స్వప్నాన్ని నాలో వొంపండి

jaya1

పూనే, మహారాష్ట్ర లో నివశించే జూయి కులకర్ణి మరాఠీ యువకవయిత్రి. హిందీ లోనూ కవితలల్లే చిత్రకారిణీ. మరాఠీ,హిందీ ఆంగ్ల భాషలతో పాటు పిగ్ లాటిన్ భాషలలో ప్రావీణ్యం సాధించిన బహుముఖ ప్రతిభావంతురాలు.

రాత్రంతా మేల్కొంటున్నావా? రెండు నదీ తీరాలను యేకం చేసే కవిత్వాన్నీ రాస్తున్నావా? అంటూ పలువురి సాహితీవేత్తల ప్రశంసలందుకొంది. శ్వాసల నిర్మాణ కార్యం అనే యీమె కవితా సంపుటి మరాఠీలో ఆసక్తిని రేకెత్తించింది. అతికోమలంగా కనిపించే పదాల వెనుకటి అల్లకల్లోలాలు పాఠకులను కలచివేసే కవితలు. యీమె కవిత్వ అభివ్యక్తి నూతనంగా వుండి ఆలోచింపజేస్తుందిలా-

నేటి నా కన్నీరును యీ పూలసజ్జలో దాస్తున్నాను..కొన్ని రోజుల్లో వో యాత్రికుడి దాహాన్ని తీర్చాక ఆరిపోవచ్చు.యీమె కవిత్వంలోని కల్పనలు,ప్రేరణలు,అర్థవంత నిర్మాణాలకు పునాదిగా నిలిచి మానవ సంబంధాలను నిర్మిస్తాయి. యీ కవితను గీత్ చతుర్వేది మరాఠీ నుంచి హిందీ చేసారు.

jaya

స్వప్నాల దాడి
——————–

యీ రోజుల్లో స్వప్నాలు
గొప్పగా ప్రపంచ వ్యవహారికంగానే వస్తున్నాయి

స్వప్నాలలోనూ
వంట చేయాలనిపిస్తుంది
చాలా సార్లు నన్ను నేను
వంట చేస్తున్నట్టే స్వప్నిస్తాను

చీల్చుతూ, కోస్తూ, మర్థిస్తూ
వుడకబెడుతూ, వేయిస్తూ, వండుతూ
పెరుగుతూనే వుంటాయి
నీ కవితలు, కథలు,వృత్తాంతాలు,నవలలు

స్వప్నాలలోనూ
తెరచిన కిటికీ నుంచి
బల్లులు, కప్పలు వస్తుంటే చూస్తుంటాను
భయపడిపోతుంటాను

స్వప్నాలలోనూ
గడియారపు ముళ్ళపై
నా బరువును తూకం వేసి
ఆకస్మిక భీతిలో నిద్రపోతాను

స్వప్నాలలోనూ
రుచి చెడిన అన్నపు వ్యంగం
గొర్తొస్తుంది

వినండి!
మీరెవరైనా సరే
బలవంతంగానైనా పర్లేదు
కొత్త కొత్తగా గాని
కఠినాతి కఠినమైనవి కాని
చూచేందుకు సరైన
స్వప్నాన్ని నాలో వొంపండి..

*

మీ మాటలు

  1. కొత్తగా గాని

    కఠినాతి కఠినమైనవి కాని

    చూచేందుకు సరైన

    స్వప్నాన్ని నాలో వొంపండి..”

    చాలా ఇంటరెస్టింగ్ అభివ్యక్తి ,అంతేకాదు చాల మంది గందరగోళ కలల ప్రహసనం కూడా
    జుయ్ కులకర్ణి వినూత్న అక్షరాల అల్లిక అందమైన గమ్మత్తు .

మీ మాటలు

*