నేను నాట్యం చేయడం లేదు!

చిత్రం: రామశాస్త్రి

చిత్రం: రామశాస్త్రి

ఈ  పాట వీడియోను శ్రధ్దగా విని చూడండి.. నాకు మాత్రం వీడియో చూస్తుంటే నోట మాట రాలేదు. 1997 మార్చి ఏడో తారీఖు అంటే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం అపుడే యవ్వనంలోకి అడుగుపెడుతున్న వేళలో ఒక అమాయక పరవశంలో నేను రాసుకున్న కవిత కు అచ్చమైన ద్యశ్యరూపంలా ఉంది..  అప్పటికి కవితకు ఎవరో ఇంత అచ్చమైన దృశ్యరూపం ఎలా చేసేసేరబ్బా అని ఒకటే ఆశ్చర్యం .. ఇది సినిమా పాట కాదు. ఒక క్రౌడ్ ఫండింగ్ మ్యూజిక్ వీడియో. రెండు రోజుల క్రితమే వీడియోలో షేర్ చేశారు. సినిమా  పాటల కన్నా అందంగా గొప్పగా ఉంది.  లింక్ కింద నా పాత కవిత. చిన్ననాటి లాలస నా కళ్ల ముందు లాక్కొచ్చిన  ఈ పాట నాకెంతో నచ్చింది.

https://www.youtube.com/watch?v=0K8qu5H4oXk

 

 

The Celebration of a Dance

 

నేను నాట్యం చేయడం లేదు

లేప్రాయపు దేహపు వేడుక చేసుకుంటున్నాను

మోహంపు తనువుగా ఎగిసిపడుతున్నాను.

 

ఎదురుచూపుల మనసు తనువై కంపిస్తున్నాను

యవ్వన చిత్రపటాన్ని గీస్తున్నాను.

ఉరకలేసిన నెత్తురౌతున్నాను.

 

నేను నాట్యం చేయడం లేదు

పాదాలతో కదలికల కత చెబుతున్నాను

పరుగుల కవిత రాస్తున్నాను

పాదాలతో అతడి పేరు రాస్తున్నాను

స్నప్న నిఘంటువు రచిస్తున్నాను

మునివేళ్ళతో పుడమిపై ముగ్గుపెడుతున్నాను

 

నేను నాట్యం చేయడం లేదు

భూమికి చిందు నేర్పిస్తున్నాను

భూమికి తుపాను హెచ్చరికలు చేస్తున్నాను

యుద్ధం తాకిడి అభివర్ణన చేస్తున్నాను

 

నేను నాట్యం చేయడం లేదు

భూదేవికి పాదాలతో చందనం పూస్తున్నాను

మునికాలివేళ్ళతో ఆమెను చుంబిస్తున్నాను

భూమి డోలుపై దరువు వేస్తున్నాను

 

నేను నాట్యం చేయడం లేదు

చలనపు నియమావళిని మట్టుబెబుతున్నాను

పాదాలు రెక్కలు వచ్చిన పక్షులౌతున్నాయి

హుషారెక్కిన నెమలి భంగిమనౌతున్నాను

తుళ్ళింతల నాట్యం చేస్తున్నాను

ఆత్మాభిషేకం చేస్తున్నాను

లయల కడలి పొంగునౌతున్నాను

 

నేను నాట్యం చేయడం లేదు

నడడకు సెలవిస్తున్నాను

భూమి పల్లకీపై పాదాల బోయీనై ఊరేగుతున్నాను

గాలి ఊయల తూగాడు పూవునౌతున్నాను

 

 

నేను నాట్యం చేయడం లేదు

అతడితో వలపు తాండవం చేస్తున్నాను

లయాత్మక చాపల్యమౌతున్నాను

వేదనను పాతాళంలోకి సరఫరా చేస్తున్నాను.

*

మీ మాటలు

  1. ravichandra says:

    డాన్స్ వీడియో తో పోటీ పడి ఉరకలెత్తినట్లు ఉంది ఈ కవిత. హ్యాట్స్ ఆఫ్ . యాదృచ్ఛికత ఒక్కోసారి మనలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది . అది మీకు దక్కినందుకు అభినందనలు .

  2. ఒక మంచి డాన్స్ వీడియో ని మాకు కూడా చూపించినందుకు మీకు అనేక కృతజ్ఞతలు !ఆ డాన్స్ లో అమ్మాయి అబ్బాయి చాలా బాగా చేశారు . అబ్బాయి వర్క్ చాలా graceful గా ఉంది.
    మీ కవిత మీరు అనుకున్నట్లు ఆ డాన్స్ కి సరి తూగింది . మాకు నాట్యము ,పాట ,కవిత్వం తో విందు చేశారు . థాంక్యూ !

  3. D. Subrahmanyam says:

    బావుంది.

  4. లాలస గారు, మీ పోయెట్రీ చాల బాగుంది
    మీరు రాసిన కవితలు ఇంకా చదవాలని ఉంది.

  5. Rajendra Prasad Chimata says:

    గొప్ప వీడియో. సంగీతం నృత్యం నటన అద్భుతం 👏👏👏

  6. Sadlapalle Chidambarareddy says:

    ప్రకృతిలో ఒక పుష్పానికి విడదీయ నంతగా రంగు ఆకారమూ పరిమళమూ సమకూరినట్లు ఈ పాటా అభినయమూ సంగీతము చిత్రీకరణమూ హ్రదయంగా ఆరాగ్యాంగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం!!

  7. పాదాల నాట్య విన్యాసాల పరమార్థం ,లాలస “నెను నాట్యం చెయడం లేదు “కవిత కు సరితూగుతు “నీవె “dance video బాగుంది.
    A pleasant coincidence

  8. Aranya Krishna says:

    I directly heard this poem from you. I still remember it. It was more fascinating!!

Leave a Reply to Aranya Krishna Cancel reply

*