నిశ్శబ్దవాక్యంలాంటి నువ్వు మిగిలావు
చేతుల్లోకి తీసుకుని
హృదయానికి హత్తుకోవటానికి
ఎవరున్నారు –
పగిలిన చంద్రుణ్ణి
కళ్లకు అతికించుకుని
రేయంతా మేల్కొనటానికి
ఎవరున్నారు –
నిశ్శబ్దగానంలాంటి నువ్వు మిగిలావు
సూర్యుడు పుష్పిస్తున్నాడు
గాలెలా వీస్తుంది
ఏ తల్లీ స్వప్నించకపోతే
వీరులెలా పుడతారు
నిశ్శబ్దసంకేతంలాంటి నువ్వు మిగిలావు.
Baagundi mouli garu
చాలా చక్కని పోయెమ్ సర్… క్లాప్స్…
” ఏ తల్లీ స్వప్నించకపోతే వీరులెలా పుడతారు ”
ఏ కవీ ఆలాపించకపోతే వీరమాతల గర్భశోకాలెలా తీరుతాయి.
విరిగిన అలని
చేతుల్లోకి తీసుకుని
హృదయానికి హత్తుకోవటానికి
ఎవరున్నారు –
very touching sir !
నైస్.
ఒక ‘నిశ్శబ్దవాక్యం’ పుష్పించే సూర్యుడి కోసం …మీకోసం . అద్భుతంగా రాసారు
అబ్బ … ఎంత గొప్పగా రాశారు సర్ … థాంక్ యు సో మచ్ .