కొండలూ, మబ్బులూ…నా ఇల్లు!

seetaram1

కొండల నడుమ

మబ్బుల  పందిరి కింద

అందే ఆకాశపు అందాల దారిలో

నా  ఇల్లు

*

 

దండమూడి  సీతారాం చూసిన  ఈ  దృశ్యాన్ని మీ  అక్షరాల్లోంచి  చూసి  ఇక్కడ మీ మాటల్లో చెప్పండి.

 

మీ మాటలు

 1. నా గది కిటికీ లో  తొంగి చూస్తుంది…
  ఉదయపు తొలి చిరు లేత  వెలుగు.

  తమ రెక్కల్ని మరింత విచ్చుకొని
  పావురాళ్ళు చక్కర్లు కొడుతున్నాయి.
  తెల్లని మబ్బులు తన చేతుల్లోకి
  మంచుకొండ ముఖాన్ని తీసుకుని ముద్దాడుతుంది.

  రాత్రంతా పరిమళించిన  నైటిక్వీన్
  పూలను తనలో దాచుకొనే పనిలో వుంది.
  రాత్రంతా కన్న కలల్ని కంటి రెప్పల్లో
  దాచుకొని ఉదయానికి పూచే నా కంటిపాపల్లా.

  మట్టి గుట్టలు ఈ మధురమైన దృశ్శానికి
  సుతిమెత్తని  పియానో వాయిస్తూ వుంది.
  ఈ ఉదయం నేను జీవించి వుండటం
  అనే ఈ వరం కాక నాకు ఇంకేం కావాలి.
         -గండికోట వారిజ. 25-11-2016

 2. Mythili Abbaraju says:

  కనుచూపుమేరంతా కాచుకుంటూ మబ్బురెక్కలు
  ఎక్కి వెళ్ళి పోగలిగే ఆకాశపు నిశ్శబ్దం
  గుట్టలసందిలి చాలక
  కట్టుకు పోతూన్న ఇళ్ళు
  ఒకటీ రెండూ మూడూ…..

మీ మాటలు

*