మీరంతా ..

40-year-old-woman-dies-of-shock-from-demonetization-move-in-gorakhpur-indialivetoday

మీరు ప్రజలా !
మీరక్కరలేదు మాకు
మీరంతా వొట్టిపోయారు
మీరంతా చెమట పట్టిపోయారు
మీకు టెక్నాలజీలు,
ఎకానమీలు తెలీవు
అస్సలు
మీకు మాయజేయడం రాదు
మీకు మభ్యపెట్టడడం రాదు
ఎదుటివాడిని ముంచడం రాదు
ఎదిగిన వారికి మొక్కడం రాదు
ఇంకెందుకు మీరు

మీకు ఒక్క వేలే చాలిక

మీరు ప్రజలు !
మీరు సమూహాలు !!
అందుకే
మాకు మీరక్కరలేదు
మీరంతా అడ్డు తొలగండి
మీరంతా రోడ్లెక్కండి
మీ చావే మీకున్న అర్హత
మీ చావులో మీరు స్వేచ్ఛను అనుభవించండి
మీ చావు మాత్రమే మీది
ఇంకేది మీది కాదు

మీరు ప్రజలా !!
మీరక్కరలేదు మాకు
మీరు మాట్లాడుతారు
మీరు ప్రశ్నిస్తారు
మీ గొంతులు నినదిస్తాయి
మీ చేతులు ఉద్యమిస్తాయి

*

మీ మాటలు

  1. ప్రజల మీద ఆక్రోశం లేదా ప్రజల ఆక్రోశం! బాగుంది.

  2. పద్మాకర్ says:

    మీకు ఒక్క వేలే చాలిక !!

  3. మీకు ఒక్క వేలే చాలిక…అదే ఆధారం

మీ మాటలు

*