ఆ రెండు సినిమాలు- రెండు ఆత్మగౌరవ పతాకలు!

movie-pink

వొకానొక రాత్రి పార్టీలో కలిసిన ముగ్గురు కుర్రాళ్ళతో ఆ ముగ్గురు అమ్మాయిలు, డ్రింక్స్ తీసుకుంటూ, నవ్వుతూ తుళ్ళుతూ వున్నప్పుడు జరుగుతుంది అది. చొరవ తీసుకుని, వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించి, లొంగదీసుకోవాలనుకుంటారు ఆ కుర్రాళ్ళు.  అమ్మాయిల్లో ధైర్యవంతురాలైన వొక అమ్మాయి, మినాల్, వేరే గత్యంతరంలేక, ప్రతిఘటిస్తున్నా వినిపించుకోని ఆ కుర్రాడిని, చేతికందిన బాటిల్తో ముఖాన కొడుతుంది. కంటి  దగ్గర గాయమై రక్తమోడుతున్న అతన్ని వదిలి, మిగతా స్నేహితురాళ్ళని (ఫలక్, ఆండ్రియా ) తీసుకుని బయట పడుతుంది.

జరిగింది పీడకలగా మరచిపోయి ముందుకు సాగిపోవాలనుకుంటారు.  కాని ఆ కుర్రాళ్ళు, వాళ్ళ మరొక స్నేహితుడు  వదిలిపెడితేగా. ఆ అమ్మాయిలకు వాళ్ళ హద్దు (ఔకాత్ అంటే స్టేటస్) ను గుర్తు  చేయాలనుకుంటారు. వాళ్ళ ఇల్లుగలాయనకు ఫోన్ చేసి వాళ్ళ చేత ఇల్లు ఖాళీ చేయించమని బెదిరిస్తారు. వాళ్ళను కూడా ఫొన్ చేసి బెదిరిస్తారు, వెంబడిస్తారు. మినాల్ నైతే కార్లోకి గబుక్కున లాక్కొని, నడుస్తున్న కారులోనే రేప్ చేసినంత పని చేస్తారు. ఇంత జరుగుతుంటే ఇక ఆ అమ్మాయిలకు ఆ కుర్రాళ్ళ  మీద పోలీసు కేసు పెట్టక తప్పని పరిస్థితి. అక్కడినుంచీ పోలీసు స్టేషన్లలో పని తీరు, వ్యవస్థ ఇవన్నీ ముందుకొస్తాయి. అభియోగి రాజవీర్ వొక రాజకీయ నాయకుడి కొడుకు. ఈ నమోదైన కేసు గురించి ముందు వారికే చెప్తారు, వారు చెప్పినట్టే పాత తేదీతో వొక కేసును ఈ అమ్మాయిల మీద (హత్యా ప్రయత్నం)  నమోదు చేస్తారు.

ఇప్పుడు ఈ విషయాన్ని చర్చకు పెట్టాలంటే కోర్ట్ రూం డ్రామా కంటే సులువు పద్ధతి యేముంది?

అప్పుడు వస్తాడు దీపక్ సెహగల్ (అమితాభ్) అన్న లాయర్. పక్క బిల్డింగులో వుంటాడు. వీళ్ళను గమనిస్తుంటాడు. మినల్ ని వాళ్ళు కారులో యెత్తుకెళ్ళిపోవడం చూస్తాడు. పోలీసుకు ఫొన్ చేసి ఫిర్యాదు చేస్తాడు. ఇప్పుడు కోర్ట్ లో వీళ్ల తరపు లాయర్.

మనకు సమాజంలో కొన్ని నమ్మకాలు, అభిప్రాయాలు బలపడ్డాయి. డ్రింక్స్ తీసుకునే అమ్మాయిలు మంచి కుతుంబంలోంచి వచ్చిన వారు కాదు, సన్స్కారవంతులు కాదు. అలాగే రాత్రి పూటలు  పార్టీలకు వెళ్ళేవారు, మగవాళ్ళతో నవ్వుతూ మాట్లాడే వాళ్ళు, జీన్స్, స్కర్ట్ లు వేసుకునేవాళ్ళు. కోర్ట్ లో గనక ఆ అమ్మాయిలు అలాంటి వారు అని నిరూపించ గలిగితే, వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారని, డబ్బుల దగ్గర తేడాలొచ్చి వాళ్ళల్లో వొక అమ్మాయి హత్యా ప్రయత్నం చేసిందని నిరూపించడం తేలికవుతుంది.

వొక స్త్రీ ఆమె భార్య కావచ్చు, వ్యభిచారి కావచ్చు, ప్రియురాలు కావచ్చు, యెవరైనా కావచ్చు, ఆమె వద్దన్న తర్వాత ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరిగేదాన్ని అత్యాచారంగానే గుర్తించాలి. ఆమె “వద్దు” (నో) అంటే ఆ మాటకు వొక్కటే అర్థం. అది మగవాళ్ళంతా అర్థం చేసుకోవాలి.

ఇవీ దీపక్ కేసులో తన వాదన ముగించాక చెప్పే చివరి మాటలు.

ఈ సినిమా యే విషయం చెప్పదలచుకుంటున్నది అన్నదాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా మంచి చిత్రం. అందరి నటనా (ముఖ్యంగా అమ్మాయిలది) చాలా చక్కగా వుంది. అనిరుద్ధ రాయ్ చౌధరి దర్శకత్వం కూడా చెప్పదలచిన విషయం వైపుకు కథను నడిపిస్తుంది. చూసే వారిని కట్టి పడేస్తుంది కథనం. మగవారి ఆలోచనల్లో మార్పు తేగలిగితే సినిమా విజయం సాధించినట్టే.

కాని కొన్ని విషయాలు వున్నాయి. దీపక్ వొక bipolar disorder తో బాధపడుతున్న వ్యక్తి. అలాంటి వాళ్ళు శరీరంలో హార్మోన్లు యెక్కువైనా, తక్కువైనా అకారణంగానే చాలా దుక్ఖంలో కూరుకుపోవడమో, కారణంలేకుండానే చాలా ఉత్సాహంగా వుండడమో చేస్తారు. అలాంటి వ్యక్తికే స్పష్టంగా అర్థం అవుతున్న విషయం, ఆరోగ్యంగా వున్న సమాజానికి యెందుకు అర్థం కాదు? వాతావరణ కాలుష్యానికి అలవాటు పడిపోయిన మనుషుల మధ్య దీపక్ మాత్రం మాస్క్ తొడుక్కునే బయటకు వెళ్తాడు. యేదో అనారోగ్యంతో బాధ పడుతున్న భార్యను ఆసుపత్రిలో చికిత్స చేయిస్తూ, వొక బాధ్యతగల భర్తగా సేవలు చేస్తుంటాడు. ఈ సందర్భం వచ్చినప్పుడు ఈ అమ్మాయిలకు న్యాయం జరగాలని వాళ్ళ తరపున కేసు వాదిస్తాడు. పితృస్వామ్యంలో ఆ అమ్మాయిలకు జరిగిన అన్యాయానికి ఇతను పితృ స్థానంలో నిలబడి సరి చేయాలనుకుంటాడు.

సినిమాలో ముగ్గురు అమ్మాయిలూ వొక రకంగా వొంటరే. వాళ్ళ ఇళ్ళ నుంచి ఈ కష్టకాలంలో తోడుగా నిలబడటానికి యెవరూ వుండరు. ఫలక్ ప్రేమిస్తున్న మనిషి కూడా ఆమెకు సపోర్టివ్వడు. తమ పనులేవో చూసుకుంటూ, తమ కాళ్ళ మీద నిలబడ్డ ఈ ముగ్గురు అమ్మాయిలూ చాలా ధైర్యం కనబరుస్తారు. కోర్ట్ లో మాత్రం బేల అయి పోతారు. యెలాంటి ధైర్యవంతులైన స్త్రీలనైనా మెడలు వంచి నిస్సహాయ పరిస్థితుల్లోకి నొక్కేసే బలమూ, తెలివి తేటలూ  వున్న వ్యవస్థ అది.

శత్రువు దుర్మార్గుడే కాదు, తెలివైనవాడు కూడా.  కోర్ట్ సీన్ లో రాజవీర్ తన సహజ స్వభావం బయటపడేలా మాట్లాడటంతో కేసు తేలిపోతుంది. ఎమోషనల్ గా కాకుండా తెలివిగా ప్రవర్తించి వుంటే కేసు ఇంత తేలికగా గెలిచేపనేనా? వాస్తవానికి అత్యాచారాల కేసులలో చాలా మటుకు తగినన్ని సాక్ష్యాధారాలు లేవనో, లేదా వేరే కారణాల వల్లనో కొట్టివేయబడుతున్నాయి.

masaan

యెందుకో 2015లో వచ్చిన సినిమా “మసాన్” గుర్తుకొస్తున్నది.

వారణాసి గంగా నదీ తీరం. సంస్కృత పండితుడు సంజయ్ మిశ్రా నదీ తీరంలో (శ్రాద్ధ కర్మలు అవీ చేసుకునేవాళ్ళకి అవసరమయ్యే సరంజామా అమ్మే) వొక దుకాణం నడుపుతుంటాడు. అతని కూతురు రిచా చడ్డా చదువుకుంటూ పార్ట్ టైం పని చేస్తుంటుంది. అదే నదీ తీరంలో శవాలను తగలబెట్టే కుటుంబంలో విక్కీ కౌశల్ అనే కుర్రాడు ఎంజినీరింగు చదువుతుంటాడు. ఇంటిదగ్గర వున్నప్పుడు తండ్రికి శవాలు తగలబెట్టే పనిలో సాయ పడుతుంటాడు.

సినిమా ఈ రెండు కుటుంబాల కథ. రిచా చడ్డా వొక అబ్బాయిని ఇష్టపడుతుంది. వొక రోజు వాళ్ళిద్దరూ చాటుగా వొక లాడ్జిలో గది తీసుకుని మోహాల మైకంలో తేలిపోతున్న వేళ పోలీసులు రైడ్ చేస్తారు. పోలీసులు అమ్మాయి ఫొటొని మొబైల్ లో తీస్తారు. అబ్బాయి మాత్రం గిలగిల లాడి పోతాడు. పరువు పోతుందని బహయం, తండ్రి భయం. వదిలి పెట్టమని ప్రాధేయపడతాడు. యెంతో కొంత తీసుకుని వదిలి వేయ మంటాడు. ఇలా చిక్కిన గొర్రెలను అంత తేలికగా వదిలిపెడతారా పోలీసులు? పిరికివాడైన అబ్బాయి సందు దొరకగానే విడిపించుకొని బాత్రూం లో దూరి తలుపు వేసుకుంటాడు. తర్వాత నిస్సహాయంగా తన చేతిని మణికట్టు దగ్గర కోసుకుంటాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తారు గాని బతకడు. అలా ఇద్దరు చేసిన పనికి ఇప్పుడు ఆ అమ్మయి వొక్కతే బలిపశువు అయ్యింది.

నువ్వు లాడ్జికి యెందుకు వెళ్ళావు అని పోలీసు అడిగితే ఆమె “కుతూహలం” కారణంగా చెబుతుందే తప్ప యెలాంతి సిగ్గు, అపరాధ భావన వ్యక్త పరచదు. వాళ్ళ నాన్న అడిగినా అదే జవాబు. abettment to suicide నుంచి ఆమెను తప్పించాలంటే మూడు లక్షలు రెండు నెలల్లో చెల్లించే వొప్పందం ఆ పోలీసు, ఆమె తండ్రి మధ్య. ఫిక్స్ దిపాజిట్ లో  దాచుకున్న లక్ష మొదటి వాయిదాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిగతా డబ్బు యెలా సమకూరాలా అన్నది వాళ్ళకు పట్టిన శని. ఆమెకు కొన్ని అదనపు సమస్యలు. “నువ్వు వాడితో పడుకున్నావుగా, నాతో పడుకోవడానికేం”, అని వేధించే వాళ్ళు. 12000 వచ్చె వుద్యోగం వూడతం, వేరే వుద్యోగంలో కుదురుకుంటే 5500 మాత్రమే రావడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా సూక్ష్మంగా చూపిస్తాడు దర్శకుడు నీరజ్ ఘైవాన్ (ఇది ఇతని మొదటి చిత్రం).

మరోపక్క తక్కువ కులానికి చెందిన విక్కీ, అగ్ర కులానికి చెందిన అమ్మాయి శ్వెతా త్రిపాఠి ప్రేమించుకుంటారు. అతని కులం తెలిసిన తర్వాత కూడా అతన్నే చేసుకుంటానని, అవసరమైతే లేచి వస్తానని, పెళ్ళి అయ్యాక పెద్దవాళ్ళు నెమ్మదిగా చల్లబడతారనీ అంటుంది. కాని దానికి ముందే ఆమె వొక బస్సు ప్రమాదంలో మరణిస్తుంది.  ఆమె శవాన్ని అతనే దహనం చేయాల్సి వస్తుంది.

ఈ రెండు జంటలూ చాలా నిజాయితీ గా, స్వచ్చంగా, అమాయకంగా, నిర్మలంగా వుంటాయి. అమ్మాయిల విషయానికి వస్తే ఇద్దరూ చాలా ధైర్యన్ని కనబరుస్తారు. రిచా చడ్డా తన బాడీ లాంగ్వేజ్ తో (నిటారు గా నిలబడే/కూర్చునే/నదిచే తీరు; సిగ్గు/అపరాధభావనా లేశమాత్రమైనా కనబడని తీక్షణ కళ్ళు, తడబాటు లేని సూటిగా వచ్చే మాటలు; తన మీద తనకున్న నమ్మకం). పోతే శ్వేతా త్రిపాఠి కవిత్వన్ని ప్రేమించే సున్నిత మనస్కురాలు. కాని తమ మధ్య వున్న కులపు అడ్డుగోడల గురించి తెలిసిన తర్వాత ఆమె తీసుకునే నిర్ణయం అవసరమైతే పారిపోయి అయినా వివాహం చేసుకోవాలి, పెద్దవాళ్ళని నెమ్మదిగా వొప్పించవచ్చు.

రోజూ యెన్నో శవాలు తగలబడుతుండే ఆ భూమికలోనే ఈ రెండు ప్రణయ గాథలు. (మసాన్ అంటే స్మశానం).

ఈ రెండు సినిమాలు పోల్చింది కూడా ఈ స్త్రీల ధైర్య-సాహసాలకి, ఆత్మ విశ్వాసానికి, ఆత్మ గౌరవానికీ.

*

యెందుకో 2015లో వచ్చిన సినిమా “మసాన్” గుర్తుకొస్తున్నది.

వారణాసి గంగా నదీ తీరం. సంస్కృత పండితుడు సంజయ్ మిశ్రా నదీ తీరంలో (శ్రాద్ధ కర్మలు అవీ చేసుకునేవాళ్ళకి అవసరమయ్యే సరంజామా అమ్మే) వొక దుకాణం నడుపుతుంటాడు. అతని కూతురు రిచా చడ్డా చదువుకుంటూ పార్ట్ టైం పని చేస్తుంటుంది. అదే నదీ తీరంలో శవాలను తగలబెట్టే కుటుంబంలో విక్కీ కౌశల్ అనే కుర్రాడు ఎంజినీరింగు చదువుతుంటాడు. ఇంటిదగ్గర వున్నప్పుడు తండ్రికి శవాలు తగలబెట్టే పనిలో సాయ పడుతుంటాడు.

సినిమా ఈ రెండు కుటుంబాల కథ. రిచా చడ్డా వొక అబ్బాయిని ఇష్టపడుతుంది. వొక రోజు వాళ్ళిద్దరూ చాటుగా వొక లాడ్జిలో గది తీసుకుని మోహాల మైకంలో తేలిపోతున్న వేళ పోలీసులు రైడ్ చేస్తారు. పోలీసులు అమ్మాయి ఫొటొని మొబైల్ లో తీస్తారు. అబ్బాయి మాత్రం గిలగిల లాడి పోతాడు. పరువు పోతుందని బహయం, తండ్రి భయం. వదిలి పెట్టమని ప్రాధేయపడతాడు. యెంతో కొంత తీసుకుని వదిలి వేయ మంటాడు. ఇలా చిక్కిన గొర్రెలను అంత తేలికగా వదిలిపెడతారా పోలీసులు? పిరికివాడైన అబ్బాయి సందు దొరకగానే విడిపించుకొని బాత్రూం లో దూరి తలుపు వేసుకుంటాడు. తర్వాత నిస్సహాయంగా తన చేతిని మణికట్టు దగ్గర కోసుకుంటాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తారు గాని బతకడు. అలా ఇద్దరు చేసిన పనికి ఇప్పుడు ఆ అమ్మయి వొక్కతే బలిపశువు అయ్యింది.

నువ్వు లాడ్జికి యెందుకు వెళ్ళావు అని పోలీసు అడిగితే ఆమె “కుతూహలం” కారణంగా చెబుతుందే తప్ప యెలాంతి సిగ్గు, అపరాధ భావన వ్యక్త పరచదు. వాళ్ళ నాన్న అడిగినా అదే జవాబు. abettment to suicide నుంచి ఆమెను తప్పించాలంటే మూడు లక్షలు రెండు నెలల్లో చెల్లించే వొప్పందం ఆ పోలీసు, ఆమె తండ్రి మధ్య. ఫిక్స్ దిపాజిట్ లో  దాచుకున్న లక్ష మొదటి వాయిదాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిగతా డబ్బు యెలా సమకూరాలా అన్నది వాళ్ళకు పట్టిన శని. ఆమెకు కొన్ని అదనపు సమస్యలు. “నువ్వు వాడితో పడుకున్నావుగా, నాతో పడుకోవడానికేం”, అని వేధించే వాళ్ళు. 12000 వచ్చె వుద్యోగం వూడతం, వేరే వుద్యోగంలో కుదురుకుంటే 5500 మాత్రమే రావడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా సూక్ష్మంగా చూపిస్తాడు దర్శకుడు నీరజ్ ఘైవాన్ (ఇది ఇతని మొదటి చిత్రం).

మరోపక్క తక్కువ కులానికి చెందిన విక్కీ, అగ్ర కులానికి చెందిన అమ్మాయి శ్వెతా త్రిపాఠి ప్రెమించుకుంటారు. అతని కులం తెలిసిన తర్వాత కూడా అతన్నే చేసుకుంటానని, అవసరమైతే లేచి వస్తానని, పెళ్ళి అయ్యాక పెద్దవాళ్ళు నెమ్మదిగా చల్లబడతారనీ అంటుంది. కాని దానికి ముందే ఆమె వొక బస్సు ప్రమాదంలో మరణిస్తుంది.  ఆమె శవాన్ని అతనే దహనం చేయాల్సి వస్తుంది.

ఈ రెండు జంటలూ చాలా నిజాయితీ గా, స్వచ్చంగా, అమాయకంగా, నిర్మలంగా వుంటాయి. అమ్మాయిల విషయానికి వస్తే ఇద్దరూ చాలా ధైర్యన్ని కనబరుస్తారు. రిచా చడ్డా తన బాడీ లాంగ్వేజ్ తో (నిటారు గా నిలబడే/కూర్చునే/నదిచే తీరు; సిగ్గు/అపరాధభావనా లేశమాత్రమైనా కనబడని తీక్షణ కళ్ళు, తడబాటు లేని సూటిగా వచ్చే మాటలు; తన మీద తనకున్న నమ్మకం). పోతే శ్వేతా త్రిపాఠి కవిత్వన్ని ప్రేమించే సున్నిత మనస్కురాలు. కాని తమ మధ్య వున్న కులపు అడ్డుగోడల గురించి తెలిసిన తర్వాత ఆమె తీసుకునే నిర్ణయం అవసరమైతే పారిపోయి అయినా వివాహం చేసుకోవాలి, పెద్దవాళ్ళని నెమ్మదిగా వొప్పించవచ్చు.

రోజూ యెన్నో శవాలు తగలబడుతుండే ఆ భూమికలోనే ఈ రెండు ప్రణయ గాథలు. (మసాన్ అంటే శ్మసానం).

ఈ రెండు సినిమాలు పోల్చింది కూడా ఈ స్త్రీల ధైర్య-సాహసాలకి, ఆత్మ విస్వాశానికి, ఆత్మ గౌరవానికీ.

మీ మాటలు

  1. rani siva sankara sarma says:

    రెండు మంచి సినిమాలు, వాటి మధ్య పోలికలు బాగా రాసారు . ఇలాంటి వ్యాసాలు విరివిగా రావడం నేటి అవసరం.

  2. Paresh sir, the description about Pink and Masan is very nice. The comparison between the movies and the story and the individuality and the boldness of the girls is very good. After reading it we want to watch both the movies. Now a days it’s very rare to get good movies. Thank you sir.

  3. తెలుగు సినిమా తీసే వోడా ఇటు వైపు కాసేపు తొంగి చూడవోయ్
    నీ పుర్రెలో కథలు పూడ్చి పెట్టవోయ్ నీ చుట్టుపక్కల వ్యధలు తరచి చూడవోయ్
    నీ కమర్షియల్ ఎంటటైన్మెంట్ కాదు కన్నీళ్ళలో కూడా మంచికథలు కొత్త కథలు దొరుకుతాయి
    అందుకే చుట్టుపక్కల చూడరా చిన్నోడా నా తెలుగు సినిమా వోడా

    • Pavan Santhosh says:

      వాళ్ళు చూస్తున్నారు, మీరు కూడా మనమంతా, పెళ్ళిచూపులు, జ్యో అచ్యుతానంద లాంటి నవకెరటాల్ని ఓమాటు చూడండి.

  4. RATNAKAR CHERUKU says:

    సర్, రచయత వ్యక్తపరిచిన విధానం సినిమా చూసినదానికి సమానంగా ఆలోచనలు రేకెత్హించింది. అద్భుతంగా వివరించారు. ధన్యవాదములు మీకు మరియు అభినందనలు రచయిత గారికి.

  5. paresh n doshi says:

    ఎం విశ్వనాధ రెడ్డి గారు, ఈ మధ్య తెలుగులో మంచి సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి సబ్జెక్టు మీద కూడా వస్తుందేమో చూద్దాం. మీ స్పందనకు కృతఙ్ఞతలు

  6. paresh n doshi says:

    Thank you, Ratnakar cheruku garu

  7. దేవరకొండ says:

    అలాంటి సినిమాలు తెలుగులోనే ఒరిజినల్గా రావాలనుకోవడం కొద్దిగా దురాశే! సినిమాకు కూడా గ్లోబల్ మార్కెట్ వచ్చినా ఇంకా ఫ్యూడల్ వాసనలు వదిలించుకోలేనిది తెలుగు సినిమా. నలుగురి నోళ్ళల్లోనూ పడి ఫలానా భాషలో వచ్చిన సినిమాలో సక్సెస్ ఎలిమెంట్ ఉందని తెలిస్తే రీమేక్ (ఇంతలోనే కమల్ హాసన్ చేయకపోతే) చేస్తారు. బడుగు వర్గాల చైతన్యాన్ని, ముఖ్యంగా దళిత/మైనారిటీ/స్త్రీ చైతన్యాన్ని సాధ్యమైనంత తక్కువగా (తక్కువచేసి కూడా) చూపడమే తెలుగు సినిమా వ్యాపార కుటుంబాలు వంశ పారంపర్యంగా పాటిస్తున్న అప్రకటిత విధానమని నా అభిప్రాయం!

  8. Srinivas Sathiraju says:

    మంచి విశ్లేషణ అందించారు. ఆ సినిమాలు చూసి తీరాలి అనే అభిప్రాయం మా అందరిలో కలిగించడం ద్వారా మీ భావ వ్యక్తీకరణకు న్యాయం చేశారు. మీకు కృతజ్ఞతలు.

  9. venu udugula says:

    గుడ్ రైటప్స్ పరేష్ గారు …. మీరు రెగ్యులర్ గా ఫిలిమ్స్ మీద రాస్తూ ఉండండి

మీ మాటలు

*