గడియారంలో ముళ్ళు లా
దగ్గరయ్యీ..దూరమయ్యేతనం
దిగులు లాంటి గాయం చేస్తుంది..!అయితేనేం..కిటికీ ఊచలపై గువ్వపిట్ట
తడిసినరెక్కల సయ్యాట చూసినప్పుడో..
చెమరింతల చినుకుల తడికి
గరిక సవ్వడుల పదనిసలు విన్నపుడో..
నక్షత్రాల మీంచి నడిచొచ్చిన గాలిలో
నిండిన గమకాలు చుట్టేసినపుడో..
చిగుర్ల నించి వేర్లు వరకూ నింపుకున్న
ఆకుపచ్చని ఆశల వాసన కమ్మేసినపుడో..
నీ ఇరు కనుపాపలూ ఆర్తిగా
నన్ను మాత్రమే కాంచే వేళలో
గుప్పెడు సీతాకోకలు గుండెల్లో వాలినప్పుడో..
అప్పుడు..
అస్సలాశ్ఛర్యంగా..
బతికిన క్షణాలు కాసిని పోగేసుకుని..
కాలం చేసే విన్యాసాలు తట్టుకుని
నిలబడాలనిపిస్తుంది..
దూరమయ్యీ..దగ్గరయ్యేతనం కోసం..!
వెరీ గుడ్
Congrats syamala గారు
Venu nice poem💐💐
very nice. గువ్వ పిట్ట పలుకులా..
ఎంత చక్కని ఫీల్… బ్యూటిఫుల్ నెరేషన్ తో హృద్యంగా మలిచారు మా…
అభినందనలు…
So lovely Syamala garu. Congratulations!!
చాలా పరిణతి కన్పడుతోంది మీ ఈ కవితలో!! పదాల ఎంపిక నుంచి ఎత్తుగడ నుంచి ముగింపు వరకూ బాగా కుదిరింది. క్లాప్స్
చాలా అద్భుతంగా రాసారండి .. నైస్ ! వ్యక్తీకరణ సూపర్ !