీ ఇబ్బందులు మీకుండచ్చు కానీ ఇదో పెద్ద అనుకోని అశనిపాతం లా ఉంది. సారంగలో ఉన్న కథలూ వ్యాసాలూ,ఇతర ప్రక్రియలూ చాలా పెద్ద రిసోర్స్ మెటీరియల్ కదా రచయితలకూ చదువరులకూ సాహిత్యాభిలాషులకూ… వెబ్సైట్ కూడా ఎత్తేస్తానంటున్నారే … ఎందుకూ ? వేరెక్కడికైనా బ్లాగుల్లోకి మార్చచ్చు గా ? అందరికీ, ముందు తరాల పిల్లలకి అందుబాటులో వుంటుంది గదా? విత్త సహాయం అవసరమైతే క్లౌడ్ సోర్సింగ్ చేయచ్చేమో కదా. దయచేసి ఆలోచించండి. నాలుగేళ్ల సమిష్టి కృషిని నాలుగు తరాల వరకూ నిలబెట్టండి అంతర్జాలంలో. ప్లీజ్.
  ఒత్తిళ్లకి వొంగకుండా సారంగనే మహాక్రతువుని నిర్వహించి వారం వారం క్రమం తప్పకుండా వెలువరించి సాహిత్య సేవ నిజంగా ఇంతబాగా చెయ్యచ్చని చూపించేరు. మీ కృషి చాలామందికి మార్గదర్శకం.
  సారంగ తెలుగు సాహిత్య ప్రచురణ చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుంది. సందేహం లేదు.
  మీ ముగ్గురికీ హృదయ పూర్వక శుభాభినందనలు.

 51. Rajendra Prasad Maheswaram says:

  సారంగ ను మూసివేయాలని నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. ఇక సెలవు అంటూ చెప్పి మా మనసులను చాలా క్షోభకు గురిచేయడం తప్ప మరేమీ కాదు నిర్ణయాన్ని మరో మారు పునః పరిశీలించాల్సిన ఆవాసం ఇంతేనా వుంది అని నా భావన .. దయచేసి మళ్ళీ ,కనీసం మాసపత్రికగానైనా తీసుకురావచ్చ్చేమో .ఆలోచించండి .. పాఠకులను భాదించకండి.. ఇది ఒక పాఠకుడిగా నా ఆవేదన .. బాధా తప్త హృదయంతో .. రాజేంద్ర ప్రసాద్ మహేశ్వరం , చింతపర్తి , చిత్తూర్ జిల్లా

 52. అన్నవరం దేవేందర్ says:

  బేస్తవారం పొద్దుగాల లేచి చూసేది మొదలు సారంగ నే .అఫ్సరన్న ఎందుకు బంద్ చేసినవే .ఇది నా బాధ కాదు అందరి బాధ .తెలుగు సాహిత్య చరిత్ర లో సారంగ ఒక తరంగం .సారదులందరికీ వందనాలు .మల్లా ఎప్పుడో ఓసారి సారంగ ప్రారంభం కావలె .

 53. తెలుగుబ్లాగుల్లోనూ, సాంఘీక మాధ్యమాల్లోనూ ఒకరమైన bandwagon ధోరణిలో వ్యాసాలొస్తున్న ఈకాలంలో ఒక ప్రత్యామ్నాయ వాణిని ధైర్యంగా వినిపించింది సారంగ. నా భావజాల పరిణామంలో కొందరు సారంగ రచయితలు పోషించిన పాత్ర నేనెన్నడూ మరువలేనిది. Miss you Saranga.

 54. Aruna.Gogulamanda says:

  BuT why sir..we all miss it a lot. The Ed decision is so disheartening.

 55. నాలుగేళ్ల సారంగ ఒక కొత్త నీటి పాయ. దప్పిక తీర్చిన చెలిమె. థాంక్యూ సారంగ!

 56. నాగజ్యోతి రమణ సుసర్ల says:

  అఫ్సర్ గారు కారణాలు ఏవైనా మంచి విలువలతో కొనసాగుతున్న సారంగ వీడ్కోలు చెప్పటం చాలా బాధాకరం ……పత్రిక త్వరలో తిరిగి ప్రారంభించబడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ….

 57. B.RAM NARAYANA says:

  Yes,at least,do not remove these four years literature,so that it would be available for readers.

 58. Suparna mahi says:

  …ణో వర్డ్స్…💔

 59. తహిరో says:

  మీ ఆనందమే మా ఆనందం.
  మీ సమస్యలే మా సమస్యలు.
  ఏ సమస్యలూ లేకపోతె సారంగ ఆపరని తెలుసు.
  – అర్థం చేసుకున్నాను.
  ఎందుకంటె, మీ శ్రేయోభిలాషిని కాబట్టి .

 60. గురూజీ.. ఇది అన్యాయం. మీరు చెప్పినట్లుగానే ఎంతోమంది రచయితలకూ, కవులకూ ‘సారంగ’ ఆలంబన అయ్యింది. చుక్కానిగా మారింది. మంచి రచనలకు అండగా నిలచింది. ‘సారంగ’లో తమ రచన/కవిత పడిందనే గౌరవాన్ని ఇచ్చింది. మరెంతో మందిని అలాంటి ఆసరాను కల్పిస్తుందని అనుకుంటే ఉరుముల్లేని పిడుగులా.. ఇలా అర్ధాంతరంగా నిష్క్రమిస్తుండటం చాలా చాలా అన్యాయం. దానికి కారణాలేమిటని అడగను. కారణం లేకుండా ఇంతటి పెద్ద నిర్ణయం తీసుకోరు కదా. వ్యక్తిగతంగా నేను సారంగ రచయితను అని కాకుండా దాని పాఠకుడిగా ఎక్కువ ఆనందాన్ని పొందాను. మీరన్నట్లే ఇది తాత్కాలిక నిష్క్రమణ అనీ, విరామం మాత్రమేననీ నమ్ముతున్నా. వీలైనంత త్వరగా మళ్ళీ సారంగ మా ముందుకు వస్తుందని ఆశిస్తున్నా.

 61. దుప్పల రవికుమార్ says:

  సారంగ మరి ఉండదంటే చాలా బాధగా ఉంది. అయితే సాహిత్యం అంటే తన జీవితం కంటే ఎక్కువ ప్రేమ చూపించే అఫ్సర్, కల్పనలు మరో మరింత మెరుగైన సాహిత్య ప్రయోగంతోనే వస్తారని ఎదురుచూస్తూ..

  దుప్పల రవికుమార్

 62. మీ-మన నిష్క్రమణ చాల బాధాకరం….
  కాని అసలు సమస్యేమిటో తెలుపలేదు??…
  అది ఏమైన దాన్ని పంచుకోడానికి మేం సిద్ధం… ఇది మనసుల వెట్టుకొండ్లి..

 63. దేవరకొండ says:

  సాహిత్య పత్రికల మనుగడ ఇలా సందిగ్ధమేనా ! ఆర్ధిక, సంస్థాగత కారణాల వల్ల భారతి వంటి పత్రికలు మూతబడ్డాయి. ఈ రోజుల్లో కూడా సంస్థాగత కారణాలైతే చెప్పలేము కానీ, ఆర్ధిక కారణాలైతే సారంగ విషయంలో అలా జరిగే వీలు లేదు. ఇది జీర్ణించుకోలేని నిర్ణయం! అత్యంత బాధాకరం! మళ్ళీ ఇలాంటి పత్రికను చూసే ఆశ కనుచూపు మేరలో లేదు! Let good sense prevail !

 64. అనుకోలేదేప్పుడూ ..ఇలా! మరెలా ……ఈ నిర్ణయం తాత్కాలికం కావాలని ఆశిస్తూ…

 65. మనోజ్ఞ says:

  ఇంత అన్యాయమా? ఇది తప్పదా సర్…..ఈ బాధను భరించవలసినదేనా……😭😭😭

 66. అఫ్సర్ గారికి, నాకు తెలిసి అంతర్జాలంలో ప్రస్తుతం నంబర్ వన్ పత్రిక సారంగ. ఉత్తమ రచనల్ని అందిస్తున్న పత్రిక. నాబోటి చాలామందికి సారంగలో తమ రచన వస్తే గౌరవంగా భావించే స్థాయి కలిగిన పత్రిక సారంగ
  ఇలాంటి తరుణంలో మీ నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మీ కారణాలు మీకు ఉండవచ్చు.
  తెలుగు సాహిత్యరంగానికి మీరు ఇచ్చిన కంట్రిబ్యూషన్ సారంగ కన్న పెద్దదని మాకు తెలుసు.
  వీలైతే ప్రత్యామ్నాయాలు అన్వేషించగలిగితే అది తెలుగు సాహిత్యానికి పెద్ద ఊతం అవుతుందని మాత్రమే ఈ సందర్భంలో చెప్పగలను….
  భవదీయుడు
  బొల్లోజు బాబా

 67. “సారంగా తేరీ యాద్ మే…” అని ఈ సారంగ గురించి పాడుకోవాలనుకోవడం లేదు. ఏదైనా అద్భుతం జరిగితే బాగుండు!

 68. అఫ్సర్ జీ ! మీ నిర్ణయం చాలా బాధాకరం.
  అయినా ఈ నిర్ణయం వెనుక ఎంతగా మదనపడి ఉంటారో..!
  ఇన్నాళ్లు మీరు, మిగతా సారంగ టీమ్ పడిన శ్రమ, వెచ్చించిన సమయం, తెలుగు సాహిత్యానికి చేసిన సేవ, కొత్త రచయితలకు అందించిన చేయూత అంతా ఇంతా కాదు.. పత్రికలకు ప్రత్యామ్నాయంగా ఒక వేదికను ఇన్నాళ్లు నిలబెట్టడం మాటలు కాదు.. మీకు సలాములు.. షుక్రియాలు..!
  మీ మరో మంచి నిర్ణయం కోసం ఎదురుచూస్తూ…

 69. datla devadanam raju says:

  చాలా బాధగా ఉంది. ఒకప్పుడు ఒకానొక డిసెంబర్ నెలాఖరున ఒక దినపత్రిక ఆగిపోయింది.రాత్రంతా కలత నిద్ర. ఇప్పుడూ అంతే. అరచేతిలో జీవ చైతన్యంతో సాహిత్యం చదువుకునే వెసులుబాటు కోల్పోవడం విచారకరం.వృత్తి వ్యాపకాల్లో సారంగ నిర్వహణ కష్టం కావచ్చు. ఎంతో మంది యువరచయితలు ఇందులోని అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఒక వేదిక కూలిపోవడం అంటే మెట్లు ఎక్కే చూపును పోగొట్టుకోవడమే.పోనీ నెల కాదూ అనుకుంటే రెండు నేలలకోసారి అయినా బతికించే వీలుంటే చూడండి, అఫ్సర్. పధ్ధతి ఉండక పోదు ఇన్నాళ్ళ సారంగ ఒకచోట భద్రపరచే ప్రయత్నమూ చేయండి.

 70. ప్ల్స్..అఫ్సర్..గారు..సారంగణపవద్దు…సాహిత్యంloEppuepudy .అడ్డుగ్గులువేస్తున్నమల్లనీటివారికి..అండగా..నిలుస్తారనిఅస్సపడుతునం..plz

 71. ఇక సారంగ రాదంటే బాధగా ఉంది.
  మీ నిర్ణయాన్ని గౌరవిస్తూ..త్వరలో మా ముందుకి వస్తారని ఆశిస్తున్నాను.

 72. భాస్కరభట్ల says:

  ఒక మంచి సాహితీ మిత్రుడి కరచాలనానికి దూరమయిపోతున్న బాధ !!

 73. నాట్ ట్రూ —జస్ట్..ఫార్ కామెంట్స్. కోసం
  సింపతీ. కోసం
  —————————-
  Reddy

 74. Saaranga rakapovatam nijamgaane badagaa undi. Saranga kosam eduruchustunna sahitee priyulantaa valla abhiprayalanu panchukune vedika kosam vetukutunnaru. Kani aa vedika koodaa saranga ne kadaa

 75. కృష్ణ జ్యోతి says:

  ఈ గురువారమే సారంగ చివరి సంచిక. మార్చి 30 తరవాత సారంగ వెబ్ సైట్ కూడా పూర్తిగా తొలగిస్తాం. కాబట్టి, మీ రచనలు అన్నీ విడిగా ఈ లోపే డౌన్ లోడ్ చేసుకోండి, ఆ తరవాత అవి కనిపించవు కాబట్టి!
  చరిత్ర ఇలా కాలగర్భంలో, భవిష్యత్తులో ఎవరికీ కనబడకుండా కనుమరుగు కావలసిందేనా?

 76. రాముడు says:

  కొందరు నిందలతో, కొందరు అభిమానంతో, కొందరు దిక్కారంతో ఒకటే ప్రశ్న అడిగేరు. కానీ సంపాదకులు సహేతుకంగా ఎందుకు పత్రిక మూసేస్తున్నారో చెప్తే సమంజసంగా ఉండేదేమో..

 77. Aranya Krishna says:

  సారంగని ఒక సాహిత్య వాయిద్యం గా చేసి మా చేతుల్లో పెట్టారు. ఇప్పుడు మూగపోవటమే కాదు మాయమై పోతుందంటే బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా మాకంటే మీరే ఎక్కువగా బాధ పడి ఉంటారు. ఎందుకంటే సారంగ మాకు నేస్తమైతె మీకు బిడ్డ. మమ్మల్ని అలరించటానికి ఆ బిడ్డకి మీరెన్నో అలంకరణలు చేసారు.

  నేనిక్కడ పంచుకోవాల్సింది ఉంది. నేను మళ్ళీ తిరిగి కవిత్వంతో కరచాలించటంలో సారంగ పాత్ర చాలా ఉంది. ఈ విషయంలో నేను సారంగకి ఎప్పటికీ ఋణగ్రస్థుణ్ణే. నా కొత్త కవితాసంకలనం “కవిత్వంలో ఉన్నంతసేపూ” లో అఫ్సర్ కి అందుకే కృతజ్ఞతలు ప్రకటించాను కూడా. నేను మళ్ళీ రాయటం మొదలుపెట్టానో లేదో అఫ్సర్ తనంత తాను నన్ను పలకరించి సారంగకి రాయమని ఆహ్వానించారు. అప్పుడెవరో చెప్పారు “సారంగ”లో రావటం మామూలు విషయం కాదని. ఒకప్పుడు “భారతి” పత్రికకి అంతటి పేరుండేదేమో! మనం మరో వెబ్ మాగజైన్ వంక కూడా చూడాల్సిన అవసరం లేని స్థాయిలో సారంగ నిర్వహణ ఉండేది. అత్యున్నత జర్నలిస్టిక్ ప్రమాణాలతో వెలువడ్డ సారంగ పాత సంచికలు చదవటం నాకో వ్యసనమైంది. ఎన్నో ఆర్టికల్స్ నచ్చాయి. వాటి మీద వ్యాఖ్యానాలు చేయటం కన్నా ఆ సమయంలో మరో రచన చదవొచ్చన్న స్వార్ధం ఉండేది నాలో. రచయితల వారీగా రచనలు ఎంచుకునే విధానం ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. ఎన్నొ చర్చలు జరిగాయి. నేను కూడా కొన్నిచోట్ల, కొన్నిసార్లు హడావిడి చేసాను. చర్చలు చేసే విధానం కూడా నేర్చుకున్నాను సారంగ ద్వారా. అది నా ఇతర ఫేస్బుక్ రచనల విషయంలో గొప్పగా ఉపకరించింది. ఒక్క సంవత్సరన్నర కాలంలో సారంగ లో 7 కవితలు, 7 సమీక్షలు రాసాను. ఇది నాకు గర్వకారణం. నిజాయితీగా చెప్పాలంటే నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన అంశం కూడా. కలాం మీద, అరుణ్ సాగర్ మృతి మీద, మల్కన్ గిరి ఎన్ కౌంటర్ మీద రాసిన నా రచనలు ఒక్క గంట కూడా ఆలస్యం చేయకుండా ప్రచురించటం నన్ను చకితుణ్ని చేసింది. ఇలాంటి ఎన్నో సందర్భాల్లో ఇతర రచయితల రచనల్ని ప్రచురించటంలో ఆయా విషయాల పట్ల సారంగ టీం కన్సర్న్ కి నేను జేజేలు పలకకుండా ఉండలేను.

  ఒక యుద్ధనౌకని సముద్రంలోకి డీకమిషన్ చేసినట్లు ఇప్పుడు సారంగని ఉపసంహరిస్తున్నాం అంటున్నారు. సారంగ అనే సాహిత్య యుద్ధనౌక మీద ఎగరేసిన ఎవరి జెండాల్ని వారే వెనక్కి తీసేసి భద్ర పరుచుకోమంటున్నారు. బాధాకరం. అశనిపాతం. కనీసం ఆయా రచనల్ని అలా ఉండనిస్తే ఒక గొప్ప సాహిత్య నిధిగా, భావితరాలకు రిసోర్స్ మెటీరియల్ గా ఉండేను కదా నా ముగ్గురు మిత్రులారా! ఇది నా విన్నపం. ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించండి.

  ఏమోలే! మీ ఇబ్బందులు ఏవో మీకుంటాయి. కానీ మాకు మాత్రం ఇది తెలుగు సాహిత్య రంగం మీద విరుచుకుపడ్డ డీమానిటైజేషన్!

 78. ఎ కె ప్రభాకర్ says:

  అన్యాయం . బొటనవేలు తెగిపోయినట్టుంది… గొంతుకీ గుండెకీ దారి మూసుకుపోయినట్టుంది…. ఇదేం బాగోలేదు అఫ్సర్ ; యింకో మాట చెప్పండి.ప్లీజ్ !
  నాలుగేళ్ళు సారంగ ని సాది సంరక్షణ చేసిన అఫ్సర్ కల్పనా రాజ్ ల కృషి మర్చిపోలేం.

 79. vamseekrishna says:

  సారంగ ఇక రాదు అంటే బాధ గా వుంది . నిర్వాహకులు గా మీ ఇబ్బందులు మీవి
  నా రచనలు కూడా కొన్ని ప్రచురించినందుకు మీకు కృతజ్ఞతలు

  వంశీకృష్ణ

 80. రాఘవ says:

  ” …….. ……..”

 81. Narayanaswamy says:

  ఏమైంది ఎందుకీ హఠాన్నిర్ణయం ఏమీ పాలుపోవడం లేదు దుఃఖంగా ఉంది ఏం చెయ్యగలం సారంగా ఆగిపోకుండా ఉండడానికి?

 82. రామచంద్ర శర్మ గుండిమెడ says:

  సారంగ చదివే వాళ్లలో నేనొకడిని… ఆపేస్తున్నాం మాట బాధ కలిగిస్తోంది… త్వరలో సారంగ ను మళ్లీ నడపగలరని ఆశిస్తున్నాను అఫ్సర్ గారూ

 83. ఇక సారంగ రాదంటే బాధగా ఉంది.

 84. RAJESH YALLA says:

  సారంగ అంటే అదో సన్నిహితమైన పదం! నాలాంటి కొత్త కథకులను ప్రోత్సహించడం, అప్పుడప్పుడూ పలకరించి మరీ రచనలను ఆహ్వానించడం, ఇదంతా ఎప్పుడూ కొనసాగే ప్రక్రియే అని ఆశించడం దురాశ అవుతుందని తెలియడం నిరాశగా ఉంది!
  ఈ విరామం విరామచిహ్నమే (,) కావాలని మనసారా కోరుకుంటున్నాను.

 85. ఇదేం బాగా లేదు. ఉన్నట్లుండి ఇంత షాకిస్తే ఎలా? ఇన్నేళ్ళుగా మంచి సాహిత్యానికి వేదికగా నిలిచిన సారంగ.. ఆగిపోతుందంటే.. నిజంగా బాధగా ఉంది. వినడానికి మాకే ఇంత బాధగా ఉందంటే.. ఆ నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులు మిమ్మల్ని ఎంత కష్టపెట్టాయో. ఏమైనా.. ఇది ముగింపు కాదు, విరామం మాత్రమే. అంతేకదా!

 86. raamaa chandramouli says:

  అలసట ఎరుగని ఆఫ్సర్, కల్పనా.. ఎందుకిలా అర్ధఅంతరంగా ప్రయాణాన్ని విరమించి.. నిష్క్రమణ.?

  ఒక నక్షత్రం రాలిపోయిన వికారానుభూతి.

  కానీ.. మళ్ళీ ఒక మొలక మొలుస్తుంది తప్పక . సృజనకారుడు అచేతనంగా ఉండలేడు.

  – రామా చంద్రమౌళి

 87. allam rajaiah says:

  patrika nadapatamu chalakastamaina పని
  nalugu endlu ennenno kotha రచనలు
  sudheerga prayanamu lo ennenno adugulu
  inka matalu dorakadamuledu

 88. Sudheshna Soma Reddy says:

  సారంగ ఇక రాదు అనుకుంటే చాల బాధగా ఉంది.
  మంచి కథలు చదవాలనే కోరిక ఉన్న నా బోటి వారికి ఇది గుండె పోటుని ఇస్తోంది.
  మళ్ళి సారంగను చూసే భాగ్యం కలిగిస్తారని ఆశిస్తూ న్నాను. ఇంతకాలం అందాల సారంగను అందించినందుకు మీ ముగ్గురికి నా ధన్యవాదాలు
  సుధేష్ణ

 89. Bhavani Phani says:

  చాలా బాధగా ఉంది సర్. ఇలా జరగకుండా ఉండి ఉంటే బావుండేది.

 90. శాంతిప్రబోధ says:

  చాలా అన్యాయం . మా మంచి నేస్తాన్ని మా నుండి దూరం చేయడం. జీర్ణంచుకోలేకపోతున్నా..
  బలమైన కారణం లేకుండా మీరీనిర్ణయం తీసుకోవడం జరగకపోవచ్చు. వీలయినంత త్వరలో మళ్లీ మా ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ.

 91. vivina murthy says:

  Very sorry to hear the news. If you share the Reason for this closure it gives an opportunity to readers and writers to share the burden. Is it financial or human resources or anything else?

 92. శ్రీనివాసుడు says:

  సారంగ సంపాదకులకు,
  ఇక మీకు సలహాయిచ్చే అవకాశం ఇకపైన వుంటుందో, వుండదో అనుకుని ఈ మాట చెబుతున్నాను.
  “టు బి” అనేది ఎంత అద్భుతంగా మీరు చేసారో పైన వ్యాఖ్యానించిన వందమందీ పొగిడారు, మీరు లేకపోతే సాహిత్యస్వరం మూగపోతుందని వాపోయారు.
  అదే సమయంలో “నాట్ టు బి” అనేది, అంటే, ఎలా వుండకూడదో, ఏమి చేయకూడదో, ఏది చేయలేదో, రాజకీయ, ఉద్వేగ, పాలసీ ప్రయోజనాలను ప్రక్కనబెట్టి ఎలా సత్యాన్వేషణవైపు వెళ్ళి రచనలు, వ్యాఖ్యలు ప్రచురిస్తూ పాటుపడాలో మీకు తెలుసుకోవాలనుకునివుంటే నేను చెప్పగలను.
  ఒకవైపే చూడడం కొనసాగిస్తూవుంటే మనకి తత్త్వం బోధపడదు.
  భవిష్యత్తులోనైనా ఆ లోపాన్ని సవరించుకోగలరని ఆశిస్తున్నాను. అలాగాక, మాకు మా పాలసీపట్ల పూర్తి అవగాహన వుందని, అదే సరియైనదని, అంతకంటే మించిన సత్యం మరొకటి లేదని, అదొక్కటే పీడితవర్గాలకు మేలు చూపే మార్గమని త్రికరణశుద్ధిగా మీరు భావిస్తే నా ఈ వ్యాఖ్య ప్రచురించనక్కరలేదు.

 93. దేవరకొండ says:

  దేవుళ్లను ద్వేషించే వాళ్ళు కూడా అంగీకరించే చేదు నిజం ఒకటుంది. లోకమంతా ఉండాలని కోరుకునే అపురూప వ్యక్తులను కూడా అకస్మాత్తుగా కనుమరుగు చేయగల శక్తి దేవుడికే (పోనీ ప్రకృతికి) ఉండడం. అలా చూస్తే సారంగ సంపాదక వర్గం మనుషులు కాదు, దేవుళ్ళే!

 94. Very sad, Afsar bhai. But I would like to know your further ambition…

 95. palagiri viswaprasad says:

  శిశిరం తరలిపోదా! వసంతం రాదా! అయినా ఏదో దిగులు. కారణాలేమైతేనేం, ఒక సాహిత్య పత్రిక ( అది వెబ్ మ్యాగజైన్ అయినా సరే ) నడపడం చాల కష్టమని ఇంకోసారి తెలిసింది.

 96. krishna mohan babu says:

  పిలిచి ప్రోత్సహిచడం ఎవరికి సాధ్యం !? మీరిచ్చిన బలం మమ్మల్ని ఎంత నిలబెట్టిందో మాకే తెలుసు . ఇక మీదట మాకు ఈతోడు ఉండదు అనిపించినప్పుడు దుఃఖం వస్తోంది . మీ అందరికి ఛాయా పక్షాన మా కృతజ్ఞతలు . జీవితాన్ని కాలం నిర్దేశిస్తే కోయల మళ్ళీ కుయాల్సిందే . చకోరాళ్ల ఎదురు చూస్తాం . అఫ్సర్ , కల్పనా , రాజ్ లకు మా ధన్యవాదాలు .

 97. Sivalakshmi says:

  మా సారంగ బృందానికి ఇన్నేళ్ళ కృషికి హృదయపూర్వక అభినందనలు! మీకూ రకరకాల ఒత్తిళ్ళనుంచి కాస్త స్పేస్ ఖచ్చితంగా అవసరం! కానీ మాకు నేరుగా పాతాళంలోకి కూరుకుపోతున్నట్లుంది! అందరి మొత్తుకోళ్ళనూ వినండి.

 98. USHA (URAF) SITA RAMA LAKSHMI P says:

  నేను అనిల్ అట్లూరి గారితో ఏకీభవిస్తున్నాను. కనీసం వెబ్ ని ‘టెంపరరీ’ గా ఐనా ఏర్పాటు చేసుకుంటే బెటర్ కదా.
  ‘ఎమెస్కో’ ప్రచురణ సంస్థ ఇంకొక సంస్థ మూత పడుతుంటే తట్టుకోలేక పుట్టింది. ఆలా ఎవరో… ఏదో…’ సారంగ’ సెలవ్ ని అబద్ధం చేస్తారని ఆసిస్తూ…

 99. padmavangapally says:

  అఫ్సర్ గారు, అనేకానేక సంక్షోభాల సమయంలో అవసరమైన సందర్భంలో మీరిలాంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరం.

 100. ari sitaramayya says:

  పత్రిక నడపడం సులభమైన పని కాదు. మీరు నాలుగు సంవత్సరాలపాటు మంచి పత్రిక నడిపారు.
  అభినందనలు.

  అమెరికా చేస్తున్న యుద్ధాలమీద మంచి కథలు రాలేదని నేను అన్నాను (మరోచోట). సాయి బ్రహ్మానందం గారు రాస్తూ, మంచి కథలు ఉన్నాయనీ, కొన్ని కథలు ఒక సంకలనంలో ఉన్నాయనీ చెప్పారు. ఆ పుస్తకం (Fire and Forget) చదివి సమాధానం రాద్దామని అనుకున్నాను. పుస్తకం తెప్పించుకోవడంలో కొంత జాప్యం జరిగింది. అందువలన తొందరగా రాయలేకపోయాను. ఇప్పుడు సారంగా ఆగిపోతుందని తెలిసింది. నేను ఇంకా పుస్తకం చదవడం పూర్తికాలేదు.

  సారంగ ఇక రాకపోతే నేను miss అయ్యే వారిలో ముఖ్యులు కల్లూరి భాస్కరం గారు. నేను ఇది వరకు వారి రచనలు చదవలేదు. సారంగ లో చదివాను. ముఖ్యంగా నాకు వారి వ్యాఖ్యానాలు ఇష్టం. ఆయన వివరంగా, భావోద్వేగాలను పక్కనబెట్టి, ఆలోచించి రాస్తారు.

  • కల్లూరి భాస్కరం says:

   సీతారామయ్యగారూ…మీరు నా గురించి రాసిన వాక్యాలకు ధన్యవాదాలు. నేనూ మిమ్మల్ని మిస్ అవుతున్నాను. మీతోపాటు ఇంకా చాలామందిని. సారంగలో నేను రాస్తూ వచ్చిన ఈ నాలుగేళ్లలో నాకు ఇంతకు ముందు తెలియని మీలాంటి ఎంతోమంది పేర్లు పరిచయమయ్యాయి. వారి ప్రతిభావ్యుత్పత్తులు, ఆలోచనా నైశిత్యం కొత్త ఎరుక కలిగించాయి. ఎనభై దశకం ప్రారంభంలో రాజమండ్రి సాహితీవేదికతో నా అనుబంధం తర్వాత, సారంగతో ఈ నాలుగేళ్ల అనుబంధం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయి!
   సారంగలో నా పురా’గమన’ వ్యాసపరంపర సందర్భం చిరస్మరణీయం. వాటిని మొదటి నుంచి చివరివరకూ చదువుతూ స్పందిస్తూ వచ్చిన ఆ సబ్జెక్టుపై అభిరుచి, ఆసక్తి కలిగిన చిన్న పాఠకబృందం నాకు ఏర్పడింది. వారిచ్చిన ఉత్సాహమే నా వ్యాసాలకు ఇంధనమై నడిపించింది. ప్రసాద్ చరసాల, పి. మోహన్, అరిపిరాల సత్యప్రసాద్, మంజరి లక్ష్మి, ఎన్. వేణుగోపాల్, వురపుటూరి శ్రీనివాస్, సుందరం. డా. విజయ్ కోగంటి, భవాని ఫణి, పి. లలిత, పవన్ సంతోష్, సాయి కిరణ్ కొండముది, అరుదుగా వివినమూర్తి, అట్టాడ అప్పల్నాయుడు, అరి సీతారామయ్య, రమాసుందరి…ఇప్పటికిప్పుడు గుర్తొచ్చిన కొన్ని పేర్లు ఇవి. ఎవరినైనా విస్మరించి ఉంటే క్షంతవ్యుణ్ణి. మొదట అభిమానించి ఆ తర్వాత జారిపోయినవారూ వీరిలో కొందరు. ఎన్. వేణుగోపాల్, వివినమూర్తి, అట్టాడ తప్ప మిగిలినవారందరూ నాకు కొత్తవారు. వీరందరినీ మిస్ అవుతున్నాను.
   నిజంగా మిస్ అవుతున్నామంటారా? కాదేమో! మరో వేదిక మీద కలసుకుంటూనే ఉంటాం.

   • కల్లూరి భాస్కరం says:

    పెద్ద మరుపు…నా సాహితీ వేదిక మిత్రులు రాణీ శివశంకరశర్మగారిని కూడా.

   • సుందరం​​​​​ says:

    శ్రీ భాస్కరం గారూ,
    మీ ‘పురాగమనం’ తో గమించిన వ్యక్తుల్లో నా పేరు కూడా ఉండటం ఒక మంచి అనుభూతి. ఇక ‘సారంగ’ రాదన్న నిజం ఎంత నిష్టూరమైనా భరించక తప్పటం లేదు… కానీ ‘సొరంగం ఆవలివైపు కనిపించే వెలుతురు’ లా ఉన్న మీ…
    ​>>”​నిజంగా మిస్ అవుతున్నామంటారా? కాదేమో! మరో వేదిక మీద కలసుకుంటూనే ఉంటాం​”<<​ అన్న వాక్యాలు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
    దయ​చేసి ఆ మరో వేదిక వివరాలు తెలుపగలరు.

    ధన్యవాదాలతో

    సుందరం​​​​​

  • ari sitaramayya says:

   Fire And Forget లో మొత్తం ౧౫ కథలున్నాయి. నేను ౮ చదివాను. ఇక చదవడం ఆపేశాను.
   ఇందులో కొన్ని మంచి కథలు ఉన్నాయి. అంటే కథనం బాగుంది. కథలు తెలుగు కథలకంటే భిన్నంగా ఉన్నాయి. సంభాషణలు తక్కువ, action ఎక్కువ. పాత్రల స్వభావాలను చెప్పడం ద్వారా కాకుండా చూపించడం ద్వారా వ్యక్తం చెయ్యాలనే సూత్రాన్ని అన్ని కథల్లోనూ రచయితలు పాటించారు.
   కానీ ౧౫ సంవత్సరాలుగా ఆప్ఘనిస్తాన్, ఇరాక్ లలో యుద్ధం జరుగుతుంది. ఆ దేశాలు దాదాపు పూర్తిగా నాశనం అయ్యాయి. దానికి కారణం మనం అన్న ఆలోచన ఈ కథల్లో ఒక్క పాత్రకు కూడా రాలేదు. మనం ఇక్కడకు ఎందుకు వచ్చాము, ఇక్కడ ఎందుకు యుద్ధం చేస్తున్నాము అన్న ప్రశ్న ఒక్క పాత్రకు కూడా రాలేదు. కానీ ప్రజల్లో ఈ విషయాల మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చ ఈ పుస్తకంలోకి రాకుండా జాగ్రత్తపడింది ఎవరు? రచయితలా? ఎడిటర్లా? కథలను రాజకీయ ప్రయోజనాలకు పనిముట్లుగా వాడుకోవడం తెలుగులో ఎక్కువ. ఈ అమెరికన్ కథల్లో ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకుండా ఉండటానికి జాగ్రత్త పడ్డట్లు కనిపిస్తుంది. ఇదికూడా కథల్లో రచయితలు జోక్యం చేసుకోవడమే కదా? లేక అలాంటి కథలు రాకుండా ఉండటానికి కారణం ఎడిటర్లు పాటించే నియంత్రణ కావచ్చు.

   • వివిన మూర్తి says:

    సర్ రచయితది సహజ స్పందన అయీ అవకాశం హెచ్చు. ఎడిటర్ కి భయం, భద్రత దృష్టి ఉండడానికి అవకాశం హెచ్చు. కనక ఎడిటింగ్ లోనే జాగ్రత్త పడటానికి అవకాశం హెచ్చు. పోతే మిస్సింగ్ సినిమా వంటివి మీకు గుర్తుండే ఉంటాయి. రాజ్యం పౌరులకు ఏం తెలియొచ్చు ఎంతవరకూ తెలియొచ్చు అనేదానిమీద దృష్టి పెడుతుంది. తెలివైనరాజ్యాలలో చాలా సుకుమారంగా శస్త్రచికిత్స జరిగితుంది. వ్యక్తి సహజ స్పందనలకి అన్ని రాజ్యోలలోనూ రాజ్యం జోక్యం ఉంటుంది. అవి కుడివైనా ఎడమవైనా సరే

   • కల్లూరి భాస్కరం says:

    అరి సీతారామయ్యగారూ, ఆయనకు స్పందిస్తూ వివినమూర్తిగారు నా ఉద్దేశంలో ఒక రచనకు సంబంధించిన మౌలికమైన ఆసక్తికరమైన చర్చను ముందుకుతెచ్చారు. ‘సారంగ’ సెలవు తీసుకున్న కారణంగా ఈ స్పేస్ లో ఇంత బరువైన లోతైన చర్చను కొనసాగించి సంపాదకవర్గాన్ని ఇబ్బంది పెట్టడంలో ఔచిత్యం, న్యాయం లేదని గుర్తిస్తూనే ఉండబట్టలేక నాలుగు మాటలు…
    1. అఫ్ఘనిస్తాన్, ఇరాక్ లలోని యుద్ధం గురించి ప్రజలలో చర్చ జరుగుతుంది కానీ, ఆ చర్చ పుస్తకంలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నది రచయితా, ఎడిటర్లా అన్న సందేహాన్ని సీతారామయ్యగారు వ్యక్తంచేశారు. ‘ఈ అమెరికన్ కథల్లో ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకుండా ఉండటానికి జాగ్రత్త పడ్డట్లు కనిపిస్తుంది’ అని అన్నారు. ప్రజల్లో చర్చ జరిగినప్పుడు, ఆ చర్చ ప్రభుత్వంపై విమర్శ కూడా కాగలినప్పుడు, అది సృజనాత్మక రచనల్లో వ్యక్తం కావడంలో ఇబ్బంది ఏముంటుంది? నేను గమనించినంతవరకు, అఫ్ఘనిస్తాన్, ఇరాక్ లలో అమెరికా పాత్రపై అక్కడి ప్రజల్లో తీవ్ర విమర్శ ఉండడమే కాకుండా అది పత్రికలు, ఇతర మాధ్యమాలలో వ్యక్తమవుతూనే వచ్చింది. ఆ విమర్శ సృజనాత్మక రచనల్లో వ్యక్తం కాకపోతే ఎందుకు వ్యక్తం కాలేదన్నది పరిశీలించాల్సిన ఆసక్తికరమైన ప్రశ్న. దానిని ప్రభుత్వ నిర్ణయాలకు విమర్శించకుండా జాగ్రత్త పడడంగా ఎంతవరకు భావించగలం? అందుకు వేరే కారణాలు ఉండవచ్చా? నాకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, కథకానీ, మరొకటి కానీ, ఒక రచన దగ్గరికి వచ్చేటప్పటికి వస్తురూపాల విషయంలో ఏ దేశానికి ఆ దేశం తనదైన ఒక మోడల్ ను అనుసరించడం. రెండోది, వ్యక్తులకు ఉన్నట్టే దేశాలకు కూడా తనదైన ఒక సగటు భావజాలం ఉంటుంది. ఆ భావజాలం అలా ఉండడానికి కారణాలు దాని చరిత్ర లోతుల్లో ఉంటాయి. మిగతా అనేక దేశాలతో పోల్చితే, అమెరికా కేవలం నాలుగైదు వందల సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉన్న దేశం. అక్కడి జనం స్థానికుల పట్ల అమానుషాలు సాగించే కావచ్చు, సుఖ సంపదలతో కూడిన ఒక భద్రజీవితాన్ని సాధించుకున్నారు. వారి సగటు భావజాలంలో ఆ భద్రజీవితం ఒక ప్రధానమైన భాగం. న్యూయార్క్ లో జంట పేలుళ్లు మొదలైన పరిణామాలు ఆ భద్రజీవితానికి సవాళ్ళుగా మారి ఒక అంతర్జాతీయ శత్రువును సృష్టించాయి. ఆ శత్రువుతో పోరాటం మేరకు ప్రభుత్వాలతో సగటు అమెరికా పౌరునికి ఎలాంటి పేచీలేదు. కాకపోతే పోరాట ఫలితాలు, వ్యూహాలు, నష్టాలు మొదలైన వాటిపై మాత్రం విమర్శ ఉంటుంది. సీతారామయ్య గారు ప్రస్తావించిన కథల్ని ఈ రెండు కోణాలనుంచీ చూస్తే ఎలా ఉంటుంది?
    2. “కథలను రాజకీయ ప్రయోజనాలకు పనిముట్లుగా వాడుకోవడం తెలుగులో ఎక్కువ” అన్నది సీతారామయ్యగారి మరో వ్యాఖ్య. ఇది కూడా లోతైన చర్చకు అవకాశమిచ్చే వ్యాఖ్య. ‘రాజకీయ ప్రయోజనాలు’ అనే మాటను ఆయన ఎంత లోతైన అర్థంలో వాడారో తెలియదు కానీ, ఇక్కడ కొన్ని ప్రశ్నలు వస్తాయి. రాజకీయ ప్రయోజనాలు అంటే రాజకీయ పార్టీకి చెందిన ప్రయోజనాలా, లేక రాజకీయభావజాలానికి చెందిన ప్రయోజనాలా? ఇంకొంచెం లోతుకు వెళ్ళి, మనిషి తాలూకు రాజకీయ అస్తిత్వ ప్రయోజనాలా? ఏ సృజనాత్మక రచన అయినా రాజకీయ ప్రయోజనానికి అతీతంగా ఉంటుందా, ఉండగలదా? ఇలా పరిశీలించుకుంటూ వెడితే చర్చ చాలా లోతుల్లోకి విస్తృతిలోకి వెళ్లిపోతుంది. కనుక క్లుప్తంగా చెబితే, మనిషి తాలూకు సామాజిక సాంస్కృతిక ఆర్థిక అస్తిత్వాలకు అడుగున ఆధారభూమికగా ఉండేది రాజకీయఅస్తిత్వమే. మనిషి మౌలికంగా రాజకీయజీవి. కనుక ఏ మినహాయింపూ లేకుండా సృజనాత్మక సాహిత్యంతో సహా అక్షరరూపం ధరించి జనం మధ్యకు వచ్చే ప్రతిదీ రాజకీయప్రయోజనం మిళితమైనదే. రాజకీయప్రకటనే. రాజకీయం అనేదాన్ని విశాలార్థంలో చూడవలసి ఉంటుంది. ఏదైనా రచన కేవలం రాజకీయ నినాదంగా మారడం, మారకపోవడం అన్నవి రచయిత సామర్థ్యం మీదా ఆధారపడతాయి.
    3. “రాజ్యం పౌరులకు ఏం తెలియొచ్చు ఎంతవరకూ తెలియొచ్చు అనేదానిమీద దృష్టి పెడుతుంది. తెలివైనరాజ్యాలలో చాలా సుకుమారంగా శస్త్రచికిత్స జరిగితుంది. వ్యక్తి సహజ స్పందనలకి అన్ని రాజ్యాలలోనూ రాజ్యం జోక్యం ఉంటుంది. అవి కుడివైనా ఎడమవైనా సరే.” అన్న వివినమూర్తిగారి అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తాను. కాకపోతే, నా ఉద్దేశంలో ఇది కేవలం రాజ్యానికి సంబంధించిన ఏకపక్షవ్యవహారం కాదు. ఇందుకు సుముఖులైన పౌరుల ఇష్టాపూర్వక పాత్రా ఇందులో ఉంటుంది. ఆ పౌరుల్లో సాహిత్య సృజనకారులూ ఉంటారు.

   • వివిన మూర్తి says:

    పత్రిక చివరి రోజులలో మీరన్నట్టు ఈ చర్చ సబబు కాదు. భాస్కరం గారూ మీరు రాసినదానితో నాకు ఏకీభావం ఉంది. మీడియాలో చోటు చేసుకున్న నిరసన వ్యతిరిక్తత సాహిత్యంలో ఎందుకు ప్రతిఫలించటంలేదన్నది ఆసక్తి కరమైన ప్రశ్న.,

   • శివకుమార శర్మ says:

    మీడియాలో అనుదినమూ చూసే నిరసన, వ్యతిరిక్తత సాహిత్యంలో కూడా ప్రతిఫలిస్తే దాన్ని కూడా పట్టించుకోవడం మానేస్తారని “రోజూ చచ్చే వాడికి ఏడిచే వాడెవడుంటాడు” అన్న సామెత వర్తిస్తుందని స్వాభిప్రాయం.
    “రాజ్యం పౌరులకు ఏం తెలియొచ్చు ఎంతవరకూ తెలియొచ్చు అనేదానిమీద దృష్టి పెడుతుంది. తెలివైనరాజ్యాలలో చాలా సుకుమారంగా శస్త్రచికిత్స జరిగితుంది. వ్యక్తి సహజ స్పందనలకి అన్ని రాజ్యాలలోనూ రాజ్యం జోక్యం ఉంటుంది. అవి కుడివైనా ఎడమవైనా సరే.”
    రాజ్యం చెప్పేవి చాలావరకూ పెడచెవిని పెట్టే జనాలు చెప్పనివాటికోసం ప్రాకులాడ్డం – మూసిన గుప్పెట్లోని రహస్యం కనుక్కొనడం వంటిదేమో! ఎందుకంటే, డోనాల్డ్ ట్రంప్ ఎంత చెత్తగా ప్రవర్తించినా, ఓటర్లలో 54 శాతం మాత్రమే ఎలక్షన్లలో పాల్గొన్నారు. ఇంక ఆయనకీ రష్యాతో డీలింగ్స్ వున్నయ్యని నిరూపిస్తే అంతకంటే ఎక్కువగా ఓటు వెయ్యడానికి వస్తారంటారా? నాకు నమ్మకం లేదు. ఎందుకంటే, గుప్పెట తెరవగానే సందేహం తీరిపోతుంది గదా!

 101. VELDANDI SRIDHAR says:

  బాధగా వుంది… ఎన్నో గొొంతుల్ని మూసేసినట్టుంది. ఎన్నో కలాల్ని విరిచేసి నట్టుంది. ఎన్నో ముని వేళ్లను నరికేసినట్టుంది… అయినా కొన్ని తప్పవు. కాలం మొండిది. ఇన్నాళ్లూ ఎంతో పేషెన్నీతో క్రమం తప్పకుండా పత్రికను అందుబాటులోకి తెచ్చిన సారంగ సంపాదకులకు హృదయపూర్వక ధన్యవాదములు.. అఫ్సర్ సార్ మీ నిర్ణయం దారుణం… వెల్దండి శ్రీధర్.

 102. HARITHA DEVI says:

  చాలా అన్యాయం. మీ ఇబ్బందులు అర్థం అవుతాయి. కాని అత్యంత సన్నిహితుడిని మాకు దూరం చెస్తున్నారు. న్యాయం కాదు మీకు. పథేర్ పాంచాలి ని గొంతు నులిమి నట్టుగా వుంది.

 103. సారంగ ను ఆపేస్తున్న వార్త చదివి మనసు ఒక మౌనరోధన చేసింది. చాలా తక్కువ సమయంలోనే అంతర్జాల పత్రికల్లో విశిష్టస్థానాన్ని సాధించిన సారంగ, మరలా కనిపించదనే ఊహ కొంత బాధనే కలిగిస్తుంది.ఒకప్పుడు నీహార్ ఆన్ లైన్, తర్వాత ప్రజాకళ, ప్రాణహిత ఇలాగే ఆగిపోయాయి. మంచి సాహిత్యాన్ని ప్రచురించిన అంతర్జాల పత్రికలు. నిజానికి వీటిని నిర్వహించడం చాలా కష్టం. కొంతమంది పిడిఎఫ్, మరికొంతమంది ఇమేజెస్, ఇంకొంతమంది తాము రాసిన దాన్ని స్కాన్ చేసి పంపించడం, మరికొంతమంది డైనమిక్ ఫాంట్ లో పంపించడం…. ఇలా యూనికోడ్ లో తీసుకొనిరావడానికి ఎడిటర్స్ చాలా ఇబ్బందులు పడిన సందర్భాలుంటాయి. వాటిని అధిగమించగలిగినా పత్రికను సమయానికి తీసుకొని రావడానికి పడే టెన్సన్ సామాన్యమైంది కాదు. మరో ఆలోచనే రాకుండా పత్రికే సగం ఆలోచనల్ని మింగేస్తుంటుంది. రచనలు మంచివి రావట్లేదనే వాళ్ళు మంచివాటిని పంపించరనేది చాలామంది ఆలోచించరు. ఆ సమస్య సారంగకు లేకపోవడానికి ఒక ప్రధాన కారణం సాహిత్యంలో ప్రముఖులుగా పేరొందిన సౌమ్యులు అఫ్సర్, కల్పనగార్లే అనుకుంటున్నాను. మరో వైపు భావజాలపరమైన సంఘర్షలు తప్పవు. ఆర్ధికపరమైన సమస్యల్ని అధిగమించవచ్చు; కానీ, హ్యూమన్ రిసోర్స్, భావజాల సంఘర్షణలు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ చివరి రెండే ప్రధాన కారణాలుగా సారంగ ఆగిపోతుందేమో అని అనుకుంటున్నాను. ఏది ఏమైనా తెలుగు సాహిత్య పత్రికా రంగం- ఒక అధ్యాయంలో సారంగ తన స్థానాన్ని భద్రపరుకుందని మాత్రం నమ్ముతున్నాను.
  రాయగలిగే చేతులు
  స్పందించగలిగే మనసు
  చిత్రించగలిగే బ్రష్
  ఎగరగలిగే రెక్కలు
  ఒకచోట నిలవ్వు
  మరెక్కడో పురివిప్పి నాట్యమాడక తప్పదు
  ఆ మనోహర దృశ్యాన్ని వీక్షించాలని
  నిరీక్షిస్తూ…
  మీ
  దార్ల

 104. చివరి సంచికలో నా కవిత వచ్చిందని ఆనంద పడాలా లేక ఇకపై సారంగ రాదని బాధ పడాలా?
  అన్ని విధాలా ఆలోచించకుండా మీరీ నిర్ణయం తీసుకోరు. పునరాగమనంపై నేనూ బోలెడు ఆశలతో ఎదురు చూస్తాను.
  నాలుగేళ్లుగా నిరంతర శ్రమకోర్చి ఒక అద్భుతమైన పత్రిక ద్వారా అద్వితీయమైన సాహితీసేవ చేసిన అఫ్సర్, కల్పనా, రాజ్ గార్లకు ధన్యవాదాలు.
  ఎమ్వీ రామిరెడ్డి

 105. Subhash Koti says:

  మీ నిర్ణయం శరాఘాతంలా తగిలింది. నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా మనవి. కావాలంటె పక్ష/మాసపత్రికగా మార్చండి కాని విరామమొద్దు. కొనసాగించేందుకు అన్ని అవకాశాలను పరిశిలించండి.

 106. rani siva sankara sarma says:

  యీ గడ్డు కాలంలో సారంగలాంటి మంచి పత్రిక మరొకటి లేదు. అదే ఆగిపోతే కాలమే ఆగిపోయినట్లు.

 107. పి.మోహన్‌ says:

  ఇది అబద్ధమైతే బావుండు! ‘ఇక సెలవ్‌’ చూశాక నాలో వందసార్లు సుళ్లు తిరిగిన మాట. కొన్ని పరధ్యానాల వల్ల ఈ మధ్య అటు ప్రింట్‌లో, ఇటు వెబ్‌లో ఏ సాహిత్య పత్రికలూ చదవని నాకు ఓ మిత్రుడు చెబితే తెలిసింది ఈ పిడుగుపాటు.
  సారంగ విలక్షణ పత్రిక అనడం పునరుక్తే కనుక అసలు విషయంలోకి వస్తాను. తెలుగు సాహిత్య రంగంలో ప్రస్తుతం దారుణాతిదారుణంగా లోపించిన చర్చ, సంభాషణ, కొత్త కోణాల ఆవిష్కరణకు సారంగ పెద్ద పీట వేయడం మొదట నన్నాకర్షించిన విషయం. అప్పట్లో యూనికోడ్‌ రాకపోవడంతో చదవడం మటుకే చేసేవాణ్ని. ముఖ్యంగా కల్లూరి భాస్కరం గారివి. తర్వాత అఫ్సర్‌ గారి ప్రోత్సాహంతో ఆర్ట్‌ గురించి, సాహిత్యం గురించి, రాజకీయాల గురించి నాకు తెలిసి నాలుగు ముక్కలు సారంగ పాఠకులతో పంచుకున్నాను, వ్యాసాల్లో, చర్చల్లో. గుర్తుండిపోయే సానుకూల, ప్రతికూల అనుభవాలన్నీ రుచి చూశాను. రాయడం నుంచి అప్పటికి కొంత విరామం తీసుకుని ఉన్న నేను సారంగ వెన్నుతట్టింపుతో మళ్లీ కీబోర్డు ఝళిపించాను. అందుకు సారంగకు కృతజ్ఞతలు. ఏడాదిగా కొన్ని కారణాల వల్ల రాయడమే కాదు, చదవడం కూడా బాగా తగ్గిపోయింది. వర్తమానాన్ని భౌతికంగా, అభౌతికంగా ఆవరించిన ఒక నైరాశ్యం నుంచి తేరుకునేలోపే సారంగ ఇక రాదన్న వార్త..
  పత్రిక నిర్వహణ చాలా కష్టమన్నదీ పునరుక్తే. డబ్బు, సమయం, రచనలు.. నాణ్యమైన రచనలు.. ఇవన్నీ మానసికంగా తినేసే వ్యవహారం. నిబద్ధతే కాకుండా నాలుగు చేతులు కలవడం కూడా పత్రిక మనుగడకు ముఖ్యమనుకుంటాను. కొన్ని పత్రికలు కేవలం ఆర్థిక వనరుల కొరత వల్ల కాకుండా సరైన మానవ వనరుల లేక మూతపడుతున్నాయని నా అభిప్రాయం. సారంగ విషయంలో ఏం జరిగిందో తెలియకున్నా.. భావసంఘర్షణకు అద్దం పట్టే ఒక పత్రిక ఆగిపోవడం విషాదకరం. అయినా పునరాగమనం వుంటుందనే ఆశతో.

 108. సారంగ ఆగిపోకూడదు అనే భావనతోనే ఉన్నాను .
  కనీసం ఈ నాలుగేళ్ళ రచనలు కొంత కాలం పాటు ఉండనిస్తారని ఆశిస్తున్నాను.

 109. Srinivas Vuruputuri says:

  సారంగ అంటే – కల్లూరి భాస్కరం, మైథిలి అబ్బరాజు, రాణి శివశంకర శర్మ, ల.లి.త, P.V. విజయ్ కుమర్, చైతన్య పింగళి. ఇంత కరెక్టుగా, ఇంత క్లుప్తంగా ఎలా చెబుతారా అని ఆశ్చర్యపరిచే అరి సీతారామయ్యగారి కామెంట్లు.

  మెదడుకి మేత, మనస్సుకి ఆహ్లాదం.

  నిజంగానే సారంగ ఉండదా?

 110. గోర్ల says:

  సారంగను త్వరలో ప్రారంభిస్తారని కోరుకుంటున్నాను. చాలా మంచి వెబ్ వారపత్రిక. దీన్ని ఆపేస్తున్నాం అనే మాట మనస్సుకు ఇబ్బంది గలిగించింది. మళ్లీ సారంగ రావాలి.

 111. venkateshwarlu boorla says:

  ప్రామాణిక పత్రికగా, ప్రపంచ సాహిత్య భిన్న కోణాల్ని సాహిత్య కారులకు చేరవేసిన, ఉత్తమ రచనలకు వేదికగా నిలిచిన పత్రిక ఊరికే మాయమవదులే… మరింత మంచి గంధంతో మరో కొత్త పతాకం చేతపట్టుకొని వస్తుందిలే…ఇన్నాళ్ళూ తమ విలువైన సమయాన్ని త్యాగం చేసిన సారంగ సారథులకు హృదయ పూర్వక ధన్యవాదాలు.

 112. Sreenivaas sattiraju says:

  సారంగ రధ సారధులకి
  ముందుగా నా అభినందనలు. నిజమే ఒక పత్రిక రాజీ పడకుండా నడపడం అంత సామాన్యమైన విషయం కాదు. బురద చల్లారు అనేది అర్ధం లేని మాట. మీ శ్రమని గుర్తించలేక పోయారు అనేది సరి అయ్యిన మాట. అలాగే సారంగ చాలా మంది కొత్త రచయితలని పరిచయం చేసింది అనేది కూడా చాలా చక్కని ప్రయోగం. ఆ పరిచయక్రమంలో కొన్ని విలువలకు తిలోదకాలు ఇవ్వడం కూడా అంతే నిజం. అయ్యితే ఇది గొప్ప సాహిత్యం ఇది విలువ లేనిది అని నేను చర్చ చేయటంలేదు. పత్రిక నడిపే సాంప్రదాయ బద్ధమైన ప్రక్రియలో స్త్రీ వాదాన్ని మైనారిటీ వారి వాదాన్ని వినిపించడంలో సారంగ తీసుకున్న కొన్ని నిర్ణయాలను నిర్ద్వందంగా ఖండించి సారంగ మీద నిప్పులు కురిపించిన వారిలో నేను గత సంవత్సరం నుంచి మడమ తిప్పకుండా పోరాటం సాగించిన సంగతి కొంత మందికి విదితమే. కొన్ని విలువలు పాటించాలి అని కోరుకున్నానే తప్పా పత్రిక మూత పడాలనే ఆలోచన నాలో ఎప్పుడు రాలేదు. అలాగే కౌముది కూడా తన గాఢతను తగ్గించుకుని సంపాదకుని చేతిలో కీలుబొమ్మయ్యింది అన్న మాట కూడా నేనే చెప్పాను. నా ఉద్దేశ్యం మీరు పత్రిక రచనా అనేది సమయంలో ముందుకు వచ్చామా లేదా అనే విషయమే కాకుండా ఇతరత్రా విషయాల మీద దృష్టి సారించి ఉంటె ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు అని నా అభిప్రాయం. ఉదాహరణకి ఏంతో మంది మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరి సహకారంతో వారానికి వక్కసారి కాకుండా కనీసం పక్ష పత్రికలా ఇంకా లేకున్నా మాస పత్రిక లాగానో నడప వచ్చును. అలాగే నిర్వహణా వ్యయంకూడా తగ్గించుకుని పది మందిని కలుపుకోవడంలో వాణిజ్య ప్రకటనల ద్వారా రాబడి పెంచుకోవచ్చును. కేవలం ముగ్గురు తమకి నచ్చిన విధంగా నడిపితే చివరికి అలసిపోవడం వల్లనో లేక దూషణలకు తిరస్కారాలకు వృత్తి బాధ్యతల వత్తిడికి లొంగి ఇలా చతికిల పాడడం నిజంగా శోచనీయం. మీరు సాహిత్యానికి చేసిన సేవ తప్పకుండా మెచ్చుకోవలసిన విషయమైనప్పటికీ మూత పెట్టడం మీ స్వీయ నిర్ణయమే అనేది అందరికి స్పష్టం. మిమ్మల్ని నేను నిజాయితీగా విమర్శించాను. రచయితలకు నా సహకారం ఒక చక్కటి హాస్యపు విమర్శా ద్వారా తెలుపుతూ ప్రోత్సాహాన్ని కూడా అదే స్పూర్తితో ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మీకు సహకారమివ్వడానికి నేను ముందుకు వస్తున్నాను. ఒక మంచి ఆశయంతో మొదలు పెట్టిన పత్రిక అలా నిలబడితే సాహిత్యానికి భాషకి మంచిది అని నా భావం. అమెరికా ఆస్ట్రేలియా లండన్ గల్ఫ్ దేశాలలో ఉన్న నా మిత్రులని సమన్వయ పరిచి మీ పత్రికని మూల పడకుండా అదే ఉత్సాహంతో కొత్త తరానికి (వయస్సులో కాదు రచనలలో) ప్రోత్సాహమిచ్చి సాంప్ర దాయ రచయితలకి సింహ స్వప్నంగా సారంగ మారాలని కోరుకుంటూ ముందుకి వస్తున్నా…మీకు నా ఆలోచన నచ్చితే…నన్ను సంప్రదించండి…ఇంతకాలము మీరు తెలుగు సాహిత్యానికి చేసిన కృషికి ధన్యవాదాలు తెలుపుతూ, ఒక వేళా ఎప్పుడైనా నొప్పించి ఉంటె మన్నించమని కోరుకుంటూ. మీ శ్రేయోభిలాషి

 113. కె.కె. రామయ్య says:

  ” అమెరికా ఆస్ట్రేలియా లండన్ గల్ఫ్ దేశాలలో ఉన్న నా మిత్రులని సమన్వయ పరిచి మీ పత్రికని ( సారంగని ) మూల పడకుండా అదే ఉత్సాహంతో కొత్త తరానికి (వయస్సులో కాదు రచనలలో) ప్రోత్సాహమిచ్చి సాంప్ర దాయ రచయితలకి సింహ స్వప్నంగా సారంగ మారాలని కోరుకుంటూ ముందుకి వస్తున్నా… ” అంటూ ఈ ఆపన్నసమయంలో ఓ చిరు ఆశ కలిగిస్తున్న శ్రీనివాస్ సత్తిరాజు గారికి పాదాభివందనం చేస్తున్నా.

  మీరు ప్రతిపాదించిన పధకం నెరవేరేలా ( అఫ్సర్ గారి మనసు కరిగేలా ) చెయ్యమని సవినయంగా విన్నవించుకుంటున్నాను.

  సారంగ అంతర్జాల పత్రిక నిలిచి పోకూడదు, ఇంతకాలం వచ్చిన కంటెంట్ మరుగున పడిపోకూడదు అని ఓ ఉమాదంతో కొట్టుకుంటున్న వాళ్లలో నన్నూ( బుడతలాంటి, ఉడతలాంటి నన్నూ) చేర్చుకోండి. సారంగ పత్రిక మిత్రులని, శ్రేయోభిలాషులని సమన్వయ పరిచే విషయంలో మావంతు కృషి మేమూ చేస్తాం.

 114. palamaneru balaji says:

  సారంగ నిస్సందేహంగా మంచి సాహిత్య పత్రిక.పత్రిక ఆగిపోతుందంటే ఒక చర్చా కార్యక్రమమే మొదలయ్యింది. స్పందన ఒక ప్రారంభం, బహుశా ఒక పరిష్కారం కూడా.ప్రతిస్పందించాల్సినవాళ్లు మాట్లాడాలని కోరుతున్నాను.సమస్యలు,కారణాలు చెప్పగలిగేవి ఐతే చెప్పగలరు.చెప్పలేనివి ఐతే -సారీ !చెప్పరానివి ఐతే మీ ఆత్మీయులతో అయినా మాట్లాడగలరు.తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మైలురాయిగా సారంగ నిలిచిపోతుంది.తెలుగు సాహిత్యానికి,కొత్త రచయితలకు ఒక మంచి వేదిక దిక్సూచి అయిన సారంగ నిరాటంకంగా కొనసాగాలని,కొనసాగుతుందని అనుకుంటున్నాను.మీ సమస్యలు,ఇబ్బందులు,కారణాలు-పరిష్కార,ప్రత్యమ్నాయ మార్గాలు ఏమిటో..అందరం లేదా కొందరు లేదా ముఖ్యులు మాట్లాడుకుంటే సాహిత్యానికి మంచి జరుగుతుంది కదా .పెద్దలారా ..ఆత్మీయులారా..సహృదయులారా ..సాహిత్యప్రేమికులారా,రచయితలలారా,పాఠకులారా..ఆలోచిద్దాం,మాట్లాడుకుందాం,చర్చిద్దాం,స్పందిద్దాం,మంచి విలువైన విలువలున్న సాహిత్య పత్రికను కాపాడుకుందాం-పలమనేరు బాలాజీ

 115. Kompella Sarma - Telugu Ratham says:

  ఎవరో ఒకరికి స్వచ్చందంగా ముందుకు వచ్చిన వారికి ఈ యాజమాన్య బాధ్యతలు అపగించవచ్చు కదా! ఏది ఏమైనా ఒక అలవాటు కలిగించి, ముందుకు నెట్టి, ఇన్నాళ్ళ తర్వాత హటాత్తుగా అగాధంలోకి నెట్టివేయబడినట్లు అనిపిస్తోంది. సాహిత్యాభిమానులు, సాహితీపిపాసులు ఎంతోమంది ముందుకు వచ్చి, ఈ సారంగ ‘సరిగమల’ ప్రయాణాన్ని కొనసాగించేందుకు ఇప్పటికేనా ప్రయత్నాలు నిజాయితీగా ప్రారంభవించవచ్చు. ఏది ఏమైనా,సాహిత్యాబిమనులకు ఒక అగాధం సృష్టించారు అన్నది మాత్రం సత్యం. నమస్కారం. కొంపెల్ల శర్మ, తెలుగురధం.

 116. ఒక మిత్రుడు దూరమవుతున్నంత బాధగా వుంది. కానీ మీ నిర్ణయం వెనుక తప్పకుండా తప్పనిసరికారణాలేవో వుండే వుంటాయి. కానీ
  ఇప్పటివరకూ సారంగాలో ప్రచురితమైన సాహిత్యం మొత్తం వృధా కాకుండా చూడండి. ఈ పత్రికను ఇలాగే వుంచాలంటే సర్వర్ కోసం వెచ్చించాల్సి రావచ్చు. అందులోనూ సారంగబుక్స్ వారి సబ్ డొవైన్ నేమ్ కాబట్టి సాంకేతికంగా అదికూడా కష్టం కావచ్చు. కానీ మొత్తం సమాచారాన్ని బ్లాగు లేదా వర్డ్ ప్రెస్ లాంటి ఉచిత డొమైన్ కమ్ సర్వర్ లలోనికి ఒక్కొక్క పోస్టు ని తిరిగి పోస్టు చేసుకునే పద్దతిలో కాకుండా మొత్తంగా ఒకేసారి ఫైల్ డంప్ చేసుకునే పద్దతి వుంది ఆ విధంగా వీటిని కాపాడటం వల్ల ఆర్టికల్స్ పంపిన రచయతల కృషికి విలువనిచ్చినట్లూ అవుతుంది. భవిష్యత్ పాఠకుడికి సారంగ సేకరించిన అపూర్వమైన సాహిత్య విషయాలను ఒక దగ్గర చదువుకునే వీలు కల్పించినట్లూ అవుతుంది.
  పత్రికను తిరిగినడపటం విషయంలో పునరాలోచించడం సాధ్యపడనప్పటికీ మార్చి ౩౦ నుంచి దీన్ని వానిష్ చేసే విషయంలో పునరాలోచించగలరని మనవి.
  ధన్యవాదాలతో

 117. GLNMurtthy says:

  పల్లం లోకి పొంగులెత్తుతున్న సాహిత్యవిలువలకి అడ్డుకట్ట వేసిన సారంగ మంచి మంచి మంచి ఆలోచనలకు కొత్త పాయ తెచ్చింది..నాలుగేళ్లు గా ఉత్తమ అభిరుచి ని చవి చూపించిన మీరు ఒక్క పెట్టున ఇంక చాలిద్దాం అంటుంటే తట్టుకోవటం కష్టం గా తల్లడిల్లే వాళ్లు నాతో పాటు చాలా మంది ఉన్నారు..సారంగ తో కలసి సాహిత్య గమకాల్నిసంగతుల్ని కొత్తకొత్తగా అందిద్దామని అనుకునే అభిమానుల్ని కూడగట్టి సమిష్టి గా సరికొత్త సారంగ ని తేవటానికి పూనుకొందామని నా సూచన… మీతో చేయిఛేయి కలిపి దన్నుగా ఉండేవాళ్లం చాలా మందిమి ఉన్నాం…తెర వేయటం వాయిదా వేయండి..ముందడుగులకు పిలుపు ఇవ్వండి..చోదకులుగా ఉండండి..విరమణ లేదు దూసుకు పోదాం రమ్మని ఓ మాట చెప్పండి…

 118. మెయిన్ స్ర్టీమ్ సాహిత్య పత్రికలకు ధీటుగా నడిచింది సారంగ.
  ఇప్పుడిలా మూసేస్తుంటే…ఏదో కోల్పోతున్న ఫీలింగ్.
  నాలాంటి ఎంతోమంది యంగ్ రైటర్స్ ని ప్రోత్సహించిన సారంగ మళ్లీ కొనసాగాలని కోరుకుంటున్నాను.
  ఇట్లు
  ఓ సారంగ పాఠకుడు

 119. రెడ్డి రామకృష్ణ says:

  ఆలస్యంగా చూసేను .చాలా బాధనిపించింంది. ఎన్నోచెప్పాలనుంది.ప్చ్….చర్చలకు సారంగ పెద్దపీట వేసింది.ఇలాంటి అవకాశం వేరే పత్రి కలలోచూడం.

 120. కృష్ణుడు says:

  ఏదో ఈడ్చుకుంటూ ఉన్న నన్ను కూడా చదివించావు, రాయించావు కదా.. ఎందుకో రాయాలన్న ఆసక్తి చచ్చిపోతోంది.

 121. మీరు ఇప్పుడు సామాన్యులు అయ్యారు అన్న.
  వెరీ హ్యాపీ.
  ఇలాగా ఇంకా మేల్ల మెల్లగా మీ గురించి పూర్తి సమయం కేటాయించాలని కోరుకుంటున్నాను.
  మీ జీవితాలను మీరు జీవించబోతున్నందుకు అభినందనలు.