అండర్ ఎచీవర్

Painting: Mandira Bhaduri

Painting: Mandira Bhaduri

కత్తి దూయాలంటే ఎవరి మీద బాలికే,
పీక కోసుకోవడానికో చెవిలో గులిమి లాగడానికో మినహ ఇహ చిలుం పట్టిన చురకత్తులు ఎత్తేదెవరిమీద జనాభ్ . ఇంటెలెక్ట్చ్యువల్ కాంపిటీషన్ మిస్ అవ్వడంకంటే పెద్ద విషాదం ఇంకేమి ఉండబోదు జీవితంలో అని తెలిసిందే కదా సుమతీ, అయిననూ బతుకు రాతల విషపాత్ర పంచుకొనే సోక్రటీస్ జాడెక్కడాంటూ ఎన్నాళ్ళీ ఎదురుచూపులు  .ఎవరికి వాళ్ళు కంఫర్ట్ జోన్ గేంలో బిజీ అయ్యాక అసలు ఆటెవరితో నీకు బేలా??

నీకు నువ్వే పోటి సాటి మేటి. నిన్నటికంటే ఈ రోజు ఇంకొంచం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడమే ఆర్టిస్ట్ ఆదిమ లక్షణం అంటాడో పెద్దాయన(అదేలే నాలో నీడగాడు ) సో సోలో లైఫే సో బెటరు జిందగీలో సింగిల్ సోల్ దో సుకూన్ , పరంతూ సింగిల్ హ్యాండ్ చప్పట్ల మజా లేదే? ఏడుస్తున్నారనో ,ఎలుగెత్తుతున్నారనో రేసుల్లోంచి రహస్యంగా జారిపోయాక ఎక్కడో ఒక మెరుపు రేఖ తళుక్కుమంటూ
మెరుస్తుంది .అదుగోరా, ఆశాకిరణమది అందుకోమంటూ ఎగబాకుతూ ఉంటామా సరిగ్గా సాహసం గొంతుదాటి ప్రళయధ్యనులు వినిపించే సెకనుకి మెరుపెందుకో ఆకాశాన్ని కప్పుకొని టాటా ..వీడుకోలు.. గుడ్ బై ఇంక సెలవు అంటుంది. వెనక తెగిన వీణల హతాశ్షురాగాల మోత ఓ రొద మోయలేని మరో వ్యధ . పిమ్మట కొంతకాలం  నీలగిరుల్లో దూకిన అత్మని వెంటబెట్టుకొని అస్త్రసన్యాసమనబడు అశృవుకటి చిందించి, అయినను పోయిరావలె అక్షరపురమునకు అంతం కాదిది ఆరంభమనుచు మండుగుండెల మాటున దాచిన చెమ్మలు ఇగిరిన మేరకు నానా తంటములు పడి అదిగో అల్లదిగో పదభందము అంటూ అల్లంత దూరాన అల్లనల్లని అడుగుల్లో ఎదురొస్తున్న కావ్య కన్నీయడి ఎదపై వాలి సొద పెట్టిన సైతమూ శోకము శమించదు . ఈ దాహమూ తీరదు .రైటర్స్ బ్లాక్ కాదు భయ్య బ్లాక్డ్ రైటర్స్ అసోసియేషన్ గిల్డు ఇక్కడ , గిల్టు పూతల నడుమ గిలగిలలాడుతూ గిరాటేసి కొట్టిన ప్రతిసారి లేచి నిలబడుతూ ,సెల్ఫ్ గోల్లో జారిపడినపుడంతా  నడ్డి విరగొట్టుకొని  అక్కటా ఒక్కటా రెండా,మూడు ముక్కలాటలో పరమపదసోపానం యూ ఆర్ డెడ్ యాస్ యే రైటర్ నాట్ బై వర్చ్యూ బట్ బై షీర్ చాయిస్ మైండ్ ఇట్ రాస్కెలా .అయినను సావిరహే తవదీనా రాధా , విరహదాహమంత వేదన లేదోయి వేమన,వాట్ డూ యూ సే ?? చెప్పడానికేముంది లోకహిథార్ధం బట్టలిప్పి బరిబాత్తల నిలబడ్డ క్షణానే తెలియలేదా సన్యాసం అచ్చంగా సాగరం అంత టెంప్టింగనీ వేమనోరు గోచిపాతల చిరుగులు కుట్టుకుంటూ గుర్రుమనుట ఖాయం

గోచో పాచో,గోనెసంచుల్లో ఎమోషన్లు ఎత్తుకోవడం మొదలెట్టాక .జిందగీకా రిసెట్ బటన్ కహా రే సాలో ? మాంత్రికుడి ప్రాణము ఏడుసముద్రముల కావల గూటిలో బుజ్జి గువ్వ గుండెలో ఉండును , చిలకమ్మ గుండె నెమురుకున్నప్పుడల్లా ఇక్కడ ప్రాణము విలవిలాడుతూ కళ్ళెంట జలజలారాలును అదియే విధి వైపరీత్యము నాయకా. చిలక నువ్వే చిరంజీవి నువ్వేయన్న సత్యము మరిచిన మనోవ్యాధికి మందెక్కడ . అయినను మంత్రం నేర్చిన మాయల ఫకీరునకు ప్రేమోచ్చినపుడు అంజలీదేవియగుట వొళ్ళుమండినప్పుడు కుక్కయగుట బీటింగ్ అవసరాలు తగ్గినప్పుడు చిలకలగుట స్త్రీ వేషధారికి తప్పని తగలాటము కదా.హతోస్మీ అయినా జోకులు కాకపోతే ఆడోళ్ళకి క్యారెక్టరేమిటి బాసు? పాత్రోచితముగా డైరెట్రు అనబడు సిస్టం నడిపే నావికుడు ,మగవాడు అందునా వాడి తమోగుణాన్ని ఆడువారి రజోగుణంగా మార్చి చూపగల సో కాల్డ్ వెన్నులెస్ మెన్ను, నవ్వమన్నప్పుడు నవ్వి ,ఏడవమన్నప్పుడు ఏడ్చి ,విప్పమన్నప్పుడు ఆ నాలుగు పీలికలు విప్పి కుప్పబోసి సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు అని గానా సహితముగా కామతాపపు వేడి ప్రజ్వరిల్లిన క్షణాన మన్మధుడు పూనిన రతీదేవివోలే మాడి మసై అగ్నిప్రవేశం అంకమున మిగిలిన బూడిద అగ్రజుడి సిమ్హాసన సోపానము జేయవలె కదా . ఇందులో మళ్ళీ స్పెషల్ అట్రాక్షన్ ఐటెం సాంగ్ క్రింద స్త్రీ యనగా తమన్నా వలే పొట్టిగా గట్టిగా మీగడతరకవలే యున్న హస్తమాలికలు పూచెండ్ల పరిమళము (అవే అవే , యూ గాట్చా బేబీ ) నొసగుతూ తగిలీ తగలకుండా అందీ అందకుండా ముద్దడవలెనే తప్ప శూర్పణకలు ఎంటర్ ది డ్రాగన్ అవతార్ కట్టి మీదడి ముద్దడిగిన “స్త్రీ”డ్రామచంద్రుడు బొత్తిగా విథ్ ప్యూర్ హార్ట్ అస్సయించుకొనును కదా డార్లింగ్ .అబ్బెబ్బే నీకు బొత్తిగా ఫెర్మోనుల మోనింగ్ తాలుక ఈస్తటిక్ సెన్సులేదమ్మీ శూర్పణక్కాయ్, పొరపాటిది తడబాటిది గుంజిళ్ళే తీసెయ్యవే .మీన్ వైల్ మీ వలెనే  మిమ్ములని మించి వుమన్ వాంటిట్ నీడిట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫక్కింగ్ మూడ్స్ టూ ( కి కి కి ) అని వాడికెవడు జెప్పవలే . చెప్పినందుకేగా కోసేయ్ ముక్కు, చెవితో పాటు మదపుటాలోచన సహితము .మాటే మంత్రమూ మనసే స్థబ్ధమూ లోల్ .

రంగుపొంగుల ఈస్టమనుకలరులో కామకేళి గాంచిన చదువరీ ఇంతకీ ఎక్కడుంటిమి అస్త్రసన్యాసమనబడు ఆరునొక్క రాగమున కదా . ఇపుడు మరలా సన్యాసమనబడు డ్రామాపై  అంత అనురక్తి ఎందుకో అంటే భీష్ముడి హథ శిఖండి చావుకొచ్చింది భయ్యా :(  పీటర్లు వారిననుకరించే రిపీటర్లు మినహ కాంపిటీటర్లు యుద్ధభూమి ఖాళీ చేసాక కత్తెత్తడమెందుకు పీక్కోసుకోవడానికో,చెవులో గులిమి తీసుకోవడానికో తక్క మరెందుకని బోర్ డోర్ కొట్టి మరీ అరుస్తుంది జహపనా, జిందగీ అబ్ తో బతా, అప్నా పథా అంటూ .స్టేటస్ మేసేజి “ఫీలింగ్ హథవిధీ మళ్ళీనా “.

వాయిడ్ ఏమిటిరా వాయిస్ లేకుండా ఇంత విశాలంగా వ్యాపిస్తుంది

*

మీ మాటలు

  1. జీవిత చక్రాన్ని మొత్తంగా గిర్రున తిప్పేసారు … ప్రతీ పదంలోనూ ప్రతీ వాక్యంలోనూ సర్రున కోసే పదును ….ఆ నెప్పి హృదయానికే తెలిసేలా . We must accept the grim reality of life.
    The ultimate writeup.

  2. THIRUPALU says:

    గుక్క తిప్పుకోకుండా నూటొక్క రాగాల్ని పలికించి ఆలకింప చేయడం అద్భుతం !

  3. Kcube Varma says:

    ఎన్నిసార్లు చదివినా ఇంకా ఏదో మరిచిపోయినట్టు వెనక్కి వెళ్తూ నిజాన్ని మింగుడు పడలేక తడబడుతూ వెతుకుతున్నా.. రక్తపు జీరల ఆబ్స్ట్రాక్ట్ చిత్రం.. మీకే సొంతమైన పాళీ ఇదిసశది..

  4. Lakshmi orsu says:

    మీ పదాలకు పదునెక్కువ చూస్తే చాలు చరిత్ర ని తల ఎత్తుకోనివ్వవు we మిస్ యూ

  5. D. Subrahmanyam says:

    పదాల విన్యాసం బావుంది. అయితే నేను 60 లో వదిలేసిన మా ఆంధ్ర విశ్వవిద్యాలం లోని ఓపెన్ ఎయిర్ థియేటర్ జ్ఞాపకం వచ్చింది. ఇలాంటి విన్యాసాలు చూసాక, ఏదయినా ప్రదర్శనలో “అంతా గొప్పగుంది గురూ , ఇంతకీ నువ్వేతంతావ్””. ఎతో ఇది సదివినాక నాకలాతి డవుతే వచ్చేసినాది.

  6. శతపత్ర says:

    రాసి మనసులను దోచుకోవడం మీకొచ్చిన విద్యని నాకు ముందు నుండి తెలుసు…కానీ మీకు మనసే లేదని నిరూపించుకున్నారు కదా హఠాత్తుగా ఓ మాట కూడా చెప్పపెట్టకుండా వెళ్ళిపోతే ఏమిటర్థం…ఎన్నిసార్లు గుర్తోచ్చావో తెలుసా ఈ సరితకి..తెలిసిన ప్రతి ఒక్కరిని అడిగాను ఏమై పోయావని…నువ్వు బాగున్నావు :)

  7. Sharada Sivapurapu says:

    చాలా బాగుంది నిషీజీ మిమ్మల్ని చదవడం చాలా రోజుల తరవాత.

  8. చంద్ర శేఖర్ కంచి says:

    ఎన్నాళ్ళకి ? సుపర్బ్ రైట్ అప్ .మీ మేజిక్ వర్డ్స్ కరువై fb బోర్ కొడుతోంది
    త్వరగా వచ్చేయండి …తీసుకున్న సెలవు చాలు . :)

  9. Thilak Bommaraju says:

    నాకు మీరిలానే రాయడం బాగుంటుంది.అజ్ఞాతంగా వుండి మెదడు అంతరాలలో వున్న ఆలోచనలను మాతో పంచుకోవడం చాలా యిష్టం నాకు.మీరిలానే వుండండి.బయటకు రావొద్దు.లవ్ యు ఆల్వెయ్స్ .

Leave a Reply to Nityaa V Cancel reply

*