ఒక ఆదివాసి ఆత్మగీతం

chandram

Art: Rajasekhar Chandram

 

 

ఆకుల్లో పచ్చదనానికి

నేను తప్ప అమ్మ నాన్న లేరా

మీరంతా హరితానికి అత్తారింటి వారా

అందరి గాలి ఇది, దీన్ని వడకట్టడానికి నా ఒక్కడి చర్మమేనా?

మీరు తీరిగ్గా చదువుకోడానికి పుస్తకాలు కావాలి, కాగితాలు కావాలి

దానికి తన చెట్లన్నీ ఇవ్వాలి అడివి, మీరు ముడ్డి తుడుచుకోడానికి కూడా

అడివి మీకు ఇంకా ఏమేమి ఇవ్వాలి

నేల మాలిగల్లోని నిధులను ఎందుకు కాపాడాలి సొంత బిడ్డల ప్రాణాలొడ్డి

పట్టణాల్లో, నగరాల్లో మీ చర్మ రక్షణ కోసం ఈ హరితాన్నిలా ఈ గాలినిలా

వుంచడానికి అడివి ఎందుకు పేలిపోవాలి మందుపాతరలయ్

అడివి బిడ్డల కండలెందుకు వ్రేలాడాలి బందిపోట్ల బాయ్నెట్లకు

అడివిని దోచిన డబ్బుతో బందిపోట్లు

మీ సమ్మతులను కొనేస్తారు మీ తలకాయలని లీజుకు తీసుకుంటారు

అబద్దం, అడివి మాది కాదు, మాది కాదు, నీది నాదనే భాషే మాది కాదు

అందరిదీ అయిన దాని యోగక్షేమాల కోసం మేం మాత్రమే మరణించాలా?

మేం వదిలేస్తాం ఈ జీతభత్యాల్లేని వూరుమ్మఢి కావలి పని

 

అడవుల్ని, నేల మాలిగల్ని అమ్ముకుని; కడగని కమోడ్ల వంటి

బంగారు సింహాసనాల మీద మీరు

ప్రకృతి వైపరీత్యాల వంటి తూటాల వడగళ్లకు నెత్తురోడుతూ మేము

మా మృతశరీరాలతో మీ ఆత్మలను అలంకరించుకునే ఆటపాటలతో మీరు

అందరిదీ అయిన గాలికి అందరిదీ అయిన నీటికి అందరి ప్రాణ హరితానికి

హామీ పడాల్సిన అతి నిస్సహాయ దైన్యంలో మేము

మీరు కూడా మనుషులై రోడ్లు గాయపడే దెప్పుఢు

అడవుల కార్చిచ్చులో మీ పట్టణాలు నగరాలు తగలబడినప్పుడా?

అంచుల్లో మంచు కరిగి మీ భవనాల ప్రాకారాలను ముంచెత్తినప్పుడా?

మనిషి పాట పాడడానికి, మనిషి కోసం ఒక స్మృతి గీతం రాయడానికి

వంకరపోని చేతి వ్రేలు ఒక్కటీ లేనప్పుడా? కంటిని తినేసిన కాటుక

వంటి చీకటి లోకాన్ని ముంచెత్తినప్పుడా?

అడగడానికి వినడానికి ఎవరూ లేనప్పుడా?

 

*

 

 

మీ మాటలు

 1. …..అడగడానికి వినడానికి ఎవరూ లేనప్పుడా?
  బలే అడిగేసారు…. కాదు కాదు కడిగేసారు
  మనిషి పాట పాడడానికి, మనిషి కోసం ఒక స్మృతి గీతం రాయడానికి.. అంటూ!
  చాలాబాగుంది.సర్!

  • తిరుపాలు గారు, థాంక్స్. పట్టణాల్లీ నగరాల్లో నివసించే వారం మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఐర్లాడులోనో ఎక్కడో తన సముద్ర తీర భవనాన్ని ప్రాకారం కట్టి కాపాడుకుంటాడట ట్రంపు. లోకమంతా మునుగు తానొక్కడు తేలి, ఎందుకు అనే ప్రశ్న రాదు కాళ కింది నేలను తప్ప చూడలేని ‘వ్యాపారి’కి, వారికి మద్దతు పలికే వారికి?

 2. కె.కె. రామయ్య says:

  ” అతి నిస్సహాయ దైన్యంలో మేము …
  మీరు కూడా మనుషులై గాయపడే దెప్పుడు ? ”
  అని నిలదీస్తున్న హెచ్చార్కె గారికి వొందనాలు.

  • రామయ్య గారు, మీ నుంచి అందుతున్న ప్రోత్సాహానికి చాలా కృతజ్ఞతలు.

   చావుబతుకుల పోరాటాన్ని మొత్తం అడివి బిడ్డలకు, వారితో పని చేసే వారికి వదిలేసి, పట్నవాసమోళ్ళు, సో కాల్డ్ నాగరికులు ‘ఇంటల్లెక్చువల్స్ ‘గా సుఖపడినంత కాలం పర్యావరణ విధ్వసం ఆగదు. అది అందరి పని. పట్టణాలు నగరాలు కదలకుండా పర్యావరణ విధ్వంసం ఆగదు.

 3. గురువు గారు…
  Vuthiki aaresaaru.

  • థాంక్యూ వెరి మచ్. మీరు నాకు తెలుసనిపిస్తోంది. గురువు గారు అని పలకరించే సరికి.. చాల కాలం నన్నలా పలకరిస్తూ వుండి, ఇప్పుడు మానేసిన ఓ మంచి మిత్రుడు గుర్తుకొచ్చారు. ఈ స్వామి ను కాదని అర్థమవుతోంది. అయినా ఈ ఆప్యాతతతో కూడిన గౌరవానికి కృతజ్ఞతలు. :-)

 4. Vijay Koganti says:

  ఇది చదివాకన్నా ఆత్మలు చలిస్తే బాగుండు.ఒక అద్భుత ఆత్మగీతం.

  • థాంక్సె లాట్ విజయ్. ఇప్పుడు రాస్తున్న కవులు ప్రకృతి గురించి పట్టించుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. ప్రకృతి కవులనే ఒక కేటగెరీలో ఇమిడిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. కళ్ళ ముందు జరుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని, విధ్వంసాన్ని తమ లాభంగా మార్చుకున్న వ్యాపారి కమ రాజకీయులను పట్టించుకోడం లేదు. ఇది చెప్పడానికే ‘రూమీ’ తరహా సో కాల్డ్ జ్ఞానోద్దీప కవిత్వం గురించి కాస్త విమర్శ చేయ బోయాను ఇటీవల.

 5. మీరు కూడా మనుషులై రోడ్లు గాయపడే దెప్పుఢు…

  • ఎన్ వెంకట్రావు గారు, కృతజ్ఞతలు. రోడ్లు గాయపడి తీరాలని నా కోరిక కాదు. ఇప్పుడు అడవులు గాయపడుతున్నాయి. హృదయవిదారక రీతిలో రక్త సిక్తమవుతున్నాయి. అక్కడి అడివి అక్కడి వాళ్లకు మాత్రమే కాదు. పట్టణాల్లో, నగరాల్లోని వారికీ అమ్మే. తనే మనం పీల్చే గాలికి, తాగే నీటికి మంచి హామీ. అమ్మ వంటి అడివి, సింబయోటిక్ గా తనతో జీవించే అడివి బిడ్డలు ఉక్కు పాదాల కింది నలిగిపోతుంటే… మనకు చీమ కుట్టినట్టయినా లేదు. మనలో కాస్త స్పృహలో వున్నవారు మాత్రం నాలుగు పాటలు రాసి, పాడి వూరుకుంటునన్నారు. జనాన్ని నడిపించే రాజకీయం .. మంచి రాజకీయ నాయకత్వం … కూడా పోరాటాన్ని ఆడవులకు లిమిట్ చేసే ఎత్తుగడలకు అతుక్కుపోయి చాల హాని చేస్తున్నది. ఈ బాధ ఆ నా వారికి చేరాలను కోరిక.

   • నరహరి says:

    మీకు చాలా పెద్ద పెద్ద గొప్ప ఆశలున్నట్లున్నాయి హెచ్చార్కె గారూ, ఎటిఎమ్ ల ముందు క్యూలో నిలుచుని వున్న ఒక పెద్దాయన గుండెపోటొచ్చి క్రిందపడిపోతే అదే క్యూలో వున్న నలభై మంది కనీసం ఒక్క అంగుళం కూడా కదలలేదు. అరగంట తరువాత అతడు చనిపోయాడు, ఇది జరిగింది బెంగాల్లో. ఇలాంటివారి గురించే అతి దీన, అట్టడుగు వర్గాల ప్రజలు ఎటిఎమ్ క్యూల్లో వున్నారు, అల్లాడిపోతున్నారని వార్తా మాధ్యమాలు వ్రాస్తాయి. కళ్ళముందు యాక్సిడెంటై గిలగిల కొట్టుకుంటున్నా అతివేగంగా వాహనాల్లో ప్రక్కనుండే పోతుంటారు. స్పందనా రాహిత్యం మన రక్తంలోనే వుంది, దానికి మార్కెట్ నో, ప్రభుత్వాన్నో, మతతత్త్వాన్నో చూపడం అవివేకం. కేవలం మూడు వేల మంది బ్రిటిష్ అధికారులు 200 ఏళ్ళు 30 కోట్ల జనాభా వున్న మన దేశాన్ని పాటిస్తే వారికి గులామన్నాం. ఈ స్పందనని బోధించే పాఠ్యాలను మతతత్త్వం అన్నాం. రామకృష్ణ మిషన్ లాంటి సంస్థలను హిందూ మతోన్మాదం అంటున్నాం. 70 ఏళ్ళ నుండి మన ఆడబిడ్డలు చెంబు పట్టుకుని బయటకి వెళుతుంటే చూస్తూనే వున్నాం. 30 ఏళ్ళ క్రితం దివ్యంగా నడచిన ప్రభుత్వ పాఠశాలలు ఆ తరువాత వచ్చిన ఇంటలెక్చ్యువల్ ఉపాధ్యాయతరం కూడా ఒక కారణమై కునారిల్లడమూ చూస్తూనే వున్నాం. పీకేసుకుందామా అని ప్రశ్నిస్తే సమస్త భూతగణాలనీ తీసుకుని వాడి పైన పడిపోతున్నాం.
    ఇలా చెప్పకుంటూ పోతే మన నిష్ఠదరిద్రానికి, ప్రక్కవాడి గురించి క్షణమైనా ఆలోచించకపోవడానికి ఎన్నో దృష్టాంతాలు. మీరేమో అడవుల దాకా వెళ్ళారు. అక్కడి దాకా అక్కర్లేదు. మన ఇంటిముందు పారబోసిన చెత్తని ఊడవమనండి చాలు.

    గుంటూర్లో వట్టికూటి వెంకట సుబ్బయ్య అనే గాంధేయవాది వుండేవాడు. ఆయన ప్రొద్దున్నేలేచి ఒక పలుగు, పార తీసుకుని ఊరంతా తిరిగి పారిశుద్ధ్యపని, మురుగుకాల్వలు బాగుచేయడం, చెత్త ఎత్తిపోయడం చేస్తూవుండేవాడు, 70 , 80 ఏళ్ళ వయస్సులో కూడా ఆ పని ఆయన మానలేదు. కేవలం తన ధర్మంగా భావించి చేస్తూవుండేవాడు. ఆయన్ని ఒకసారి అడిగాను, “అయ్యా! ఇంత మురికి, చెత్త రోడ్ల మీద ఎలా వస్తుంది?” అని, “మన మెదడులో వుండే మురికే రోడ్లమీదకి వస్తుందయా” అన్నాడు.
    మన యోగ్యతని బట్టే మన నాయకులు, మన సమాజం రూపొందుతాయి. ఎవడో వచ్చి బాగుచేయడం, మార్చడం అనేది ఎంతో పారితోషికం తీసుకుని సానియా మీర్జా చీపురు పట్టుకుని స్వచ్ఛభారత్ కి ఫోజులిచ్చినట్లే అవుతుంది. మనిట్లో చెత్తని ఊడ్చుకోమని ఎవరైనా మనకి చెప్పాలా? అది చెత్త అనే స్పృహ మనకి కలగనంతవరకూ ఆ కంపుని ఇంపుగా పీల్చవలసిందే.

    ప్రభుత్వోద్యోగాలు న్యూ క్రీమీ లేయర్ని బాగా పెంచేసాయి. వారిలో కుల, మతాలకు అతీతంగా స్పందనా రాహిత్యం శిఖరాలకు చేరింది. మన బడ్జెట్ లో సిింహభాగం వారి జీతభత్యాలకే సరిపోతున్నాయి. ఇింకా ఉద్యోగాలివ్వండి, ఖాళీలను భర్తీ చేయండి అని మిగిలిన సగం బడ్జెట్ కూడా క్రొత్త ఉద్యోగ మతానుయాయులు ధర్నాలు చేస్తున్నారు.
    ఇదెందుకు చెబుతున్నానంటే వారు చేయవలసిన పని నిజాయితీగా చేస్తే, రాజ్యాంగం, చట్టం ప్రకారం నిర్భీతిగా ప్రవర్తిస్తే అంటే, కొద్దిగా స్పందనని ప్రదర్శిస్తే ఇంత దౌర్భాగ్యం వుండేది కాదు.

 6. ఏల్చూరి మురళీధరరావు says:

  మాన్యులు శ్రీ హెచ్చార్కె గారికి
  నమస్కారములతో,

  ఎంతటి భావగర్భితమైన కవితను ఎంత గంభీరంగా వ్రాశారండీ! ఎంతసేపో చదువుతూ, ఎంతో సేపు ఆలోచిస్తూ ఉండిపోయాను.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

 7. నరహరి గారు, మీరు చెప్పిన కారణాలు సరైనవని నాకు అనిపించడం లేదు. ప్రజల్లో నిష్క్రియ నిజం కాదు. ముందుకు వచ్చిన వేలాది మంది యువతీ యువకులు… అటు.. గెలుపు ఏమాత్రం అవకాశం లేని హింసాత్మక పోరాటాల లోనికి.. లేదా ఇటు పరమ కెరీరిస్టు రాజకీయాల లోనికి మళ్లించబడుతున్నారు. ‘నిష్పూచీ విప్లవకవిత్వం’ అంటో నేను బరి తెగించి మాట్లాడుతున్నదీ, స్నేహాల్ని కోల్పోయి బాధ పడుతున్నదీ ఈ విషయంలోనే. ఇది ఒకే సారు సాహిత్యం, రాజకీయమున్నూ.

  మనం చేయవలసింది అసలేమీ లేదని అనడం సరైంది కాదు. కనీసం రాయగలం కదా. కెరీరిస్టు గోలకు దూరంగా రాయగలం కదా. మన మాట మనం చెప్పాల్సిందే.

  క్రీమీ లేయర్ విషయమై మీ ఉద్ఘాటనల్ని నేను పంచుకోడం లేదు. చిన్ని నా పొట్టకు శ్రీరామ రక్ష గాళ్లు అందులో బాగానే తయారయిన మాట నిజమే. వాళ్ళు అసలు ‘క్రీము’ లోని వారి స్థాయికి ఇంకా చేరలేదు. ఇంకా, అలాంటి స్ఠితి రాలేదు. దలితుల లోంచి ఒక రామోజీరావు, రాధాకృష్ణ అయినా రనివ్వండి. ఆ మాత్రం స్థితి కూడా రాకుండా, కేవలం కొన్ని ఉద్యోగాల్ని చూపించి ఇలా మాట్లాడడం మనసు లేని చాణక్యమే నని… నా హంబుల్ సబ్ మిషన్. బట్, థాంక్యూ, ప్రతిస్పందనకు. :-)

 8. నరహరి says:

  Ralegaon Siddhi గ్రామం గురించి గాని, Auroville global village గురించి గానీ మీరు వినివున్నారా?
  అన్నా హజారేకి, ప్రెంచ్ దేశస్థురాలికి సాధ్యమయింది మనకెందుకు సాధ్యం కావడంలేదు?

  క్రీమీ లేయర్ అని నేన్నది కుల, మతాలకు అతీతమైన ప్రభుత్వోద్యోగ మతస్థులైన సమస్త క్రీమీ లేయర్ గురించి, ఈ వ్యవస్థలో సగం బడ్డెట్ తినేస్తూ; సింహభాగం నిర్వహణ చేస్తూ 70 ఏళ్ళ నుంచి అద్భుతమైన స్వాతంత్ర్య ఫలితాలను అందించిన వర్గం గురించి.

  నా ఉద్ఘాటనలను అస్సలు పంచుకోనక్కరలేదు, సానుభూతి చూపించనక్కరలేదు. అంబేడ్కర్ 1950 ప్రాంతాలలోనే ఈ క్రీమీలేయర్ గురించి వాపోయిన సంగతి మీకు గుర్తుండే వుంటుంది., దాన్నయినా గుర్తుచేసుకోండి.

  Dr Ambedkar had said: “In every country the intellectual class is the most influential class. The masses are largely imitative and follow the intellectual class.” But the bitter truth is that the so-called intellectuals among these communities look at their own society with disdain and seldom try to directly involve themselves with the oppressed masses to help them join the mainstream.

  Even in his book, Annihilation of Castes, Ambedkar admits: “Our educated elite always fly away from the society.” Almost 57 years ago, during his last days, a heart-broken Ambedkar had confided in his secretary, Nanak Chand Rattu: “Whatever I have been able to achieve is being enjoyed by the educated few, who with their deceitful performances have proved to be the worthless lot, with no sympathy for their downtrodden brethren.” As the political class has nurtured and manipulated castes and ‘the minority’, the affirmative action has done the opposite — it solidified caste consciousness.

 9. Rajasekhar Chandram says:

  ఇది ఓ అడవి ఆత్మ గీతం…..గొప్పగా ఉంది..
  నేను వేసిన బొమ్మ మీ కవితకు ఉపయోగించడం చాలా సంతోషం గా ఉంది..
  నేను సైతం…

 10. కె.కె. రామయ్య says:

  ” అడివి అక్కడి వాళ్లకు మాత్రమే కాదు. పట్టణాల్లో, నగరాల్లోని వారికీ అమ్మే.
  … పోరాటాన్ని ఆడవులకు లిమిట్ చేసే ఎత్తుగడలకు అతుక్కుపోయి చాల హాని చేస్తున్నది.
  ఈ బాధ ఆ నా వారికి చేరాలని కోరిక ”

  కవిత ద్వారానే కాదు, మీ స్పందనల ద్వారాను మంచి సందేశం ఇచ్చారు హెచ్చార్కె గారు.

మీ మాటలు

*