ఎరువు..

satya2

దించిన నడుం ఎత్తకుండానే
కమ్మిన మబ్బుకుండ ఒట్టిపోయి
నాటిన నారు నీరిగిరిన మడిలొ
విలవిలలాడుతుంటే
నెత్తురు చిమ్మిన కళ్లు!

వానా వానా వస్తావా
ఈ నేల దాహం తీర్చుతావా!

ఆశలన్ని మొగిలికి చేరి
ఆవిరింకిన కనులలోకి
కాసింత తడి చేరుతుందా!

వాడు నలుదిక్కులా వేసిన
కార్పెట్ బాంబింగ్ పొరల పొరలుగా
బద్ధలై పచ్చదనంతో పాటు పసిపాపలను
హరించి ఇప్పడీ హరిత వనం కోతలు కోస్తున్నాడు!

నేలతల్లి నవ్వలు విరబూసేలా
నువ్వూ నేను కలిసి
ఓ మొక్క నాటుదాం
ఎరువుగా వాడినే పాతుదాం!!

*

మీ మాటలు

  1. నెత్తురు చిమ్మిన కళ్ళ తడిమడిలో ఓ మొక్కను నాటి… ఎరువుగా వాడినే పాతుదాం!!
    అద్భుతమైన వ్యక్తీకరణ నేటి స్థితికి దర్పణం.

మీ మాటలు

*