ఉదయాస్తమయాల మలుపులు!

seetaram1

 

-సుపర్ణా మహి 

చిత్రం: దండమూడి సీతారాం

~

 

…తలుచుకున్నప్పుడల్లా

మరింత బరువెక్కే ఈ గుండె తో

నిశి వొడిలోకి తలొంచుకు వెళ్ళాలంటే

వెనుక

గతం నిముషానికోసారి

విస్తరించుకుపోయే అనంత విశ్వమ్…

🌼

తారాతీరాల తరగతి గదుల ముందు

నువ్వూ నేనూ

రోజూ దూరం తగ్గించలేని అపరిచితులమయ్యాక,

మన దారి రేపటికి లోపల

ఓ ఆశదీపం వెలిగించుకునే చిరునవ్వు

జ్ఞాపకమూ కాదూ,

దహించుకుపోతున్న విరహాగ్నిని ఆర్పి

ఊరుకోబెట్టే వీడ్కోలు కన్నీటిచుక్కా కాదు..

🌼

అసలు మైలురాళ్లే లేని పయనంలోకి

తప్పిపోయాక

ఉదయం, అస్తమయం

ఎవరికైనా

మలుపులే అవుతాయి తప్ప

చిరునామాలసలెన్నటికీ కావు…

*

మీ మాటలు

 1. POTAGANI KAVI says:

  అద్భుతమైన అభివ్యక్తి,మళ్ళీ మళ్ళీ చదివించి పాఠకుని మనస్సులో ఆలోచనల ఊటచెలిమలకు దాహం పెంచే ప్రత్యేకమైన శైలి,
  కవితా వస్తువు ఏదైనా చక్కని భావనాబలంతో రంజింపజేయగల నేర్పు ఈ కవి సాధించిన తపఃఫలాలు…ఈ రోజు నేనొక మంచి కవితను చదివాను.

  • Suparna mahi says:

   …చాలా చాలా ధన్యవాదాలు మీ అభిమానానికి 💚…🌼🌸🌼…

 2. Very good poem mahi

 3. సూపర్బ్ మహీ. శుభాభినందనలు!

 4. ధనుంజయ మూర్తి says:

  పయనం అనంతమైనాక చిరునామా ఉండదుగా. సూపర్బ్ మహీ.

 5. vani venkat says:

  adbhutaina bhavalu mahi …superb

 6. లాస్య ప్రియ says:

  అద్భుతంగా ఉంది మహి … ఇలా రాయటం నీకు మాత్రమే సాధ్యం

 7. govind naidu says:

  సూపర్ మహి …..మళ్ళీ మళ్ళీ చదివేలా చేసావ్ ….గోవింద్ నాయుడు

 8. సోదర అద్భుతమైన కవిత,

 9. సాయి.గోరంట్ల says:

  కవిత్వం పట్ల గొప్ప ఆసక్తి కలిగిస్తావు మహీ…నువ్వు
  ప్రతి పొయెమ్ లోను విభిన్నత,చక్కని భావ వ్యక్తీకరణ కలిగి వుంటాయి..
  ఫీల్ గుడ్ పొయెమ్ 🌺🌻🌺

 10. వాసుదేవ్ says:

  ఇంత చిన్న వయసులోనే ఇంత పరిణతిని నేనూహించలేదు మహీ. మీరు కవిత్వ పల్స్ పట్టారు. ఇంతవరకూ కవిత్వ భాషలోనే కవి తన మనసుని పాఠకునికి చేరవేసే ప్రయత్నం చేసే వాడు. కానీ మిరు పాఠకుడి స్థాయి పెంచే ప్రయత్నంలో సఫలీకృతులయినట్లే. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటే ఏంటో ప్రాక్టికల్ గా చెప్పారు ఈ కవితలో. బహుశ నాకదే అర్ధమయిందేమే.
  “దహించుకుపోతున్న విరహాగ్నిని ఆర్పి

  ఊరుకోబెట్టే వీడ్కోలు కన్నీటిచుక్కా కాదు.” ఈ వాక్యాల్ని చదివి ఓహో అని ఊరికినే అనలేం. మళ్ళీ మళ్ళీ చదవాల్సిందే. నాకెక్కడో అనుమానం మీరు మీ ఐడెండిటీనీ సరిగ్గా చెప్పట్లేదేమొ అని. ఎందుకంటే ఇది అర్ధం కావాలంటే సార్త్రేని మళ్ళీ చదవాల్సిందే లేదంటే ఇక ఇక్కడ ఆగిపోయి కవిత్వాన్ని ఎలా చదవాలో క్లాసులైనా తీసుకొవాలి. కుడొస్ మహీ

  • Suparna mahi says:

   …ఇం బ్లెస్సెడ్ సర్, చాలా చాలా ధన్యవాదాలు…
   నాకింతకంటే ఇక్కడ రాయడానికి మాటలు లేవు సర్…🌷💚🌷…

  • ధనుంజయ మూర్తి says:

   అవును సర్. మహీని చదవాలంటే పాఠకుడి స్థాయి పెరగాల్సిందే. నాకందుకే చాలా కష్టం, మహీని అర్థం చేసుకోవడం. అర్థం కాకపొతే, అనుభూతి చెందలేము కాబట్టి, నేను నిరంతరమూ ఆ ప్రయత్నంలోనే ఉంటున్నా….

మీ మాటలు

*