వాయిదా వేయ్

painting: Rafi Haque

painting: Rafi Haque

 

ఈ క్షణాన్ని

వాయిదా వేయ్

మళ్ళీ మళ్ళీ యుగాల కాలాన్ని

బంధిస్తా

 

అసమ్మతి సందర్భాన్ని

వాయిదా వేయ్

సమ్మతించిన కలయికలని

గుమ్మరిస్తా

 

మూసిన కలలను

వాయిదా వేయ్

తెరిచిన నిజాలను

నీ ముందు నిలుపుతా

 

తక్షణ మోహాలను

వాయిదా వేయ్

అచిర కాల ఆరాధననై

నిలుస్తా

 

కరచాలన పలకరింపులను

వాయిదా వేయ్

హృదయం విప్ప

పూయిస్తా

 

ముసురు కప్పిన మునిమాపులను

వాయిదా వేయ్

వెలుతురు పిట్టల ఉషస్సులను

ఎగుర వేస్తా

 

ఆకలి గొనన్న దాహాలను

వాయిదా వేయ్

మధుశాలలో చషకాన్నయి

అందివస్తా

 

నుదుట ముడిచిన సందేహాలను

వాయిదా వేయ్

కంటి చివర ఆనంద ధారలు

కురిపిస్తా

 

రగులుతున్న దేహాన్ని

వాయిదా వేయ్

శీతల గంధమై

హత్తుకుంటా

*

మీ మాటలు

  1. good one

  2. ముసురుకున్న సందేహాలను వాయిదా వేయ్…వాస్తవిక ప్రపంచాన్ని విప్పి చూపిస్తా నన్నంత ధీటుగా ఉంది..చాలా బావుంది

  3. syed sabir hussain says:

    బాగుంది…..కొత్తగా వుంది….మంచి కాఫీ తాగినట్లుంది.

మీ మాటలు

*