ఈ రాత్రి వొడవదు ఎన్నో రాత్రి ఇది చెంప మీద ఎన్నో కన్నీటి చుక్క జారి ఆరిపోతున్నది తెల్లని మంటయ్ కురుస్తున్న మంచు కిటికీ అద్దం మీద వీధి లాంతరు విసుగు ఒక్క వెచ్చని వూహ లేదని ఫిర్యాదు దృశ్యం మారితే బాగుండు, మార్చేది ఎవరు నేనెప్పుడూ చీకట్లో ఆడుకుంటున్న ఆడపిల్లనే నా చుట్టూరా నల్లని కందకం, ప్రతిబింబం లేని అద్దం వృత్తాకార కందకంలో నాచు పట్టిన కత్తులు కందక ఖడ్గానికి పొదిగిన పచ్చల వలె చుక్కలు నల్లని అద్దాన్ని దాటే … [ఇంకా చదవండి ...]
నువ్వంతే ఎప్పుడూ నిత్య వికసిత కుసుమానివై పరిమళం వెదజల్లుతుండు నిను కాంచే చూపుల పై... దేహాలపై... ~ నీ నవ్వుకు వేలాడుతుంది ఓ ముక్క ఆకాశం కాంతి సముద్రాన్నెత్తుకొని నీ నడుమ్మోసే చంటిపాపలా ఓ మాయని మాయలా ముడతలు కొన్ని నీ ముఖంమ్మీద అందం చెక్కిన ఆనందాలౌతుంటాయి అసలే నలుపు ఆపై చెవికి చెవులై వేలాడే లోలాకులు నక్షత్రమంత కాకపోయినా అలాంటిదే ఓ ముక్కు పుడక నీ ముక్కు అందం జుర్రేసుకుంటూ అంత వరకూ చూడని రంగురంగుల సీతాకోకచిలుక దేహపుహోళిలా నిను చుట్టేసిన బట్టల అద్దాల్లోంచి తొంగి … [ఇంకా చదవండి ...]
నా లోపలి సతత హరితారణ్యానికి ఎవడో చిచ్చు పెట్టాడు మట్టిదిబ్బలూ ముళ్లపొదలూ తప్ప తుమ్మముళ్లూ బ్రహ్మజెముళ్లూ తప్ప పూల పలకరింపుల్ని ఆఘ్రాణించలేని పక్షుల రెక్కల ఆకాశాల్ని అందుకోలేని సెలయేళ్ల లేళ్లను తనలోకి మళ్లించుకోలేని జంతుజాతుల జన్మరహస్యాల్ని పసిగట్టలేని మనిషిరూపు మానవుడొకడు ఒళ్లంతా అగ్గి రాజేసుకుని అంటించేశాడు వాడు విధ్వంసపు మత్తులో తూలుతూ మంటల ముందు వెర్రిగా తాండవమాడుతూ ++++++ కాలమాపకయంత్రం మలాము పూసింది కాలిన గాయాలు కనుమరుగవుతున్నాయి పచ్చదనం మళ్లీ … [ఇంకా చదవండి ...]
Copyright © 2024 Saaranga Publishers
బ్రహ్మానందం గారు మంచి పరిశీలన తో రాసారు. నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నాను.
సారంగ వాళ్ళు అడిగారని మీఅభిప్రాయాలు చెప్పారు .బానే ఉంది. కానీ కథల పేర్లు సరిగ్గా గుర్తు పెట్టుకుని చెప్పి ఉంటే మీరు నిజాయితీ గా మీ అభిప్రాయం వెలిబుచ్చినట్లు నేను నమ్మేవాడిని. అది కస్తూరి పూలు కాదు.కస్తూరి నీడలు.
కొన్ని వందల కథలు చదివాను. పేరు పొరపాటుగా పడింది. తప్పే. అంత మాత్రం చేత నిజాయితీ లోపించినట్లేనా? మల్లాది ఒక కథ అనువాదం చేశారు. అది గుర్తులేదనే రాసాను.
బ్రహ్మానందం గారు… మీ సూచనలు బాగున్నాయి. కొత్త కథకులకు ఉపయోగకరం.
“నవ్య” వీక్లీ లో ఒక్క కథ కూడా నచ్చలేదా?
లేక మీరు ఆ పత్రిక చదవరా?
లేక ‘ఆంధ్ర జ్యోతి ‘అంటే మీ ఉద్దేశ్యంలో ‘నవ్య ‘ నేనా?
నేను మీతో చాలా విషయాల్లో ఏకీభవించలేక పోతున్నాను.
ప్రభాకర్ గారూ: నేను నవ్య రెగ్యులర్ గా చదువుతాను. కథలో నే చూసిన కొలమానాలు చేప్పాను. అన్ని కథలూ చదవడం అసాధ్యం. చదివినంత మేరకూ నా అభిప్రాయాలు అవి. మీకు తెలిసిన మంచి కథలు చెప్పండి. నేనూ తెలుసుకుంటాను.
బ్లాగులనీ, బ్లాగుల్లో కథల్ని ప్రస్తావించినందుకు ధన్యవాదాలు, సాయి బ్రహ్మానందం గారూ.
సాయి బ్రహ్మానందం గొర్తి గారు !
మీరు అమెరికన్ కథల గురించి రాసిన వాక్యాలు (8 వ పాయింటు లో) నాకు బాగా నచ్చాయండి – ముఖ్యంగా రచయిత పాత్రల్లోకి జొరబడక పోవడం గురించి.