సిస్టర్ అనామిక

Art: Satya Sufi

తని
రెండు రెక్కల్లో చేతులు ఉంచి
టాయిలెట్ సీట్ నుంచి లేపి
పళ్ళుతోమి స్నానం చేయించి
ఒళ్ళుతుడిచి బట్టలు తొడిగి
జాగ్రత్తగా నడిపించి
మంచంపై పడుకోబెట్టి
“మీ అబ్బాయి రమ్మంటున్నాడని అన్నారుగా
వెళ్ళొచ్చు కదా?” అందామె
మాత్రలు వెతుకుతూ
నీటిపొర నిండిన కళ్ళతో
సీలింగ్ కేసి చూస్తూ ఉండిపోయాడతను
ఫోన్ కూడా చేయటం మానుకొన్న
బబ్లూ గాడిని గుర్తుచేసినందుకు.
*

మీ మాటలు

  1. Suparna mahi says:

    మీకు మాత్రమే సాధ్యమయ్యే గొప్ప కవిత బాబా సర్…💚

  2. చాలా బాగుంది

  3. prl swamy says:

    బాబా గారు ఒక ఉన్నత స్థాయికి చెందిన కవి.వారి వాక్యాలు అలానే ఉంటాయి .నా లాంటి వాడు అలానే స్పందిస్తాడు .

  4. బాగుంంది.

  5. కవిత.బాగుంది. ..

మీ మాటలు

*