రాజ్యమా ఉలికిపడకు

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

యే దిక్కునుండో
నోట్లు రాలుతున్న శబ్దం

కన్నీళ్లు
కరెన్సీనోట్ల ముందు
మంచుగడ్డలై మౌనం వహిస్తుతుంటే
కుబుసం విడిచిన రాజ్యం
కొత్త నవ్వులు నవ్వుతుంది

గుండెల్లో
లాండ్మైనింగ్ జరుగుతున్నట్టు
కరెన్సీ నోట్ల బాంబులు

అక్కడో సగటు మనిషి
తలగడ కింద నోట్లతో
శూన్యంలోకి చూస్తూ
తిరగబడ్డ ఆకాశానికి
శాపనార్థాల రాళ్లు విసురుతున్నాడు

ఆశలని మోసిన భుజాలు
ATM ల ముందు
కనబడని శిలువతో కూలబడుతుంటే
అచ్చేదిన్ స్టాంపును వీపులపై ముద్రిస్తూ
కాషాయపు చువ్వలు

రాజ్యమా ఉలికిపడకు
నీ వోటే అది కళ్లు పెద్దవి చేసిచూడు

యే దిక్కునుండో
నోట్లు రాలుతున్న శబ్దం
కాళ్లు భూమిలో దిగబడుతుంటే
వినిపిస్తున్న దేశభక్తిగీతం.

*

మీ మాటలు

  1. కవిత బాగుంది ఏ అంశం పై కవి సమ్మేళనం జరిపి ప్రజా నిరసన తెలపాల్సిన బాధ్యత కవుల పై వుంది . మెర్సీ మార్గరెట్ గారికి అభినందనలు . మస్తాన్ వాలి ,కడప 9704073044

  2. మెర్సీ ఒక సామాజిక సంక్షోభ సందర్భంలో తీవ్ర కంఠధ్వనితో నిరసన కవిత్వం తో తెలుపడం నిజంగా ఆశ్చర్యం కాదు.మెర్సీ ప్రతి సందర్భాన్ని ప్రధానంగా ప్రజల పడే బాధల్ని వేదనల్ని కవిత్వం చేస్తూవచ్చింది.

    ఆకాశానికి శాపనార్థాల రాళ్ళు విసిరే సామాన్యుని నిరసనను కవిత్వం చేసిన తీరు బాగుంది.అభినందనలు మెర్సీ కి.

  3. Rajendra Prasad says:

    వెరీ నైస్. నిజాలు >>>

  4. Ramakrishna says:

    ముందు ముఖ్యంగా చెప్పాలంటే.. పెద్ద నోట్ల రద్దును స్వాగితిస్తున్నాను. కానీ ముందస్తు నిర్ణయంకంటే కూడా.. తర్వాతి పరిణామాలకు ప్రభుత్వం సిద్దపడి లేకపోవడం అనేది క్షమార్హం కాదు.

    నేనూ సామాన్యుడినే కాబట్టి, ఇప్పుడున్న కష్టమనుకోండి, అగచాట్లనుకోండి.. నాలో ఏదో మూల వ్యాఖ్యానించలేని బేలతనం అలా సర్దుకుని పడుండొచ్చు.. మెర్సీ గారు అలా కాదు కదా..?

    కవిత్వమైతే తేలిగ్గా వంటబట్టింది కానీ..

    కాషాయపు చువ్వలు, దేశభక్తి, రాజ్యం.. ఎందుకో? గొంతు దిగడం లేదు.

  5. Gangadhar Veerla says:

    అర్ధవంతం.. సమకాలీనం.
    వాస్తవికతకు అద్దంపట్టిన మీకవిత ప్రచండభానుడిలా పాలకుల్ని హెచ్చరికలు చేస్తున్నట్టుగా ఉంది.
    మంచి కవిత..కు జేజేలు
    – గంగాధర్ వీర్ల

  6. D. Subrahmanyam says:

    ఇప్పుడు రాజ్యం చేస్తున్న దోపిడీనీ చాల చక్కగా చిత్రించారు మెర్సీ. ఇప్పుడు జరిగే కొన్ని వేళా-లక్షల కోట్ల పెద్దల అప్పుల మాఫీల గురించి అది బేంకు పుస్తకాల సవరణకు ఎంత అవసరమో చెపుతున్న బుద్ధి(హీన) పెద్ద పెద్ద ఫైనాన్స్ పెద్దలు ఈ కవిత చదవాలి. ఆ పెద్దలకు అదే మాఫీ చిన్నకారుల రైతుల రుణాలకు ఎందుకు ఇవ్వరో అన్న ఆలోచన రాని దౌర్భాగ్య దేశం లో బతుకుతున్నాం. అభినందలు మెర్సీ. ఇలాగె గొప్ప కవితలు రాస్తూండండి.

  7. syed sabir hussain says:

    సమకాలీన కవిత. మార్గరెట్ గారికి అభినందనలు.

  8. Doctor Nalini says:

    దేశం సొమ్ముని బడాబాబులు భోంచేస్తే వారి రుణాలు మాఫీ . బడుగు జీవులు మాత్రం కష్టాల శిలువలని మోస్తూ పిచ్చి వాళ్లవుతున్నారు. అవును, కుబుసం విడిచిన రాజ్యం చురకలు పెడుతోంది . బ జ ర , మెర్సీ వంటి వారి మాటలకి మేధావుల భ్రమలు తొలగితే దేశానికి మంచిది. కంగ్రాట్స్ మెర్సీ .

  9. పఠాన్మ మస్తాన్ ఖాన్ says:

    దేశంలో యేర్పడుతున్న హింసా నిర్మాణాల నుండి దృష్టిని మరల్చే వో పెద్ద కుట్రగా డీమానిటైజేషన్ ను ముందుకు తీసుకొచ్చిన వర్తమాన రాజ్యం దేశభక్తి పేరుతో అవినీతిని అరికట్టే ప్రయత్నాన్ని చాలా డొల్లగా చెప్పి అతి సామాన్యుల పేదల కష్టాలను కవితావస్తువై ద్రవించిన మెర్సీకీ మరో అరచేతినందించాలని కోరుకొంటూ….వస్తూత్పత్తిని గురించి మాటాడని ప్రభుత్వాలు ప్రజలను మభ్య పెట్టేవే…వస్తూత్పత్తి కి మారక త నిచ్చే కరెన్నీ అంటే ద్రవ్యం లిక్విడిటీ ల మధ్య సమతుల్యత లోపించిన విషయాలనూ విశ్లేషణలను పూర్తిగా మరుగున పడేసే ప్రయత్నంలో భాగమెే…డీమానిటైజేషన్….
    యింకా స్థానికంగా ఆర్త…ఆర్త్తం…ఆర్తఇ…స్వావలంభన దిశగా కనిీస ఆలొోచన విధి విధానాలే లేని వ్యవస్థలో సమిధలెవ్వరూ?….

  10. kandikonda says:

    మెర్సీ గారు… మీ పోయెమ్ చాలా చాలా బావుంది ధన్యవాదాలు

  11. రెడ్డి రామకృష్ణ says:

    మెర్సీ మార్గరేట్ గారూ! మీ కవిత బాగుంది: అభినందనలు

Leave a Reply to s.masthanvali Cancel reply

*