ప్రకృతి ఒక క్యాన్వాస్!

seeta1

 

ప్రకృతిని మించిన కృతి  లేదు! కెమెరా లెన్స్ ఒకసారి  ప్రకృతితో ప్రేమలో పడ్డాక ఎన్ని వర్ణాలో  ఆ ప్రేమకి! ఆ  వర్ణాలన్నీ తెలిసినవాడు  దండమూడి సీతారాం!

ఈ దృశ్యాన్ని  మీ  అక్షరాల్లో బంధించండి.

కవితగానో, చిన్ని మనోభావంగానో ఆ దృశ్యానువాదం  చేయండి.

మీ మాటలు

 1. వావ్ అద్భుతం ! అఫ్సర్ భాయ్. ధన్యవాదాలు _/\_

 2. దేవరకొండ says:

  నేను పరిమితం కావచ్చు…
  ఆకాశాన్ని ప్రతిఫలించి
  అనంతాన్ని అయ్యాను!
  అందుకు నేను చేసిందల్లా ఒక్కటే!
  చేయనివి ఎన్నో…
  నింగితో మాట్లాడుకోలేదు,
  నింగిని తాకలేదు కనీసం!
  నింగి అనుమతి తీసుకోలేదు,
  నింగిని చేరాలనుకోలేదు!
  చేసింది ఒక్కటే!
  నన్ను నేను స్వచ్ఛపరచుకున్నాను!
  అమాంతం ఆకాశం నేనయ్యాను!
  నీటిగా ఉంటూనే నీలాల నింగినయ్యాను!
  నన్ను దాటించే వంతెనలు,
  నా సందేశాన్ని నరునికివ్వలేవు!

మీ మాటలు

*