మనందరి కథ!

manam1
‘మనమంతా’ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. తెలుగులోనే కాకుండా, తమిళం మరియు మళయాలంలోకి డబ్ చేయబడింది. ప్రేమం, దృశ్యం లాంటి చిత్రాలను మన తెలుగు వారు అప్రీషియేట్ చేయడమే కాకుండా ఈ సారి ఇతర భాషల సినీ ప్రేమికులు మన తెలుగు వాడి గురించి చెప్పుకునే విధంగా, మనం కూడా తలెత్తుకొనే విధంగా తీయబడ్డ సినిమా ‘మనమంతా’.
 M1
సాయిరాం అనే అసిస్టెంట్ స్టోర్ మేనేజర్ తను మేనేజర్ కావడానికి చేసిన ప్రయత్నం ఎలా మలుపు తిరిగింది అనేది ఒక కథ, మహిత అనే అమ్మాయి తమ ఇంటి పక్క గుడిసెలో ఉన్న చిన్న పిల్లవాడికి చదువు చెప్పించాలనే కోరిక… తర్వాత ఆ పిల్లవాడు తప్పిపోయి వాడిని వెతుకుతూ వెళ్లే దారి మరో కథ, ఓ కుర్రాడు తను ఎంతో ప్రేమతో చూసుకునే లాప్ టాప్ అమ్మి ఓ అమ్మాయి ప్రేమ కోసం తను నమ్మిన విలువలను ఒక్కోటీ ఎలా కోల్పోయి హుస్సేన్ సాగర్లో తన ఐడెంటిటినీ మళ్ళీ ఎలా తిరిగి తెచ్చుకొన్నాడో చెప్పే కథ, గాయత్రి అనే మధ్యతరగతి గృహిణి తన కుటుంబం కోసం సింగపూరు బయలుదేరి చివర్లో తన గమ్యం చేరే కథ…ఈ నాలుగు కథల్ని ఒడుపుగా ఒకదానిలోంచి మరోటి పాయలుగా సాగి ఒక నదిలా ఉరకలెత్తి, సంద్రంలా మనల్ని ఓ భావావేశంలో ముంచెత్తుతుంది. ఈ సినిమాకు ఇరవై నిమిషాల క్లైమాక్స్ ఆయువుపట్టు. అలా అని క్లైమాక్స్ ఒక్కటే బావుందని కాదు. అనుకోకుండానే ఓ చిన్న కన్నీటి పొర, మీ గుండె చిక్కబడేలా చేస్తుంది. ఒక కథని ఎంత చిక్కగా చెప్పవచ్చో దర్శకుడు నిరూపించాడు.
yeleti
ఇరువర్/ ఇద్దరులో తన నటనతో సంభ్రమంలో ముంచెత్తిన నటుడు మోహన్ లాల్ ఈ సినిమాలో సటిల్ గా నటిస్తూ చివరికొచ్చే సరికి తనేంటో మరోసారి తెలియపరుస్తాడు. గౌతమి కూడా చాలా చక్కగా చేస్తూ చివరి ఇరవై నిముషాల్లో తన ప్రతిభ ఏంటో గుర్తు చేస్తుంది. వీరిద్దరినీ మరిపిస్తూ ఓ పదేళ్ల పాప ‘రైనా రావు మహిత పాత్రలో మనల్ని లీనం చేసుకుంటుంది. తను నవ్వితే మనం నవ్వుతాం, తను ఏడిస్తే మనం కూడా కళ్ల నీళ్లు పెట్టుకుంటాం. అంతగా ఆ అమ్మాయి మనల్ని కదిలిస్తుంది. విష్వాంత్ అనీషా ఆంబ్రోస్ హర్ష వర్ధన్, గొల్లపూడి, ఊర్వశి, అయ్యప్ప శర్మ, వెన్నెల కిషోర్, ధన్ రాజ్ వారి పాత్రల కు పూర్తి న్యాయం చేసారు.మొత్తం మీద ఇది ఇంటిల్లిపాదీ చూడదగ్గ సినిమా. ‘వారాహీ చలనచిత్రం సాయి కొర్రపాటి నిర్మాణం: ‘మనమంతా’ Rating 4****/5

మీ మాటలు

  1. సాయి పద్మ says:

    తప్పకుండా చూడాలన్నట్లు రాసేరు డాక్టర్ గారూ .. థేంక్ యు

  2. ఈ సమీక్షను
    WhatsApp లో మా family group లో share చేసాను.

  3. Ram sarma says:

    మంచి కథలు , నూతనయువ దర్శకత్వ ప్రతిభ ఈ మధ్య మంచి సినిమాలను చూసే అవకాశం కల్పిస్తోంది..
    ఇది ఎంతో ముదావహం …
    ‘పెళ్లిచూపులు’.. ‘మనమంతా’ చిత్రాలు ఆ కోవ లో తీసిన చిత్రాలు.. నిజంగా అద్భుతాలు ..
    …రామ శర్మ

  4. Sivalakshmi says:

    అర్జెంట్ గా సినిమా చూసేస్తామండీ!

Leave a Reply to సాయి పద్మ Cancel reply

*