ఒకానొక సర్జికల్ సందర్భం..

 

mandira1

Art: Mandira Bhaduri

 

అర్థరాత్రికి అటువైపు, ఒక ఉలికిపాటు

కొందరి పీడకల, మరికొందరికి హర్షాతిరేకమైన గగుర్పాటు

అంతా మిథ్య అనే మాయావాదికి

ఒక వాస్తవికమైన ఆసరా

అంతా నిజం అనుకునే వాస్తవికవాదికి

ఒక అసహజమైన షాక్

కలడు కలడనువాడు కలడో లేడో

జరిగాయంటున్నవి, జరిగాయో లేదో

అందరిలోనూ సందేహాస్పద దేశభక్తి

ఒక వర్గంలో రగిలిన భీతి

ఉప్పొంగిన మరో వర్గం ఛాతి

వీర తిలకాలు దిద్దుకుని విర్రవీగిందొక జాతి

సరిహద్దులు దాటితే దేశభక్తి

మరి, మన హద్దుల్లో దానినేమందురు?

అయినా, అనుమానించామన్న అపప్రథ మనకెందుకు?

పోలీసులది రాజ్యభక్తి, సైనికులది దేశభక్తి

అంతేనా?

అయినా, అధినేతే స్వయంగా రంగంలో నిలిచినప్పుడు

సాక్ష్యాలనీ, ఆధారాలనీ వెంపర్లాటెందుకు?

ఓట్లనీ, సీట్లనీ, అధికారం కోసమనీ విశ్లేషిస్తారు కొందరు

రెక్కలు కట్టుకుని చుట్టి వచ్చిన దేశాల దౌత్యనీతి సఫలతను

పరీక్షించుకున్నాడంటారు మరికొందరు

బీఫ్ రాజకీయాలు, అక్షరాలకు నెత్తుటి పూతలు

అంతరంగాకాశాన్ని అలుముకుంటున్న అసహనంపై

ఎంతకైనా తెగిస్తామంటూ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టాడు

చివరాఖరికి

అద్దంలో శత్రువును చూపించి భళ్లున పగులకొట్టాడు

రాలిన మన ముఖాలను వాస్తవాధీన రేఖపై వేలాడదీశాడు

బహుశా-

పొడుచుకొచ్చిన విభజన రేఖలను దాటితే తప్ప

మనం ఈ దేశంలో అంతర్భాగం కాలేమేమో?

మీ మాటలు

  1. D. Subrahmanyam says:

    ప్రస్తుత దేశ పరిస్థితిని బాగా చిత్రీకరించారు దేశరాజు గారు . ముఖ్యంగా ఈ పదం బావుంది “సరిహద్దులు దాటితే దేశభక్తి

    మరి, మన హద్దుల్లో దానినేమందురు?

    అయినా, అనుమానించామన్న అపప్రథ మనకెందుకు?

    పోలీసులది రాజ్యభక్తి, సైనికులది దేశభక్తి

    అంతేనా?.

  2. విలాసాగరం రవీందర్ says:

    బహుశా-

    పొడుచుకొచ్చిన విభజన రేఖలను దాటితే తప్ప

    మనం ఈ దేశంలో అంతర్భాగం కాలేమేమో?

    నిజమే సర్

    వాస్తవిక రాజకీయ చిత్రం

  3. చాలా బాగుంది ఆశారాజు గారూ- అభినందనలు. చేయవలసినదే జయప్రదంగా చేశారనుకుందాం. దానికి కారకులైన వారందరికీ అభినందినలందిద్దాం. కాని దానిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం , అది ఏ పక్షమైనా ఆక్షేపణీయమే.

  4. Aranya Krishna says:

    పొడుచుకొచ్చిన విభజన రేఖలను దాటితే తప్ప

    మనం ఈ దేశంలో అంతర్భాగం కాలేమేమో?”…నిజమే!

  5. కె.కె. రామయ్య says:

    “Our homeland is the whole world. Our law is liberty.
    We have but one thought, Revolution in our hearts “ ~ Dario Fo

    ప్రముఖ ఇటాలియన్ నాటక రచయిత, రంగస్థల కళాకారుడూ, రాజకీయ కార్యకర్త
    డారియో ఫో ను అద్భుతంగా పరిచయం చేసిన శ్రీ దాసరి అమరేంద్ర గారి వ్యాసం జ్ఞప్తితో

    http://saarangabooks.com/retired/2016/10/14/%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B-%E0%B0%AB%E0%B1%8B-%E0%B0%85%E0%B0%A4%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%B0%E0%B0%82%E0%B0%97%E0%B0%82/

  6. రెడ్డి రామకృష్ణ says:

    దేశరాజు గారు,
    పోయం బాగుంది.సూటిగా,స్పష్టంగా పవర్ఫుల్ గా వుంది.అభినందనలు

  7. THIRUPALU says:

    /అద్దం లో శత్రువుని చూపించి భల్లున పగలగొట్టాడు
    రాలిన మన ముఖాలను వాస్తవాదిన రేఖపై వేలాడ తీశాడు. /
    దృశ్యం సుస్పష్టంగా చూపించారు.

  8. Koduri Vijayakumar says:

    అద్దంలో శత్రువును చూపించి భళ్లున పగులకొట్టాడు

    రాలిన మన ముఖాలను వాస్తవాధీన రేఖపై వేలాడదీశాడు

    …… ప్రస్తుత స్థితికి అడ్డం పట్టే నీ కవిత్వ వాక్యాలు !

  9. వెరీ పవర్ఫుల్ పోయెం

  10. బాగుంది రవి. ఆ అద్దం ఇమేజ్ మరీ చాలా బాగుంది.:-)

  11. Kcube Varma says:

    అద్దంలో శత్రువును చూపించి భళ్లున పగులకొట్టాడు

    రాలిన మన ముఖాలను వాస్తవాధీన రేఖపై వేలాడదీశాడు

    Vaastavikatanu pratibimbinchindi poem.. abhinandanalu sir

  12. Sadlapalle Chidambarareddy says:

    ప్రస్తుత ద్వంద్వ ప్రమాణాల ముఖ చిత్రం చక్కగా చూపారు

మీ మాటలు

*