రహస్య గీతిక

satya1

చిత్రం: సత్యా సూఫీ

 ~
సగం నవ్విచ్చిమధ్యలో దూరం ఉందని గుర్తుచేసి
మౌనంగా నువ్వెళ్తున్నప్పుడల్లా
ఆపి చెప్పాలనిపిస్తుంది నేస్తం!…
అలవాటు కథగా కాలం అవతారమెత్తకముందే
నిన్నటి నీ గడపముందు నిరీక్షించి
వాడిపోయిన ఆ ఆశ అసలు అందం చూడాలంటే
నీ కళ్ళకి కాసింత ప్రేమ కూడా రాసుకోవాలనే
యుగాలనాటి నిజమైన రహస్యం…
సామాన్య న్యాయ శాస్త్రం ఋజువు చేయడం కోసం
అటునుంచి ఇటుకీ, ఇటునుండి అటుకీ
నిన్నే నువ్ పంచుకుంటూ రెండువైపులా
బరువు సమానమయిందా అని చూస్తుంటే చెప్పాలనిపిస్తుంది…
బతుకంటే బంధాల్ని
గణించే త్రాసు కాదు నేస్తం!
ఒకరి ఆనందం కోసం మరొకరు తగ్గే
తూగుడుబల్లేననే జీవిత రహస్యం…
గెలవడం, ఓడటం తప్ప
ఈ ఆటకు అంతం ఉండదని
నువ్ పిడికిళ్లు బిగించి
చూపులు రాజేస్తున్నపుడల్లా చెప్పాలనిపిస్తుంది నేస్తం!
ఎవరి బ్రతుకూ రణరంగం కాదూ
లోపల ఎవరితో వారు
ఓడిపోతూ చేసే అంతర్యుద్ధమనే యుద్ధ రహస్యం…
ఓ అనుకోని ప్రశ్న
ఈ వర్తమానం దారిమీద ఏ మలుపులోనో
ఎవర్నువ్వని ఎదురైతే,
నీ ఆలోచనని ఇదీ నేనని
పెదాల మీదకి అనువదించుకుని చెప్పాలంటే
ఈ భ్రమలాంటి అనుభవాల మధ్య,
లోపల నాకోసం ఇవ్వడానికి
కొంచెమైనా ఖాళీ మిగుల్చుకో నేస్తం అనే అసలు రహస్యం..

మీ మాటలు

  1. నిర్మలారాణి తోట says:

    వావ్…అద్భుతమైన వాక్యాలు…లోతుల్ని తాకే భావ సరళి.. ప్రశ్నించుకునే సందర్భం..

    బతుకంటే బంధాల్ని
    గణించే త్రాసు కాదు నేస్తం!
    ఒకరి ఆనందం కోసం మరొకరు తగ్గే
    తూగుడుబల్లేననే జీవిత రహస్యం…
    గెలవడం, ఓడటం తప్ప
    ఈ ఆటకు అంతం ఉండదని
    నువ్ పిడికిళ్లు బిగించి
    చూపులు రాజేస్తున్నపుడల్లా చెప్పాలనిపిస్తుంది నేస్తం

    • Suparna mahi says:

      చాలా చాలా ధన్యవాదాలు మా…🌸🌼🌸

      • ధనుంజయ మూర్తి says:

        బతుకంటే బంధాల్ని
        గణించే త్రాసు కాదు నేస్తం!
        ఒకరి ఆనందం కోసం మరొకరు తగ్గే
        తూగుడుబల్లేననే జీవిత రహస్యం…
        ************************************
        బతుకంటే ఏమిటో ఇంత సింపుల్ గా కూడా చెప్పవచ్చా మహీ.
        చాలా బాగుంది మహీ. ఇంత సింపుల్ గా చెప్పావు కాబట్టే, నాలాంటి వాళ్లకు కూడా బాగా అర్థమయింది.
        నేనో నిర్ధారణకు వచ్చేసాను.
        నువ్వెంత గొప్పగా వ్రాసినా, ఇక పైన ఆశ్చర్య పోనవసరం లేదు. ఎందుకంటే,
        అద్భుతంగా వ్రాయడమన్నది నీ ఇంటి పేరయి చాలా కాలమయింది మహీ.

  2. హరి మిహిర says:

    లెక్కలు కొలిచే ఈభౌౌతికానికి ఆవల అల్లంంత దూరాన అమాయంంగా మిగిలిపోయిన మనసుని రెక్కలు తొడుక్కోని పక్కన వాలమంంటున్నావు.
    నువ్వెపుడైైనా కవిత్వంం రాయవు సోదరా
    మనిషి తత్వాన్ని రాస్తావు. తత్వజ్ఞానపు పేజీలు ఈకాలపు ల్యాపీలు,ట్యాబ్లెట్లు, సామాజిక మాధ్యమాల ఇరుకు సంందుల్లో నలిగిపోతుంంటే. విడమర్చి ఝెంంఢాల ఎగరేయాలని చెప్తుంంటావు.
    కాదు అంందరి మనసులు వినేల అరుస్తుంంటావు.

    ఏదో ఓనాడు కవికే సొంంతంం కాదు కవిత్వంం
    మనిషి జీవితమే కవిత్వంం అని
    దాన్ని పట్టుకున్న ప్రతీవాడు కవేనని నిరూపిస్తావు.
    ❤❤❤ Mahi

    స్వచ్ఛంంగా రెపరెపలాడే కవిత్వానికి నా తరుపున ఊపిరి గాలిని వదులుతూనే ఉంంటా. i with u keep it up.

    • Suparna mahi says:

      నీ అభిమానానికి నా ధన్యవాదాలు చాలా చాలా చిన్నవి సోదరా… 💚…

  3. నైస్ anna

  4. సాయి. గోరంట్ల says:

    వాస్తవానికి
    కవిత్వం అంటే మనసును హత్తుకుని గిలిగింతలు పెట్టేది.
    ఆవేశాన్ని
    ఆలోచనల్ని రగిల్చెది.
    కానీ Suparna Mahi.ప్రతి కవితా ముందు ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
    పూల మీద
    పిల్లల మీద
    జీవితం మీద ఎంత అవగాహనతో రాయగలడని
    #SarangaMagazine. లో ఈ వారం తన కవితని చదవండి ఇక❤💙💝💚
    ఆ తన్మయత్వం లో తేలిపోండి

    మహీ యు రాక్స్..
    Thank you saranga editorial team

  5. ravikumar says:

    chaala baagundi

  6. బ్యూటిఫుల్ పొయెమ్ మిత్రమా

  7. చాలా అద్భుతంగా ఉంది మహి నీకు నేవే సాటి అల్ ది బెస్ట్

  8. Vilasagaram Ravinder says:

    బాగుంది పోయెమ్ సపర్ణ మహి గారు

  9. పఠాన్ మస్తాన్ ఖాన్ says:

    యుగరహస్యం నుంచి జీవిత,అంతర్యుధ్ధరహస్యాలను బట్టబయలు చేసేందుకు తాను సంఘర్షించిన క్షణాలలోంచి సంశ్లేషితమై అందిన యీ అనుభవాత్మక కవిత్వం
    వున్నత సృజనా జననము నన్ను కట్టి పడేసే ముగ్ధత్వం మహీ…యువ కవిత్వపు పరిపక్వతలు నిండుగా దర్శింపజేసే మహీ…నిజంగా ఇప్పటి సృజనకారుల్లో అగ్రజులు…తాను చూసే జీవితం..తపన…ఆర్తీ…విభిన్నంగా ..వుంటూ మానవత్వపు మూలాల తడి హృదయాలను తాకిస్తుంటే…హోవ్…నో వర్డ్స్ మహీ….

  10. shrutha keerthi says:

    Superb Mahi..very well said..loved your words very much.

  11. నెమలిదిన్నె రమణారెడ్డి says:

    ఎంత చక్కగా రాశావు మహీ !చాలా చాలా ….బాగుందీ పొయెమ్ ..అభినందనలు !

  12. నెమలిదిన్నె రమణారెడ్డి says:

    ఎంత చక్కగా రాశావు మహీ !ఇట్స్ వెరీ నైస్ .కంగ్రాట్స్ !

  13. శివారెడ్డి says:

    సూపర్ మహి..
    చాలా బాగా రాశావు….

    అల్ ది బెస్ట్
    💐💐💐💐💐💐

  14. Aruna Thara says:

    నిజమే మహీ గారూ , జీవితం ఒకరి కోసం మరొకరు తగ్గాల్సిన తూగుడు బల్లే. చాలా మంచి కవిత . అభినందనలు

  15. వాసుదేవ్ says:

    దాదాపు మీ ప్రతీ కవితా ఓ కవితఝరి…మీ మొదటి కవితనుంచీ మిమల్న్ని చదువుతూ వున్నా. విజయానికి దగ్గరదారి లేదు కానీ పరిణతికి మాత్రం మీరే ఓ పెద్ద బెంచ్ మార్క్..అనుభవాలన్నింటినీ ఏర్చికూర్చి రాసిన ప్రతీది కవితకానేరదు. కానీ ఇలాంటివి చదూతూన్నప్పుడు మాత్రం అది తప్పేమో అనిపించక మానదు. మీరు చరిత్ర సృష్టిస్తూనే ఉన్నారు. కుడోస్ మహీ!!

    • Suparna mahi says:

      చాలా చాలా ధన్యవాదాలు సర్… మీ మాటలెప్పుడూ గుర్తుంచుకుంటాను…🌼🌸🌼…

  16. srinivas sathiraju says:

    లోపల ఎవరితో వారు ఓడిపోతూ చేసే అంతర్యుద్ధమనే యుద్ధ రహస్యం…అంటూనే మళ్ళీ అర్ధం చేసుకోవటం లేదంటూ నిట్టూర్పులు….ఓ అనుకోని ప్రశ్న నీ కళ్ళకి కాసింత ప్రేమ కూడా రాసుకోవాలనే ఎవర్నువ్వని ఎదురైతే లోపల నాకోసం ఇవ్వడానికి కొంచెమైనా ఖాళీ మిగుల్చుకో నేస్తం అనే అసలు రహస్యం.!!! ఆపి మరీ చెప్పాలనిపిస్తుంది నేస్తం!

Leave a Reply to Suparna mahi Cancel reply

*